IndiaVsPakistan: గెలిచిన భారత్.. చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపులు

దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా కప్ 2022 క్రికెట్ టోర్నమెంటులో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య ఆదివారం సాయంత్రం జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టు, పాకిస్తాన్ ఇచ్చిన 148 పరుగుల టార్గెట్‌ను 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

లైవ్ కవరేజీ

  1. , నేటి లైవ్ పేజీ ముగిస్తున్నాం

    ఇక్కడితో బీబీసీ తెలుగు న్యూస్ లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    మళ్లీ తాజా అప్‌డేట్లతో రేపు ఉదయం కలుద్దాం.

    ధన్యవాదాలు!

  2. ఆసియా కప్: ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో పాక్ మీద భారత్ గెలుపు

    హార్దిక్ పాండ్యా

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, హార్దిక్ పాండ్యా చివర్లో మెరుపులు మెరిపించాడు

    ఆసియా కప్ టోర్నమెంటులో భాగంగా ఎ-గ్రూప్‌లోని భారత్ – పాక్ జట్ల మధ్య ఆదివారం రాత్రి దుబాయ్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో.. భారత జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచింది.

    ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఇరువైపులా బౌలర్లు ఆధిపత్యం చాటారు.

    తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టు.. ఒక బంతి మిగిలి ఉండగానే పాకిస్తాన్‌ జట్టును 147 పరుగలకు ఆలౌట్ చేసింది.

    మ్యాచ్ గెలవాలంటే 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. 5 వికెట్లు కోల్పోయి, 2 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేధించింది.

    అంతకుముందు పాక్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో భారత జట్టు ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కె.ఎల్.రాహుల్ డకౌట్ అయ్యాడు.

    ఆ తర్వాత 9వ ఓవర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 18 బంతుల్లో 12 పరుగులు చేసి మొహమ్మద్ నవాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    విరాట్ కోహ్లీ కెరీర్‌లో వందో టీ20 మ్యాచ్‌లో 34 బంతుల్లో 35 పరుగులు చేసి మొహమ్మద్ నవాజ్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో కోహ్లీ ఔటయ్యాడు.

    ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ (18 బంతుల్లో 18 పరుగులు) నసీమ్ షా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో గెలవటానికి కేవలం 7 పరుగులు అవసరమైన మసయంలో.. రవీంద్ర జడేజా (29 బంతుల్లో 35 పరుగులు) భారీ షాట్‌కు ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

    చివరి ఓవర్లలో హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 33 పరుగులు) మెరుపులు మెరిపించాడు. ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే సిక్స్ కొట్టటంతో భారత జట్టు గెలిచింది.

    దినేష్ కార్తీక్ చివరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 1 పరుగు చేశాడు.

    పాక్ బౌలర్లలో మొహమ్మద్ నవాజ్ 3 వికెట్లు, నసీమ్ షా 2 వికెట్లు తీశారు.

    తొలుత పాక్ జట్టు ఆలౌట్...

    మొదట బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 19.5 ఓవర్లలో 147 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

    భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్‌ 4 వికెట్లు, హార్దిక్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టారు. అర్షదీప్ సింగ్‌ 2, అవేష్ ఖాన్‌ 1 చొప్పున వికెట్ కూల్చారు.

    పాక్ జట్టులో మొహమ్మద్ రిజ్వాన్ 43 పరుగులు, ఇఫ్తికార్ అహ్మద్ 28 పరుగులు చేశారు. చివర్లో షానవాజ్ దహానీ 5 బంతుల్లో 16 పరుగులు చేశాడు. హారిస్ రవూఫ్ 13 పరుగులు జోడించాడు. బాబర్ ఆజం (10), ఫఖార్ జమాన్ (10), షాదాబ్ ఖాన్ (10), ఆసిఫ్ అలీ (9), ఖుష్దిల్ షా (2), మొహమ్మద్ నవాజ్ (1), నసమీ షా (0) పరుగులు చేశారు.

    భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కె.ఎల్.రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్‌

    పాకిస్తాన్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), మొహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫఖార్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్దిల్ షా, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, నసీమ్ షా, హారిస్ రౌఫ్, షానవాజ్ దహానీ

  3. 15 ఓవర్లలో 4 వికెట్లకు 97 పరుగులు చేసిన భారత్

    ఆసియా కప్ టోర్నమెంటులో భాగంగా భారత్ – పాక్ జట్ల మధ్య దుబాయ్‌లో జరగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో.. భారత జట్టు 15 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది.

