24 గంటలు గడిస్తేనే ఏ విషయమైనా చెప్పగలం - కృష్ణ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు

కృష్ణ కొంతకాలంగా శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. ఈ రోజు ఉదయం గుండెపోటు రావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. జో బైడెన్: చైనాతో కొత్తగా ప్రచ్ఛన్న యుద్ధాలు ఉండవు

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

    ఫొటో సోర్స్, Reuters

    చైనాతో కొత్తగా ప్రచ్ఛన్న యుద్ధాలు ఏమీ ఉండవని భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.

    జీ20 సమావేశం కోసం ఇండోనేషియా చేరుకున్న సందర్భంగా జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సమావేశమయ్యారు.

    ‘అలాగే ఇప్పటికిప్పుడు తైవాన్ మీద చైనా దాడి చేసే ప్రమాదం’ ఉన్నట్లుగా తాను భావించడం లేదని బైడెన్ తెలిపారు.

    కొన్ని విషయాల్లో ‘రాజీపడటానికి’ చైనా అధ్యక్షుడు సిద్ధంగా ఉన్నట్లు కూడా ఆయన చెప్పారు.

  3. మిజోరాం: కూలిన క్వారీ... ‘చిక్కుకు పోయిన సుమారు 20 మంది కార్మికులు’

    మిజోరాంలో ఒక క్వారీ కూలిన ప్రమాదంలో 15-20 మంది కార్మికులు అందులో చిక్కుకొని పోయినట్లు భావిస్తున్నారు.

    మౌదార్ ప్రాంతంలో సుమారు 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. ‘రాళ్లతో కొట్టడం, కాళ్లు చేతులు నరకడం’.. ఇస్లామిక్ షరియా చట్టాల ప్రకారం కఠినంగా శిక్షలు అమలు చేస్తామని ప్రకటించిన తాలిబాన్ టాప్ లీడర్

  5. ఆప్తుల అస్థికల్ని డ్రోన్ల సాయంతో సముద్రంలో, నదుల్లో నచ్చిన చోట చల్లిస్తున్నారు

  6. ఒక సంస్థను ఒకే రోజు రూ.1.22 లక్షల కోట్లకు ముంచేసిన రూ.650 ట్విటర్ బ్లూటిక్

  7. అయిదేళ్లుగా రెండు చెవులూ వినిపించట్లేదు.. చెవుడు వచ్చిందని అంతా అనుకున్నారు.. కానీ, చెవుల్లో ఇయర్ బడ్స్ ఇరుక్కుపోయాయని తెలిసి షాక్ అయ్యారు..

  8. 24 గంటలు గడిస్తేనే ఏ విషయమైనా చెప్పగలం - కృష్ణ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు, బళ్ల సతీశ్, బీబీసీ ప్రతినిధి

    కృష్ణ ఫైల్ ఫొటో

    ఫొటో సోర్స్, ManjulaGhattamaneni

    ఫొటో క్యాప్షన్, కృష్ణ ఫైల్ ఫొటో

    కృష్ణ ఆరోగ్యం ఇంకా తీవ్ర విషమంగానే ఉందని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.

    ఆయన ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారని, అవసరమైన అన్ని రకాల చికిత్సలూ, మందులు అందిస్తున్నామని చెప్పారు.

    ఈరోజు ఉదయంతో పోలిస్తే మధ్యాహ్నానికి పరిస్థితి క్రిటికల్ గానే ఉందని చెప్పారు.

    ఎనిమిది మంది వైద్యుల బృందం ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయి వైద్యాన్ని కృష్ణకు అందిస్తోందని చెప్పారు.

    కార్డియాక్ అరెస్ట్‌తో కృష్ణను ఆసుపత్రికి తీసుకొచ్చారని, అయితే.. ఆయనకు కిడ్నీ, లివర్ సమస్యలు కూడా ఉన్నాయని, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ పరిస్థితిని ఆయన ఎదుర్కొంటున్నారని డాక్టర్లు తెలిపారు.

    తాము అందిస్తున్న వైద్యానికి ఆయన శరీరం స్పందిస్తోందా? అన్న విషయాన్ని కూడా ఇలాంటి కేసుల్లో చెప్పలేమని, ఇలాంటి కేసుల్లో రెండు మూడు రోజులు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని అన్నారు.

    అయితే, తాము ఇస్తున్న మందులను ఆయన శరీరం భరిస్తోందని వెల్లడించారు. ఆయనకు డయాలసిస్ కూడా చేస్తున్నామని తెలిపారు.

    మరొక 24 గంటలు గడిస్తేనే తాము ఏ విషయమైనా చెప్పగలమని వైద్యులు ప్రకటించారు.

    మహేశ్ బాబు సహా కృష్ణ కుమార్తెలు, కోడళ్లు, అల్లుళ్లు అంతా కాంటినెంటల్ ఆసుపత్రిలోనే ఉన్నారు.

