జీ-7 దేశాల నాయకులు రష్యా, చైనా, ఇరాన్‌ల గురించి ఏమన్నారు?
మూడు రోజుల సదస్సులో చివరి రోజైన మంగళవారం నాడు జీ7 దేశాల అధినేతలు రష్యా, చైనా, ఇరాన్ దేశాలపై ఇంధనం, ఆహారం, భద్రత, వాతావరణ మార్పులు, కరోనా వంటి అంశాలకు సంబంధించి ఆంక్షలు విధించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు.
లైవ్ కవరేజీ
నేటి ముఖ్యాంశాలు
- ఓఎన్‌జీసీకి చెందిన హెలికాప్టర్ అత్యవసర పరిస్థితుల్లో అరేబియా సముద్రం మీదకు దిగింది. ముంబయి-హైలోని సాగర్ కిరణ్ రిగ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పైలెట్లతో కలిపి ఈ హెలికాప్టర్‌లో మొత్తం 9 మంది ప్రయాణిస్తున్నారు.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేశ్ అంబానీ మంగళవారం రిలయన్స్ గ్రూపుకు చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియోకు రాజీనామా చేశారు.
- తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం చేశారు.
- అమెరికాలో ఒక కంటైనర్ ట్రక్కులో 46 వలసదారుల మృత దేహాలు లభించాయి. ఇటీవల కాలంలో అమెరికా-మెక్సికో సరిహద్దుల వెంట ఇంత భారీ స్థాయిలో వలసదారులు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన తాజా అప్‌డేట్ల కోసం ఈ లింకును క్లిక్ చేయండి
సెరిబ్రల్ పాల్సీతో బాధ పడుతున్న వందన... అమితాబ్ బచ్చన్‌కు ఎన్నో లేఖరు రాశారు, ఆయన కొన్నింటికి బదులిచ్చారు
శ్రీకాకుళంలో గోల్కొండ నవాబులు పాలించిన షేర్ మహమ్మద్ పురం కథ తెలుసా
నాజీల క్యాంప్ గార్డుగా పని చేసి, వేల హత్యలకు బాధ్యుడైన 101 ఏళ్ళ వృద్ధుడికి అయిదేళ్ళ జైలు శిక్ష
క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్న 4 కొత్త మందులు
జీ7 దేశాలు చైనా, రష్యా, ఇరాన్‌ల గురించి ఏమన్నాయి?

ఫొటో సోర్స్, Reuters
ప్రపంచంలోని 7 సంపన్న ప్రజాస్వామ్య దేశాల నాయకులు దక్షిణ జర్మనీలోని బవేరియన్ ఆల్ప్స్ పర్వతాల నడుమ ఉన్న విలాసవంతమైన రిసార్ట్‌లో సమావేశమయ్యారు.
మూడు రోజుల సదస్సులో చివరి రోజైన మంగళవారం నాడు జీ7 దేశాల అధినేతలు రష్యా, చైనా, ఇరాన్ దేశాలపై ఇంధనం, ఆహారం, భద్రత, వాతావరణ మార్పులు, కరోనా వంటి అంశాలకు సంబంధించి ఆంక్షలు విధించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు.
అలాగే, పారిస్ ఒప్పందాన్ని అమలు చేయడానికి క్లైమేట్ క్లబ్ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
ప్రపంచ ఆహార భద్రత కోసం 1,400 కోట్ల డాలర్లు కేటాయించడానికి జీ7 దేశాలు అంగీకరించాయి.

ఫొటో సోర్స్, Reuters
రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం, “తూర్పు, దక్షిణ చైనా సముద్రంలోని పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రం మీద చైనాకు ఎలాంటి అధికారం లేదు. యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్న రష్యాను వెనక్కి తగ్గాలని చైనా కోరాలి. రష్యా తన దళాలను ఉపసంహరించుకునేందుకు చైనా ఒత్తిడి చేయాలి అని కోరుతున్నాం” అని జీ7 దేశాధినేతలు అన్నారు.
ఇక రష్యా విషయానికి వస్తే, యుక్రెయిన్ మీద దాడి వల్ల రష్యాకు సానుకూల పరిస్థితులు లేకుండా చేయడానికి మరిన్ని ప్రయత్నాలు చేస్తామని, పౌర అణు అవసరాలు వంటి విషయంలో రష్యాపై ఆధారపడడాన్ని తగ్గించుకుంటామని వారు అన్నారు.
అరేబియా సముద్రంలో అత్యవసరంగా దిగిన ఓఎన్‌జీసీ హెలికాప్టర్... నలుగురు మృతి

