లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.
హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మిలను అధికారులు ప్రశ్నిస్తున్నారు. లైగర్ సినిమాలో పెట్టుబడుల మీద ఈడీ ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

ఫొటో సోర్స్, UGC
హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మిలను అధికారులు ప్రశ్నించారు.
లైగర్ సినిమాలో పెట్టుబడుల మీద ఈడీ ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయ నాయకులు ఈ సినిమాలో పెట్టుబడి పెట్టినట్లుగా ఈడీ అనుమానిస్తోంది. అలాగే విదేశాల నుంచి కూడా పెట్టుబడులు వచ్చినట్లుగా భావిస్తోంది.
ఈమేరకు 15 రోజుల కిందటే పూరీ జగన్నాథ్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇవాళ పొద్దున్న పూరీ, ఛార్మి ఈడీ కార్యాలయానికి వచ్చారు.
కొంత కాలంగా పూరీ, ఛార్మి కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు.

ఫొటో సోర్స్, Puri Jagannadh/Facebook
రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న వారిని విడుదల చేయడం మీద సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
శ్రద్ధ హత్య కేసు నిందితుడిని ఈరోజు దిల్లీ పోలీసులు సాకేత్ కోర్టులో హాజరు పరచాల్సి ఉంది. అఫ్తాబ్ కోర్టులో హాజరుకావడానికి ముందు సాకేత్ కోర్టు లాయర్లు అఫ్తాబ్‌కు వ్యతిరేకంగా నినాదాలు, నిరసనలు చేశారు.
నిందితుడు అఫ్తాబ్‌ను ఉరి తీయాలంటూ వారు నినదించారు.
అఫ్తాబ్ లాంటి నేరస్థులకు మరణశిక్ష విధించాలని సాకేత్ కోర్టు లాయర్ వీరేంద్ర కటోలియా అన్నారు.
‘‘లవ్ జిహాద్ జరుగుతోంది. శరీర అవయాలను నరికి పారేస్తున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి నేరాలు జరుగకుండా ఉండాలంటే కఠిన శిక్షను విధించాలి’’ అని ఆయన ఆవేశాన్ని వ్యక్తం చేశారు.
మరోవైపు కేసు సున్నితత్వం, భద్రతా కారణాల రీత్యా నిందితుడు అఫ్తాబ్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో ప్రవేశపెట్టేందుకు చేసిన దరఖాస్తుకు అనుమతి లభించినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
దీంతో అఫ్తాబ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో విచారణకు హాజరు కానున్నాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Twitter/ANI
బ్రిటిష్ వారికి వినాయక్ దామోదర్ సావర్కర్ రాసిన లేఖను చూపిస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారు.
ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ బ్రిటిష్ వారికి సావర్కర్ సహాయం చేశారని అన్నారు.
ఈ మేరకు సావర్కర్ రాసిన లేఖను చదివి వినిపించారు. బ్రిటిష్ వారికి సేవకునిగా ఉండాలనుకుంటున్నానని సావర్కర్ లేఖలో రాసినట్లు చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘‘ఇది నాకు చాలా ముఖ్యమైన పత్రం. ఇది బ్రిటిష్ వారికి సావర్కర్ రాసిన లేఖ. ఇందులో చివరి లైన్‌ను ఇంగ్లిష్‌లో రాశారు. అది చదవాలని అనుకుంటున్నా. హిందీలో దీని అర్థం ఏంటంటే..‘సర్, నేను మీకు సేవకునిగా ఉండాలనుకుంటున్నా.’
ఇది నేను రాయలేదు. సావర్కర్ గారు రాశారు. కావాలంటే దీన్ని ఫడ్నవిస్ గారు చూడొచ్చు. ఆంగ్లేయులకు సావర్కర్ సహాయపడ్డారనే విషయంలో నేను స్పష్టంగా ఉన్నా.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

పోస్ట్ of X ముగిసింది, 3
ప్రస్తుతం యువతకు ఉద్యోగాలు వస్తాయనే భరోసా కనిపించడం లేదు. రైతులకు ఏ వైపు నుంచి కూడా సహాయం అందట్లేదు. ఇవి రెండు అతిపెద్ద సమస్యలు.
