లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ దిల్లీలోని తిస్ హజారి కోర్టులో పిటీషన్ వేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా అందులోని పాత్రలను చిత్రీకరించారంటూ పిటీషనర్ పేర్కొన్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

ఫొటో సోర్స్, Facebook/Prabhas
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ దిల్లీలోని తిస్ హజారి కోర్టులో పిటీషన్ వేశారు.
హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా అందులోని పాత్రలను చిత్రీకరించారంటూ పిటీషనర్ పేర్కొన్నారు.
అభ్యంతకరమైన సన్నివేశాలు తీసేసిన తరువాతే సినిమాను విడుదల చేసేందుకు అనుమతించాలంటూ కోర్టును కోరారు.

ఫొటో సోర్స్, EPA
రష్యాను క్రైమియాను కలిపే వంతెన మీద జరిగిన దాడిని ‘ఉగ్రవాద చర్య’గా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభివర్ణించారు.
వంతెన మీద దాడి చేసింది యుక్రెయిన్ అని భావిస్తున్న పుతిన్, ప్రతీకారంగా ఆ దేశం మీద దాడులు ప్రారంభించారు.
‘ఉగ్రవాదంలో భాగంగా క్రైమియా వంతెన మీద దాడి చేశారు. యుక్రెయిన్ ప్రత్యేక దళాలు దీని వెనుక ఉన్నాయి. టర్కిష్ స్ట్రీం పైప్‌లైన్‌ను ధ్వంసం చేసేందుకు కూడా యుక్రెయిన్ ప్రయత్నిస్తోంది.
రష్యాకు వ్యతిరేకంగా ఇలాగే దాడులు కొనసాగిస్తే మా రియాక్షన్ మరింత కఠినంగా ఉంటుంది’ అని వీడియో సందేశంలో పుతిన్ హెచ్చరించారు.
యుక్రెయిన్‌లోని సైనిక స్థావరాలు, ఇంధన, కమ్యూనికేషన్ సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని లాంగ్ రేంజ్ మిసైల్స్‌ను ప్రయోగించినట్లు వెల్లడించారు.
క్రైమియా వంతెన మీద శనివారం దాడి జరిగింది. అయితే ఆ దాడికి యుక్రెయిన్ బాధ్యత తీసుకోలేదు.

ఫొటో సోర్స్, Reuters
యుక్రెయిన్ రాజధాని కీయెవ్ నగరం మీద సోమవారం ఉదయం జరిగిన బాంబు దాడుల్లో ఎనిమిది మంది పౌరులు చనిపోయినట్లు యుక్రెయిన్ అంతర్గత మంత్రిత్వశాఖ చెప్పింది.
ఈ దాడుల్లో ఆరు కారులు దగ్ధమయ్యాయని, మరో 15 వాహనాలు ధ్వంమయ్యాయని పేర్కొంది.
‘‘మమ్మల్ని నాశనం చేయటానికి, భూమి మీద నుంచి తుడిచివేయటానికి రష్యా ప్రయత్నిస్తోంద’’ని తాజా దాడులు సూచిస్తున్నాయని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ వ్యాఖ్యానించారు.
కీయెవ్‌తో పాటు జపోరిఝియా, ద్నిప్రో నగరాల మీద బాంబు దాడులను ఆయన ఉటంకిస్తూ.. ‘‘యుక్రెయిన్ అంతటా ఎయిర్ అలారమ్ విరామం లేకుండా మోగుతోంది’’ అని టెలిగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
జనం కొందరు చనిపోవటం, గాయపడటం జరిగిందని చెప్పారు. ప్రజలు షెల్టర్లలో తలదాచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ నేత లాలు యాదవ్ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా లాలు భావోద్వేగానికి గురయ్యారు.
‘‘ఆయన సామ్యవాద ఉద్యమాన్ని దేశమంతటా ముందుకు తీసుకెళ్లారు. రామ్ మనోహర్ లోహియా, జన్నాయక్ కర్పూరి ఠాకూర్, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్‌ల ఆలోచనలు ఆయనలో నాటుకుపోయాయి’’ అంటూ ములాయంను లాలు కొనియాడారు.
ములాయంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘నేను చికిత్స కోసం సింగపూర్ వెళుతున్నాను. నేతాజీ అంత్యక్రియలకు నేను హాజరుకాలేనని చెప్తున్నారు. తేజస్వి హాజరవుతారు’’ అని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
సిసలైన రాజకీయవేత్త: వైఎస్ జగన్ సంతాపం
ములాయం సింగ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
‘‘ఆయన నిజమైన రాజకీయవేత్త. భారతదేశంలో సామ్యవాద నాయకత్వానికి నిలువెత్తు ప్రతీక. అణగారిన వర్గాల సాధికారత కోసం అనునిత్యం పనిచేశారు’’ అని కొనియాడారు.
ములాయం కుటుంబానికి, మద్దతుదారులకు సంతాపం తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ నేత ప్రియాంకా గాంధీ వాద్రా, రాష్ట్రీయ జనతాదళ్ నేత శరద్ యాదవ్ తదితరులు కూడా ములాయం మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

ఫొటో సోర్స్, Reuters
క్రైమియాను, రష్యాతో అనుసంధానించే ఏకైక వంతెన శనివారం నాడు ఒక పేలుడులో ధ్వంసమైన నేపథ్యంలో.. కీయెవ్ మీద తాజా దాడులు జరగటం విశేషం.
ఆ వంతెన మీద దాడి చేసింది యుక్రెయిన్ అని ఆరోపిస్తూ.. అది ‘‘ఉగ్రవాద చర్య’’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం నాడు నిందించారు.
రష్యా పౌర మౌలిక సదుపాయాల్లో కీలకమైన భాగాన్ని ధ్వంసం చేయటానికి యుక్రెయిన్ నిఘా బలగాలు ఈ దాడి చేశాయని ఆయన ఆరోపించారు.