ఫొటో సోర్స్, ANI
ఓఎన్‌జీసీకి చెందిన హెలికాప్టర్ అత్యవసర పరిస్థితుల్లో అరేబియా సముద్రం మీదకు దిగింది. ముంబయి-హైలోని సాగర్ కిరణ్ రిగ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పైలెట్లతో కలిపి ఈ హెలికాప్టర్‌లో మొత్తం 9 మంది ప్రయాణిస్తున్నారు.
వారిలో ఆరుగురిని ముందుగానే రక్షించగలిగారు. మిగతా ముగ్గురిని కూడా హెలికాప్టర్ నుంచి బయటకు తీసుకువచ్చి ఆస్పత్రికి తరలించారు.
అయితే, తొమ్మిది మందిలో నలుగురు వ్యక్తులు అప్పటికే స్పృహ కోల్పోయారని, దురదృష్టవశాత్తు వారి ప్రాణాలు కాపాడడం సాధ్యం కాలేదని ఓఎన్‌జీసీ ట్వీట్ చేసింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అధికారిక సమాచారం ప్రకారం ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా రక్షణ చర్యల్లో పాలుపంచుకుందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
హెలికాప్టర్ నీళ్ళల్లో పడిన ప్రదేశానికి కోస్ట్ గార్డ్ సిబ్బంది రెండు నౌకలను మళ్ళించారు. దమన్ నుంచి ఒక డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ కూడా హెలికాప్టర్లో ఉన్న వారిని కాపాడేందుకు బయలుదేరింది.
ప్రమాద స్థలం ముంబయి తీరానికి 7 నాటికల్ మైళ్ళ దూరంలో ఉంది.
అమెరికా-టెక్సస్: రోడ్డు పక్కన వదిలేసిన ట్రక్కులో 46 మృతదేహాలు... గాలీ, నీరూ లేక ఉక్కిరిబిక్కిరై చనిపోయారు
రిలయన్స్ జియోకు ముకేశ్ అంబానీ రాజీనామా, కొత్త చైర్మన్‌గా అకాశ్ అంబానీ

ఫొటో సోర్స్, Getty Images
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేశ్ అంబానీ మంగళవారం రిలయన్స్ గ్రూపుకు చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియోకు రాజీనామా చేశారు.
వార్తా సంస్థ పీటీఐ ప్రకారం, రిలయన్స్ జియో బోర్డుకు ముకేశ్ అంబానీ రాజీనామా చేశారు. ఆయన కుమారుడు ఆకాశ్ అంబానీని కొత్త చైర్మన్‌గా నియమించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అకాశ్ అంబానీ గురించి....
ఆకాశ్ అంబానీ 2009లో ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఐబీ డిప్లొమా ప్రోగ్రామ్ పూర్తి చేశారు. ఆ తర్వాత 2013లో అమెరికా బ్రౌన్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ కామర్స్‌లో గ్యాడ్యుయేట్ అయ్యారు.
తన చదువును పూర్తి చేసుకున్న తర్వాత ఆకాశ్, రిలయన్స్ జిమోఇన్ఫోకామ్ లిమిటెడ్‌లో పనిచేశారు.
ఆకాశ్ చిన్నతనం నుంచే టెక్నాలజీ పట్ల ఆసక్తి కనబరిచేవారు. జియో మెసేజింగ్, చాట్ ప్రోడక్ట్‌లతో పాటు ఇతర డిజిటల్ సర్వీస్ అప్లికేషన్స్ అభివృద్ధిలో ఆయన పాలుపంచుకున్నారు.
వజ్రాల వ్యాపారి రసెల్ మెహతా చిన్న కూతురు శ్లోకా మెహతాతో ఆకాశ్ వివాహం జరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
‘‘జుబైర్‌ను విడుదల చేయాలి’’- ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా డిమాండ్

ఫొటో సోర్స్, Social Media
జర్నలిస్టు మహమ్మద్ జుబైర్ అరెస్టును మంగళవారం ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఖండించింది. ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. ‘‘ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్ అరెస్టును ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఖండిస్తోంది. 2018 నాటి ఒక ట్వీట్‌ను పరిగణలోకి తీసుకుంటూ మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టారనే ఆరోపణలతో దిల్లీ పోలీసులు జూన్ 27న జుబైర్‌ను అరెస్ట్ చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ వేదికల్లో భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించడానికి కృషి చేస్తామని భారత్ స్పష్టం చేసిన రోజునే మొహమ్మద్ జుబైర్‌ను అరెస్ట్ చేయడం విడ్డూరం అని ఆ ప్రకటలో పేర్కొంది.
అంతేకాకుండా తీస్తా సెతల్వాద్ అరెస్టుపై కూడా అభ్యంతరం వ్యక్తం చేయబడింది.

