లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు మళ్లీ కలుద్దాం.
యుక్రెయిన్ రాజధాని కీయెవ్ మీద రష్యా జరిపిన మిసైల్స్ దాడిలో ఒకరు చనిపోయినట్లు ఆ నగర మేయర్ విటాలీ తెలిపారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు మళ్లీ కలుద్దాం.
యుక్రెయిన్ రాజధాని కీయెవ్ మీద రష్యా జరిపిన మిసైల్స్ దాడిలో ఒకరు చనిపోయినట్లు ఆ నగర మేయర్ విటాలీ తెలిపారు.
ఒక రెసిడెన్సియల్ బిల్డింగ్ నుంచి శవాన్ని సహాయక సిబ్బంది వెలికి తీసినట్లు వెల్లడించారు.

ఫొటో సోర్స్, EPA
రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ జీ20 సమావేశాల నుంచి మధ్యలోనే వెళ్లిపోయినట్లు రష్యా న్యూస్ ఏజెన్సీ టాస్ వెల్లడించింది.
ఆయన ఇండోనేషియా నుంచి రష్యాకు బయలుదేరారు.
జీ20 సమావేశాలు రేపు ముగియనున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌తో పాటు ఇతర పట్టణాల మీద రష్యా మిసైల్స్‌తో దాడి చేసిందని ఆ దేశ అధికారులు తెలిపారు.
జీ20 సదస్సు జరుగుతున్న నేపథ్యంలో మరొక వైపు యుక్రెయిన్ మీద దాడులు జరుగుతున్నాయి.
జీ20 సమావేశాల్లో చాలా దేశాల అధినేతలు యుక్రెయిన్ మీద రష్యా దాడిని ఖండించారు.

ఆంధ్రప్రదేశ్ లోని దేవరపల్లి మండలం గౌరీపట్నంలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదవశాత్తూ కెమికల్ ట్యాంకర్ పేలింది.
మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మరణించారు.
ఒక్కసారిగా పేలుడు సంభవించి, మంటలు వ్యాపించడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
దాంతో విజన్ డ్రగ్స్ ఫ్యాక్టరీ సిబ్బంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
ఘటనా స్థలాన్ని తూర్పు గోదావరి జిల్లా అధికారులు సందర్శించారు. ప్రమాద కారణాలపై విచారణ జరుపుతామని తెలిపారు.
కార్మికుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పోస్ట్ మార్టమ్ అనంతరం మృతుల కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రమాద కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు అంటున్నారు.
ప్రాధమిక దర్యాప్తులో కొన్ని ఆధారాలు లభించాయని మీడియాకు తెలిపారు.
ఇటీవల వరుసగా పలు పరిశ్రమల్లో ప్రమాదాలు జరగడం ఆందోళనగా మారుతోంది.
నెల రోజుల క్రితం కాకినాడలోని ఓ షుగర్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన ఐదుగురు కార్మికులు మరణించారు.
నాలుగు రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు మూలంగా ముగ్గురు చనిపోయారు.
తాజాగా ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
వివిధ పరిశ్రమల్లో భద్రత మీద యంత్రాంగం దృష్టి సారించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ విజన్ డ్రగ్ పరిశ్రమ వద్ద ఆందోళన నిర్వహించాయి.
తూర్పు గోదావరి జిల్లాలోని విజన్ డ్రగ్స్ ఫ్యాక్టరీలో కెమికల్ ట్యాంకర్ పేలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు.
దేవరపల్లి మండలం గౌరీపట్నంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఫ్యాక్టరీకి చేరుకున్నారు.
మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ఫొటో సోర్స్, Margadarsi
మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులు విజయవాడ సహా పలు కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలకు పూనుకున్నారు. రికార్డులు పరిశీలిస్తున్నారు. మార్గదర్శి సిబ్బంది నుంచి పలు వివరాలు సేకరిస్తున్నారు.