    ఈ మ్యాచ్ గెలవాలంటే ఇంకా 30 బంతుల్లో 51 పరుగుల చేయాలి.

    రవీంద్ర జడేజా (19), హార్దిక్ పాండ్యా (7) క్రీజులో ఉన్నారు.

    భారత జట్టు 148 పరుగుల లక్ష్యంతో ఇన్సింగ్స్ మొదలు పెట్టింది.

    ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ (18 బంతుల్లో 18 పరుగులు) నసీమ్ షా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    విరాట్ కోహ్లీ తన వందో టీ20 మ్యాచ్‌లో 34 బంతుల్లో 35 పరుగులు చేసి మొహమ్మద్ నవాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో కోహ్లీ ఔటయ్యాడు.

    అంతకు ముందు రోహిత్ శర్మ 18 బంతుల్లో 12 పరుగులు చేసి మొహమ్మద్ నవాజ్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు.

    దానికిముందు.. భారత జట్టు మొదటి ఓవర్‌లోనే ఓపెనర్ కె.ఎల్.రాహుల్ వికెట్ కోల్పోయింది. రాహుల్ డకౌట్ అయ్యాడు.

  4. ఆసియా కప్: 35 పరుగులు చేసి విరాట్ కోహ్లీ ఔట్

    విరాట్ కోహ్లీ

    ఫొటో సోర్స్, Getty Images

    ఆసియా కప్ టోర్నమెంటులో భాగంగా భారత్ – పాక్ జట్ల మధ్య దుబాయ్‌లో జరగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో.. భారత జట్టు 10వ ఓవర్‌లో 53 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.

    విరాట్ కోహ్లీ తన వందో టీ20 మ్యాచ్‌లో 35 పరుగులు చేసి మొహమ్మద్ నవాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    అంతకు ముందు రోహిత్ శర్మ 18 బంతుల్లో 12 పరుగులు చేసి మొహమ్మద్ నవాజ్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు.

    దానికిముందు.. భారత జట్టు మొదటి ఓవర్‌లోనే ఓపెనర్ కె.ఎల్.రాహుల్ వికెట్ కోల్పోయింది.

    భారత జట్టు 148 పరుగుల లక్ష్యంతో ఇన్సింగ్స్ మొదలు పెట్టింది.

    ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది.

    రవీంద్ర జడేజా (8), సూర్యకుమార్ యాదవ్ (2) క్రీజులో ఉన్నారు.

    ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం భారత జట్టు ఇంకా 60 బంతుల్లో 86 పరుగులు చేయాల్సి ఉంటుంది.

  5. 50 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన భారత జట్టు

    ఆసియా కప్ టోర్నమెంటులో భాగంగా భారత్ – పాక్ జట్ల మధ్య దుబాయ్‌లో జరగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో.. భారత జట్టు 8వ ఓవర్‌లో 50 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.

    రోహిత్ శర్మ 18 బంతుల్లో 12 పరుగులు చేసి మొహమ్మద్ నవాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    అంతకుముందు.. 148 పరుగుల లక్ష్యంతో ఇన్సింగ్స్ మొదలు పెట్టిన భారత జట్టు మొదటి ఓవర్‌లోనే తొలి వికెట్ కోల్పోయింది.

    ఓపెనర్ కె.ఎల్.రాహుల్ ఇన్నింగ్స్ రెండో బంతికే నసీమ్ షా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    విరాట్ కోహ్లీ 33 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రవీంద్ర జడేజా బ్యాటింగ్‌కు వచ్చాడు.

  6. 5 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 29 పరుగులు చేసిన భారత్

    ఆసియా కప్ 2022

    ఫొటో సోర్స్, Getty Images

    ఆసియా కప్ టోర్నమెంటులో భాగంగా భారత్ – పాక్ జట్ల మధ్య దుబాయ్‌లో జరగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో.. భారత జట్టు తొలి 5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది.

    148 పరుగుల లక్ష్యంతో ఇన్సింగ్స్ మొదలు పెట్టిన భారత జట్టు మొదటి ఓవర్‌లోనే తొలి వికెట్ కోల్పోయింది.

