మయన్మార్ సంక్షోభం: కచ్చిన్ తిరుగుబాటుదారులపై వైమానిక దాడి – 50 మంది మృతి

మయన్మార్‌లో అతిపెద్ద ఆదివాసీ తిరుగుబాటు గ్రూపు లక్ష్యంగా జరిగిన వైమానిక దాడిలో 50 మంది చనిపోగా, 100 మంది గాయపడ్డట్లు చెప్తున్నారు.

లైవ్ కవరేజీ

  1. నేటి లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం

    తాజా వార్తలతో రేపు ఉదయం కలుద్దాం.

    అంతవరకు సెలవు.

  2. రిషి సునక్ ఎవరు? బ్రిటన్ ప్రధాని స్థాయికి ఎలా ఎదిగారు?

  3. అయోధ్యలో దీపావళి: లక్షల దీపాలతో వెలిగిపోయిన సరయూ నదీ తీరం

  4. మయన్మార్ సంక్షోభం: కచ్చిన్ తిరుగుబాటుదారులపై వైమానిక దాడి – 50 మంది మృతి, జొనాథన్ హెడ్, సౌతీస్ట్ ఏసియా కరెస్పాండెంట్

    మయన్మార్ సైన్యం

    ఫొటో సోర్స్, Getty Images

    మయన్మార్‌లో అతిపెద్ద ఆదివాసీ తిరుగుబాటు గ్రూపు లక్ష్యంగా జరిగిన వైమానిక దాడిలో 50 మంది చనిపోగా, 100 మంది గాయపడ్డట్లు చెప్తున్నారు.

    కచ్చిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ (కేఐఏ) అధికార ప్రతినిధి కల్నల్ నా బు బీబీసీకి ఈ విషయం తెలిపారు.

    మయన్మార్ ఉత్తర ప్రాంతంలోని కచ్చిన్ రాష్ట్రంలోని కాన్సీ గ్రామంలో కేఐఏ ఏర్పాటు చేసిన ఒక సంగీత కచేరీ మీద ఓ విమానం మూడు బాంబులు జారవిడిచినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.

    ఈ దాడికి ముందుగా ఎలాంటి హెచ్చరికలూ లేవని గ్రామస్థులు తెలిపారు.

    కచ్చిన్ స్వయం ప్రతిపత్తి కోసం తిరుగుబాటు సైన్యం ఏర్పడిన 62వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సంగీత కచేరీ నిర్వహించారు.

    స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8:30 గంటల సమయంలో మూడు భారీ విస్ఫోటనాలు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కచేరీ జరుగుతున్న ప్రాంతంలో భవనాల సముదాయాన్ని ఆ బాంబులు తునాతునకలు చేశాయి. ప్రేక్షకులు చాలా మంది చనిపోయారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    మరణించిన వారిలో నలుగురు ప్రముఖ కచ్చిన్ గాయకులు ఉన్నట్లు భావిస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని హ్పకాంత్ పట్టణంలో ఆస్పత్రికి తరలించటానికి వైద్య సిబ్బంది ప్రయత్నించగా.. వారిని సైన్యం అడ్డుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

    కచ్చి రాష్ట్రంలోని ఈ ప్రాంతంలో జేడ్ (పచ్చరాయి) గనుల నుంచి ఏటా 3,000 కోట్ల డాలర్ల విలువైన తవ్వకాలు జరుగుతున్నట్లు అంచనా. ఈ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి కావాలని కచ్చిన్ తిరుగుబాటుదారులు డిమాండ్ చేస్తున్నారు. వీరికి, సైన్యానికి మధ్య చాలా ఏళ్లుగా భీకర పోరాటం జరుగుతోంది.

    గత ఏడాది ఆంగ్ సాన్ సూచీ సారథ్యంలోని ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసిన సైనిక కుట్ర అనంతరం ఈ పోరాటం మరింత ముదిరింది.

    ఆ కుట్రను ప్రతిఘటిస్తూ మయన్మార్‌లో ఏర్పాటైన ఇతర సాయుధ బృందాలకు కచ్చిన్ తిరుగుబాటుదారులు మద్దతు ఇస్తుండటంతో.. వారిని హెచ్చరింటానికి, లేదా వారిపై ప్రతీకారానికి సైన్యం ఈ దాడి చేసినట్లు కనిపిస్తోంది.

    మియన్మార్ మ్యాప్
  5. బ్రిటన్ భారీ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది.. సుస్థిరత, సమైక్యత అవసరం: రిషి సునక్

    రిషి సునక్

    ఫొటో సోర్స్, Getty Images

    బ్రిటన్ గొప్ప దేశమని, కానీ భారీ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్తూ.. ఈ తరుణంలో దేశంలో సుస్థిరత, సమైక్యత అవసరమని బ్రిటన్ కాబోయే ప్రధానమంత్రి రిషి సునక్ పిలుపునిచ్చారు.

