You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

INDvsSA : మూడో వన్డేలో గెలిచిన భారత్, 2-1 ఆధిక్యంతో సిరీస్‌ కైవసం

దక్షిణాఫ్రికా బ్యాటింగ్ మూడో వన్డేలో కుప్ప కూలింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రాణించాడు. 4.1 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. షాబాజ్ అహ్మద్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు.

లైవ్ కవరేజీ

  1. ప్రపంచ పర్యావరణ దినోత్సవం: ఆవు తేన్పుల మీద పన్ను... ఎక్కడ, ఎందుకు?

  2. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

    అంత వరకు సెలవు.

  3. కర్నాటక: ‘16 మంది దళితుల నిర్బంధం... వేధింపులు’

    కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లాలో 16 మంది దళితులను నిర్బంధించి టార్చర్ చేశారనే ఆరోపణలతో జగదీశ్ గౌడ అనే వ్యక్తి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

    ఈమేరకు కాఫీ తోటల యజమాని అయిన జగదీశ్ గౌడ, ఆయన కుమారుడు తిలక్‌ల మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టారు.

    6 దళిత కుటుంబాలు జగదీశ్ గౌడ కాఫీ తోటల్లో మూడు నెలలుగా పని చేస్తున్నారు. అయితే ఒక గొడవకు సంబంధించి మంజు అనే కూలీని జగదీశ్ కొట్టారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో కూలీలు తిరుగుబాటు చేసి తాము పని చేయమని అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు.

    అయితే తాను అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి కట్టి అప్పుడు మాత్రమే వెళ్లిపోవాలని జగదీశ్ గౌడ డిమాండ్ చేశారు.

    అక్టోబరు 8న కూలీలను తిట్టడంతోపాటు వారి ఫోన్లను ఆయన తీసుకున్నారని దళితులు ఆరోపిస్తున్నారు. అర్పిత అనే గర్భిణి ఫోను ఇవ్వడానికి నిరాకరించడంతో ఆమె మీద జగదీశ్ దాడి చేశారు.

    ఆ తరువాత అర్పిత భర్తతో పాటు ఇతరుల మీద దాడి చేశారు. అర్పితో సహా మహిళా కూలీలను ఒక గదిలో వేసి తాళం వేశారు.

  4. ఉజ్జయినిలో మహాకాళేశ్వర్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

  5. బిహార్: జేపీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్ షా

    జనతా పార్టీ నేత జయప్రకాశ్ నారాయణ్ స్వస్థలాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు సందర్శించారు.

    ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి జయప్రకాశ్ నారాయణ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

    ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను విమర్శించారు.

    ‘నితీశ్ కుమార్ అధికారం కోసం జయప్రకాశ్ నారాయణ్ ఆశయాలను గాలికి వదిలేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ఒడిలో కూర్చొని ఉన్నారు. 1974లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాన్ని జయప్రకాశ్ నారాయణ్ బిహార్ నుంచే ప్రారంభించారు.

    నాడు ఎందరో యువత ఉద్యమంలో పాల్గొన్నారు. వాళ్లలో కొందరు నేటికీ జయప్రకాశ్ నారాయణ్, లోహియా తమకు ఆదర్శమని చెబుతుంటారు.

    కానీ వాస్తవంలో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ చంక ఎక్కుతారు’ అని అమిత్ షా విమర్శించారు.

  6. మధ్యప్రదేశ్‌లో ‘శ్రీ మహాకాల్ కారిడార్’ను ప్రారంభించిన మోదీ

    మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ‘శ్రీ మహాకాల్ కారిడార్’ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు.

    ఈ ఫేజ్-1 ప్రాజెక్ట్ మొత్తం విలువ రూ.850 కోట్లు అని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఇక్కడకు వచ్చే భక్తులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పిస్తారని వెల్లడించింది.

    ప్రస్తుతం ఏడాదికి కోటిన్నర మంది భక్తులు వస్తున్నారని, ఇకపై ఈ సంఖ్య రెట్టింపు కావొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

    ఆలయ ప్రాంగణాన్ని విశాలంగా తీర్చిదిద్దడంతో పాటు, ఇక్కడి చారిత్రక నిర్మాణాలను పునరుద్ధరించి పరిరక్షణ చర్యలు చేపట్టారు. ఆలయ ప్రాంగణాన్ని గతంలో కన్నా ఏడు రెట్లు విశాలంగా చేశారు.

