ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
శ్రద్ధ వాల్కర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలాను తీసుకెళ్తున్న పోలీసు వ్యాన్‌పై కొందరు వ్యక్తులు దాడిచేశారు.

ఫొటో సోర్స్, ANI

వార్తా సంస్థ ఏఎన్ఏ ట్వీట్ చేసిన దృశ్యాల్లో కొందరు వ్యక్తులు కత్తులు పట్టుకొని పోలీసు వ్యాన్‌పై దాడికి దిగుతున్నట్లు కనిపిస్తోంది.
ఆ దాడిచేసే వారిని అక్కడి నుంచి తరిమేసేందుకు పోలీసులు తుపాకీలను పైకి చూపించారు. ఎఫ్ఎస్‌ఎల్ ఆఫీసు దగ్గర చోటుచేసుకున్న ఈ దాడికి సంబంధించి ఇద్దిరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇప్పటివరకు ఏం జరిగింది?
మహారాష్ట్రకు చెందిన శ్రద్ధ, అఫ్తాబ్‌లు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండేవారు. కొన్ని సంవత్సరాల క్రితం వీరు దిల్లీకి తమ నివాసం మార్చుకున్నారు. అయితే, శ్రద్ధను అఫ్తాబ్ హత్య చేసి ఆమె శరీరాన్ని ముక్కలుగా కోసి భిన్న ప్రాంతాల్లో విసిరేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
నేడు ఆ శరీర భాగాలను వెతికిపట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అఫ్తాబ్ వయసు 28 ఏళ్లు. మరోవైపు శ్రద్ధ వయసు 27 ఏళ్లు. వీరు మెహ్రౌలీలోని ఉండేవారు.
ఈ కేసుకు సంబంధించి కొంత సమాచారాన్ని పోలీసులకు అఫ్తాబ్ వెల్లడించాడు. అయితే, కేసు మిస్టరీని ఛేదించేందుకు ఇది సరిపోదని పోలీసులు చెబుతున్నారు. అతడికి నార్కో టెస్టు నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఒక ఓవర్‌లో ఏడు సిక్స్‌లు కొట్టి రుతురాజ్ గైక్వాడ్ ప్రపంచ రికార్డు సృష్టించారు.
విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌లో భాగంగా మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్‌ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ విజృంభించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
49వ ఓవర్‌లో వరుసగా సిక్స్‌లు బాదారు. మధ్యలో వచ్చిన నోబాల్ కూడా సిక్స్ కొట్టారు. మొత్తంగా ఈ ఓవర్‌లో రుతురాజ్ 43 రన్లు వచ్చాయి.
ఈ ఓవర్‌లో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన శివ సింగ్ బౌలింగ్ వేశారు. మొత్తంగా మ్యాచ్‌లో రుతరాజ్ డబుల్ సెంచరీ కొట్టారు.
అమరావతిని ఒక్కటే రాజధానిగా కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఏపీ ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
రాజధాని నిర్మాణంలో కాలపరిమితితో పనులు పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది.
ఈ ఏడాది మార్చిలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
దీనిపై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ఈ వ్యవహారంలో స్పందన తెలపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్ of X ముగిసింది, 2
హైకోర్టు ఆదేశాలలో అయిదవ డైరక్షన్ పూర్తిగా అసంబంద్ధమైనదిన సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు లైవ్ లా ట్విటర్ లో పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
అనంతరం విచారణను వచ్చే ఏడాది జనవరి 31కి వాయిదా వేసింది.
దిల్లీలో కుటుంబ కలహాల కారణంగా అంజన్ దాస్ అనే వ్యక్తిని భార్య, కుమారుడు చంపేసినట్లు పోలీస్ కమిషనర్(నేరాలు) రవీందర్ యాదవ్ తెలిపారు.
‘అంజన్ దాస్ కుటుంబంలో గొడవలున్నాయి.
ఆయన కొడుకు పెళ్లి చేసుకున్నాక పరిస్థితి మరింత దిగజారింది. ఆయనకు కూతురు కూడా ఉంది. భార్య కూతుళ్ల మీద అంజన్ దాస్‌కు పగ ఉండేది.
ఆయనకు సంపాదన లేదు. తమ దగ్గర ఉన్న డబ్బు అంతా అంజన్ దాస్ లాగేసుకుంటాడని వారు భయపడ్డారు.
తల్లి పూనం, కొడుకు దీపక్ కలిసి అంజన్ దాస్‌ను చంపారు. శవాన్ని ముక్కలు చేసి వాటిని రామ్‌లీల మైదాన్, న్యూ అశోక్ నగర్ వంటి ప్రాంతాల్లో పడవేశారు’ అని రవీందర్ యాదవ్ వివరించారు.
