You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మహారాష్ట్ర: ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి అసెంబ్లీ వేదికగా బలపరీక్ష నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.
లైవ్ కవరేజీ
వరికూటి రామకృష్ణ
మహారాష్ట్ర: ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందా?
ఆంధ్రప్రదేశ్‌లో పులుల సంఖ్య పెరగడానికి అసలు కారణాలేంటి?
నేటి ముఖ్యాంశాలు
- ప్రస్తుత భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం 2022 ఆగస్టు 10తో ముగియనున్న నేపథ్యంలో ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.
- రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జరిగిన కన్నయ్య లాల్ హత్యను దిల్లీలోని జామా మసీద్ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ ఖండించారు.
- లోన్ యాప్స్‌ను రద్దు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ లేఖ రాశారు.
- కొలంబియాలోని ఒక జైలులో చెలరేగిన మంటల వల్ల సుమారు 51 మంది చనిపోయారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన తాజా వార్తాల కోసం ఈ లింకును క్లిక్ చేయండి.
బ్రేకింగ్ న్యూస్, మహారాష్ట్ర: ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేసినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి అసెంబ్లీ వేదికగా గురువారం బలపరీక్ష నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.
బలపరీక్షలో ఓటు వేయడానికి నవాబ్ మాలిక్, అనిల్ దేశ్‌ముఖ్‌లకు అనుమతి ఇచ్చింది.
సుప్రీం తీర్పు వెలువడిన తర్వాత ఫేస్‌బుక్ వేదికగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఉద్ధవ్ ఠాక్రే, రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
తనకు మద్దతుగా నిలిచిన ఎన్సీపీ, కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తున్నానని అన్నారు.
తాను అనుకోకుండా ఈ పదవిలోకి వచ్చానని, అదే పద్ధతిలో పదవిని విడిచి వెళుతున్నానని ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి పదవితో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తన ప్రసంగంలో ఠాక్రే వెల్లడించారు.
తాజ్ హోటల్‌లో బీజేపీ నేతల సమావేశం
ముంబయిలోని తాజ్ ప్రెసిడెంట్ హోటల్‌లో సమావేశమైన బీజేపీ నేతలు ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా ప్రకటన వెలువడగానే మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు అనుకూలంగా నినాదాలు చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఈ సమావేశంలో ఫడణవీస్‌తో పాటు, బీజేపీ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, మరికొందరు బీజేపీ నేతలు పాల్గొన్నారు
బ్రేకింగ్ న్యూస్, మహారాష్ట్ర: అసెంబ్లీలో రేపటి బలపరీక్షపై స్టే ఇవ్వలేమన్న సుప్రీం కోర్టు
ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి అసెంబ్లీ వేదికగా బలపరీక్ష నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.
జూన్ 30న బలపరీక్ష నిర్వహించాలని అసెంబ్లీ కార్యదర్శి రాజేంద్ర భాగవత్‌కు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి సూచించారు.
దీనికి వ్యతిరేకంగా శివసేన నాయకులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
శివసేన దాఖలుచేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. అనంతరం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను ఎందుకు హత్య చేశారు, రాజస్థాన్ పోలీసులు ఏం చెప్పారు?
భావప్రకటనా స్వేచ్ఛ ఒప్పందంపై మోదీ సంతకం చేయడాన్ని కొందరు ఎందుకు తప్పుబడుతున్నారు?
విజయవాడ నడిబొడ్డున ఉన్న ఈ సొరంగం గురించి ఎంతమందికి తెలుసు?
కన్నయ్యలాల్: రాజీ కుదిరిన తర్వాత కూడా నిందితులు ఎందుకు హత్యకు పాల్పడ్డారు, ఈ కేసులో ఇంతకు ముందు ఏం జరిగింది?
ఆగస్ట్ 6న ఉపరాష్ట్రపతి ఎన్నికలు
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఆగస్ట్ 6న జరగనున్నట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
ప్రస్తుత భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం 2022 ఆగస్టు 10తో ముగియనుందని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ మేరకు బుధవారం భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) ఎస్‌హెచ్ రాజీవ్ కుమార్ అధ్యక్షతన ఎన్నికల సంఘం సమావేశమై ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
దీని ప్రకారం, జూలై 7న నోటిఫికేషన్ వెలువడనుంది.
నామినేషన్ల దాఖలు కోసం చివరి తేదీని జూలై 19గా నిర్ణయించారు.
జూలై 20న నామినేషన్లను పరిశీలిస్తారు.
నామినేషన్ విత్ డ్రా చేసుకునేందుకు చివరి తేదీ జూలై 22.
ఆగస్టు 6న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
ఆ తర్వాత ఓట్ల లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు.
భారత్‌లో పాకిస్తాన్ ప్రభుత్వ ట్విటర్ అకౌంట్ నిలిపివేత
పాకిస్తాన్ ప్రభుత్వ ట్విటర్ ఖాతాను భారత్‌లో నిలిపి వేశారు.