    ఓపెనర్ కె.ఎల్.రాహుల్ ఇన్నింగ్స్ రెండో బంతికే నసీమ్ షా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    విరాట్ కోహ్లీ 24 పరుగులు, రోహిత్ శర్మ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  7. ఆసియా కప్ టీ20లో మొదటి వికెట్ కోల్పోయిన భారత జట్టు

    ఆసియా కప్ 2022

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే రాహుల్ ఔటయ్యాడు

    ఆసియా కప్ టోర్నమెంటులో భాగంగా భారత్ – పాక్ జట్ల మధ్య దుబాయ్‌లో జరగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో.. భారత జట్టు తొలి ఓవర్‌లోనే మొదటి వికెట్ కోల్పోయింది.

    ఓపెనర్ కె.ఎల్.రాహుల్ ఇన్నింగ్స్ రెండో బంతికే నసీమ్ షా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    నాలుగో బంతికి కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను థర్డ్ స్లిప్‌లో ఫఖార్ జమాన్ జారవిడిచాడు.

  8. నిద్ర సరిగా పోని వాళ్ళకు సాయం చేసే గుణం తగ్గిపోతుందా?

  9. ఆసియా కప్ టీ20లో 147 పరుగులకు పాక్ ఆలౌట్.. భారత జట్టు లక్ష్యం 148

    ఆసియా కప్

    ఫొటో సోర్స్, Getty Images

    ఆసియా కప్ టోర్నమెంటులో భాగంగా భారత్ – పాక్ జట్ల మధ్య దుబాయ్‌లో జరగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో.. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 19.5 ఓవర్లలో 147 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

    భారత జట్టు 148 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగుతోంది.

    భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్‌ 4 వికెట్లు, హార్దిక్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టారు. అర్షదీప్ సింగ్‌ 2, అవేష్ ఖాన్‌ 1 చొప్పున వికెట్ కూల్చారు.

    పాక్ జట్టులో మొహమ్మద్ రిజ్వాన్ 43 పరుగులు, ఇఫ్తికార్ అహ్మద్ 28 పరుగులు చేశారు. చివర్లో షానవాజ్ దహానీ 5 బంతుల్లో 16 పరుగులు చేశాడు. హారిస్ రవూఫ్ 13 పరుగులు జోడించాడు. బాబర్ ఆజం (10), ఫఖార్ జమాన్ (10), షాదాబ్ ఖాన్ (10), ఆసిఫ్ అలీ (9), ఖుష్దిల్ షా (2), మొహమ్మద్ నవాజ్ (1), నసమీ షా (0) పరుగులు చేశారు.

    భారత జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్), కె.ఎల్.రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్‌లు ఆడుతున్నారు.

    పాకిస్తాన్ జట్టులో.. బాబర్ ఆజం (కెప్టెన్), మొహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫఖార్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్దిల్ షా, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, నసీమ్ షా, హారిస్ రౌఫ్, షానవాజ్ దహానీలు ఆడుతున్నారు.

  10. Ind vs Pak: 15 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసిన పాక్

    హార్దిక్ పాండ్యా

    ఫొటో సోర్స్, Getty Images

    ఆసియా కప్ టోర్నమెంటులో భాగంగా భారత్ – పాక్ జట్ల మధ్య దుబాయ్‌లో జరగుతున్న టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాక్ జట్టు 15 ఓవర్లు ముగిసే సరికి.. 5 వికెట్ల నష్టపోయి 103 పరుగులు చేసింది.

    భారత బౌలర్ హార్దిక్ పాండ్యా 15వ ఓవర్‌లో.. మొహమ్మద్ రిజ్వాన్, ఖుష్దిల్ షా వికెట్లు పడగొట్టాడు.

    దానికి ముందు 13వ ఓవర్‌లో సైతం హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఇఫ్తికార్ అహ్మద్ ఔటయ్యాడు.

    తొలుత బాబర్ ఆజం, ఫఖార్ అహ్మద్‌లు చెరో 10 పరుగులు చేసి ఔటయ్యారు. వారి వికెట్లను భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్‌లు చెరో వికెట్ కూల్చారు.

  11. Ind vs Pak: 15వ ఓవర్‌లో 96 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన పాక్

    భారత్ - పాక్ జట్ల మధ్య దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా కప్ టీ20 మ్యాచ్‌లో పాక్ జట్టు 15వ ఓవర్‌లో నాలుగో వికెట్ కోల్పోయింది.

    మొహమ్మద్ రిజ్వాన్ 42 బంతుల్లో 43 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    అప్పటికి పాక్ జట్టు స్కోరు 4 వికెట్ల నష్టానికి 96 పరుగులుగా ఉంది.