పూనం భర్త కల్లు 2016లో చనిపోయారు. దాంతో 2017లో ఆమె అంజన్ దాస్‌ను పెళ్లి చేసుకున్నారు. బిహార్‌కు చెందిన ఆయనకు పెళ్లి అయి, 8 మంది పిల్లలున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Reuters
అదానీ గ్రూప్ పోర్టు ప్రాజెక్టుకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలలో 36 మంది పోలీసులకు గాయాలైనట్టు రాయిటర్స్ పేర్కొంది.
కేరళలో అదానీ గ్రూప్ చేపడుతున్న 900 మిలియన్ డాలర్ల(సుమారు రూ.7,356 కోట్ల) విలువైన పోర్టు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఫొటో సోర్స్, ANI
ఈ దాడుల్లో 36 మంది పోలీసులు గాయాలు పాలైనట్టు అధికారులు తెలిపినట్టు రాయిటర్స్ రిపోర్టు చేసింది. పోర్టు ప్రాజెక్టుకి వ్యతిరేకంగా ఆందోళనకారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
23 బిలియన్ డాలర్ల( సుమారు రూ.1,88,016 కోట్ల) విలువైన అదానీ పోర్ట్స్, లాజిస్టిక్స్ వ్యాపారాలకు ప్రస్తుతం జరుగుతున్న ఈ ఆందోళనలు పెద్ద ఎదురు దెబ్బగా మారాయని రాయిటర్స్ కథనం పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ నిరసనలలో భాగంగా ప్రాజెక్టుకి వ్యతిరేకంగా ప్రదర్శన చేపడుతున్న కొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తిరువనంతపురంలోని విళింజం పోలీసు స్టేషన్‌పై గత రాత్రి ఆందోళనకారులు దాడులు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
దుబాయ్, సింగపూర్, శ్రీలంకలలోని పోర్టుల నుంచి వ్యాపారాలను పొందేందుకు కేరళలో ఉన్న అదానీ విళింజం పోర్టునే కీలకంగా ఉంది.
అయితే, స్థానికుల డిమాండ్లలో ఒక్క పోర్టును మూసేయడం తప్ప అన్ని డిమాండ్లు నెరవేర్చామని ఆ రాష్ట్ర న్యాయ, పరిశ్రమల మంత్రి పి.రాజీవ్ అన్నారు.
ఈ ప్రాజెక్టు ఇంత వరకు వచ్చిన తర్వాత నిలిపేయడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా విమర్శలు చేశారు.
ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు ప్రధాని మోదీ ఎప్పుడూ అబద్ధాలు చెబుతూ ఉంటారని ఆయన ఆరోపించారు.
‘70ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని మోదీ ఎప్పుడూ ప్రశ్నిస్తుంటారు. మీరు(మోదీ) ఎప్పుడూ నేను పేదవాడిని అని అంటూ ఉంటారు. కానీ నేను పేదల్లోనే పేద వాడిని. అంటరాని వాళ్లలో ఒకడిని.
మీ(మోదీ) చాయ్‌ను ఎవరైనా తాగుతారు. కానీ నా చాయ్‌ను ఎవరూ తాగరు.
ప్రజల సానుభూతి కోసం మీరు(మోదీ) ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. ఎన్నిసార్లు మీరు అబద్ధం చెబుతారు?’ అని మల్లికార్జున ఖర్గే అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, En Solidarité avec Hongkong/Twitter
చైనాలో ‘జీరో కోవిడ్’ విధానానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు మద్దతుగా ఇతర దేశాల్లోనూ ప్రదర్శనలు జరుగుతున్నాయి.
లండన్, పారిస్, డబ్లిన్, టొరొంటో వంటి నగరాల్లో ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు.
పారిస్‌లో జరుగుతున్న ప్రదర్శనల ఫొటోలు ఇంటర్నెట్‌లో కనిపిస్తున్నాయి. కానీ వాటిని బీబీసీ ధ్రువీకరించుకోలేదు.
ఆమ్‌స్టర్‌డామ్‌లో తెల్ల కాగితాలను పట్టుకొని కొందరు వీధుల్లో నిలబడ్డారు.
డబ్లిన్ వంటి నగరాల్లో కొవ్వొత్తులు వెలిగించి మద్దతు తెలియజేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, FACEBOOK/IndranilRajguruOfficial
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంద్రనీల్ రాజ్‌గురు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
‘నా దృష్టిలో శివుడు, అల్లా ఇద్దరూఒక్కరే.
అజ్మేర్‌లో శివుడు ఉంటాడు. సోమనాథ్ దేవాలయంలో అల్లా ఉంటాడు’ అని రాజ్‌కోట్(తూర్పు) నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న సందర్భంగా ఇంద్రనీల్ అన్నారు.
అజ్మేర్‌లో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా ఉండగా సోమనాథ్‌లో శివుని దేవాలయం ఉంది.