You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

భారత్ X న్యూజీలాండ్: తొలి వన్డేలో ఓడిపోయిన టీం ఇండియా

న్యూజీలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓడిపోయింది. భారత్ విధించిన 307 పరుగుల లక్ష్యాన్ని 17 బంతులు మిగిలి ఉండగానే న్యూజీలాండ్ చేధించింది.

లైవ్ కవరేజీ

  1. రాముడు నడిచిన దారి ప్రాజెక్టు ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎందుకు వస్తున్నాయి?

  2. నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియా బీచ్‌లో యువతి హత్య.. ఇప్పుడు భారత్‌లో నిందితుడి అరెస్ట్.. ఎలాగంటే..

  3. కాంతారా: అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా మీద అసంతృప్తి ఎందుకు?

  4. రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఢీ కొట్టగలరా?

  5. భీమా కోరేగావ్: ఆనంద్ తేల్‌తుంబ్డే‌కు సుప్రీంలో ఊరట

    భీమా కోరేగావ్ కేసులో ప్రొఫెసర్ ఆనంద్ ‌తేల్‌తుంబ్డేకు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది.

    ఇటీవల బాంబే హై కోర్టు ఆనంద్‌కు బెయిల్ మంజూరు చేసింది.

    ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

  6. ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

  7. భారత్ X న్యూజీలాండ్: తొలి వన్డేలో టీం ఇండియా ఓటమి

    న్యూజీలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓడిపోయింది.

    భారత్ విధించిన 307 పరుగుల లక్ష్యాన్ని 17 బంతులు మిగిలి ఉండగానే న్యూజీలాండ్ చేధించింది.

    47.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 309 పరుగులు చేసింది న్యూజీలాండ్.

    టామ్ లాథమ్ 104 బంతుల్లో 145 పరుగులు చేయగా కెప్టెన్ కేన్ విలియమ్సన్ 98 బంతుల్లో 94 పరుగులు చేశాడు.

    భారత బౌలర్లో ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు తీయగా శార్దుల్ ఠాకుర్ ఒక వికెట్ తీశాడు.

    తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవరల్లో 306 పరుగులు చేసింది.

    శ్రేయస్ అయ్యర్(80), శిఖర్ ధవన్(72), శుభ్‌మన్ గిల్(50) రాణించారు.

  8. ‘అమితాభ్ బచ్చన్ అనుమతి లేకుండా ఆయన పేరు, గొంతు, ఫొటోలు వంటివి వాడొద్దు’

    అమితాభ్ బచ్చన్ అనుమతి లేకుండా ఆయన పేరు, గొంతు, ఫొటోలు వంటివి వాడకూడదని దిల్లీ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

    కొందరు బచ్చన్ పేరును మిస్ యూజ్ చేస్తున్నారని ఆయన న్యాయవాది కోర్టుకు తెలిపారు.

    ‘మొబైల్ యాప్స్ డెవలపర్లు, బుక్ పబ్లిషర్లు, టి-షర్టు వెండార్లతోపాటు కేబీసీ పేరుతో అక్రమంగా లాటరీలు నిర్వహించే వారు బచ్చన్ గొంతు, ఫొటోలు వంటివి తప్పుడు పద్ధతిలో వాడుతున్నారు’ అని లాయర్ హరీశ్ సాల్వే వెల్లడించారు.

    అమితాభ్ బచ్చన్ పేరు మీద, www.amitabhbachchan.com, www.amitabhbachchan.inవెబ్ డొమైన్స్‌లను అక్రమంగా రిజిష్టర్ చేశారని కూడా న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

  9. 'ఇట్లు.. మారేడుమిల్లి ప్ర‌జానీకం' రివ్యూ: స‌మాజంలో జ‌రుగుతున్న వాస్త‌వ ప‌రిస్థితుల్ని నిజాయితీగా చెప్పిన కథ

  10. ‘దిల్లీ లిక్కర్ స్కాం’ కేసులో సీబీఐ చార్జ్ షీట్

    ‘దిల్లీ లిక్కర్ స్కాం’ కేసులో సీబీఐ చార్జ్ షీట్ ఫైల్ చేసింది.

    అభిషేక్ బోయినపల్లి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత విజయ్ నాయర్‌లతో పాటు ఇతరుల పేర్లను అందులో చేర్చింది.

