మునుగోడు: ‘ఖాతాల్లో డబ్బుల’ మీద కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

ఓటర్లను కొనుగోలు చేసేందుకు సుమారు రూ.5.22 కోట్ల మొత్తాన్ని వివిధ బ్యాంకు ఖాతాలకు రాజ్‌గోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా బదిలీ చేసిందని టీఆర్‌ఎస్ ఆరోపించింది.

లైవ్ కవరేజీ

  1. గుజరాత్: బ్రిడ్జి నదిలో కూలిన ఘటనలో 141 మంది మృతి-ప్రకటించిన అధికారులు

  2. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

  3. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

    కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి

    ఫొటో సోర్స్, Facebook/Komatireddy Raj Gopal Reddy

    మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి‌కి చెందిన కంపెనీ కొన్ని అకౌంట్లలో డబ్బులు వేసిందనే ఆరోపణల మీద కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది.

    అక్టోబరు 31 అంటే రేపటి లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

    ఓటర్లను కొనుగోలు చేసేందుకు సుమారు రూ.5.22 కోట్ల మొత్తాన్ని వివిధ బ్యాంకు ఖాతాలకు రాజ్‌గోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా బదిలీ చేసిందని టీఆర్‌ఎస్ ఆరోపించింది.

    ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది. దీని మీద కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. 600 ఇళ్లు ఉన్న ఆ పల్లెటూరిలో ఆ ఒక్క కారణం కోసమే CC కెమెరాలు ఏర్పాటు చేశారు

  5. గుజరాత్: కేబుల్ బ్రిడ్జి ప్రమాదంలో కనీసం 32 మంది మృతి

    కేబుల్ బ్రిడ్జ్

    ఫొటో సోర్స్, RAJESH AMBALIYA/ UGC

    గుజరాత్‌లోని మచ్చు నదిలో కేబుల్ బ్రిడ్జి కూలడంతో జరిగిన ప్రమాదంలో బాధితులకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

    పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున చెల్లించనున్నట్లు ఆయన ప్రకటించారు.

    మోర్బీ ప్రాంతంలోని మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి కూలడంతో పలువురు గాయాల పాలయ్యారు.

    ఈ ఘటనలో ఇప్పటివరకు 32 మంది చనిపోయినట్లు స్థానిక ఆసుపత్రి అధికారి చెప్పినట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2

    పోస్ట్ of X ముగిసింది, 2

    మృతుల సంఖ్య 40 అని మోర్బీ ఎమ్మెల్యే చెప్పినట్లు ప్రముఖ వార్తా పత్రిక ‘హిందూ’ తెలిపింది.

    మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

    తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.

    ప్రమాద ఘటన గురించి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో పాటు ఇతర అధికారులతో ప్రధాని మోదీ మాట్లాడారు. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, కావాల్సిన సహకారాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు.

    గాయపడినవారికి వెంటనే సరైన వైద్య సహాయం అందించాలని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సూచనలు జారీ చేశారు.

    మోర్బీ కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటన గురించి గుజరాత్ హోం మంత్రి హర్ష్ సాంఘవితో పాటు ఇతర అధికారులతో మాట్లాడినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

    స్థానిక యంత్రాంగం సహాయ చర్యలు చేపడుతోందని, త్వరలోనే ఘటనా స్థలానికి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకుంటాయని ఆయన చెప్పారు.

    సహాయక చర్యల్లో పాల్గొనడానికి గాంధీనగర్ నుంచి రెండు, బరోడా నుంచి ఒక ఎన్డీఆర్‌ఎఫ్ బృందం ఇప్పటికే బయల్దేరిందని ఎన్డీఆర్‌ఎఫ్ డీజీ అతుల్ కర్వాల్ చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 4

  6. INDvsSA: 5 వికెట్ల తేడాతో ఇండియాపై గెలిచిన దక్షిణాఫ్రికా

  7. బ్రేకింగ్ న్యూస్, గుజరాత్: కూలిన కేబుల్ బ్రిడ్జి

    గుజరాత్‌లో కూలిన వంతెన

    ఫొటో సోర్స్, ANI

    గుజరాత్‌లోని మచ్చు నదిలో ఒక కేబుల్ బ్రిడ్జి కూలిపోయినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    చాలా మంది గాయపడి ఉంటారని భావిస్తున్నారు.