  9. షాహీన్ అఫ్రిదికి గాయం కావడం వల్లే పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్‌ కోల్పోయిందా?

  10. ది గ్రేట్ మూన్ హోక్స్: ‘చంద్రుని మీద మనుషులు, 420 కోట్ల జీవులు’.. వారికి బైబిల్ బోధించాలని 187 ఏళ్ల కిందట క్రైస్తవ మిషనరీలు నిధులు సేకరించినప్పుడు..

  11. జీ20 సదస్సు: షీ జిన్‌పిన్, జో బైడెన్ సమావేశం వివరాలు

    షీ జింగ్‌పింగ్, బైడెన్

    ఫొటో సోర్స్, Reuters

    ఇండోనేషియాలోని బాలిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జింగ్‌పింగ్ సమావేశమయ్యారు. అధ్యక్షుల హోదాలో వీరిద్దరూ కలుసుకోవడం ఇదే తొలిసారి.

    సమావేశంలో మొదట జిన్‌పింగ్ మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సంబంధాలను ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు.

    షీ జింగ్‌పింగ్

    ఫొటో సోర్స్, REUTERS

    "మిస్టర్ ప్రెసిడెంట్, మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. మనం చివరిసారిగా అయిదేళ్ల క్రితం దావోస్‌లో కలుసుకున్నాం. మీరు అధ్యక్ష పదవిని చేపట్టాక, చాలాసార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నాం. కానీ, ముఖాముఖి సమావేశం కావడం వేరు. నేడు మనం ముఖాముఖి కలిశాం.

    మనం అనుభవం నుంచి పాఠాలు నేర్చుకున్నాం. చరిత్ర కంటే గొప్ప పాఠ్య పుస్తకం మరొకటి లేదు. చరిత్రను అద్దంలా చూడాలి. ప్రస్తుతం అమెరికా, చైనా సంబంధాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. రెండు పెద్ద దేశాల నాయకులుగా మనం సరైన నిర్ణయాలు తీసుకోవాలి.

    ద్వైపాక్షిక సంబంధాలకు సరైన దిశను కనుగొనాలి. తద్వారా దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచుకోవచ్చు. ఇతర ప్రపంచ దేశాలతో కలిసి ప్రపంచ శాంతి కోసం కృషి చేయాలి. ఈ సమావేశంలో వ్యూహాత్మక ప్రాముఖ్యం ఉన్న అంశాలపై స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తపరచాలి. మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను" అని జిన్‌పింగ్ అన్నారు.

    బైడెన్

    ఫొటో సోర్స్, Reuters

    అనంతరం బైడెన్ మాట్లాడుతూ, అమెరికా, చైనాల మధ్య వివాదాలను నివారించడం ముఖ్యమని ఆన్నారు.

    "రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగించాలి. తద్వారా, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ భద్రత మొదలైన అత్యవసర సమస్యలపై రెండు దేశాలు కలిసి పనిచేయవచ్చు. ఈ రెండు దేశాలు భాగస్వామ్యంతో పనిచేయాలని ప్రపంచం ఆశిస్తోంది" అని బైడెన్ అన్నారు.

  12. 'ఆమెను చంపి ముక్కలు ముక్కలుగా కోసి విసిరేశాడు' .. దిల్లీలో మరో హత్య

    హత్య

    ఫొటో సోర్స్, ANI

    ఆరు నెలల క్రితం జరిగిన హత్య కేసుని మెహ్రౌలీ పోలీసులు ఛేదించారని దిల్లీ పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి 5 రోజుల పోలీసు కస్టడీకి తరలించారని వార్తా సంస్థ ఏఎన్ఐ వెల్లడించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    దిల్లీ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, అఫ్తాబ్ పూనావాలా అనే వ్యక్తి తనతో లివ్ ఇన్ సంబంధంలో ఉన్న శ్రద్ధను 2022 మేలో హత్యచేశాడు. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి చుట్టుపక్కల ప్రాంతాల్లో విసిరేశాడు.

    "వీరిద్దరికీ ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. ముంబైలో ఉన్నప్పుడు కలిసి జీవించడం మొదలుపెట్టారు. తరువాత దిల్లీ వచ్చారు. ఇక్కడికి వచ్చిన కొద్ది రోజుల తరువాత, ఆమె కనిపించడం లేదని ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు. వెంటనే దిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె చివరి లొకేషన్ దిల్లీగా గుర్తించారు. ఆమె వివాహం చేసుకోమని అతడిపై ఒత్తిడి తేవడంతో, ఆమెను చంపేశాడు" అని దిల్లీ సౌత్ డిస్ట్రిక్ట్ అడిషనల్ డీసీపీ అంకిత్ చౌహాన్ తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    ప్రస్తుతం అఫ్తాబ్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు.

