You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
"ఒకే భారతంలో రెండు దేశాలు ఉండటాన్ని ఆమోదించం" - రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ఒకే భారతదేశంలో పేదలకు, సంపన్నులకు వేర్వేరుగా రెండు రకాలైన దేశాలున్నాయని అన్నారు.
లైవ్ కవరేజీ
'రివెంజ్ ట్రావెల్' అంటే ఏంటి, ఇది భారత పర్యాటక రంగాన్ని రక్షిస్తుందా?
మహమూద్ గవాన్ మదరసాలో కుంకుమ చల్లి పూజలు చేసిన నలుగురి అరెస్ట్... అసలేం జరిగింది?
"ఒకే భారతంలో రెండు దేశాలు ఉండటాన్ని ఆమోదించం"- రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ఈ దేశంలో రెండు రకాలైన భారతదేశాలు ఉన్నాయి. ఒకటి పేదలకు, రెండవది సంపన్నులకు అని అన్నారు.
ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
"నిన్న నేనొక మహిళను కలిసాను. ఆమె భర్త రూ.50,000 అప్పును తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనొక రైతు".
"ఒక భారత్: పెట్టుబడిదారీ స్నేహితులకు 6% వడ్డీతో రుణాలు, కోట్ల కొలదీ రుణ మాఫీలు"
"రెండవ భారత్: అప్పులతో నిండిన జీవితం, రైతులకు 24% వడ్డీతో రుణాలు"
ఒకే దేశంలో రెండు విధానాలు" దీనిని మేము ఆమోదించం" అని అన్నారు.
రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటకలో సాగుతోంది.
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా రాహుల్ తో పాటు ఈ యాత్రలో పాల్గొంటున్నారు.
నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు ఎవరు... ఈ పురస్కారానికి ఎలా ఎంపిక చేస్తారు, విజేతలకు ఏమిస్తారు?
ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి
మొబైల్ ఫోన్లు చోరీ అయితే పోలీసులు ఎలా వెతికి పట్టుకుంటారో తెలుసా?
నోబెల్ శాంతి బహుమతి విజేతల ప్రకటన
నోబెల్ శాంతి బహుమతిని ఒక మానవ హక్కుల ప్రచారకర్తకు, రెండు సంస్థలకు ప్రకటించారు.
బెలారస్‌కు చెందిన అలెస్ బియాలియాట్స్కితో పాటు రష్యా కు చెందిన మానవ హక్కుల సంస్థ మెమోరియల్, యుక్రెయిన్‌కు చెందిన సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్‌కు శాంతి బహుమతి లభించింది.
అయితే, రష్యన్ మానవ హక్కుల సంస్థ మెమోరియల్ ఈ ఏడాది ప్రారంభంలో మూతపడింది.
గత 30 ఏళ్లుగా మెమోరియల్ సంస్థ సోవియెట్ పాలనలో శిక్షించిన, బంధించిన, పీడించిన కొన్ని లక్షల మంది ప్రజల జ్ఞాపకశక్తిని పునరుద్ధరించేందుకు కృషి చేసింది.
శాంతి బహుమతి గ్రహీతలు మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, శాంతియుత సహజీవనం కోసం విలక్షణమైన సేవలు అందించారని శాంతి బహుమతిని ప్రకటించిన బెరిట్ రీస్ ఆండర్సన్ చెప్పారు.
తెలంగాణ: ‘చూపు పోయింది.. అడుక్కోమన్నారు, 50 ఏళ్లుగా ఈ రిపేర్లు చేసుకుని జీవిస్తున్నా’
మేడిన్ ఇండియా ఐఫోన్ 14: భారత్ ‘ప్రపంచ ఫ్యాక్టరీ’ అవుతుందా? చైనా స్థానాన్ని భర్తీ చేస్తుందా?
మునుగోడు ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్ధిగా ప్రభాకర్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
ఉద్యమకారుడిగా, ఆవిర్బావ కాలం నుంచి ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. స్థానికంగా ఆయనకు మంచి పేరు ఉండటంతో కేసీఆర్ ఆయన వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
స్థానిక నాయకులు కార్యకర్తలు, జిల్లా పార్టీ నాయకత్వం, నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే రిపోర్టులను పరిశీలించిన తర్వాత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఝార్ఖండ్: వేరొకరిని పెళ్లి చేసుకుంటోందని బాలికపై పెట్రోలు పోసి నిప్పుపెట్టిన యువకుడు
ఝార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో ఓ బాలికపై పెట్రోల్ పోసి తగులబెట్టేందుకు ప్రయత్నించిన ఉదంతం వెలుగు చూసింది. నిందితుడు రాజేష్ రౌత్‌ను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ సంఘటన గత గురువారం రాత్రి జరిగింది. బాలికకు 90 శాతం కాలిన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్)కు తరలించారు.