    అంతకుముందు ఇఫ్తికార్ అహ్మద్ 22 బంతుల్లో 28 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లోనే ఔటయ్యాడు.

    దానికిముందు.. బాబర్ ఆజం, ఫఖార్ అహ్మద్‌లు చెరో 10 పరుగులు చేసి అవుటయ్యారు.

  12. India Vs Pakistan Cricket Match: 87 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన పాక్

    భారత్ - పాక్ జట్ల మధ్య దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా కప్ టీ20 మ్యాచ్‌లో పాక్ జట్టు 13వ ఓవర్‌లో మూడో వికెట్ కోల్పోయింది.

    ఇఫ్తికార్ అహ్మద్ 22 బంతుల్లో 28 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    అప్పటికి పాక్ జట్టు స్కోరు మూడు వికెట్ల నష్టానికి 87 పరుగులుగా ఉంది.

  13. Ind vs Pak: 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసిన పాక్

    ఆసియా కప్ 2022

    ఫొటో సోర్స్, Getty Images

    ఆసియా కప్ టోర్నమెంటులో భాగంగా భారత్ – పాక్ జట్ల మధ్య దుబాయ్‌లో జరగుతున్న టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాక్ జట్టు 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టపోయి 68 పరుగులు చేసింది.

    బాబర్ ఆజం, ఫఖార్ అహ్మద్‌లు చెరో 10 పరుగులు చేసి అవుటయ్యారు. భారత జట్టులో భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్‌లు చెరో వికెట్ కూల్చారు.

    మొహమ్మద్ రిజ్వాన్ 29 పరుగులు, ఇఫ్తికార్ అహ్మద్ 16 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

    భారత జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్), కె.ఎల్.రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్‌లు ఆడుతున్నారు.

    పాకిస్తాన్ జట్టులో.. బాబర్ ఆజం (కెప్టెన్), మొహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫఖార్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్దిల్ షా, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, నసీమ్ షా, హారిస్ రౌఫ్, షానవాజ్ దహానీలు ఆడుతున్నారు.

  14. ఆసియా కప్ 2022 – Ind vs Pak: 6 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసిన పాక్

    ఆసియా కప్ 2022

    ఫొటో సోర్స్, Getty Images

    దుబాయ్ టీ20లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ జట్టు.. మూడో ఓవర్‌లో తొలి వికెట్ కోల్పోయింది.

    భువనేశ్వర్ బౌలింగ్‌లో పాక్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్‌ ఔటయ్యాడు. తొమ్మిది బంతుల్లో 10 పరుగులు చేసిన బాబర్ అర్షదీప్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. అప్పటికి జట్టు స్కోరు 15 పరుగులు మాత్రమే.

    పాక్ జట్టు ఆరో ఓవర్‌లో రెండో వికెట్ కోల్పోయింది. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఫకీర్ జామన్ ఔటయ్యాడు. అతడు ఆరు బంతుల్లో 10 పరుగులు చేసి ఔటయ్యాడు.

    పాక్ జట్టు ఆరు ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది.

  15. ఆసియా కప్ 2022 – Ind vs Pak: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

    ఆసియా కప్ 2022

    ఫొటో సోర్స్, Getty Images

    దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా కప్ 2022 క్రికెట్ టోర్నమెంటులో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య ఆదివారం సాయంత్రం టీ20 మ్యాచ్ ప్రారంభమైంది.

    తొలుత టాస్ గెలిచన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ మొదలైంది.

    భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి ఇది 100వ టీ20 మ్యాచ్ అవుతోంది.

  16. అగ్నిపథ్ పథకంపై నేపాలీ గూర్ఖాలు ఎందుకు కోపంతో ఉన్నారు... వారు, పాక్, చైనా ఆర్మీలో చేరాలనుకుంటున్నారా?

  17. పాకిస్తాన్: వరదలతో జనం అతలాకుతలం.. అంతర్జాతీయ సాయం కోసం అభ్యర్థన

    పాకిస్తాన్ వరదలు

    ఫొటో సోర్స్, Getty Images

    వరదలతో అతలాకుతలమైన పాకిస్తాన్.. మరింతగా అంతర్జాతీయ సహాయం కావాలంటూ అభ్యర్థిస్తోంది.

    దేశంలో వర్షాలు, వరదల్లో గత 24 గంటల్లో 119 మంది చనిపోయారని.. దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 1,033 మందికి పెరిగిందని నేషనల్ డిజాస్టర్ అథారిటీ చెప్పింది.

    పాకిస్తాన్‌కు అమెరికా, బ్రిటన్, అరబ్ ఎమిరేట్స్ సాయం అందించాయి. అయితే ఇంకా మరిన్ని నిధులు అవసరమని పాక్ అధికారులు చెప్తున్నారు.

    అంతర్గత వ్యవహారాల మంత్రి సల్మాన్ సూఫీ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. కానీ ఇప్పుడు ఈ వర్షాకాలపు విపత్తు నుంచి బయట పడాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు.

    అనేక అభివృద్ధి ప్రాజెక్టల నుంచి నిధులను వరద ప్రభావిత ప్రజలకు సాయం కోసం మళ్లించినట్లు ఆయన తెలిపారు.

    పాకిస్తాన్ వరదలు

    ఫొటో సోర్స్, Getty Images

    వరదల ప్రభావం తీవ్రంగా ఉన్న పఖ్తున్ఖావా ప్రావిన్స్‌కు సాయం కోసం 1000 కోట్ల పాకిస్తానీ రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ ప్రకటించారని డాన్ వార్తాపత్రిక తెలిపింది.

    వరదల వల్ల ప్రభావితమైన ప్రతి కుటుంబానికీ 25,000 రూపాయల చొప్పున సాయం అందిస్తామని.. వారం రోజుల్లో ఈ మొత్తం పంపిణీ చేస్తామని ప్రధాని చెప్పారు.

    ఖైబర్ పఖ్తున్ఖావా ప్రావిన్స్‌లో నదులు ఉప్పొంగి తీవ్రస్థాయి వరదలు ముంచెత్తటంతో.. వాయువ్య పాకిస్తాన్‌లో వేలాది మంది ప్రజలు ఇళ్లు విడిచి వెళ్లాల్సి వచ్చింది.

    పాకిస్తాన్ వరదలు

    ఫొటో సోర్స్, Vertical

    ‘‘మేం ఏళ్ల తరబడి కష్టపడి కట్టుకున్న ఇళ్లు మా కళ్ల ముందే నీట మునిగాయి. మేం రోడ్డు పక్కన కూర్చుని మా ఇళ్లు మునిగిపోతుంటే కళ్లప్పగించి చూడాల్సి వచ్చింది’’ అని 23 ఏళ్ల జునైద్ ఖాన్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పారు.

    ఆగ్నేయంలోని సింధ్ రాష్ట్రంలో కూడా వరదల ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. అక్కడ కూడా వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

    పాకిస్తాన్ వరదలు

    ఫొటో సోర్స్, Zahid Mengal

    గ్రామీణ ప్రాంతాల్లో మట్టి ఇళ్లు నీళ్లలో మునిగిపోగా.. మైళ్ల కొద్దీ దూరం వరద నీటిలో మునిగిన చెట్ల చిటారు కొమ్మలు మాత్రమే కనిపిస్తున్నాయని బీబీసీ ప్రతినిధి పుమ్జా ఫిహ్లానీ తెలిపారు.

    మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తాయని ఇక్కడి ప్రజలు చెప్తున్నారు.

    పాకిస్తాన్ వరదలు

    ఫొటో సోర్స్, PDMA

    జనం ఆహారం కోసం అలమటిస్తున్నారు. పసివారికి సైతం 24 గంటలుగా తినటానికి ఏమీ దొరకలేదని వాపోతున్నారు. పిల్లలు కలుషిత నీటి వల్ల జబ్బులు పడుతున్నారు.

    మొత్తం 3.30 కోట్ల మంది - అంటే దేశ జనాభాలో 15 శాతం మంది వరదల వల్ల ప్రభావితమయ్యారని మంత్రి షరీఫ్ తెలిపారు.

    పాకిస్తాన్ వరదలు

    ఫొటో సోర్స్, Getty Images

  18. నోయిడా ట్విన్ టవర్స్‌‌ కూల్చివేత పూర్తి కథ

  19. నోయిడా ట్విన్ టవర్స్: 9 సెకన్లలో కూలిపోయిన ఆకాశ హర్మ్యాలు

    నోయిడా భవనాల కూల్చివేత

    ఫొటో సోర్స్, UGC

    దిల్లీ సమీపంలోని నోయిడాలో.. సూపర్‌టెక్ నిర్మాణ సంస్థ నిర్మించిన రెండు భారీ ఆకాశహర్మ్యాలను ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు కూల్చివేశారు.

    ‘అపెక్స్’, ‘సియానే’ అనే పేర్లున్న ఈ ట్విన్ టవర్స్‌ను పడగొట్టేందుకు 3700 కేజీల పేలుడు పదార్థాలను ఉపయోగించారు.

    రెండు భారీ భవనాలూ కేవలం 9 సెకన్లలో కూలిపోయాయి.

    వీడియో క్యాప్షన్, దిల్లీలో ట్విన్ టవర్స్ క్షణాల్లో ఎలా కుప్పకూలి పోయాయో చూడండి...

    ఈ జంట భవనాల్లో అపెక్స్ టవర్‌లో 32 అంతస్తులు, సియానే టవర్‌లో 29 అంతస్తులు ఉన్నాయి. ఇవి రాజధాని దిల్లీ నగరంలోని కుతుబ్ మీనార్ కన్నా పొడవైన భవనాలు.

    మొత్తం 100 మీటర్ల ఎత్తయిన ఈ భవనాలను కూల్చివేయాలని.. 9 ఏళ్ల పాటు సాగిన కోర్టు కేసు అనంతరం న్యాయస్థానం ఆదేశించింది.

    ఆదివారం మధ్యాహ్నం ఒక మీట నొక్కిన 9 సెకన్లలో రెండు భవనాలూ శిథిలాల కుప్పగా మారాయి. ఇవి కూలేటపుడు భారీ స్థాయి ధూళి మేఘం రేగింది. చుట్టుపక్కల పరిసరాలన్నిటినీ ఆ ధూళి మేఘం కమ్మేసింది.

    అయితే, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పర్యావరణ శాఖ.. ట్విన్ టవర్స్ కూల్చివేత స్థలం వద్ద కాలుష్య స్థాయిని పర్యవేక్షించటానికి ఆరు ప్రత్యేక డస్ట్ మెషీన్లను ఏర్పాటు చేసింది.

    ‘‘కూల్చివేతకు ముందు, కూల్చివేత సమయంలో, కూల్చివేత తర్వాత కూడా కాలుష్య స్థాయిని పరిశీలిస్తాం. గాలిలో పీఎం 10, పీఎం 2.5 రేణువుల మోతాదును ఈ మెషీన్ల ద్వారా తనిఖీ చేస్తాం. ఆ నివేదిక 24 గంటల్లో వస్తుంది’’ అని ఒక మెషీన్ టెక్నీషియన్ ఉమేష్ తెలిపారు.

    నోయిడా భవనాల కూల్చివేత

    ఫొటో సోర్స్, UGC

    ఈ టవర్స్‌కు సమీపంలోని అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్న వారిని వారి ఫ్లాట్ల నుంచి ఖాళీ చేసి వెళ్లారు. ఎమరాల్డ్ కోర్ట్ సొసైటీలో నివసించే ఒక కుటుంబం తమ ఫ్లాట్‌ను ఖాళీ చేసి పార్స్వనాథ్ గ్రామానికి వెళ్లింది.

    ఆదివారం మధ్యాహ్నం కూల్చివేత తర్వాత సాయంత్రానికే తాము తమ ఫ్లాట్‌కు తిరిగి రావచ్చునని భరోసా ఇచ్చారని ఆ కుటుంబం చెప్పింది. అయితే తామందరం ఒకటి రెండు రోజులు దూరంగా ఉండటానికి సిద్ధపడ్డట్లు తెలిపింది.

    ఈ ట్విన్ టవర్స్ కూల్చివేత వల్ల 35,000 ఘనపుటడుగుల శిథిలాలు మిగులుతాయి. వీటిని తొలగించటానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది.

    కొన్ని నెలలుగా ఈ ట్విన్ టవర్స్ కూల్చివేత గురించి ప్రచారం జరుగుతుండటంతో ఆదివారం నాటి కూల్చివేత కార్యక్రమాన్ని దేశమంతా ఆసక్తిగా తిలకించింది.

    ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. నోయిడా సెక్టార్ 93ఎ సమీపంలో ఆస్పత్రులను అత్యవసర వైద్య సేవలు అందించటానికి సంసిద్ధంగా ఉంచారు.

  20. అనకాపల్లి జిల్లాలో 25 కింగ్ కోబ్రా పిల్లలను ఎలా సురక్షితంగా అడవిలో వదిలారంటే