స్టాంప్ట్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి ఈ సోదాలకు దిగారు.
రాష్ట్రంలోని పలు కీలక ప్రాంతాల్లో ఈ దాడులు జరగడం చర్చనీయాంశం అవుతోంది.
మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థపై గతంలో పలు ఆరోపణలు వచ్చాయి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రభుత్వం నోటీసులు కూడా ఇచ్చింది.
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పట్లోనే ఫిర్యాదులు చేశారు.
ఆ కేసులను 2018 చివరిలో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు కొట్టేయడంతో దానిపై ఉండవల్లి సుప్రీంకోర్టుకి వెళ్లారు.
ఈ కేసులో ఏపీ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అవుతూ మొన్నటి సెప్టెంబర్ లో పిటీషన్ వేసింది.
ఈనాడు గ్రూపునకు చెందిన రామోజీరావు చైర్మన్ గా, ఆయన కోడలు శైలజ ఎండీగా ఉన్న మార్గదర్శి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తరించింది. పలు బ్రాంచీలు నిర్వహిస్తోంది.
అయితే మార్గదర్శి చిట్స్ నుంచి సేకరించిన నిధులను ఇతర అవసరాలకు వినియోగించారన్నది ఫిర్యాదు.
అంతేగాకుండా మార్గదర్శి పేరుతో చిట్స్ నిర్వహణకు కూడా చట్టం ప్రకారం అనుమతి లేదని ఉండవల్లి సహా పలువురి వాదన.
ఈ నేపథ్యంలో మార్గదర్శి కేసు సుప్రీంకోర్టులో ఉండగానే ఏపీ ప్రభుత్వం ఆసంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడం కీలక పరిణామంగా కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, PMO/Twitter
జీ20 శిఖరాగ్ర సదస్సు మొదటి రోజున భారత సంతతికి చెందిన బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునక్‌తో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి పలకరించుకున్నారు.
ఈ సదస్సు సందర్భంగా ఎదురుపడ్డ ఇద్దరు నేతలు కాసేపు మాట్లాడుకున్నారు.
వీరిద్ధరి సమావేశం ఫొటోను ప్రధానమంత్రి కార్యాలయం తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, @ANI
మిజోరంలోని హంహథియాల్ జిల్లా మౌదర్ గ్రామంలో జరిగిన క్వారీ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎనిమిది మృతదేహాలను వెలికితీశారు.
సోమవారం ప్రమాదం జరిగిన తరువాత, బీఎస్ఎఫ్ రెస్క్యూ టీమ్ ఫస్ట్ రెస్పాన్స్ యూనిట్‌గా సంఘటనా స్థలానికి చేరుకుంది.
మిజోరాం విపత్తు నిర్వహణ, పునరావాస శాఖ అదనపు కార్యదర్శి లాల్ హరియత్‌పుయా సోమవారం మాట్లాడుతూ గని కూలిన సమయంలో దాదాపు 15 మంది ఘటనా స్థలంలో ఉన్నారని తెలిపారు.
మధ్యాహ్నం 2.40 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఏబీసీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కార్మికులు గనిలో పనిచేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
అమెజాన్ 10,000 మందిని తొలగించబోతోందని న్యూయార్క్ టైమ్స్ వార్తాపత్రిక పేర్కొంది. ఇదే జరిగితే, కంపెనీ చరిత్రలో ఇదే అతిపెద్ద తొలగింపు అవుతుంది.
న్యూయార్క్ టైమ్స్ చెప్పినదాని ప్రకారం తొలగింపు ప్రక్రియ ఈ వారంలోనే ప్రారంభమవుతుంది.
వాయిస్ అసిస్టెంట్ అలెక్సా, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్ వంటి కంపెనీకి చెందిన అనేక బిజినెస్‌లలో ఈ తొలగింపులు జరుగుతాయని ఈ రిపోర్టులో పేర్కొంది.
ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ట్విట్టర్, మెటా, మైక్రోసాఫ్ట్ కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఇప్పుడు ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్ కూడా తోడయింది.
తొలగించే ఉద్యోగుల సంఖ్యలో మార్పులు ఉండొచ్చని పేరు చెప్పడానికి ఇష్టపడని కంపెనీ ఉద్యోగి ఒకరు చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
ప్రస్తుతం పేర్కొన్న 10వేలమంది ఉద్యోగుల సంఖ్య అమెజాన్ మొత్తం వర్క్‌ఫోర్సులో 3% వరకు ఉంటుందని తేలింది.

ఫొటో సోర్స్, @MIB_India
పదిహేడవ జీ20 సదస్సు ఇండోనేషియాలోని బాలిలో ప్రారంభమైంది. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహార, ఇంధన భద్రత సెషన్‌లో పాల్గొంటున్నారు.
“కోవిడ్ తర్వాత కొత్త ప్రపంచ వ్యవస్థను సృష్టించే బాధ్యత మనపై ఉంది. శాంతి భద్రతల పరిరక్షణకు ఒక దృఢమైన సంకల్పాన్ని ప్రకటించడం, కలిసి రావడం తక్షణావసరం. ప్రపంచదేశాలనేతలు ప్రస్తుతం బుద్ధుడు, గాంధీ నడయాడిన నేలపై ఉన్నారు. వీరంతా ప్రపంచానికి ఒక బలమైన సందేశాన్ని ఇస్తారు’’ అని మోదీ వ్యాఖ్యానించారు.
రష్యా-యుక్రెయిన్‌ల మధ్య యుద్ధాన్ని ఆపడానికి దౌత్యమార్గాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి మోదీ అన్నారు.
నేటి ఎరువుల కొరత రేపటి ఆహార సంక్షోభమని, దీనికి ప్రపంచం పరిష్కారంలేదని ప్రధాని మోదీ అన్నారు. ఎరువులు, ఆహార ధాన్యాల సరఫరా గొలుసును స్థిరంగా ఉంచేలా ప్రపంచ దేశాలు మధ్య ఒప్పందాలు జరగాలని ప్రధాని అన్నారు.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయినందున, ప్రపంచ అభివృద్ధికి భారతదేశ ఇంధన భద్రత కూడా చాలా ముఖ్యమని మోదీ అన్నారు.
మోదీ - బైడెన్
ఈ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన భారత ప్రధానమంత్రి మోదీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పలకరించారు. వారిద్దరు సమావేశం ప్రారంభానికి ముందువీరిద్దరు కాసేపు మాట్లాడుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అంతకు ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మేక్రాన్ కూడా ప్రధానితో మాట్లాడారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
కంబోడియా ప్రధానికి కరోనా వైరస్
ఈ సదస్సులో పాల్గొనడానికి బాలీకి వచ్చిన కంబోడియా ప్రధాని హున్ సేన్ మంగళవారం నాడు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలారు.
అంతకు ముందు ఆయన కంబోడియాలోని నామ్‌ఫెన్‌లో జరిగిన ఆగ్నేయాసియా దేశాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సదస్సులోఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు పలు ప్రపంచదేశాల నేతలు పాల్గొన్నారు.
సోమవారం రాత్రి తనకు కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారని, వైద్యులు దీన్ని ధృవీకరించారని ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో హున్‌సేన్ పేర్కొన్నారు.
తాను తిరిగి కంబోడియాకు వస్తున్నానని, బ్యాంకాక్‌లో జరగనున్న జీ20 సదస్సు, ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) సమావేశంలో పాల్గొనబోనని సేన్ చెప్పారు.
ఆదివారం ముగిసిన ఆగ్నేయాసియా దేశాల (ఆసియాన్) సదస్సుకు కంబోడియా ఆతిథ్యమిచ్చింది. ఇక్కడ సేన్ పలువురు నేతలను కలిశారు.

ఫొటో సోర్స్, Getty Images