  13. జీ20 పక్కనే బీ20 సదస్సు.. వర్చువల్‌గా హాజరైన ఈలాన్ మస్క్

    ఈలాన్ మస్క్

    ఫొటో సోర్స్, EPACopyright

    ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ఈలాన్ మస్క్ ఇండోనేషియాలో జరుగుతున్న వ్యాపార సదస్సు బీ20కి వర్చువల్ హాజరయ్యారు.

    జీ20 సదస్సుకు పక్కనే బీ20 కూడా జరుగుతోంది.

    మస్క్ చాలాకాలంగా ఇండోనేషియాలో వ్యాపార అవకాశాలను పరిశీలిస్తున్నారు. ప్రత్యేకంగా, అక్కడి నికెల్ గనుల్లో పెట్టుబడి పెట్టే యోచన చేస్తున్నారు. ఇది ఆయన ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారానికి సహాయపడుతుంది.

    ఇండోనేషియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధిపతి అయిన అర్స్‌జాద్ రస్జిద్‌ బీ20 సదస్సుకు ఆతిధ్యం వహిస్తున్నారు.

    "మస్క్ నేరుగా సదస్సులో పాల్గొనలేకపోవడం నిరాశాజనకమే. కానీ, ఇక్కడ ఇంకా చాలామంది పెట్టుబడిదారులు ఉన్నారు. మస్క్ ఇండోనేషియాలో పెట్టుబడులు పెడతారని ఆశిస్తున్నాం" అని రస్జిద్‌ అన్నారు.

  14. 15 ఏళ్ల క్రితం తన కుమార్తెను చంపి, ముక్కలుగా కోసిన హంతకుడిని ఈ తల్లి ఎలా కనిపెట్టారు?

  15. పొలం దున్నే బుల్లెట్ బండి

  16. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే ఏంటి

  17. జీ20 సదస్సు: బాలీ చేరుకున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్

    షీ జిన్‌పింగ్

    ఫొటో సోర్స్, Reuters

    చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ జీ20 సదస్సులో పాల్గొనేందుకు బాలి చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.

    ఇరు దేశాల మధ్య సంబంధాలు వీగుతున్న తరుణంలో, ఈ ఇద్దరు దేశాధినేతల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంటుంది.

    చర్చల్లో తైవాన్ ప్రధానాంశం కావచ్చు.

    తైవాన్ విషయంలో "ఇరు దేశాల గీతలు ఏమిటో చర్చిస్తాం" అని బైడెన్ ఇంతకుమునుపు చెప్పారు.

    ఈ ఇద్దరు నేతలు 11 ఏళ్ల తరువాత ముఖాముఖి కలుసుకోబోతున్నారు. బైడెన్ అధికారం చేపట్టిన తరువాత, జిన్‌పింగ్‌ని తొలిసారిగా కలుస్తున్నారు.

  18. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సిటీ నటుడు కృష్ణ ఆరోగ్యం.. ఐసీయూలో చికిత్స

    సినీ నటుడు కృష్ణ

    ఫొటో సోర్స్, maheshbabu/twitter

    సినీ నటుడు కృష్ణకి కార్డియాక్ అరెస్ట్ కావడంతో తమ ఆస్పత్రికి తీసుకొచ్చారని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు మీడియా సమావేశంలో చెప్పారు.

    "ఆదివారం అర్థరాత్రి స్పృహ లేని స్థితిలో ఆయన్ను మా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆయనకి కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. సీపీఆర్ చేసి 20 నిమిషాల్లో ఆయనను కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటకి తీసుకొచ్చాం. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆయన ఆరోగ్యం క్రిటికల్‌గానే ఉంది. నిపుణులైన వైద్యులందరూ పర్యవేక్షిస్తున్నారు. చేయాల్సినదంతా చేస్తున్నాం. ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చెప్పలేం. ఆయన ఆరోగ్యంపై 24 గంటల తరువాత మళ్లీ మరొక ప్రకటన ఇస్తాం" అని డాక్టర్ చెప్పారు.

    సిటీ నటుడు కృష్ణ

    ఫొటో సోర్స్, UGC

    కృష్ణ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.

  19. మళ్లీ వరదలు వస్తే ఈ నగరం తట్టుకోగలదా?

    చెన్నై

    ఏడేళ్ల క్రితం చెన్నై నగరాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ ఇప్పుడు ఆ ప్రాంతంలో తీవ్ర వర్షాలు కురుస్తున్నాయి. రాను రాను వీటిని అంచనా వేయడం కష్టమైపోతోంది.

  20. జీ20: 11 ఏళ్ల తరువాత కలుస్తున్న బైడెన్, జిన్‌పింగ్.. ఏం చర్చించనున్నారు