    లండన్‌లోని కన్జర్వేటివ్ పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సహచర పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి రిషి సునక్ ప్రసంగించారు.

    టోరీ నాయకుడిగా తన తొలి ప్రసంగం చేస్తూ.. సహచర ఎంపీలు తనకు మద్దతిచ్చి నాయకుడిగా ఎన్నుకోవటం అత్యంత గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.

    దేశంలోనూ, విదేశాల్లోనూ క్లిష్ట పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రధానిగా లిజ్ ట్రస్ గౌరవప్రదమైన నాయకత్వం అందించారని ఆయన కీర్తించారు.

    ‘‘నేను ప్రేమించే పార్టీకి సేవ చేయగలగటం, నేను ఎంతో రుణ పడి ఉన్న దేశానికి రుణం తీర్చుకోగలగటం నా జీవితంలో అత్యంత విశిష్ట అవకాశం’’ అని పేర్కొన్నారు.

    ‘‘నేను నిబద్ధతతో నిరాడంబరంగా మీకు సేవ చేస్తాననని ప్రతిజ్ఞ చేస్తున్నా’’ అన్నారు.

    బ్రిటిష్ ప్రజలకు అనునిత్యం సేవ చేయటానికి కృషి చేస్తానన్నారు.

  6. రిషి సునక్ ఎవరు, ఆయనకూ భారతదేశానికీ ఉన్న అనుబంధం ఏంటి?

  7. బ్రేకింగ్ న్యూస్, బ్రిటన్ కొత్త ప్రధాని కానున్న రుషి సునక్.. పోటీ నుంచి తప్పుకున్న పెన్నీ మోర్డంట్

    రుషి సునక్

    ఫొటో సోర్స్, Reuters

    బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా రిషి సునక్ ఖాయమయ్యారు. ప్రధాని పదవికి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పెన్నీ మోర్డంట్ ప్రకటించటంతో రేసులో ఆయన ఒక్కరే మిగిలారు.

    దీంతో రుషి సునక్ టోరీ పార్టీ నేతగా ఎన్నికై, ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టడం ఇక లాంఛనప్రాయమే.

    రిషి సునక్ రేపు అధికారికంగా ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని బీబీసీ లండన్ చీఫ్ పొలిటికల్ కరెస్పాండెంట్ నిక్ ఈర్డ్‌లీ తెలిపారు.

    పెన్నీ పోటీ నుంచి తప్పుకోవడానికి ముందు మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కూడా ఆదివారం రాత్రి ప్రధాని పదవి బరి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.

    పార్టీ ఎంపీల మద్దతు ఆశించినంతగా లభించకపోవటంతో పెన్నీ మోర్డంట్ వైదొలిగారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ నేత పదవికి కేవలం రుషి సునక్ ఒక్కరు మాత్రమే నామినేషన్ వేశారు.

    దాంతో, సెప్టెంబర్ నెలలో ప్రధాని పదవికి పోటీ చేసి ఓడిన రిషి సునక్ అక్టోబర్ నెలలో విజేతగా నిలిచినట్లయింది.

    కన్సర్వేటివ్ పార్టీ తదుపరి నాయకుడు, కాబోయే ప్రధానమంత్రి రిషి సునక్ అని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. 'ఆ చివరి మూడు ఓవర్లు చూస్తూ దీపావళి పండుగ చేసుకున్నా' - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, సోషల్ మీడియాలో చర్చ

  9. కార్గిల్: సైనికులతో ప్రధాని మోదీ దీపావళి సంబరాలు

    సైనికులకు స్వీట్లు తినిపిస్తున్న ప్రధాని మోదీ

    ఫొటో సోర్స్, Facebook/Narendra Modi

    ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

    కార్గిల్ యుద్ధంలో చనిపోయిన సైనికులకు నివాళులు అర్పించారు.

    అక్కడి సైనికులకు స్వయంగా స్వీటు తినిపించారు.

    సైనికులతో మోదీ

    ఫొటో సోర్స్, Facebook/Narendra Modi

  10. బ్రిటన్ ప్రధాని ఎన్నిక: బోరిస్ జాన్సన్ మద్దతుదారులు ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారు?

    రిషి సునక్, పెన్నీ మోర్డంట్

    ఫొటో సోర్స్, PA Media

    ఫొటో క్యాప్షన్, ప్రధాని రేసులో పెన్నీ మోర్డంట్ కన్నా రిషి సునక్ ముందంజలో ఉన్నారు

    బ్రిటన్ ప్రధానమంత్రి పదివికి పోటీ నుంచి వైదొలగుతున్నట్లు మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఆదివారం రాత్రి ప్రకటించారు. దీంతో అప్పటివరకూ ఆయనకు మద్దతునిచ్చిన టోరీ ఎంపీలు ఇప్పుడు ఎవరికి మద్దతు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.