శనివారం కెర్చ్ బ్రిడ్జ్ మీద జరిగిన దాడిలో ముగ్గురు చనిపోయినట్లు అధికారులు చెప్తున్నారు. ఒక లారీ పేలిపోయినపుడు సమీపంలో ఉన్న కారులో వారు ముగ్గురూ ఉన్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో కీయెవ్ మీద సోమవారం ఉదయం బాంబు దాడులు జరిగాయి.
దీనికి ముందు శనివారం రాత్రి నుంచీ కూడా యుక్రెయిన్‌లోని పలు నగరాల మీద బాంబు దాడులు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి.
యుక్రెయిన్ రాజధాని కీయెవ్ నగరంలో సోమవారం ఉదయం వరుస పేలుళ్లు సంభవించాయి.
ఓ హోటల్‌లో బసచేస్తున్న బీబీసీ బృందం ఒక మిసైల్ దాడిని ప్రత్యక్షంగా చూసింది.
ఆ దాడికి 90 నిమిషాల ముందు గగనతల దాడి గురించి హెచ్చరిస్తూ సైరన్ మోగింది.
యుక్రెయిన్ - రష్యా యుద్ధంలో చాలా రోజుల విరామం తర్వాత కీయెవ్ నగరం మీద దాడి జరిగింది.
సిటీ సెంటర్‌లో బాంబు దాడులు జరిగినట్లు మేయర్ విటాలియ్ క్లిష్కెకో తెలిపారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో భవనాల మీద నుంచి భారీ ఎత్తున పొగ ఎగసి పడుతున్న దృశ్యాలు సోసల్ మీడియాలో పోస్టయ్యాయి.
ఈ దాడుల్లో పలువురు చనిపోయారని, ఇంకొందరు గాయపడ్డారని ప్రముఖ జర్నలిస్ట్ ఆంద్రీయ్ త్సాప్లియెంకో చెప్పారు.
గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో కన్నుమూసిన ములాయం సింగ్ యాదవ్ భౌతిక కాయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సందర్శించి నివాళులు అర్పించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ భౌతిక కాయానికి మంగళవారం సాయ్‌ఫాయ్‌లో అంత్యక్రియలు జరుగుతాయని సమాజ్‌వాది పార్టీ తెలిపింది.
సోమవారం ఉదయం గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో మృతి చెందిన ములాయం భౌతిక కాయాన్ని సాయ్‌ఫాయ్‌కి తీసుకు వెళుతున్నట్లు ఒక ట్వీట్‌లో వెల్లడించింది.
కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ములాయం మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
యూపీలో మూడు రోజులు సంతాపం ప్రకటించిన సీఎం యోగి

ఫొటో సోర్స్, Getty Images
ములాయం మృతి పట్ల ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. రాష్ట్రంలో మూడు రోజులు అధికారిక సంతాప దినాలుగా ప్రకటించారు.
‘‘ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మూడు రోజులు రాష్ట్ర సంతాపం ప్రకటిస్తోంది. ఆయన అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తాం’’ అని సీఎం యోగి ట్వీట్ చేశారు.
ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్‌కు ఫోన్ చేసి మాట్లాడానని, ఆయనకు తన సంతాపం తెలిపానని ఆదిన్యాథ్ పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు.
‘‘ములాయం మరణం దేశానికి తీరని నష్టం. సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ములాయం సాధించిన విజయాలు అసాధారణమైనవి. భూమి పుత్రుడైన ములాయం భూమికి కట్టుబడ్డారు. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ, మాయావతి సంతాపం
ములాయం మరణం జాతీయ రాజకీయాలకు తీరని నష్టమని కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు ఈ లోటును తట్టుకునే శక్తినివ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి కూడా తన సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
ములాయం సింగ్ యాదవ్ మృతిపట్ల టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తంచేశారు.
ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్‌కు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అణగారిన వర్గాల కోసం పోరాడన యోధుడు: సీతారాం ఏచూరి
అణగారిన వర్గాలు, వెనుకబడిన వర్గాల వారి కోసం పోరాడిన యోధుడు ములాయం అని సీపీఎం పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాపం తెలిపారు.
భారతదేశానికి కీలకమైన సమయంలో మత విద్వేషానికి వ్యతిరేకంగా ములాయం అచంచల పోరాటం చేశారని, భారత సమైక్యత కోసం, సమ్రగత కోసం నిలిచారని కొనియాడారు.

ఫొటో సోర్స్, @ncbn
ములాయం సింగ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తంచేశారు.
‘‘నేను ఓ ప్రియమైన సోదరుడిని కోల్పోయాను. ఈ ఓబీసీ మహానేతతో నాలుగు దశాబ్దాల పాటు ఎంతో సమయం గడిపే అదృష్టం నాకు దక్కింది’’ అని సంతాపం పేర్కొన్నారు.
‘‘తన సామ్యవాద లక్ష్యాలను సాధించటానికి మౌనంగా ముందుకు సాగిన ప్రజా నేత ఆయన. ఆయన కుటుంబానికి, ఉత్తరప్రదేశ్ ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.