లీగల్ కారణాల వల్ల భారత్‌లో @GovtofPakistan ఖాతాను హోల్డ్‌లో పెట్టారనే సందేశం పాకిస్తాన్ ప్రభుత్వ ట్విటర్ ఖాతాలో కనిపిస్తోంది.
ఇటీవల కాలంలో పాకిస్తాన్‌కు చెందిన పలు ట్విటర్ ఖాతాలను భారత్‌లో నిలిపి వేశారు.
యూఎన్‌లోని పాకిస్తాన్ ఎంబసీతోపాటు ఇరాన్, ఈజిప్టు,టర్కీలలోని పాకిస్తాన్ ఎంబసీ ట్విటర్ ఖాతాలను ఇండియాలో ఆపేశారు.
అబార్షన్లు చేయించుకోవద్దని నిజంగా బైబిల్‌లో ఉందా, సమర్ధించేవారు ఏమంటున్నారు
రాజస్థాన్: కన్నయ్య లాల్ హత్యను ఖండించిన జమా మసీద్ ఇమామ్
రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జరిగిన కన్నయ్య లాల్ హత్యను దిల్లీలోని జమా మసీద్ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ ఖండించారు.
‘అది పిరికిపందలు చేసే చర్య. రియాజ్, గౌస్ అనే ఇద్దరు వ్యక్తులు మహ్మద్ ప్రవక్త పేరుతో హత్య చేయడం ఇస్లామ్‌కు వ్యతిరేకం.
భారతదేశంలోని ముస్లింల అందరి తరపున నేను దీన్ని ఖండిస్తున్నా.’ అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.
బిల్‌గేట్స్‌ను కలిసిన మహేశ్ బాబు
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను తెలుగు సినీ నటుడు మహేశ్ బాబు కలిశారు.
బిల్‌గేట్స్‌తో మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ ఫొటో దిగారు. ఆ ఫొటోను మహేశ్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సమ్మర్ వెకేషన్‌లో భాగంగా ప్రస్తుతం మహేశ్ బాబు ఫ్యామిలీతో కలిసి అమెరికాలో ఉన్నారు.
ప్రపంచంలోనే గొప్ప దార్శనికుడైన వ్యక్తిని కలవడం సంతోషంగా ఉందని మహేశ్ బాబు రాశారు.
ఉదయ్‌పుర్: ‘కన్నయ్య చెప్పినా రాజస్థాన్ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు’
ఉదయ్‌పుర్‌లో హత్యకు గురైన కన్నయ్య లాల్‌కు ముందుగా బెదిరింపులు వచ్చాయని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.
కన్నయ్య లాల్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలియదని ఆయన చెప్పుకొచ్చారు. యాక్షన్ తీసుకోకుండా పోలీసుల మీద ఎవరైనా ఒత్తిడి తెచ్చారా? అని ప్రశ్నించారు.
కన్నయ్య హత్యకు రాజస్థాన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ నాయకుడు రాజ్యవర్ధన్ రాథోడ్ అన్నారు.
రాజస్థాన్‌లో ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
సూర్యకు ‘ఆస్కార్’ నుంచి ఆహ్వానం
తమిళ సినీ నటుడు సూర్య, బాలీవుడ్ నటి కాజోల్‌కు అరుదైన అవకాశం లభించింది.
అకాడమీ క్లాస్‌లో సభ్యులు అయ్యేందుకు ఆస్కార్ అవార్డులు ఇచ్చే ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ నుంచి సూర్య, కాజోల్‌కు ఆహ్వానాలు అందాయి.
2022కు సంబంధించి 397 మంది కొత్త కళాకారులకు ఆహ్వానాలు పంపారు.
జులై 1 నుంచి దేశమంతా ప్లాస్టిక్ నిషేధం- ఈ లిస్ట్‌లోని వస్తువులు వాడితే అయిదేళ్ల జైలు శిక్ష
లోన్ యాప్స్ రద్దు చేయాలంటూ కేసీఆర్‌కు దాసోజు శ్రవణ్ లేఖ
లోన్ యాప్స్‌ను రద్దు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ లేఖ రాశారు.
లోన్ యాప్‌ల నిర్వాహకులు చేసే దారుణాల వల్ల అనేక మంది అమాయకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పోలీసు శాఖలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడంతోపాటు చిన్న, మధ్యతరహా, చిరు వ్యాపారులు, తక్కువ ఆదాయ వర్గాలకు సులభంగా రుణాలు ఇచ్చేలా పాలసీలు తీసుకురావాలని శ్రవణ్ విజ్ఞప్తి చేశారు.
వాహనాలపై ఫాస్టాగ్ స్టిక్కర్ స్కాన్ చేసి డబ్బులు దొంగిలిస్తున్నారా