నిందితుడిని శుక్రవారం ఉదయం అరెస్టు చేసినట్లు దుమ్కా ఎస్‌డిపిఓ శివేంద్ర బీబీసీకి తెలిపారు.
బాధిత కుటుంబ సభ్యులకు జిల్లా యంత్రాంగం లక్ష రూపాయల చెక్కును అందజేసింది.
బాధితురాలు, నిందితులు ఇద్దరూ జర్ముండి బ్లాక్‌కు చెందినవారు. ఎస్డీపీఓ శివేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరి మధ్య 2019 సంవత్సరం నుంచి పరిచయం ఉందని..ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారని, అయితే వారి కుటుంబాలు సిద్ధంగా లేవని తెలిపారు.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో యువకుడికి వివాహం జరిగింది. బాధితురాలికి కూడా పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా, నిందితుడు దాన్ని వ్యతిరేకించాడు.
పెళ్లి చేసుకుంటే చంపుతానని నాలుగు రోజుల కిందటే బాలికను నిందితుడు హెచ్చరించినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
చైనాపై మానవహక్కుల తీర్మానాన్ని తిరస్కరించిన ఐరాస హ్యూమన్ రైట్స్ కౌన్సిల్
వీగర్ ముస్లింల స్థితిగతులపై చైనాకు వ్యతిరేకంగా చేసిన మానహ హక్కుల తీర్మానాన్ని జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి తిరస్కరించింది.
చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘనలపై చర్చ కోసం కెనడా, అమెరికా, బ్రిటన్ సహా అనేక దేశాలు ఈ ముసాయిదా తీర్మానాన్ని సమర్పించాయి. ఈ ప్రతిపాదనకు తగినన్ని ఓట్లు రాకపోవడంతో ఇది తిరస్కరణకు గురైంది.
చైనాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై 47 సభ్య దేశాలలో 17 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా, చైనా సహా 19 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి.
ఇండియా, యుక్రెయిన్, మలేషియా సహా 11 సభ్య దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
అనేక ఇస్లామిక్ దేశాలు కూడా ఈ తీర్మానంపై చర్చలో పాల్గొన్నా, చాలా దేశాలు చైనాకు అనుకూలంగా ఓటు వేయడమోలేదా ఓటింగ్‌కు దూరంగా ఉండటమో చేశాయి.
వ్యతిరేకం: పాకిస్తాన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఉజ్బెకిస్తాన్, సూడాన్, సెనెగల్ తదితర దేశాలు
గైహర్హాజరు: ఇండియా, మలేషియా, గాంబియా, లిబియా తదితర దేశాలు
అనుకూలం: సోమాలియా, అమెరికా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, హోండురాస్, నెదర్లాండ్స్, పోలాండ్, దక్షిణ కొరియా తదితర దేశాలు.
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
ముఖ్యాంశాలు:
- చైనాలో వీగర్ ముస్లింల స్థితిగతులపై వివిధ దేశాలు ప్రవేశపెట్టి మానవ హక్కుల తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల మండలి తిరస్కరించింది.
- చైనాకు వ్యతిరేకంగా యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్ కార్యక్రమానికి భారత్ గైర్హాజరైంది.
- రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతోంది.
- జమ్మూ కశ్మీర్ పర్యటన సందర్భంగా వేదికపై తనకు ఏర్పాటు చేసిన బులెట్ ప్రూఫ్ పోడియంను తీసేయాలని కోరిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ప్రభావం పెరుగుతోందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఆందోళన వ్యక్తం చేసింది.
- ఖతార్‌లో జరగబోయే ఫీఫా వరల్డ్ కప్ టోర్నీ తన చివరి టోర్నీ అని స్టార్ ఫుట్ బాలర్ లియోనిల్ మెస్సీ ప్రకటించారు.
తెలంగాణ: ‘చూపు పోయింది.. వరంగల్‌లో అడుక్కుని బతకమన్నారు.. 50 ఏళ్లుగా నేను ఏం చేస్తున్నానంటే..’