ఇక మూడోది ఏంటంటే ప్రజలంతా చదువు, ఆరోగ్యం కోసం డబ్బులు ఖర్చుపెడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు మూతపడుతున్నాయి. ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తోంది’’ అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, ANI
బిహార్ రాష్ట్రం ఖగరియా జిల్లాలోని ఒక ఆరోగ్య కేంద్రంలో అనస్థీషియా ఇవ్వకుండానే 28 మంది మహిళలకు గర్భ నిరోధక ఆపరేషన్ చేశారు.
నవంబర్ 15న ఈ ఘటన జరిగింది. ఆపరేషన్ సమయంలో మహిళలు అంతా నొప్పితో విలవిల్లాడారు.
దీని గురించి ఖగరియా డీఎం రంజన్ ఘోష్, బీబీసీతో మాట్లాడారు.
‘‘మహిళలు అందరికీ లోకల్ అనస్థీషియా ఇచ్చాం. ఇది స్టాండర్డ్ ప్రొటోకాల్. లోకల్ అనస్థీషియా ఇచ్చి ఈ ఆపరేషన్ చేయొచ్చు. కానీ, కొందరు మహిళలకు అది సరిపోనట్లు అనిపిస్తుంది. అంటే వారి శరీరాలకు మరింత ఎక్కువ మోతాదులో లోకల్ అనస్థీషియా అవసరం. అందుకే వారికి నొప్పి కలిగింది. ఆపరేషన్ జరిగిన సగం మందిలో ఎలాంటి సమస్యలు లేవు’’ అని ఆయన చెప్పారు.
మరోవైపు ఖగరియా సివిల్ సర్జన్ అమర్‌నాథ్ ఝా మాట్లాడుతూ తమ వద్ద వైద్య నిపుణుల కొరత ఉందని చెప్పారు. ఈ విషయాన్ని తాము చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని అన్నారు.
అయితే తాజా ఘటనను విచారించి దోషులుగా తేలిన వారిని శిక్షిస్తామని ఆయన చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
అఫ్తాబ్‌ను విచారించేందుకు దిల్లీ పోలీసులు నార్కో పరీక్షకు దరఖాస్తు చేసినట్లు శ్రద్ధ వాకర్ తండ్రి వికాస్ వాకర్ చెప్పినట్లు వార్తాసంస్థ ఏఎన్ఐ తెలిపింది.
వికాస్ వాకర్ ఈ కేసు గురించి ఏఎన్‌ఐతో మాట్లాడారు.
‘‘అఫ్తాబ్ కొన్నిసార్లు నిజాలు, కొన్నిసార్లు అబద్ధాలు చెబుతాడని పోలీసులు గ్రహించారు. అందుకే నార్కో టెస్టు కోసం దరఖాస్తు చేశారు. నాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నా. ఒకవేళ అతనే నేరం చేసి ఉంటే, అతన్ని కచ్చితంగా ఉరి తీయాలి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అతను అబద్ధం చెబుతున్నాడని నాకు అనిపించింది. ఇదే విషయం దిల్లీ, ముంబై పోలీసులతో చెప్పాను. అఫ్తాబ్ చాలా జిత్తులమారి. గత 5-6 నెలల్లో అతను సాక్ష్యాలు అన్నింటిని నాశనం చేశాడు. అందుకే ఈ కేసులో సాక్ష్యాలను సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది. అఫ్తాబ్‌కు మరణశిక్ష పడే వరకు నాకు విశ్రాంతి ఉండదు’’ అని వికాస్ వాకర్ చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది.
మరోవైపు శ్రద్ధ హత్య కేసులో ఆధారాలు సేకరించేందుకు అఫ్తాబ్‌తో కలిసి దిల్లీ పోలీసులు కొన్నిరోజులుగా ఛతర్‌పూర్ కొండ ప్రాంతంలో గాలిస్తున్నారు.
బుధవారం అడవిలో క్రైమ్ సీన్ పున:స్థాపన చేసేందుకు ప్రయత్నించారు.
హత్యకు వాడిన ఆయుధంతో పాటు హత్య సమయంలో ఆమె వేసుకున్న దుస్తులు, సీసీటీవీ ఫుటేజీ కోసం పోలీసులు వెదుకుతున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మైనింగ్ కుంభకోణంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించనుంది.