    ఆలయ అభివృద్ధి ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టారు. మొదటిదశలో భాగంగా... మహాకాల్ మార్గంలో 108 స్తంభాలను నిర్మించారు. వాటిపై శివుని ఆనంద తాండవాన్ని చెక్కారు. మహాకాల్ మార్గంలో శివపురాణానికి సంబంధించిన ఎన్నో కుడ్య చిత్రాలను ఏర్పాటు చేశారు.

  7. ఆంధ్రప్రదేశ్: ఈ బడికి కరెంటు బిల్లు రాదు, ప్రభుత్వమే డబ్బు చెల్లిస్తుంది

  8. ఈ మహిళా బైక్ మెకానిక్స్ పనితీరు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే...

  9. మూడో వన్డేలో భారత్ గెలుపు... 2-1తో సిరీస్ కైవసం

    దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది.

    దక్షిణాఫ్రికా విధించిన 100 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి చేధించింది.

    శుభమన్ గిల్ 57 బంతుల్లో 49 పరుగులు చేయగా శ్రేయస్ అయ్యర్ 23 బంతుల్లో 28 పరుగులు చేశాడు.

    టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 99 పరుగులకే ఆల్ ఔటైంది.

    4 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

    దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో భారత్ గెలుచుకుంది.

  10. భారత్-పాకిస్తాన్: కార్గిల్ సరిహద్దుల్లో అంతులేని నిరీక్షణ, సొంతవాళ్లను కలుసుకునే మార్గమే లేదా?

  11. ఇరాన్: నికా షకరామీ చనిపోవడానికి ముందు హిజాబ్‌ను తగులబెట్టినట్లు చూపిస్తున్న వీడియోలు

  12. మూడో వన్డేలో 99 పరుగులకే దక్షిణాఫ్రికా ఆల్ ఔట్

    భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 99 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది.

    27.10 ఓవర్లు మాత్రమే క్రీజులో నిలబడగలిగింది.

    మార్కరమ్ ఒక్కడే 42 బంతుల్లో 34 పరుగులు చేశాడు.

    ఏడుగురు ప్లేయర్లు సింగిల్ డిజిట్‌కే అవుట్ అయ్యారు.

    బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ రాణించాడు. 4.1 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు.

    షాబాజ్ అహ్మద్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు.

    ఇక అవేశ్ ఖాన్ 5 ఓవర్లలో 8 పరుగులు మాత్రమే ఇవ్వడం విశేషం.

  13. బీసీసీఐ కొత్త అధ్యక్షునిగా రోజర్ బిన్నీ!

    మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడు కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధ్యక్షునిగా ఉన్న సౌరవ్ గంగూలీ నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

    బీసీసీఐ కార్యదర్శి పదవిలో జే షా కొనసాగనున్నారు.

    1983 వరల్డ్ కప్ గెలిచిన టీం సభ్యుల్లో రోజర్ బిన్నీ కూడా ఒకరు.

  14. స్పీకర్ ఫార్మాట్ అంటే ఏమిటి? ఎమ్మెల్యేల రాజీనామాలు ఆ పద్ధతిలో లేకుంటే చెల్లవా?

  15. అమితాబ్-రేఖ: వీరిది ‘అందమైన మలుపులున్న ముగింపు లేని ప్రేమ కథ’

  16. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోయే మహాకాల్ లోక్ ప్రత్యేకలేంటి?

    ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయం కొత్త కారిడార్ 'మహాకాల్ లోక్'ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

    ఈ కారిడార్‌ను రూ.865 కోట్లతో రెండు దశల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఈ మొత్తం ప్రణాళిక పూర్తయిన తర్వాత, మహాకాల్ విస్తీర్ణం 47 హెక్టార్లు అవుతుంది. ప్రస్తుతం ఇది 2.8 హెక్టార్ల విస్తీర్ణం ఉంది.

    946 మీటర్ల పొడవైన కారిడార్‌ను ఉపయోగించి భక్తులు మహాకాల్ ఆలయ గర్భగుడి వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. దీనికోసం 25 అడుగుల ఎత్తు, 500 మీటర్ల పొడవుతో గోడను నిర్మించారు.

    దీనితో పాటు, 108 శివ లింగాలు, వివిధ భంగిమలలో శివుని రూపాలను నిర్మించారు.

