You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి
ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇందులో సైరస్ మిస్త్రీతో పాటు మరొకరు మరణించగా, మరో ఇద్దరు గాయాల పాలయ్యారు.
లైవ్ కవరేజీ
నేడే ఝార్ఖండ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పై విశ్వాస తీర్మానం
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పై అసెంబ్లీలో సోమవారం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఈ విశ్వాస తీర్మానానికి ప్రత్యేకంగా విధాన సభను ఒక రోజుకు హాజరుపరిచారు.
హేమంత్ సోరెన్ విశ్వాస తీర్మానానికి ముందు ఆదివారం ఎంఎల్‌ఏలతో సమావేశమయ్యారు.
ఆయన గతంలో ముఖ్యమంత్రిగా, గనుల మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పదవిని దుర్వినియోగం చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
ఆయన గతంలో రాంచీలో గనుల లీజును సొంతంగా కేటాయించుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ఉల్లంఘించడం కిందకు వస్తుంది.
గత నెలలో ఎన్నికల కమీషన్ ఆయనను పదవి నుంచి తొలగించేందుకు రాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్‌కు లేఖను పంపినట్లు వార్తలొచ్చాయి.
అప్పటి నుంచి హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేస్తే, ఆయన తిరిగి ముఖ్య మంత్రి పదవిని చేపట్టేందుకు ఆరు నెలలలోగా ఎన్నికల్లో శాసన సభ్యునిగాగెలవాల్సి ఉంటుంది.
81 మంది సభ్యులున్న ఝార్ఖండ్ అసెంబ్లీల జేఎంఎంకు (30) ,కాంగ్రెస్ (18), రాష్ట్రీయ జనతా దళ్ (1) శాసన సభ్యులు ఉన్నారు. ఝార్ఖండ్ శాసన సభలో బీజేపీకి 26 మంది ఎంఎల్‌ఏ లు ఉన్నారు.
లఖ్‌నవూలోని పెద్ద హోటల్‌లో అగ్ని ప్రమాదం
ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలోని లెవానా హోటల్‌లో ఏర్పడిన అగ్ని ప్రమాదంలో పలువురు చిక్కుకున్నారు. మంటల ద్వారా వచ్చే పొగ వల్ల చాలా మంది స్పృహ కోల్పోయారు.
ఈ ప్రాంతంలో ఉన్న పెద్ద హోటళ్లలో ఒకటైన ఈ హోటల్ లఖ్‌నవూలోని హజ్రత్‌గంజ్ ప్రాంతంలో ఉంది.
మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అగ్నిమాపక దళాలు పని చేస్తున్నాయి. కిటికీల దగ్గరకు నిచ్చెనలు అమర్చి హోటల్పై అంతస్తుల్లో ఉండిపోయిన వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.
హోటల్‌లో ఎంత మంది చిక్కుకున్నారనే విషయం పై స్పష్టమైన సమాచారం లేదు.
నేడే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ పర్యటన ప్రారంభం
బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా భారత పర్యటన సోమవారం ప్రారంభం కానుంది. హసీనా సెప్టెంబరు 5-8 వరకు భారత్‌లో పర్యటిస్తారు.
ఈ పర్యటనలో భాగంలో భారత్, బంగ్లాదేశ్ రక్షణ, వాణిజ్యం, నదీ జలాల పంపకంలో సహకారాన్ని పెంపొందించుకునే దిశగా ప్రకటనలు చేసే అవకాశముంది.
సోమవారం 12 గంటలకు ఆమె దిల్లీ చేరుతారని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.
పర్యటన మొదటి రోజున మహాత్మా గాంధీ సమాధి రాజ్ ఘాట్ సందర్శిస్తారు.
హసీనా మంగళవారం భారత ప్రధాని మోదీతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య కుషాయిరా నదీ జలాల పంపకంతో పాటు మరిన్ని ముఖ్యమైన ఒప్పందాలు చేసుకునే అవకాశముంది.