ఫొటో సోర్స్, Getty Images
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా మొహమ్మద్ జుబైర్, తీస్తా సెతల్వాద్ అరెస్ట్‌పై విస్మయం వ్యక్తం చేశారని వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.
విద్వేషాలు వ్యాప్తి చేసిన వారిపై చర్యలు తీసుకోవట్లేదు. కానీ, తీస్తా సెతల్వాద్, మొహమ్మద్ జుబైర్‌లను ఎందుకు అరెస్ట్ చేశారని ఆమె ప్రశ్నించినట్లు పీటీఐ తెలిపింది.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
చెస్ ఒలింపియాడ్ 2022: తమిళనాడులో రష్యా-యుక్రెయిన్ పోరు
సెక్స్ అంటే అరబ్ కుర్రాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, వయాగ్రాకు అక్కడ ఎందుకంత డిమాండ్?
Instagram: మీ సెల్ఫీ వీడియో చూసి వయసెంతో గుర్తు పట్టేస్తుంది.
పట్టుదలే ఆమెను జీవితంలో ముందుకు నడిపిస్తోంది
తెలంగాణ హై కోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం

ఫొటో సోర్స్, Telangana CMO
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం చేశారు.
రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
గతంలో బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేసిన ఆయన 2021లో తెలంగాణ హై కోర్టుకు బదిలీ మీద వచ్చారు.
సుమారు ఎనిమిది నెలల తరువాత కేసీఆర్ తొలిసారి రాజ్‌భవన్‌కు వెళ్లారు. కొంత కాలంగా కేసీఆర్, తమిళిసై మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి.
బీజేపీతో కయ్యానికి దిగుతున్న కేసీఆర్, కొంత కాలంగా గవర్నర్‌ను దూరం పెడుతూ వస్తున్నారు. ఆయా ప్రభుత్వ కార్యక్రమాలకు ఆమెను దూరంగా ఉంచడం, అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి గవర్నర్‌ను పిలవకపోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.

ఫొటో సోర్స్, Telangana CMO

ఫొటో సోర్స్, Telangana CMO
యుక్రెయిన్‌లో దొంగిలిస్తున్న ఆహార ధాన్యాలను రష్యా ఎక్కడికి తీసుకెళ్తోంది?
అమెరికా: కంటైనర్‌లో 46 మృత దేహాల మధ్య సజీవంగా 16 మంది

ఫొటో క్యాప్షన్, శాన్ ఆంటోనియో రైల్వే ట్రాక్స్ పక్కన మృత దేహాలతో ఉన్న ట్రక్కు కనిపించింది. అమెరికాలో ఒక కంటైనర్ ట్రక్కులో 46 వలసదారుల మృత దేహాలు లభించాయి. ఇటీవల కాలంలో అమెరికా-మెక్సికో సరిహద్దుల వెంట ఇంత భారీ స్థాయిలో వలసదారులు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి.
టెక్సస్ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియోలో జనసంచారం పెద్దగా లేని ప్రాంతంలో ఈ ట్రక్కును వదిలేశారు.
కంటైనర్‌లో శవాల మధ్య 16 మంది సజీవంగా కనిపించగా వారిని ఆసుపత్రికి తరలించారు.
సాయం కోసం అరుపులు వినిపించగా దగ్గర్లోని బిల్డింగ్‌లో పని చేస్తున్న కార్మికులు కంటైనర్ తలుపులు తెరిచి చూశారని శాన్ ఆంటోనియో సిటీ పోలీసులు తెలిపారు.
కార్మికులు కంటైనర్ తెరచినప్పుడు భారీ సంఖ్యలో మృత దేహాలు కనిపించాయని వెల్లడించారు.
ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అమెరికా-మెక్సికో సరిహద్దుకు సుమారు 250 కిలోమీటర్ల దూరంలో శాన్ ఆంటోనియో ఉంటుంది. మెక్సికో నుంచి అక్రమంగా వలసదారులను తరచూ ఈ మార్గంలో సిండికేట్ ముఠాలు తరలిస్తూ ఉంటాయి.


ఫొటో క్యాప్షన్, అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఈ కేసును విచారిస్తున్నారు. 
ఫొటో క్యాప్షన్, ఈ రోడ్డు చివరే కంటైనర్ కనిపించింది. ఇతర మహిళలపై తనలో పుట్టే ఆకర్షణని ఆమె ఎప్పుడు తెలుసుకున్నారు?
అమెరికా: కంటైనర్‌లో 46 మృత దేహాలు... కిటికీలు, తాగడానికి మంచి నీళ్లు లేవు
అమెరికాలోని ఒక కంటైనర్‌లో 46 మృత దేహాలు లభించాయి. మరొక 16 మంది సజీవంగా దొరికారు. వీరిలో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు.
కిటికీలు లేని కంటైనర్‌లో వీరిని అక్రమంగా తరలిస్తున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కంటైనర్ లోపల ఏసీ పని చేయకపోవడం, తాగడానికి నీళ్లు లేకపోవడం వల్ల డీహైడ్రేషన్‌తో వారు చనిపోయి ఉంటారని ప్రాథమిక అంచనాకు వచ్చారు.
ప్రస్తుతం అమెరికాలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. సోమవారం ఉష్ణోగ్రత 39.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
