ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
మళ్లీ రేపు ఉదయం తాజా వార్తలతో కలుద్దాం.
కాంగ్రెస్ లేకుండా విపక్షాలన్నీ ఏకం కావాలని కొన్ని పార్టీలు అనుకుంటున్నాయని, కానీ, అది సాధ్యం కాదని.. అలాంటి పార్టీల నమ్మకం భ్రమ మాత్రమేనని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
మళ్లీ రేపు ఉదయం తాజా వార్తలతో కలుద్దాం.

ఫొటో సోర్స్, ani
కాంగ్రెస్ లేకుండా విపక్షాలన్నీ ఏకం కావాలని కొన్ని పార్టీలు అనుకుంటున్నాయని, కానీ, అది సాధ్యం కాదని.. అలాంటి పార్టీల నమ్మకం భ్రమ మాత్రమేనని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు.
ఇలాంటి ప్రయత్నాలన్నీ కాంగ్రెస్, విపక్షాల బలాన్ని తగ్గిస్తాయని ఆయన అన్నారు.
కొన్ని ప్రాంతీయ పార్టీలు వాటి ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచాయని ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
బీజేపీయేతర పార్టీలు ఏవైనా కాంగ్రెస్ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఐదేళ్లు మనుగడ సాధిస్తామనుకుంటే అది పిచ్చితనమని ఆయన అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
ఆగ్నేయ తైవాన్‌లో ఆదివారం రిక్టర్ స్కేలు పై 6. 8 తీవ్రతతో భూకంపం ఏర్పడినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఈ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
ఈ భూకంప తీవ్రతను 7.2 గా యూఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. ఈ భూకంప కేంద్రం భూమి లోపల 10కిలోమీటర్ల లోతులో ఏర్పడినట్లు పేర్కొంది.
ఈ భూకంపంలో ఒక భవనం కూలిపోయినట్లుగా తెలిసింది. ఒక రైలు పట్టాలు తప్పినట్లు నివేదికలొచ్చాయి. ప్రాణనష్టం గురించి వివరాలు తెలియాల్సి ఉంది.
తైవాన్ సముద్ర ప్రాంతంలో ప్రమాదకరమైన సునామీ సంభవించవచ్చని యూఎస్ సునామీ హెచ్చరికల కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

ఫొటో సోర్స్, ANI
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) తెలుగు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, నెల్లూరు, కడప, గుంటూరు, తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాలలో పీఎఫ్ఐ కేసుకు సంబంధించి ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ కేసులో ముఖ్య నిందితుడైన పీఎఫ్ఐ కన్వీనర్ షాదుల్లా ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఎన్ఐఏ సుమారు 24మందికి పైగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకుల ఇళ్ల పై సోదాలు నిర్వహించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
నిజామాబాద్ లోని షాహిద్ చౌష్ ఇంట్లో కూడా ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించి సీపీసీ 41(ఏ) కింద ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
ఈ సంస్థ తీవ్రవాద కార్యకలాపాలు చేస్తున్నట్లుగా ఆరోపణలు రావడంతో ఈ సోదాలను నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
ఆగస్టు 26న ఎన్ఐఏ హైదరాబాద్ శాఖ పీఎఫ్ఐ కు సంబంధం ఉన్న ఒక కేసును నమోదు చేసింది.
ఎన్ఐఏ నిజామాబాద్ కు చెందిన అబ్దుల్ ఖాదర్ తో పాటు మరో 26 మంది పేర్లనుఎఫ్ఐఆర్ లో నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ లో వీరు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలు చేసింది.
"ఈ కుట్రను అమలు చేసే భాగంగా తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు శిక్షణ ఇచ్చేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా లోకి కొంత మంది వ్యక్తులను సభ్యులుగా చేర్చుకున్నారు. వీరు భారతీయ సార్వభౌమాధికారం, భద్రతకు అంతరాయం కలిగించే చర్యలకు పాల్పడి వివిధ వర్గాల మధ్య మత విద్వేషాలు రగిల్చే ప్రయత్నాలను చేశారు" అని ఎఫ్ఐఆర్ పేర్కొంది.

ఫొటో సోర్స్, ANI
చండీగఢ్‌లోని ఒక ప్రైవేటు యూనివర్సిటీలో శనివారం రాత్రి కనీసం 8 మంది విద్యార్థినులు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారన్న వాదనలను పంజాబ్ పోలీసులు ఖండించారు.
శనివారం రాత్రి యూనివర్సిటీలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
ఇదొక వైరల్ వీడియోకు సంబంధించిన వ్యవహారమని మొహాలీ ఎస్ఎస్పీ వివేక్ సోనీ చెప్పారు.
యూనివర్సిటీ విద్యార్థినులు స్నానం చేస్తుండగా మరొక విద్యార్థిని వీడియో తీసి షేర్ చేయడంతో మొత్తం వివాదం మొదలయిందని బీబీసీ ప్రతినిధి గుర్ విందర్ సింగ్ గ్రేవాల్ చెప్పారు.
అమ్మాయిలు స్నానం చేస్తుండగా తీసిన వీడియోలను సిమ్లాలో నివసిస్తున్న మరొక అబ్బాయితో పంచుకోవడంతో ఆ అబ్బాయి వాటిని వైరల్ చేసినట్లు ఫిర్యాదు చేసిన విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
అయితే, ఈ అంశం పై యూనివర్సిటీ యాజమాన్యం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ఈ అంశం పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టినట్లుపోలీసులు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
విద్యార్థులు సంయమనం పాటించాలని, తప్పు చేసినవారినెవరినీ వదిలిపెట్టేది లేదని పంజాబ్ విద్యా శాఖ మంత్రి హర్ జోత్ సింగ్ బైన్స్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఇది చాలా సున్నితమైన ఆడపిల్లల గౌరవానికి, హుందత్వానికి సంబంధించిన అంశమని అన్నారు.
మీడియా కూడా ఈ అంశం పై రిపోర్ట్ చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలని కోరారు. ఇది సమాజానికే ఒక పరీక్ష లాంటిదని ట్వీట్ చేశారు.
తప్పు చేసినవారిని క్షమించేది లేదని పంజాబ్ రాష్ట్ర మహిళా కమీషన్ చైర్మన్ మనీషా గులాటీ చెప్పారు.

ఫొటో సోర్స్, PRESIDENT'S Office/TWITTER
క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు హాజరయ్యేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్ చేరుకున్నారు.
ఆమె సెప్టెంబరు 8న బల్మోరల్ కాసిల్ లో మరణించారు.
వెస్ట్‌మినిస్టర్ అబేలో మధ్యాహ్నం 3:30 గంటలకు అధికారిక లాంఛనాలతో క్వీన్ అంత్యక్రియలు జరుగుతాయి.
ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతల్ని ఈ కార్యక్రమం కోసం ఆహ్వానిస్తారు.
యూకే సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ప్రధానులు కూడా ఇందులో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని టీవీల్లో కూడా ప్రసారం చేస్తారు.

ఫొటో సోర్స్, ANI
దేశవ్యాప్తంగా జరిగే స్లమ్ రన్ కార్యక్రామాన్ని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా దిల్లీలోని ధ్యాన్ చంద్ స్టేడియం నుంచి ఆదివారం ప్రారంభించారు.
ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా రెండు వారాల పాటు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా స్లమ్ రన్ ను చేపట్టారు.
ఈ స్లమ్ రన్ లో మురికివాడలకు చెందిన 10,000మందికి పైగా విద్యార్థులు, యువత పాల్గొన్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.