    ఈ హ్యాంగింగ్ బ్రిడ్జి వయసు సుమారు 100 ఏళ్లు. ఇది చాలా కాలంగా మూసివేసి ఉంది. ఇటీవలే మరమ్మతులు చేసి మళ్లీ తెరచారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    మరొక వైపు మహారాష్ట్రలో ఒక భవనం కూలి అయిదుగురు చనిపోయారు.

    అమ్రావతిలోని ప్రభాత్ సినిమా ప్రాంతంలో శిథిలావస్థలో ఉన్న ఒక భవనం కూలిందని పోలీసులు తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  8. ‘ఆ రోజు అమ్మ చెప్పిన మాటలే ఇప్పటికీ నన్ను ముందుకు నడిపిస్తున్నాయి’’

  9. బ్రేకింగ్ న్యూస్, INDSvsSA: 24 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా

    భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 24 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది.

    అర్షదీప్ 2 వికెట్లు తీశాడు.

    క్వింటన్ డీకాక్(1), బవుమా(10), రిలీ(0) అవుటయ్యారు.

  10. బ్రేకింగ్ న్యూస్, INDSvsSA: 20 ఓవర్లలో 133 పరుగులు చేసిన భారత్

    దక్షిణాఫ్రి మీద టీం ఇండియా 20 ఓవర్లలో 133 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది.

    ఇప్పుడు దక్షిణాఫ్రికా లక్ష్యం 134.

    తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.

    అయితే దక్షిణాఫ్రికా బౌలర్ లుంగి ఎంగిడి భారత్ టాప్ ఆర్డర్‌నున కూల్చాడు.

    ఓపెనర్లు కేఎల్ రాహుల్(9), రోహిత్ శర్మ(15), విరాట్ కోహ్లీ(12) పరుగులకే పెవిలియన్ చేరారు.

    హార్దిక్ పాండ్య, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్ సైతం తక్కువ పరుగులకే అవుటయ్యారు. సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే పోరాడాడు. 40 బంతుల్లో 68 పరుగులు చేసి అవుటయ్యాడు.

    దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి 4 వికెట్లు తీయగా వేన్ పార్నెల్ 3 వికెట్లు తీశాడు.

  11. బ్రేకింగ్ న్యూస్, INDSvsSA: సూర్యకుమార్ అవుట్... 8 వికెట్లు కోల్పోయిన భారత్

    సూర్య కుమార్ యాదవ్ 40 బంతుల్లో 68 పరుగులు చేసి అవుటయ్యాడు.

    రవిచంద్రన్ అశ్విన్ 7 పరుగులకే వెనుతిరిగాడు.

    ఇప్పటి వరకు 127 పరుగులకు భారత్ 8 వికెట్లు కోల్పోయింది.

  12. బ్రేకింగ్ న్యూస్, INDSvsSA: ఆరో వికెట్ కోల్పోయిన భారత్

    దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీంఇండియా 115 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.

    ఇప్పటి వరకు 17 ఓవర్లు జరిగాయి.

    తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.

    అయితే దక్షిణాఫ్రికా బౌలర్ లుంగి ఎంగిడి భారత్ టాప్ ఆర్డర్‌నున కూల్చాడు.

    ఓపెనర్లు కేఎల్ రాహుల్(9), రోహిత్ శర్మ(15), విరాట్ కోహ్లీ(12) పరుగులకే పెవిలియన్ చేరారు.

    హార్దిక్ పాండ్య, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్ సైతం తక్కువ పరుగులకే అవుటయ్యారు. సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే పోరాడుతున్నాడు.

  13. బ్రేకింగ్ న్యూస్, INDvsSA: 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత్

    విరాట్

    ఫొటో సోర్స్, Getty Images

    టి20 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మ్యాచ్‌లో భారత్ తడబడుతోంది.

    టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఇప్పటికే నాలుగు వికెట్లను కోల్పోయింది.

    ప్రస్తుతం భారత్ స్కోరు 8.3 ఓవర్లలో 49/5.

    ఈ మ్యాచ్‌లోనూ ఓపెనర్ కేఎల్ రాహుల్ పేలవ ప్రదర్శన కొనసాగింది.

    రాహుల్ 14 బంతుల్లో 9 పరుగులు చేసి అవుటయ్యాడు.