గురువారం రాజస్థాన్‌లోని అజ్మేర్‌లోఉన్న సూఫీ సెయింట్ మొయినుద్దీన్ చిష్తీని సందర్శించనున్నట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి బృందంలో బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్, వాణిజ్య మంత్రి టిపు మున్షీ, రైల్వే శాఖ మంత్రి మొహమ్మద్ నూరుల్ ఇస్లాం సూజన్, ప్రధాన మంత్రి ఆర్ధిక వ్యవహారాల సలహాదారు మాసియార్ ఏఎం రహ్మాన్ కూడా ఉంటారు.
ఆమె పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌ను కూడా కలుస్తారు.
ఆమె 2019లో భారత్ విచ్చేశారు.
జార్ఖండ్: విశ్వాస పరీక్ష నెగ్గిన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్
భారత ఆర్ధిక వ్యవస్థ బ్రిటన్‌ను అధిగమించిందా, ఇది నిజమేనా?
పంజాబ్-మొహాలీ: దసరా ఎగ్జిబిషన్‌లో 50 అడుగుల ఎత్తు నుంచి కింద పడిన జెయింట్ వీల్
ఆసియా కప్ 2022: భారత్‌పై పాకిస్తాన్ ఎలా గెలిచింది... ఆసిఫ్ అలీ, ఖుష్‌దిల్ షా చివరి రెండు ఓవర్లలో ఏం చేశారు?
బ్రేకింగ్ న్యూస్, ఆసియాకప్ సూపర్4: భారత్‌పై పాకిస్తాన్ విజయం
ఆసియా కప్ సూపర్ 4 తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది.
20 ఓవర్లలో 182 పరుగులు సాధించాల్సిన పాకిస్తాన్ ఒక బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ 71 పరుగులు చేసి పాక్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
పాకిస్తాన్ మొదటి బంతికే ఫోర్ కొట్టి ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ ఆజమ్ ఇద్దరూ మొదటి ఓవర్‌లోనే బౌండరీలు కొట్టారు.
అయితే, పవర్ ప్లే నడుస్తుండగానే నాలుగో ఓవర్‌కే స్పిన్నర్ రవి బిష్ణోయిని ప్రయోగించడం ద్వారా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తొలి వికెట్ సాధించాడు. 14 పరుగులు చేసిన బాబర్ ఆజమ్‌ను రవి బిష్ణోయి ఔట్ చేశాడు.
ఐదో ఓవర్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో పాక్ బ్యాటర్లు 14 పరుగులు సాధించారు. రిజ్వాన్ రెండు ఫోర్లు కొట్టగా ఫఖర్ జమాన్ ఒక ఫోర్ కొట్టాడు.
తొమ్మిదో ఓవర్‌లో పాకిస్తాన్ మరో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన ఫఖర్ జమాన్ యజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
10 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ 2 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. అప్పటికి మరో 60 బంతుల్లో 106 పరుగులు సాధించాల్సి ఉంది.
12.2 ఓవర్లకు పాక్ 100 పరుగులు చేసింది. ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ 37 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 50 పరుగులు చేశాడు.
15 ఓవర్లకు పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. మొహమ్మద్ రిజ్వాన్ 44 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 62 పరుగులతోనూ, మొహమ్మద్ నవాజ్ 18 బంతుల్లోనే ఆరు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.
16వ ఓవర్ మూడో బంతికి నవాజ్(42 పరుగులు)ను భువనేశ్వర్ కుమార్ ఔట్ చేశాడు.
తర్వాతి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రిజ్వాన్ (51 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 71 పరుగులు) ఔటయ్యాడు.
18వ ఓవర్‌లో పాకిస్తాన్ 8 పరుగులు చేసింది. ఆసిఫ్ అలీ ఇచ్చిన క్యాచ్‌ను అర్ష్‌దీప్ జారవిడిచాడు.
12 బంతుల్లో 26 పరుగులు సాధించాల్సిన సమయంలో 19వ ఓవర్‌లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఆసిఫ్ అలీ ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టగా, ఖుష్దిల్ ఒక ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్‌లో మొత్తం 19 పరుగులు లభించాయి.