  11. బ్రేకింగ్ న్యూస్, ‘సేమ్ సెక్స్’ వివాహాల చట్టబద్ధతపై కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు

    గే, లెస్బియన్ వంటి ‘సేమ్ సెక్స్’ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

    హైదరాబాద్‌కు చెందిన గే కపుల్స్, ప్రత్యేక వివాహాల చట్టం కింద ‘సేమ్ సెక్స్’ వివాహాలను గుర్తించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.

  12. రోజా వీడియో వైరల్... జగనన్న సాంస్కృతిక సంబరాల్లో డాన్స్ చేసిన మంత్రి

  13. నారా లోకేశ్: జనవరి 27 నుంచి పాదయాత్ర

    తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేశ్, ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది.

    వచ్చే ఏడాది జనవరి 27 నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. 400 రోజులు పాటు 4వేల కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగనున్నట్లు నారా లోకేశ్ తెలిపారు.

    కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఈ యాత్ర జరగనుంది.

  14. అమితాభ్ బచ్చన్: నా పర్సనాల్టీ రైట్స్ కాపాడండి... అంటూ కోర్టులో పిటిషన్

    ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాభ్ బచ్చన్, దిల్లీ హై కోర్టులో తన ‘పర్సనాల్టీ రైట్స్’ను కాపాడాలంటూ పిటిషన్ వేశారు.

    జస్టిస్ నవీన్ చావ్లా బెంచ్ ముందుకు వచ్చిన ఈ కేసును లాయర్ హరీష్ సాల్వే వాదిస్తున్నారు.

    అయితే ఏ విషయానికి సంబంధించి అమితాభ్ బచ్చన్ ఈ పిటిషన్ వేశారో తెలియడం లేదు.

    ఒక వ్యక్తి పేరు, ఫొటోలు వంటి వాటిని వాణిజ్యపరంగా ఉపయోగించడం మీద నియంత్రణ పొందడం వంటివి పర్సనాల్టీ రైట్స్‌లోకి వస్తాయి.

  15. శ్రద్ధ వాల్కర్, అఫ్తాబ్ పూనావాలా: ‘ఫ్రిడ్జ్ మర్డర్’ మీద వస్తున్న సంచలన వార్తల్లో నిజానిజాలేంటి?

  16. భారత్ X న్యూజీలాండ్: 7 వికెట్లకు 306 పరుగులు చేసిన టీం ఇండియా

    న్యూజీలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ 7 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది.

    శ్రేయస్ అయ్యర్ 76 బంతుల్లో 80 పరుగులు చేయగా కెప్టెన్ శిఖర్ ధవన్ 77 బంతుల్లో 72 పరుగులు చేశాడు.

    శుభ్‌మన్ గిల్ 65 బంతులు 50 పరుగులు తీశాడు.

    న్యూజీలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్ చెరో 3 వికెట్లు తీశారు.

  17. పీరియడ్స్‌లో బ్లీడింగ్ ఎక్కువైనప్పుడు ఏం చేయాలి, 9 ముఖ్యమైన ప్రశ్నలు-జవాబులు

  18. ఈ బ్యాంకులో విద్యార్థులే మేనేజర్లు, ఉద్యోగులు

    తెలంగాణలోని జనగామ జిల్లా చిల్పూర్ జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థుల కోసం విద్యార్థులే నిర్వహిస్తున్న స్కూల్ బ్యాంక్ ఆఫ్ చిల్పూర్ ఇది.

    ప్రారంభించిన నెల రోజుల్లోనే రూ.32 వేలు జమయ్యాయి. ఈ బ్యాంకు నిర్వహణ అంతా ఇక్కడి విద్యార్థినుల చేతుల మీదుగానే జరుగుతోంది.

  19. ఒంటరి మహిళల మీద నిషేధాన్ని ఎత్తివేసిన జామా మసీదు

    ఒంటరి మహిళలకు ప్రవేశం లేదంటూ జారీ చేసిన మార్గదర్శకాలను జామా మసీదు వెనక్కి తీసుకుంది.

    ఆ నిర్ణయం మీద విమర్శలు రావడంతోపాటు ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కోరడంతో జామా మసీదు ఆ నిషేధాన్ని తొలగించింది.

    మసీదుకు వచ్చే ఒంటరి అమ్మాయిలు, అబ్బాయిలను కలవడానికి రావడం, దీన్ని పార్క్‌గా భావించడం, డ్యాన్సులు చేయడం వంటివి వాటిని తాము అనుమతించమని జామా మసీదు పీఆర్‌ఓ నిన్న అన్నారు.