ఈమేరకు హేమంత్ సోరెన్ రాంచీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
అక్రమ మైనింగ్ కేసును ఈడీ విచారిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిందిగా హేమంత్ సోరెన్‌కు సమన్లు పంపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, RANDY BROOKS
ఐసీసీ టి20 బ్యాట్స్‌మన్ ర్యాంకుల్లో భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు.
టి20 ప్రపంచకప్ సూపర్ 12 దశలో అద్భుత ప్రదర్శన కనబరిచిన సూర్యకుమార్ తొలిసారిగా నంబర్ వన్ ర్యాంకును అందుకున్నాడు.
తాజాగా ఐసీసీ గురువారం విడుదల చేసిన ర్యాంకుల్లోనూ 859 పాయింట్లతో సూర్యకుమార్ అగ్రస్థానంలో నిలిచాడు. పాక్ బ్యాట్స్‌మెన్ మొహమ్మద్ రిజ్వాన్ (836 పాయింట్లు), బాబర్ ఆజమ్ (778 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
టి20 ఆల్‌రౌండర్ల కేటగిరీలో హార్దిక్ పాండ్యా మూడో ర్యాంకులో నిలిచాడు. బంగ్లాదేశ్‌కు చెందిన షకీబుల్ హసన్, అఫ్గాన్ ప్లేయర్ మొహమ్మద్ నబీ వరుసగా తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు.
వన్డే ఫార్మాట్ బ్యాట్స్‌మన్ ర్యాంకుల్లో విరాట్ కోహ్లి (722), రోహిత్ శర్మ (718) వరుసగా ఏడు, ఎనిమిది ర్యాంకుల్లో నిలిచారు. ఈ జాబితాలో బాబర్ ఆజమ్ 890 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.
బౌలర్ల విభాగంలో భారత్ నుంచి టాప్-10లో కేవలం బుమ్రాకు మాత్రమే చోటు దక్కింది. బుమ్రా 642 పాయింట్లతో పదో స్థానంలో నిలవగా, న్యూజీలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 775 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్నాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Nara Chandrababu Naidu/fb
కర్నూలు జిల్లా పర్యటనలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
రానున్న ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని సూచనప్రాయంగా అన్నారు.
పత్తికొండ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘సీనియర్ నాయకుడిని అయిన నన్ను అసెంబ్లీలో అవమానించారు. నా భార్యను కూడా అవమానించే పరిస్థితికి వచ్చారు.
ఆరోజే ఒక నిర్ణయం తీసుకున్నా. మళ్లీ క్షేత్ర స్థాయిలో గెలిచిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెడతా. లేకపోతే అసెంబ్లీకి రానని ఆరోజే చెప్పాను.
నేను అసెంబ్లీకి వెళ్లాలంటే.. రాజకీయాల్లో ఉండాలంటే... ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే వచ్చే ఎన్నికల్లో మీరు గెలిపించాలి. లేదా ఇదే నాకు చివరి ఎన్నిక అవుతుంది’’ అని ఆయన ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు.

ఫొటో సోర్స్, ANI
తనతో సహజీవనం చేసిన ప్రియురాలిని చంపి మృతదేహాన్ని ముక్కలు చేసిన నిందితుడు అఫ్తాబ్ పూనావాలాను దిల్లీ పోలీసులు నేడు సాకేత్ కోర్టులో హాజరు పరచనున్నారు.
అఫ్తాబ్‌ను మరికొంతకాలం తమ కస్టడీలో ఉంచాలని కోర్టును కోరనున్నారు.
ఈ హత్య కేసు విచారణలో పోలీసులు మరికొన్ని ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు.
శ్రద్ధను హత్య చేసిన తర్వాత రక్తపు మరకలను శుభ్రం చేయడానికి అఫ్తాబ్ ఎక్కువగా నీటిని వినియోగించడంతో నీటి బిల్లు అధికంగా వచ్చినట్లు తెలిసిందని వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
ఇంటికి ప్రతినెలా ఉచితంగా సరఫరా అయ్యే 20 వేల లీటర్ల కంటే అధికంగా నీటిని అఫ్తాబ్ వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు.
అఫ్తాబ్ భవనంలోని నీటి ట్యాంకులను తరచుగా పరిశీలించేవారని పోలీసులకు అఫ్తాబ్ పొరుగువారు చెప్పినట్లు ఏఎన్‌ఐ తెలిపింది.