చివరి 6 బంతుల్లో 7 పరుగులు సాధించాల్సిన పాకిస్తాన్ మరో బంతి మిగిలి ఉండగానే విజయలక్ష్యాన్ని చేరుకుంది. 4వ బంతికి ఆసిఫ్ అలీ (8 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో 16 పరుగులు) ఎల్బీడబ్ల్యూగా ఔట్ కావడంతో కొద్దిసేపు ఇరువైపులా ఉద్వేగభరితమైన వాతావరణం నెలకొంది. కానీ, తర్వాతి బంతికి ఇఫ్తికార్ రెండు పరుగులు సాధించడంతో పాకిస్తాన్ విజయం ఖరారైంది.
వీర్యం, అండం లేకుండా సృష్టించిన ఈ పిండం గుండె కొట్టుకుంటోంది
మునుపటి ఫామ్‌లోకి విరాట్ కోహ్లి, కీలక అర్ధసెంచరీ.. పాక్ విజయలక్ష్యం 182 పరుగులు
ఆసియా కప్‌లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి వరుసగా రెండో అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు.
ఆదివారం పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మునుపటి ఫామ్‌ను ప్రదర్శిస్తూ కోహ్లి (44 బంతుల్లో 60; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసింది.
మ్యాచ్ ప్రారంభంలో ఓపెనర్లు కేఎల్ రాహుల్ (28; 1ఫోర్, 2 సిక్స్‌లు), కెప్టెన్ రోహిత్ శర్మ (16 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడారు. దీంతో పవర్ ప్లేలో ఒక వికెట్ నష్టపోయిన భారత్ 62 పరుగులు చేసింది.
తర్వాత సూర్యకుమార్ యాదవ్ (13), రిషభ్ పంత్ (14), హార్దిక్ పాండ్యా (0) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు.
దీపక్ హుడా మద్దతుతో కోహ్లి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. అప్పుడుప్పుడు బౌండరీలు బాదుతూ స్కోరు వేగం పెంచాడు. మొహమ్మద్ హస్నాన్ బౌలింగ్‌లో సిక్సర్‌తో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 37 పరుగులు జోడించిన తర్వాత దీపక్ హుడా (16) అవుటయ్యాడు.
మరో రెండు బంతుల్లో ఇన్నింగ్స్ ముగుస్తుందనగా కోహ్లి రనౌట్ అయ్యాడు. తర్వాతి రెండు బంతుల్ని రవి బిష్ణోయ్ (8) బౌండరీలు కొట్టడంతో భారత్ స్కోరు 181 పరుగులకు చేరింది.
పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టాడు. నవాజ్, హారీస్ రవూఫ్, హస్నాన్, నసీమ్ షా తలా ఓ వికెట్ తీశారు.
తెలంగాణ: ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక క్లినిక్
బ్రేకింగ్ న్యూస్, రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి
టాటా గ్రూపు మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ, ముంబయి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
పాల్ఘర్ పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారించారు.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇందులో సైరస్ మిస్త్రీతో పాటు మరొకరు మరణించగా, మరో ఇద్దరు గాయాల పాలయ్యారు.
సైరస్ మిస్త్రీ గురించి
సైరస్ మిస్త్రీ లండన్ బిజినెస్ స్కూల్‌లో చదివారు. ఆయన షాపూర్‌జీ పల్లోంజీ చిన్న కుమారుడు. ఐర్లాండ్‌లో అత్యంత ధనిక భారతీయ కుటుంబాల్లో ఆయన కుటుంబం కూడా ఒకటి.
1991లో మిస్త్రీ, షాపూర్‌జీ పల్లోంజీ అండ్ కంపెనీలో పని చేయడం మొదలుపెట్టారు.
1994లో పల్లోంజీ గ్రూపు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన సారథ్యంలో షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ విపరీతంగా లాభాలు ఆర్జించింది. కంపెనీ టర్నోవర్రూ. 183 కోట్ల నుంచి రూ. 13,762 కోట్లకు పెరిగింది.
ఆ తర్వాత ఆయన కంపెనీ మెరైన్, ఆయిల్ గ్యాస్, రైల్వేస్, కన్‌స్ట్రక్చన్ తదితర రంగాల్లోకి విస్తరించింది.