    ఆ ఎంపీల్లో చాలా మంది మాజీ ఆర్థికమంత్రి రిషి సునక్‌ను సమర్థిస్తున్నట్లు ఆదివారం రాత్రి పొద్దు పోయాక, సోమవారం ఉదయం కనిపించిన ప్రాధమిక పరిణామాలు సూచిస్తున్నాయి.

    ఆయన తర్వాత ఆర్థికమంత్రి అయిన నిధిమ్ జహావి, మాజీ హోంమంత్రి ప్రీతి పాటిల్, ప్రస్తుత విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీలు ఇప్పటికే తమ ఓట్లను ఆయన వైపు మళ్లించారు.

    ప్రధానమంత్రి పదవికి ఎన్నికవాలంటే బ్రిటన్ కాలమానం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 2:00 గంటల లోపు.. మొత్తం 355 మంది టోరీ ఎంపీల్లో కనీసం 100 మంది ఎంపీల మద్దతు పొందాల్సి ఉంటుంది.

    బోరిస్ జన్సన్‌కు మద్దతిచ్చిన ఎంపీల్లో చాలా మంది ఇప్పుడు తము ఎవరివైపు నిలుస్తున్నామనే విషయాన్ని ఇంకా బహిరంగంగా చెప్పలేదు. సోమవారం మధ్యాహ్నం లోగా వారు ఎటువైపు ఉన్నారనేది స్పష్టమవుతుంది.

    బ్రిటన్ ప్రధాని ఎన్నిక
  11. ‘సిట్రాన్గ్‌ తుపానుతో తెలుగు రాష్ట్రాలకు ఇబ్బంది లేదు’, శ్రీనివాస్ లక్కోజు, బీబీసీ కోసం

    పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో నెలకొన్న సిట్రాన్గ్ తుపాను, బంగ్లాదేశ్‌లోని బరిసాల్ తీరానికి 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఏపీలోని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

    ఈ తుపాను గత 6 గంటలుగా 21 కి.మీ. వేగంతో కదులుతోందని రానున్న 12 గంటల్లో ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

    ఇది అక్టోబరు 25 తెల్లవారుజామున బరిసాల్‌కు సమీపంలో టింకోనా ద్వీపం, శాండ్‌విప్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్పారు.

    ఈ తుపాను ప్రభాం తెలుగు రాష్ట్రాలపై ఉండదని, ఈ నెలాఖరు వరకు తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి కేంద్రం తెలిపింది.

  12. గ్రహణం విడిపోయే వరకూ అన్నం వండకూడదా... తినకూడదా?

  13. కేరళ: గవర్నర్ ఆదేశాల మీద హై కోర్టుకు వెళ్లిన ప్రభుత్వం

    కేరళలోని తొమ్మిది యూనివర్సిటీల వైస్ చాన్సలర్స్‌ను రాజీనామా చేయమంటూ ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం కోర్టులో సవాలు చేసింది.

    ఈమేరకు నేడు మధ్యహ్నం నాలుగు గంటలకు కేరళ హై కోర్టు ప్రత్యేక విచారణ చేపట్టనుంది.

    ఏపీజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌ను యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) నిబంధనలకు విరుద్ధంగా నియమించారంటూ సుప్రీం కోర్టు ప్రకటించింది.

    ఈ నేపథ్యంలో 9 యూనివర్సిటీల వైస్ చాన్సలర్స్ రాజీనామా చేయాలంటూ ఆరిఫ్ మహ్మద్ ఆదేశించారు.

    అయితే ఇది ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడమేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. తెలంగాణ: ఆదివాసీల దండారీ పండగ, గుస్సాడీ నృత్యాల ప్రత్యేకతలు ఏంటి?

  15. ‘కూడు లేకపోయినా, కుళ్లిపోయి ఇంట్లోనే చచ్చిపోతాం కానీ, ఆ నది దాటి వెళ్లలేం’

    బ్రిడ్జి లేక నదులను దాటి వెళ్లే ప్రజల కష్టాలు మనం చాలానే చూసి ఉంటాం. కానీ బ్రిడ్జి ఉన్నా ఆ ఊరి ప్రజలు మాత్రం నదిలో దిగి వెళ్లాల్సిన పరిస్థితి. అసలిలా ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  16. రమీజ్ రాజా: ‘ఈ ఆట అనైతికమైదని క్రూరమైనది అవుతుంది’

    పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ రమీజ్ రాజా

    ఫొటో సోర్స్, UCG

    టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోయింది.

    ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ రమీజ్ రాజా స్పందించారు.

    పాకిస్తాన్ టీం ఆట తీరును ఆయన ప్రశంసించారు.

    ‘క్లాసిక్! మీరు కొన్ని సార్లు గెలుస్తారు. కొన్ని సార్లు ఓడిపోతారు. ఈ ఆట క్రూరమైనది, అనైతికమైనది అవుతుందనే విషయం మన అందరికీ తెలుసు.

    బ్యాటు, బాల్‌తో ఇంత కంటే ఎక్కువ చేయలేరు.

    మీ ఆట తీరును చూసి గర్విస్తున్నాం’ అని ఆయన ట్వీట్ చేశారు.

    ఎంతో ఉత్కంఠంగా, నాటకీయంగా జరిగిన ఈ మ్యాచులో 4 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు తీశాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. బ్రిటన్ ప్రధాని రేసు నుంచి తప్పుకున్న బోరిస్ జాన్సన్

    బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్

    ఫొటో సోర్స్, PA Media

    బ్రిటన్ ప్రధాని రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు బోరిస్ జాన్సన్ తెలిపారు.

    గతంలో ఆయన బ్రిటన్ ప్రధానిగా పని చేశారు.

    బోరిస్ జాన్సన్ తప్పుకోవడంతో భారత సంతతి రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయ్యే అవకాశాలు మెరుగైనట్లుగా కనిపిస్తోంది.

    తాను పోటీలో నిలబడటానికి తగిన మద్దతు ఉన్నప్పటికీ కానీ పోటీ చేయడమనేది సరైన పని కాదు అని బోరిస్ అన్నారు.

  18. విరాట్ కోహ్లీ: ‘ఆ షాట్ ఒక మానవమాత్రుడు కొట్టి ఉంటే ఔటయ్యేవాడు... విరాట్ కాబట్టి దాన్ని బౌండరీ దాటించి, సిక్స్‌గా మలిచాడు’

  19. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ వల్ల ఆలస్యంగా టేకాఫ్ అయిన విమానం

    బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా

    ఫొటో సోర్స్, Getty Images

    భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కోసం విమానాన్ని కాస్త లేట్‌గా పైలెట్ టేకాఫ్ చేసినట్లు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా తెలిపారు.

    ‘ముంబయి నుంచి ఛండీగడ్ వెళ్లే విమానంలో ఫైనల్ రెండు ఓవర్లు చూశాను. విమానంలోని ప్రయాణికులందరూ మ్యాచ్ చూస్తూ ఫోన్లకు తమ కళ్లను అప్పగించేశారు.

    క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే పైలెట్ అయిదు నిమిషాలు ఆలస్యంగా విమానాన్ని టేకాఫ్ చేశారు. ఎవరు ఫిర్యాదు చేయలేదు.

    అశ్విన్ ఆఖరి షాట్ కొట్టగానే కేరింతలతో విమానం మారుమోగింది. ఇలాంటి దాన్ని ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు.

    రన్‌వే మీద టేకాఫ్ కోసం విమానం వేగంగా పరుగులు తీస్తున్నప్పుడే ఇదంతా జరిగింది’ అని ఆయన ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  20. కత్తి దాడిలో ఒక కంటి చూపు కోల్పోయిన సల్మాన్ రష్దీ

    రచయిత సల్మాన్ రష్దీ

    ఫొటో సోర్స్, Reuters

    ఈ ఏడాది అగస్టులో జరిగిన కత్తి దాడిలో గాయపడిన రచయిత సల్మాన్ రష్దీ, ఒక కంటి చూపును కోల్పోయినట్లు ఆయన ఏజెంట్ తెలిపారు.

    అలాగే ఆయన చేతుల్లో ఒకటి పని చేయదని వెల్లడించారు. ఆయన ఛాతీకి 15 కంటే ఎక్కువ గాయాలు అయ్యాయని రష్దీ ఏజెంట్ ఆండ్రూ వైలీ, స్పానిష్ పత్రికకు తెలిపారు.

    ప్రస్తుతం రష్దీ ఎక్కడ ఉంటున్నారు అనేది తాను చెప్పలేనని ఆండ్రూ అన్నారు.

    ‘ది సటానిక్ వెర్సెస్’ అనే పుస్తకం రాసినందుకు 1988 నుంచి సల్మాన్ రష్దీని చంపుతామంటూ బెదిరిస్తున్నారు.

    కొందరు ముస్లింలు ‘దైవ దూషణ’గా ఆ పుస్తకాన్ని చూస్తున్నారు.

    న్యూయార్క్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ ఏడాది అగస్టు 12న రష్దీ మీద ఒక వ్యక్తి కత్తితో దాడి చేశాడు.