    కెప్టెన్ రోహిత్ శర్మ (15), విరాట్ కోహ్లి (12) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. దీపక్ హుడా (0) డకౌట్ కాగా హార్దిక్ పాండ్యా 2 పరుగులకే అవుట్ అయ్యాడు.

    సఫారీ బౌలర్లలో లుంగీ ఎన్‌గిడి 3 వికెట్లు పడగొట్టాడు. ఆన్రిచ్ నోర్జే ఒక వికెట్ తీశాడు.

  14. INDvsSA: దక్షిణాఫ్రికాపై భారత్ గెలవాలంటూ పాక్ అభిమానులు కోరుకుంటున్నారా

  15. కేసీఆర్: ‘వంద కోట్లను మన ఎమ్మెల్యేలు గడ్డిపోచలా విసిరేశారు’

    కేసీఆర్

    దిల్లీ నుంచి వచ్చిన కొందరు వంద కోట్ల ఆశ చూపినప్పటికీ తెలంగాణ ఎమ్మెల్యేలు వాటిని గడ్డిపోచలా విసిరేశారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

    వారికి లొంగకుండా ఎమ్మెల్యేలు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలిపారని ప్రశంసించారు.

    మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరులో నిర్వహిస్తున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

    ‘తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు’ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.

    ఆయనతో పాటు ‘ఎమ్మెల్యేల కొనుగోలు’ వ్యవహారంతో వార్తల్లో నిలిచిన ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు సభా స్థలానికి వచ్చారు.

    ఈ సభకు భారీ ఎత్తున గులాబీ శ్రేణులు తరలి వచ్చాయి.

    ఈ సభలో మాట్లాడుతూ కేసీఆర్ ఏమన్నారంటే...

    ‘‘ఉప ఎన్నిక ఫలితం ఎప్పుడో తేలిపోయింది. నాతో పాటు నలుగురు తెలంగాణ బిడ్డలు వచ్చారు. వందకోట్లను గడ్డిపోచలా విసిరేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని వారు కాపాడారు. ఇలాంటి ఎమ్మెల్యేలే మనకు కావాలి. రాజకీయమంటే అమ్ముడుపోవడం కాదని వారు నిరూపించారు.

    కొంతమంది దిల్లీ బ్రోకర్లు తెలంగాణను కొనాలని వచ్చారు. కానీ, తెలంగాణ అంటే అమ్ముడుపోయేది కాదు.

    తెలంగాణను కొనడానికి వందల కోట్ల రూపాయలు వారికి ఎక్కడి నుంచి వచ్చాయి?

    ప్రధాని మోదీ ఎందుకీ అరాచకాలు? ఇంకా మీకు ఏం కావాలి? దేశంలో ప్రధానమంత్రి కంటే పెద్ద పదవేం లేదు కదా...

    ప్రజలారా మీరంతా ఓటు వేసే ముందు ఆలోచించండి.

    రైతులపై కేంద్రం పెద్ద కుట్ర చేస్తోంది. రైతులను వ్యవసాయం నుంచి తప్పించాలని కుట్ర పన్నుతోంది.

    బీజేపీకి ఓటు వేస్తే వారి విద్యుత్ చట్టాలను మనం ఒప్పుకున్నట్లే అవుతుంది.

    దేశంలో అరాచక పాలన అంతానికే బీఆర్‌ఎస్ పుట్టింది.

    మీరంతా ప్రలోభాలకు లొంగకుండా ఆలోచించి, విశ్లేషించి ఓటు వేయండి’’ అని అన్నారు.

  16. క్యూబా జనాభా 25 ఏళ్లుగా ఎందుకు పెరగడం లేదు... కారణాలేంటి, పరిణామాలు ఎలా ఉంటాయి

  17. దక్షిణకొరియా హాలోవీన్ వేడుకల తొక్కిసలాటలో 151 మంది మృతి

  18. Samantha: ‘నేను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నా’

  19. పూనమ్ కౌర్: ‘నేను కిందపడబోతుంటే రాహుల్ గాంధీయే నా చేయి పట్టుకున్నారు’

  20. తిరుమలలో నవంబర్ 1 నుంచి టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్ల జారీ మళ్లీ ప్రారంభం, ఇది భక్తులకు ఎంత ఉపయోగం