2006లో టాటా సన్స్ బోర్డులో సైరస్ చేరారు. రతన్ టాటా రిటైర్మెంట్ అనంతరం 2012లో ఆయన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2016లో టాటా బోర్డు ఆయనను చైర్మన్ పదవి నుంచి తొలిగించింది.
సీనియర్ జర్నలిస్ట్ ఎంకే వేణు చెప్పినదాని ప్రకారం, టాటా సన్స్ షేర్లలో అధిక భాగం సైరస్ మిస్త్రీ కుటుంబం వద్దే ఉన్నాయి.
విమానం దొంగిలించి, వాల్‌మార్ట్‌పై కూల్చేస్తానంటూ గాలిలో చక్కర్లు.. నిందితుడిని పోలీసులు ఎలా పట్టుకున్నారంటే...
269 మంది ప్రయాణీకులతో వెళ్తోన్న కొరియన్ విమానాన్ని సోవియట్ యూనియన్ పొరపాటున కూల్చినప్పుడు..
ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసనలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న దిల్లీ పోలీసులు
దేశంలో పెరుగుతున్న ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ దిల్లీ రామ్ లీలా మైదానంలో ర్యాలీ నిర్వహిస్తోంది.
ఈ ర్యాలీలో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న కార్యకర్తలను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారులు బంగా భవన్ నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి వెళుతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇతర ప్రాంతాల్లో నిరసనలు చేస్తున్న కార్యకర్తలను బస్సులలో తీసుకుని వెళ్లి రామ్ లీలా మైదానం దగ్గర వదిలిపెట్టారు.
‘ముధోల్ హౌండ్’ కుక్కను ప్రధాని మోదీ భద్రతా బృందంలోకి ఎందుకు తీసుకుంటున్నారు?
"నిత్యావసరాలు కొనుక్కోవడానికి కూడా ప్రజలు పది సార్లు ఆలోచించాల్సి వస్తోంది" - రాహుల్ గాంధీ
దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం దిల్లీ రామ్ లీలా మైదానంలో "హల్లా బోల్" ర్యాలీని నిర్వహిస్తోంది.
ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి వచ్చిన పార్టీ మద్దతుదారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ర్యాలీ ప్రారంభం కావడానికి ముందు రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.
"దేశ ప్రజలు పెరిగిన ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతుంటే పాలించే రాజు మాత్రం స్నేహితులను సంపాదించుకోవడంలో తలమునకలై ఉన్నారు. నిత్యావసరాలు కొనుక్కోవడానికి కూడా ప్రజలు పది సార్లు ఆలోచించాల్సి వస్తోంది. ఈ సమస్యలన్నిటికీ ప్రధాన మంత్రే కారణం. మేము ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా గొంతును వినిపిస్తూనే ఉంటాం. రాజు మా మాట వినాలి" అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ద్రవ్యోల్భణం గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది.
నేడు జరగనున్న హల్లా బోల్ ర్యాలీ తర్వాత,కాంగ్రెస్ సెప్టెంబరు 07 నుంచి "భారత్ జోడో యాత్ర"ను నిర్వహించనుంది. 150 రోజుల పాటు సాగే ఈ ర్యాలీ కన్యాకుమారిలో మొదలై కశ్మీర్లో ముగుస్తుంది. ఈ పాదయాత్రలో భాగంగా సుమారు 3570 కిలోమీటర్ల మేర పర్యటిస్తారు.
"అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ "ఈ దేశానికి శత్రువు" - డోనల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ "ఈ దేశానికి శత్రువు" అని మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ శనివారం నిర్వహించిన ర్యాలీలో అన్నారు.
ట్రంప్ పెన్సిల్వేనియాలో రిపబ్లిక్ అభ్యర్థుల తరుపున ప్రచారం చేసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా వేలాది మంది మద్దతుదారులతో మాట్లాడుతూ ఎఫ్‌బీఐను ఆయన పై ఆయుధంలా ప్రయోగించారని ఆరోపించారు.