    ఆలయాన్ని సందర్శించిన తర్వాత, ప్రధాని మహాకాల్ కారిడార్ నంది ద్వారం వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి మహాకాల్ లోక్‌ను దేశానికి అంకితం చేస్తారు.

    అనంతరం కార్తీక్ మేళా మైదానంలో జరిగే సభలో ప్రసంగిస్తారు.

    ప్రధాని నరేంద్ర మోదీ భద్రత కోసం 6 వేల మంది సైనికులను మోహరించారు.

  17. పంజాబ్‌: జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకూ దాంపత్య సుఖం.. కొత్త పథకం ప్రారంభించిన జైళ్ల శాఖ

  18. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ డి.వై.చంద్రచూడ్

    సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా డాక్టర్ ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ పేరును చీఫ్ జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ సూచించారు.

    సుప్రీంకోర్టుకు 50వ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించనున్న డాక్టర్ ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.

    ఆగస్ట్ 27న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి స్వీకారం చేసిన జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నవంబర్ 8న తన పదవి నుంచి రిటైర్ కాబోతున్నారు.

    దీంతో జస్టిస్ లలిత్ 74 రోజుల స్వల్ప వ్యవధికి ఈ పదవిలో కొనసాగినట్లవుతుంది.

  19. ఊర్వశి రౌతేలా: ఈ సినీ నటి టీమిండియా వికెట్ కీపర్ వెంటపడుతున్నారా? ఈమె ఆస్ట్రేలియా వెళ్లడంపై ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ ఎందుకు?

  20. కీయెవ్ పై మిసైల్ దాడి ఆరంభమే, అసలు ఎపిసోడ్ ముందు ఉందంటూ రష్యా హెచ్చరిక

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌ పై రష్యా క్షిపణి దాడులను ప్రపంచంలోని అనేక దేశాలు ఖండించాయి.

    యూనివర్శిటీలు, పిల్లల ఆట స్థలాలు సహా పౌరులను రష్యా లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోందని అమెరికా అన్నది. యుక్రెయిన్‌కు తమ సాయం కొనసాగుతుందని హామీ ఇచ్చింది.

    ఈ దాడి పట్ల తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు.

    క్రైమియాను రష్యాకు కలిపే ఏకైక వంతెనపై శనివారం జరిగిన పేలుడుకు ప్రతిస్పందనగా ఈ దాడులు జరిగాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు.

    రష్యా సోమవారం 83 క్షిపణులను ప్రయోగించిందని, వాటిలో 43 క్షిపణులను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకున్నాయని యుక్రెయిన్ పేర్కొంది.

    ‘‘యుక్రెయిన్‌ను మీరు భయపెట్టలేరు. ఈ దాడులు మమ్మల్ని మరింత ఐక్యం చేస్తాయి’’ అని యుక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలియెన్‌స్కీ ఒక వీడియోలో వ్యాఖ్యానించారు.

    "రష్యా యుద్ధ నేరాలకు పాల్పడింది"

    రాజధాని కీయెవ్‌తో పాటు యుక్రెయిన్‌లోని ఎల్వివ్, ఖార్కివ్ తదితర నగరాలపై కూడా రష్యా దాడి చేసింది. ఈ నగరాలు గతంలో కూడా రష్యా లక్ష్యంగా ఉన్నాయి సోమవారం జరిగిన దాడుల్లో దాదాపు 14 మంది మరణించారని, పలువురు గాయపడ్డారని ఓ అధికారి తెలిపారు.

    దాడుల కారణంగా పలు నగరాల్లో విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రష్యా యుద్ధ నేరానికి పాల్పడిందని, తీవ్రవాదాన్ని, క్రూరత్వాన్ని ప్రదర్శించిందని యూరోపియన్ యూనియన్ ఆరోపించింది.

    మరోవైపు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ, కెర్చ్ వంతెనపై శనివారం జరిగిన పేలుడుకు ప్రతిస్పందనగా ఈ దాడులు చేశామని చెప్పారు.

    యుక్రెయిన్‌పై “భయంకరమైన” దాడికి తాను ఆదేశించబోతున్నట్లు ప్రకటించారు.

    "ఈ దాడి అసలు దాడులలో మొదటి ఎపిసోడ్ మాత్రమే" అని రష్యా భద్రతా మండలి డిప్యూటీ హెడ్ దిమిత్రి మెద్వెదెవ్ అన్నారు.