కిరెన్ రిజిజు: ‘కశ్మీర్ విషయంలో నెహ్రూ చేసిన తప్పులను మోదీ సరి చేస్తున్నారు’
కశ్మీర్ విషయంలో జవహర్‌లాల్ నెహ్రూ చేసిన తప్పులను ప్రధాని నరేంద్ర మోదీ సరిదిద్దుతున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు అన్నారు.
లైవ్ కవరేజీ
అరుణ్ శాండిల్య
లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.
కిరెన్ రిజుజు: ‘నెహ్రూ చేసిన తప్పులను ప్రధాని మోదీ సరి చేస్తున్నారు’

ఫొటో సోర్స్, Facebook/KirenRijiju
కశ్మీర్ విషయంలో జవహర్‌లాల్ నెహ్రూ చేసిన తప్పులను ప్రధాని నరేంద్ర మోదీ సరిదిద్దుతున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు అన్నారు.
‘కశ్మీర్ విషయంలో నెహ్రూ అయిదు తప్పులు చేశారు. అందువల్ల లెక్కలేని ప్రాణాలు పోయాయి. నాడు చేసిన ఆ తప్పులను నేడు ప్రధాని నరేంద్ర మోదీ సరి చేస్తున్నారు’ అని కిరెన్ రిజుజు అన్నట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
MCBT: ఇదొక మొసళ్ల బ్యాంక్, ఇక్కడ వేల మొసళ్లు పుట్టాయి
అన్నమయ్య ప్రాజెక్టు బాధితులు ఏడాది తర్వాత ఎలా ఉన్నారు-బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
కిమ్ జోంగ్ ఉన్: దీపావళి టపాకాయల్లా మిసైళ్లను పేలుస్తున్న ఉత్తరకొరియా అధినేత, అసలు లక్ష్యం ఏంటి?
‘ఏడాదికి 7 లక్షల ఉద్యోగాలిస్తున్న యూట్యూబ్ క్రియేటర్స్’

ఫొటో సోర్స్, Getty Images
భారత జీడీపీలో యూట్యూబ్ వాటా ఏడాదికి రూ.6,800 కోట్లుగా ఉన్నట్లు ఆ సంస్థ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ నీల్ మోహన్ తెలిపారు.
ఏడాదికి సుమారు 7 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
‘భారత్‌లో క్రియేటర్ ఎకానమీ బాగా పెరుగుతోంది. దేశంలోని ప్రముఖ భాషలన్నీ మా ప్లాట్ ఫాం మీద ఉన్నాయి. జెండర్ డైవర్సిటీ కూడా ఉంది.
కంటెంట్ తయారు చేసే వారు, దాన్ని యూజ్ చేసుకునే వారికి యూట్యూబ్ ఒక సురక్షితమైన ప్లేస్‌గా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని నీల్ మోహన్ వివరించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భారతీయుల ప్రాణాలు హరిస్తున్నాయా, లాన్సెట్ నివేదికలో ఏముంది?
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సీబీఐ, లేదా సిట్ విచారణకు అప్పగించాలంటూ హైకోర్టులో బీజేపీ పిటిషన్
బ్రేకింగ్ న్యూస్, సమాజ్ వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌కు 3 ఏళ్ల జైలు శిక్ష

ఫొటో సోర్స్, Getty Images
2019 నాటి విద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్ వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడింది.
అలాగే రూ.2,000 జరిమానా కూడా విధించారు.
2019 ఎన్నికల సందర్భంగా మిలాక్ నియోజకవర్గంలో ఆజం ఖాన్ విద్వేష పూరిత ప్రసంగం చేశారనేది ఆరోపణ.
నాడు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడంతోపాటు ఒక రాజ్యాంగ సంస్థకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేశారు.
INDvsNED: నెదర్లాండ్స్ మీద 56 పరుగుల తేడాతో గెలిచిన భారత్

ఫొటో సోర్స్, Getty Images
టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ మీద 56 పరుగులతో టీం ఇండియా గెలిచింది.
భారత్ విధించిన 180 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో నెదర్లాండ్స్ 9 వికెట్లకు 123 పరుగులు మాత్రమే చేసింది.
భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్ల చొప్పున తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 66 పరుగులు చేయగా రోహిత్ శర్మ 39 బంతుల్లో 53 పరుగులు చేశాడు.
సూర్యకుమార్ యాదవ్ మరొక సారి తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 25 బంతుల్లో 51 పరుగులు కొట్టాడు. ఇందులో 7 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.
ఎవరు కొంటున్నారో, ఎవరు అమ్ముడుపోతున్నారో-తెలంగాణ ఫిరాయింపుల్లో మునుగోడు చాప్టర్
INDvsNED: నెదర్లాండ్స్ ముందు 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన భారత్

