ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
మళ్లీ రేపు ఉదయం తాజా వార్తలతో కలుద్దాం.
107 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 16.4 ఓవర్లలో 2 వికెట్లకు 110 పరుగులు చేసింది. అంతకుముందు దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు చేసింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
మళ్లీ రేపు ఉదయం తాజా వార్తలతో కలుద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది.
తిరువనంతపురంలో బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 8 వికెట్లతో గెలిచింది.
107 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 16.4 ఓవర్లలో 2 వికెట్లకు 110 పరుగులు చేసింది.
ఓపెనర్ కేఎల్ రాహుల్ (56 బంతుల్లో 51 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు ) అజేయ అర్ధసెంచరీ సాధించాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ కాగా, విరాట్ కోహ్లి (3) కూడా త్వరగానే అవుటయ్యాడు.
తర్వాత సూర్య కుమార్ యాదవ్ (33 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు )తో కలిసి రాహుల్ మ్యాచ్‌ను ముగించాడు.
వీరిద్దరూ మూడో వికెట్‌కు అజేయంగా 93 పరుగులు జోడించారు.
కగిసో రబడ, నోర్జే చెరో వికెట్ తీశారు.
అంతకుముందు దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్‌ను చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా నియమిస్తున్నట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
సీడీఎస్ పదవితోపాటు భారత ప్రభుత్వ కార్యదర్శిగానూ చౌహాన్ పనిచేస్తారని మంత్రిత్వ శాఖ వివరించింది.
సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన పది నెలల తర్వాత చౌహాన్‌ను ఈ పదవిలో నియమించారు.
కోల్‌కతాలో జన్మించిన చౌహాన్ 1981లో సైన్యంలో చేరారు. భిన్న హోదాల్లో దాదాపు 40ఏళ్లు ఆయన సేవలు అందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Reuters
సీనియర్ అడ్వొకేట్ ఆర్ వెంకటరమానీని అటార్నీ జనరల్(ఏజీ)గా నియమిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఈ పదవిలో వెంకటరమానీ మూడేళ్లు కొనసాగుతారు.
ఈ విషయాన్ని న్యాయశాఖ మంత్రి కిరణ్ రెజిజు బుధవారం ట్విటర్ వేదికగా వెల్లడించారు.
ప్రస్తుత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఆరంభంలోనే తీవ్ర కష్టాల్లో పడింది. కనీసం 10 పరుగులు కూడా చేయకుండా ఏకంగా 5 వికెట్లను కోల్పోయింది.
ఆ తర్వాత మెల్లగా కోలుకున్న ఆ జట్టు, జాగ్రత్తగా ఆడుతూ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేయగలిగింది
పరుగులు ఎక్కువగా రాకపోయినా, వికెట్లను కాపాడుకోవడంపైనే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు దృష్టిపెట్టారు.
దక్షిణాఫ్రికా జట్టులో నలుగురు ఆటగాళ్లు డకవుట్ అయ్యారు.
కేశవ్ మహారాజ్ ఒక్కడే అత్యధికంగా 41 పరుగులు చేయగా, వేన్ పార్నెల్ 24, అయిడెన్ మార్క్రమ్ 25 పరుగులు చేయగలిగారు.
భారత జట్టులో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు, దీపక్ చహర్, అర్షల్ పటేల్‌లు చెరి రెండు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ తీశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు తొలి మ్యాచ్‌లో తలపడుతున్నాయి.
తిరువనంతపురంలో జరుగుతోన్న తొలి మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
7 గంటల నుంచి మ్యాచ్ జరుగనుంది.
వెన్నునొప్పి కారణంగా తొలి మ్యాచ్ నుంచి బుమ్రా తప్పుకున్నాడు.
టీం ఇండియా జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్-కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Facebook/KCR
సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా రూ.368 కోట్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
అంటే 2021-22 సంవత్సరానికి సింగరేణి కాలరీస్ సాధించిన లాభాల్లో 30శాతాన్ని ఇందుకు కేటాయించనున్నారు.