ఆగస్టు మొదట్లో ఎఫ్ బి ఐఫ్లోరిడాలోని ట్రంప్ రిసార్ట్ పై సోదాలు నిర్వహించింది. ఎఫ్‌బీఐ సోదాల్లో కొన్ని రహస్య (క్లాసిఫైడ్) పత్రాలు ఉన్నట్లు గుర్తించారు. ట్రంప్ వ్యక్తిగత కార్యాలయం నుంచి కూడా కొన్ని అత్యున్నత రహస్య ఫైళ్లు లభించాయి.
"ఈ సోదాలు అమెరికా చరిత్రలోనే అధికారాన్ని దుర్వినియోగం చేసిన దిగ్బ్రాంతి కలిగించే ఘటన" అని ట్రంప్ ఆరోపించారు.
ర్యాలీలో భాగంగా ట్రంప్ రెండు గంటల పాటు చేసిన ప్రసంగంలో అధిక భాగం ఎఫ్‌బీఐ నిర్వహించిన సోదాలను విమర్శించేందుకే కేటాయించారు.
అయితే, ట్రంప్ మాత్రం తానేమీ తప్పు చేయలేదని అంటున్నారు.
రహస్య పత్రాలు లభించడం పై విచారణ ఎదుర్కొంటున్న ట్రంప్ మాత్రం తానేమి తప్పు చేయలేదని అంటున్నారు.
"బ్రిటన్ పైసలు లెక్కపెట్టుకుంటుంటే, యుక్రెయిన్ శవాలను లెక్క పెట్టుకుంటోంది" - ఒలేనా జెలియెన్స్కీ
యుక్రెయిన్ లో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం మిత్ర దేశాల పై చాలా తీవ్రంగా పడిందని యుక్రెయిన్ అధ్యక్షుని భార్య ఒలేనా జెలియెన్స్కీ అన్నారు. ఆమె బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "బ్రిటన్ పైసలు లెక్కపెట్టుకుంటుంటే యుక్రెయిన్ శవాలను లెక్కపెట్టుకుంటోంది" అని అన్నారు.
"యుద్ధంలో ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నారో చెప్పడం కూడా అవసరం" అని అన్నారు.
ఆమె భర్త వొలొదిమిర్ జెలియెన్స్కీని అరుదుగా కలిసినప్పటికీ, ప్రతి రోజూ ఫోనులో మాట్లాడుకుంటూ ఉంటామని చెప్పారు.
ఒలేనా యుక్రెయిన్ అధ్యక్షడు జెలియెన్స్కీని 2003లో పెళ్లి చేసుకున్నారు.
యుక్రెయిన్ లో రష్యా దాడులతో పెరిగిన ఇంధన ధరలతో సతమతమవుతున్న బ్రిటన్ ప్రజలకు ఆమె ఇచ్చే సందేశం ఏమిటని అడిగినప్పుడు..."ప్రస్తుతం పరిస్థితి చాలా కష్టంగా ఉందని నాకు తెలుసు. కానీ, కోవిడ్ 19 మహమ్మారి సమయంలో పెరిగిన ధరలతో యుక్రెయిన్ కూడా ప్రభావితమయింది. యుక్రెయిన్ లో కూడా ధరలు పెరుగుతున్నాయి. కానీ, వీటన్నిటితో పాటు మా దేశంలో ప్రజల ప్రాణాలు కూడా పోతున్నాయి" అని అన్నారు.
"మీరు బ్యాంక్ అకౌంట్లలో, జేబుల్లో పైసలను లెక్కపెట్టుకుంటుంటే, మేమిక్కడ శవాలను లెక్కపెట్టుకుంటున్నాం" అని అన్నారు.
గత నెలలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కీయెవ్ వెళ్ళినప్పుడు యుక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడిని తిప్పి కొట్టేందుకు యుక్రెయిన్ కు మద్దతిస్తూ యూరప్ జనాభా పెరుగుతున్న ధరలను తట్టుకుని బ్రతకాల్సి వస్తోందని అన్నారు. బోరిస్ చేసిన వ్యాఖ్యలకు స్పందనగా జెలియెన్స్కీ సమాధానం చెప్పారు.
యూకేలో ద్రవ్యోల్బణం గత 42 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది 13.3శాతానికి పెరిగింది. మరో ఏడాదిలో ఆర్ధిక పరిస్థితులు మరింత క్షీణిస్తాయని భావిస్తున్నారు.