ఫొటో సోర్స్, Getty Images
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీ ఇండియా 20 ఓవర్లకు 179 పరుగులు చేసింది.
రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది.
విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 66 పరుగులు చేయగా రోహిత్ శర్మ 39 బంతుల్లో 53 పరుగులు చేశాడు.
సూర్యకుమార్ యాదవ్ మరొక సారి తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 25 బంతుల్లో 51 పరుగులు కొట్టాడు. ఇందులో 7 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రష్యా ఆక్రమణ నుంచి విముక్తి పొందిన యుక్రేనియన్ గ్రామాలు ఎలా ఉన్నాయంటే.. - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్..
భారత్‌లో ఇకపై మహిళా క్రికెటర్లకు పురుషు క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ ఫీజు
మహిళా క్రికెటర్లకు పురుష క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ ఫీజు ఇస్తామని బీసీసీఐ ప్రకటించింది.
ఈ మేరకు బీసీసీఐ గౌరవ కార్యదర్శి జయ్ షా ప్రకటించారు.
బీసీసీఐతో కాంట్రాక్ట్ ఉన్న మహిళా క్రికెటర్లందరికీ ఇది వర్తిస్తుంది.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
దీంతో ఇకపై బీసీసీఐ మహిళా క్రికెటర్లు టెస్టులకు రూ. 15 లక్షలు, వన్ డే మ్యాచ్‌లకు రూ. 6 లక్షలు, టీ20లకు రూ. 3 లక్షల చొప్పున పొందుతారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
బ్రిటన్ రాజు చార్లెస్ కంటే ప్రధాని రిషి సునక్ సంపన్నుడా?
క్రైస్తవ సన్యాసినులూ పోర్న్ చూస్తున్నారు.. మానుకోవాలి: పోప్ ఫ్రాన్సిస్

ఫొటో సోర్స్, Getty Images
ఆన్‌లైన్‌లో పోర్న్ కంటెంట్ చూడడమనేది మతబోధకులను మానసికంగా బలహీనులను చేస్తుందని, దానికి దూరంగా ఉండాలని నన్‌లు, ప్రీస్ట్‌లను పోప్ ఫ్రాన్సిస్ హెచ్చరించారు.
వాటికన్‌లోని నిర్వహించిన ఓ సెషన్‌లో ‘డిజిటల్, సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకోవచ్చు’ అన్న ప్రశ్నకు సమాధానమిచ్చే క్రమంలో పోప్ ఫ్రాన్సిస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలను వాడొచ్చు కానీ అవి మన సమయాన్ని వృథా చేసేవిగా ఉండరాదన్నారు.
పోర్నోగ్రఫీ గురించి మాట్లాడిన ఆయన... ‘చాలామందికి దీన్ని వీక్షించే దుర్వ్యసనం ఉంది.. చివరకు ప్రీస్ట్‌లు, నన్‌లకు కూడా’ అన్నారాయన.
ఫోన్‌లోంచి ఇలాంటివి డిలీట్ చేసేస్తే చేతిలో ఇక ఆ టెంప్టేషన్ ఉండదన్నారు పోప్.
చర్చి బోధనల ప్రకారం పోర్నోగ్రఫీ పవిత్రకు పూర్తిగా వ్యతిరేకం.
టీ20 ప్రపంచకప్‌లో నేడు ఇండియా, నెదర్లాండ్స్ మ్యాచ్
టీ20 ప్రపంచకప్‌లో గురువారం టీమ్ ఇండియా నెదర్లాండ్స్‌తో తలపడనుంది.
ఈ మ్యాచ్‌తో పాటు మరో రెండు మ్యాచ్‌లూ గురువారం ఉన్నాయి.
దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ మధ్య... పాకిస్తాన్, జింబాబ్వే మధ్య మిగతా రెండు మ్యాచ్‌లు జరుగుతాయి.
కాగా గ్రూప్-1లో 3 పాయింట్లతో న్యూజీలాండ్ అగ్రస్థానంలో ఉండగా గ్రూప్-2లో బంగ్లాదేశ్ 2 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. గ్రూప్-2 భారత్ 2 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉంది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
తెలంగాణలో ‘భారత్ జోడో యాత్ర’ పునఃప్రారంభం

ఫొటో సోర్స్, congress
తెలంగాణలో రాహుల్ పాదయాత్ర పునఃప్రారంభమైంది.
ఈ నెల23నే రాహుల్ తెలంగాణలో అడుగుపెట్టినప్పటికీ, కొద్ది దూరం మాత్రమే నడిచారు.
దీపావళి కావడంతో యాత్రకు విరామం ఇచ్చి, ఈరోజు ఉదయం మళ్లీ యాత్ర ప్రారంభించారు.
గురువారం తెల్లవారుజామున శంషాబాద్‌కు విమానంలో చేరుకున్న రాహుల్, తరువాత మఖ్తల్ వెళ్లారు.
గతంలో యాత్ర ఆపిన గూడబెల్లూరు నుంచే తిరిగి నడక ప్రారంభించారు.
రాహుల్ తో కలసి రేవంత్ సహా తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు నడుస్తున్నారు.
నారాయణపేట జిల్లా మఖ్తల్ నియోజకవర్గంలో ఈవాళ యాత్ర సాగుతుంది.
యలిగండ్ల దగ్గర రాత్రికి బస చేస్తారు.
తెలంగాణలో నవంబర్ 6వ తేదీ వరకూ రాహుల్ పాదయాత్ర సాగనుంది. హైదరాబాద్ లో కూడా రాహుల్ యాత్ర ఉంటుంది.

ఫొటో సోర్స్, congress
భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నాగరాజు కళాబృందం టేకులపల్లి పెట్రోల్ బంక్ వద్ద ఒగ్గుడోలు కళాకారులు ప్రదర్శన ఇచ్చారు.
టీ విరామం తర్వాత రాహుల్ గాంధీ గారు ఒగ్గుడోలు కళాకారుల వద్దకు వచ్చి వారి ప్రదర్శనను ఆసక్తికరంగా తిలకించారు.
ఈ సందర్భంగా కళాకారులు పలు విన్యాసాలు చేసి చూపించారు.
గొల్ల కురుమ లకు సంబంధించిన ఈ కళాకారుల విశిష్టత గురించి రాహుల్ గాంధీ గారికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు వివరించారు.

ఫొటో సోర్స్, congress
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.