మూడు రైల్వే స్టేషన్లను ఆధునీకరించడానికి సంబంధించి రూ.10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా న్యూ దిల్లీ, అహ్మదాబాద్, ముంబయి రైల్వే స్టేషన్లను ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దనున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Facebook/Department of Food and Supplies, Government of West Bengal
పశ్చిమబెంగాల్‌లో ఇంటి వద్దకే రేషన్ డెలివరీ చేసే ‘దువారే రేషన్’ పథకాన్ని కలకత్తా హై కోర్టు కొట్టివేసింది.
జాతీయ ఆహార భద్రతా చట్టానికి ఆ పథకం విరుద్ధంగా ఉందని కోర్టు ప్రకటించింది.
ఇంటి వద్దకే రేషన్‌తో పాటు రేషన్ షాపులో దొరికే ఇతర వస్తువులను లబ్ధిదారుల ఇంటి వద్దనే అందించేందుకు ‘దువారే రేషన్’ అనే పథకాన్ని 2021 నవంబరులో మమతా బెనర్జీ ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Facebook/Asaduddin Owaisi
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)ను నిషేధించడాన్ని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తప్పుపట్టారు.
‘పీఎఫ్ఐ ఎంచుకున్న విధానాన్ని నేను ఎప్పుడూ వ్యతిరేకిస్తాను. ప్రజాస్వామ్యానికే నా మద్దతు. కానీ పీఎఫ్‌ఐ మీద విధించిన నిషేధం మాత్రం సరికాదు.
కొందరు వ్యక్తులు నేరాలకు పాల్పడినంత మాత్రాన మొత్తం సంస్థనే బ్యాన్ చేయడం పద్ధతి కాదు. ఒక సంస్థతో అనుబంధం ఉన్నంత మాత్రానా నేరం చేసినట్లు కాదని సుప్రీం కోర్టు కూడా చెబుతోంది’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
మరి రాజస్థాన్‌లోని ఖాజా అజ్మేరీ దర్గాలో బాంబు దాడులకు పాల్పడిన వారికి చెందిన సంస్థను ఎందుకు బ్యాన్ చేయరు? అని ఓవైసీ ప్రశ్నించారు.
ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాలో 2007లో పేలుళ్లు జరిగాయి. ఆ కేసులో ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ముగ్గురిని ఎన్‌ఐఏ కోర్టు దోషులుగా తేల్చింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్ of X ముగిసింది, 2
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)తో పాటు ఆర్ఎస్ఎస్ను కూడా నిషేధించాలని ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ అన్నారు.
పీఎఫ్‌ఐ మీద విచారణ చేపట్టడంతోపాటు ఆర్‌ఎస్‌ఎస్‌ను కూడా నిషేధించి దాని మీద విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
దేశంలో ‘హిందూ కమ్యూనలిజం’ పేరుతో దేశాన్ని విభజిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ను కూడా నిషేధించాలని కాంగ్రెస్ ఎంపీ కొడికున్నిల్ సురేశ్ అన్నారు.
‘ఆర్‌ఎస్‌ఎస్, పీఎఫ్‌ఐ రెండూ ఒకటే. రెండింటినీ ప్రభుత్వం నిషేధించాలి. కానీ పీఎఫ్‌ఐ మాత్రమే ఎందుకు?’ అని ఆయన ప్రశ్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
సౌతాఫ్రికాతో నేటి నుంచి జరగనున్న టీ20 సిరీస్ టీ ఇండియా జట్టులో ఉమేశ్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, షాబాజ్ అహ్మద్‌కు చోటు లభించింది.
టీం ఇండియా జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్-కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్‌ప్రీత్ బూమ్రా, ఉమేశ్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, షాబాజ్ అహ్మద్
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సిల్క్ స్మిత చనిపోయి 26 ఏళ్లు. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో ఆమె ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారు? సినిమాల్లోకి రాకపోయుంటే ఏం కావాలనుకున్నారు?
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది