ఏ రాష్ట్రానికి ఎంత అప్పు? ఏపీ, తెలంగాణ అప్పులు ఎంతెంత?
2022 మార్చి చివరి నాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం తమిళనాడుకు అత్యధికంగా రూ. 6,59,868.9 కోట్ల అప్పు ఉండగా ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్రలు రూ. 6 లక్షల కోట్లకు పైగా అప్పులతో ఆ తరువాత రెండు స్థానాలలో ఉన్నాయి.
లైవ్ కవరేజీ
శారద మియాపురం
ఈ రోజు లైవ్ పేజీలో ముఖ్యాంశాలు
* రాష్ట్రాల అప్పులపై కేంద్రం వివరాలు వెల్లడించింది. లోక్‌సభలో బీజేపీ సభ్యుడు కిషన్ కపూర్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఈ వివరాలు సభ ముందు ఉంచారు.
* భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను అగౌరవపరిచారంటూ ప్రతిపక్ష పార్టీలు రాజ్యసభ చైర్మన్‌కు లేఖను సమర్పించాయి.
* కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌లను చంపేస్తామంటూ బెదిరించిన ఓ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
* మయన్మార్ సైన్యం, నలుగురు ప్రజాస్వామ్య కార్యకర్తలను ఉరి తీసింది. దశాబ్దాల తర్వాత అక్కడ తొలిసారిగా ఈ శిక్షను విధించినట్లు భావిస్తున్నారు.మాజీ చట్టసభ సభ్యుడు ప్యో జెయా థావ్, రచయిత కో జిమ్మీలతో పాటు లాయో ఆంగ్, ఆంగ్ తురా జాలపై తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.
* భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి భవన్‌లో కార్యాలయ బాధ్యతలు చేప్టటారు.
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి సుప్రీం కోర్టు నోటీసులు

ఫొటో సోర్స్, Getty Images
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
అంతేకాకుండా ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ గ్రూపుకు సంబంధించిన మధ్యవర్తిత్వ ప్రక్రియపై కూడా స్టే విధించింది.
ధోని పిటిషన్ మేరకు ఢిల్లీ హైకోర్టు ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియను ప్రారంభించింది.
సుప్రీం కోర్టు నియమించిన రిసీవర్, కేవలం అమ్రపాలి సంస్థలో గృహ కొనుగోలుదారులకు సంబంధించిన వ్యవహారాలను మాత్రమే చూస్తారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
ఆమ్రపాలి కేసు పెండింగ్‌లో ఉన్నంత వరకు ఆర్బిట్రేషన్ ఎదుట రిసీవర్ హాజరుపై స్టే విధిస్తున్నట్లు చెప్పింది.
మధ్యవర్తిత్వ ప్రక్రియ కోసం ఆర్బిట్రేషన్ ఎదుట హాజరు కావాలంటూ రిసీవర్‌కు ఆర్బిట్రేటర్ నోటీసులు పంపించారు. ఈ విషయాన్ని రిసీవర్, సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో సుప్రీం కోర్టు దీనిపై స్టే విధించింది.
జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నేతృత్వంలోని బెంచ్, ధోనికి నోటీసులు జారీ చేసింది.
బాక్సర్ లవ్లీనా ఆరోపణల నేపథ్యంలో స్పందించిన క్రీడా మంత్రిత్వ శాఖ
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ సోమవారం చేసిన ఆరోపణల నేపథ్యంలో భారత క్రీడామంత్రిత్వ శాఖ స్పందించింది.
బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో తన కోచ్‌కు ప్రవేశం నిరాకరించారని, ఇది తనను మానసికంగా వేధించడమేనని ఆరోపిస్తూ సోమవారం ఆమె ట్వీట్ చేశారు.
దీనిపై భారత క్రీడా మంత్రిత్వ శాఖ స్పందించింది. లవ్లీనా కోచ్‌కు వెంటనే గుర్తింపునిస్తూ ఆయనకు కామన్వెల్త్ క్రీడల వద్దకు అనుమతించాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌ను కోరామని తెలిపింది.
ఈ సమస్యకు పరిష్కారం చూపేలా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధికారులతో మాట్లాడాలని క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులకు మంత్రి అనురాగ్ ఠాకుర్ సూచించారని ఏఎన్ఐ ట్వీట్ చేసింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మంకీపాక్స్ ఎలా వస్తుంది, దీని లక్షణాలేంటి?
లక్షలాది మంది భారతీయులు ఎందుకు భారత పౌరసత్వం వదులుకుంటున్నారు?
ఏ రాష్ట్రానికి ఎంత అప్పు ఉంది? ఏపీ, తెలంగాణ అప్పులు ఎంతెంత?

ఫొటో సోర్స్, http://loksabhaph.nic.in/
రాష్ట్రాల అప్పులపై కేంద్రం వివరాలు వెల్లడించింది. లోక్‌సభలో బీజేపీ సభ్యుడు కిషన్ కపూర్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఈ వివరాలు సభ ముందు ఉంచారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ‘స్టేట్ ఫైనాన్సెస్: ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ఆఫ్ 2021-2022’ని ఆధారంగా చేసుకుని 2020 మార్చి, 2021 మార్చి, 2022 మార్చి నాటికి రాష్ట్రాలకు ఎంతెంత అప్పులు ఉన్నాయో తెలిపారు.
దీని ప్రకారం... 2022 మార్చి చివరి నాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం తమిళనాడుకు అత్యధికంగా రూ. 6,59,868.9 కోట్ల అప్పు ఉండగా ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్రలు రూ. 6 లక్షల కోట్లకు పైగా అప్పులతో ఆ తరువాత రెండు స్థానాలలో ఉన్నాయి.
2022 మార్చి చివరినాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ. 3,98,903.6 కోట్లు కాగా ఇదే సమయానికి తెలంగాణ అప్పులు రూ. 3,12,191.3 కోట్లు.
2021 మార్చి చివరి నాటికి సవరించిన బడ్జెట్అంచనాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు అత్యధికంగా రూ. 6,00,006.2 కోట్ల అప్పు ఉండగా.. తమిళనాడు, మహారాష్ట్ర ఆ తరువాత స్థానాలలో ఉన్నాయి.
2021 మార్చి చివరి నాటికి సవరించిన బడ్జెట్అంచనాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 3,60,333.4 కోట్లు కాగా తెలంగాణ అప్పు రూ. 2,67,530.7 కోట్లు.
2020 మార్చి చివరినాటికి రాష్ట్రాల అప్పులు పరిగణనలోకి తీసుకుంటే రూ. 5,49,559.2 కోట్ల అప్పుతో ఉత్తర్ ప్రదేశ్ అందరి కంటే ముందుంది. మహారాష్ట్ర, తమిళనాడు ఆ తరువాత స్థానాలలో ఉన్నాయి.
2020 మార్చి చివరినాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 3,07,671.5 కోట్లు కాగా తెలంగాణ అప్పు రూ. 2,25,418 కోట్లు.
మీర్ సుల్తాన్ ఖాన్: 90 ఏళ్ళ కిందటే బ్రిటిష్ చెస్ చాంపియన్... కానీ, ఆయనకు 'గ్రాండ్ మాస్టర్' గౌరవం ఎందుకు దక్కలేదు?
ఖర్గేను అగౌరవపరిచారంటూ రాజ్యసభ చైర్మన్‌కు ప్రతిపక్షాల లేఖ

ఫొటో సోర్స్, mallikarjun Kharge/fb
భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను అగౌరవపరిచారంటూ ప్రతిపక్ష పార్టీలు రాజ్యసభ చైర్మన్‌కు లేఖను సమర్పించాయి.
ఆ కార్యక్రమంలో ఖర్గే హోదాకు తగిన సీటును ఆయనకు కేటాయించలేదని వారు అందులో పేర్కొన్నారు.
ఒక సీనియర్ నాయకుని పట్ల ప్రొటోకాల్ పాటించకుండా ఉద్దేశపూర్వకంగా అగౌరవపరచడంతో షాక్‌కు గురయ్యామని, ఈ చర్యను నిరసిస్తున్నామని వారు లేఖలో రాశారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మనీషా రూపేటా: పాకిస్తాన్‌లో డీఎస్పీ అయిన తొలి హిందూ మహిళ
నదిలో పడి కొట్టుకుపోతున్న పెద్దపులిని ఎలా కాపాడారో చూడండి
విజయవాడ: చరిత్రకు సాక్ష్యంగా నిలిచే బాపు మ్యూజియం
కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ జంటకు బెదిరింపులు, కేసు నమోదు

ఫొటో సోర్స్, HYPE PR
కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌లను చంపేస్తామంటూ బెదిరించిన ఓ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
విక్కీ కౌశల్ ఫిర్యాదు మేరకు ముంబైలోని శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్‌లో ఈ వ్యక్తిపై కేసు నమోదైంది.
సామాజిక మాధ్యమాల వేదికగా విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌లకు బెదిరింపుల వచ్చాయని పోలీసులు చెప్పారు.
ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశామని అన్నారు.
గత ఏడాది డిసెంబర్‌లో కత్రినా, విక్కీ కౌశల్ వివాహం జరిగింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మయన్మార్: కుటుంబీకులకు చెప్పకుండానే నలుగురు ప్రజాస్వామ్య కార్యకర్తలకు ఉరి, జుబైదా అబ్దుల్ జలీల్, బీబీసీ న్యూస్

ఫొటో సోర్స్, REUTERS
ఫొటో క్యాప్షన్, ప్రముఖ ప్రజాస్వామ్య కార్యకర్త కో జిమ్మీ 2012 నాటి ఫొటో మయన్మార్ సైన్యం, నలుగురు ప్రజాస్వామ్య కార్యకర్తలను ఉరి తీసింది. దశాబ్దాల తర్వాత అక్కడ తొలిసారిగా ఈ శిక్షను విధించినట్లు భావిస్తున్నారు.
మాజీ చట్టసభ సభ్యుడు ప్యో జెయా థావ్, రచయిత కో జిమ్మీలతో పాటు లాయో ఆంగ్, ఆంగ్ తురా జాలపై తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.
వీరికి ఉరిశిక్ష విధిస్తున్నట్లు జూన్‌లో సైన్యం ప్రకటించిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఈ నిర్ణయాన్ని అందరూ ఖండించారు.
క్రూరమైన, అవమానవీయ తీవ్రవాద కార్యకలాపాలకు కుట్ర పన్నడం, వాటికి ఏర్పాట్లు చేయడం, దిశానిర్దేశం చేసిన కారణంగా నలుగురికి ఉరిశిక్ష అమలైందని మయన్మార్ అధికారిక మీడియా సంస్థ ‘గ్లోబల్ న్యూస్ లైట్’ తెలిపింది.

ఫొటో సోర్స్, REUTERS
ఫొటో క్యాప్షన్, ఆంగ్ సాన్ సూకీ సన్నిహిత మిత్రుడు ప్యో జెయా థావ్ తీవ్రవాద నిరోధక చట్టం కింద వారిపై అభియోగాలు ఉన్నాయని పేర్కొంది. కానీ, వారిని ఎప్పుడు, ఎలా ఉరి తీశారో చెప్పలేదు.
ఐక్యరాజ్య సమితి ప్రకారం, 1988 తర్వాత అక్కడ ఉరి తీయడం ఇదే మొదటిసారి.
నలుగురు కార్యకర్తలకు మరణశిక్ష విధిస్తూ సైన్యం తీసుకున్న నిర్ణయం.. వ్యక్తుల జీవించే హక్కు, స్వేచ్ఛ, భద్రతా హక్కులకు స్పష్టంగా ఉల్లంఘించడమే అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అన్నారు.
బీబీసీ బర్మీస్ ప్రకారం, ఈ నలుగురు వ్యక్తులకు చెందిన కుటుంబ సభ్యులు, అధికారులను ప్రశ్నించడం కోసం యాంగోన్‌లోని జైలు ముందు ఎదురు చూస్తున్నారు.
తమవారి మృతదేహాలు ఇంకా అందలేదని బీబీసీతో జిమ్మీ సోదరి చెప్పారు.
తన భర్తకు ఉరి శిక్ష విధిస్తారనే సమాచారాన్ని తనకు ఇవ్వలేదని ప్యో థాయ్ భార్య తాజిన్ యుత్ ఆంగ్ చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఉరి శిక్షలపై సమాచారం కోసం వారి కుటుంబాలు దరఖాస్తులు చేశాయి.
రాష్ట్రపతి భవన్‌ను వీడిన రామ్‌నాథ్ కోవింద్
భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధికారిక నివాసాన్ని వీడారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఆయన జన్‌పథ్ రోడ్‌లోని కొత్త ఇంటికి మారారు.
ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అనంతరం ఆయన రాష్ట్రపతి భవన్‌ను వీడి తన కొత్త ఇంటికి చేరుకున్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రాష్ట్రపతి కార్యాలయ బాధ్యతలు స్వీకరించిన ద్రౌపది ముర్ము

ఫొటో సోర్స్, Rashtrapati Bhavan
భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి భవన్‌లో కార్యాలయ బాధ్యతలు చేప్టటారు.
ఆ సమయంలో ఆమెతో పాటు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఉన్నారు.
ఈ మేరకు రాష్ట్రపతి భవన్ వారి ఫొటోలను విడుదల చేసింది.

ఫొటో సోర్స్, Rashtrapati Bhavan

ఫొటో సోర్స్, Rashtrapati Bhavan

ఫొటో సోర్స్, Rashtrapati Bhavan
అనంతరం ఆమెకు త్రివిధ దళాల సైనిక సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ద్రౌపది ముర్ము: క్లర్క్ నుంచి రాష్ట్రపతి వరకు... ఆదివాసీ నేత ప్రస్థానం
ద్రౌపది ముర్ము: ‘రాష్ట్రపతి పదవి దక్కించుకోవడం నా విజయం కాదు, దేశంలోని పేద ప్రజలందరి విజయం’

ఫొటో సోర్స్, sansadTv
భారతదేశ రాష్ట్రపతి పదవిని అందుకోవడం తాను సాధించిన వ్యక్తిగత విజయం కాదని, ఇది దేశంలోని పేద ప్రజలందరి విజయమని ద్రౌపది ముర్ము అన్నారు.
భారత్‌లో పేదలు కలలు కనడమే కాదు వాటిని నిజం చేసుకుంటారనడానికి తన నామినేషనే సాక్ష్యమని ఆమె వ్యాఖ్యానించారు.
సోమవారం ఉదయం 10:15 గంటలకు పార్లమెంట్‌లోని సెంట్రల్ హాల్‌లో భారత 15వ రాష్ట్రపతిగా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు.
ఆ తర్వాత ఆమె దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘‘ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉన్న పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులు నన్ను తమ ప్రతినిధిగా భావించడం నాకు సంతృప్తిని ఇస్తోంది.
నా నామినేషన్‌కు పేదల ఆశీస్సులు ఉన్నాయి. కోట్లాది మంది మహిళల కలలు, సామర్థ్యాలకు నా ఎన్నికే నిదర్శనం.
దేశ ప్రజలందరికీ నా వినయపూర్వక కృతజ్ఞతలు. రాష్ట్రపతిగా బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించడంలో మీ నమ్మకం, మద్దతే నాకు శక్తినిస్తాయి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక జన్మించి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తిని నేను. భారత పౌరులపై స్వాతంత్ర్య సమరయోధులు పెట్టుకున్న అంచనాలను అందుకునే దిశగా ప్రయత్నాలను వేగవంతం చేయాల్సి ఉంది’’ అని ఆమె అన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం: ప్రత్యక్ష ప్రసారం
పోస్ట్ YouTube స్కిప్ చేయండిGoogle YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
పార్లమెంట్‌కు బయల్దేరిన ద్రౌపది ముర్ము
భారత్‌కు నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము పార్లమెంట్‌కు బయల్దేరినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
పదవి నుంచి నిష్క్రమించనున్న రామ్‌నాథ్ కోవింద్ కూడా ఆమెతో పాటు రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్‌కు బయల్దేరి వెళ్లారు.
పార్లమెంట్‌లోని సెంట్రల్ హాల్‌లో 10:15 గంటలకు ఆమె భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
