ఏక్‌నాథ్ శిందేను తమ నాయకుడిగా ఎన్నుకున్న తిరుగుబాటు ఎమ్మెల్యేలు
37 మంది శివసేన ఎమ్మెల్యేలు, 9 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ శిందే వెంట ఉన్నట్లు ఆయన కార్యాలయం నుంచి జాబితా విడుదల చేశారు.
లైవ్ కవరేజీ
ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ప్రకటించి విపక్షాలపై బీజేపీ ఒత్తిడి చేస్తోందా
నేటి ముఖ్యాంశాలు
- శ్రీలంకతో గురువారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 34 పరుగుల తేడాతో గెలుపొందింది.
- రెబెల్ ఎమ్మెల్యేలు కోరుకుంటే తాము మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) నుంచి తప్పుకుంటామని శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు.
- మమ్మల్ని ట్రాప్ చేసి సూరత్ తీసుకెళ్లారని శివసేన రెబల్ శిబిరం నుంచి వచ్చిన ఎమ్మెల్యే కైలాష్ పాటిల్ అన్నారు.
- వామపక్ష తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపిస్తూ హైదరాబాద్‌లోని న్యాయవాది శిల్పను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకుంది.
- చనిపోయిన తరువాత కూడా వ్యక్తుల గొంతును అనుకరించి మాట్లాడేలా అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌ను అమెజాన్ ట్రైన్ చేస్తున్నట్లు టెక్ క్రంచ్ అనే వెబ్‌సైట్ తెలిపింది.
ఇక్కడితో బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
ఏక్‌నాథ్ శిందేను నాయకుడిగా ఎన్నుకున్న తిరుగుబాటు ఎమ్మెల్యేలు

ఫొటో క్యాప్షన్, గువాహటిలో ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్న ఏక్‌నాథ్ శిందే శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఏక్‌నాథ్ శిందేను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు.
బీబీసీ మరాఠీ కథనం ప్రకారం, దీని తర్వాత ఏక్‌నాథ్ శిందే, ఎమ్మెల్యేలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వారితో చర్చించారు.
మొత్తం 37 మంది శివసేన ఎమ్మెల్యేలు, 9 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ శిందే వెంట ఉన్నట్లు ఆయన కార్యాలయం నుంచి జాబితా విడుదల చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఏక్‌నాథ్ శిందే తిరుగుబాటుకు ఇది మూడో రోజు.
గురువారం శరద్ పవార్ సమక్షంలో ఎన్సీపీ నిర్వహించిన సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు ఉద్ధవ్ ఠాక్రేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
భారత్ ఇచ్చింది దానం కాదు, అప్పు అని శ్రీలంక ప్రధాని ఎందుకు అన్నారు
అగ్నిపథ్ పథకంపై 10 సందేహాలు, వాటికి సమాధానాలు
రాణించిన రాధా యాదవ్, జెమీయా... భారత్ ఘన విజయం

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, జెమీమా రోడ్రిగ్స్ శ్రీలంక పర్యటనలో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది.
మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది.
దంబుల్లాలో 34 పరుగుల తేడాతో శ్రీలంకపై భారత్ గెలుపొందింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 138 పరుగులు చేసింది.
ఓపెనర్ షెఫాలీ వర్మ (31; 4 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (36 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) బ్యాటింగ్‌లో రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో ఇనోకా రణవీరా 3 వికెట్లు పడగొట్టగా, ఒషాడి రణసింఘే 2 వికెట్లు దక్కించుకుంది.
అనంతరం 139 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్లకు 104 పరుగులే చేసి ఓడిపోయింది.
కవిషా దిల్హరి (49 బంతుల్లో 47 నాటౌట్; 6 ఫోర్లు) పోరాడింది.
భారత బౌలర్లలో రాధా యాదవ్ 2 వికెట్లు తీయగా... దీప్తి శర్మ, పూజ వస్త్రకర్, షెఫాలీ వర్మ తలా ఓ వికెట్ పడగొట్టారు.
జెమీమా రోడ్రిగ్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఇరు జట్ల మధ్య తదుపరి మ్యాచ్ ఈనెల 25న దంబుల్లాలో జరుగనుంది.
ఆపరేషన్ లోటస్: శివసేనలో ముసలం వెనుక బీజేపీ ఉందనడానికి 5 అనుమానాలు ఇవేనా?
సినిమా కార్మికుల ఆందోళన: షూటింగ్‌లు నిలిచిపోయే పరిస్థితి ఎందుకొచ్చింది?
హోమ్ లోన్ ఈఎంఐ కట్టలేకపోతే ఏం చేయాలి?
కెరియర్‌లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, AFP
టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నేటితో 15 ఏళ్ల కెరియర్‌ను పూర్తి చేసుకున్నాడు.
2007 జూన్ 23న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డేల్లో రోహిత్ అడుగు పెట్టాడు.
230 మ్యాచుల్లో 9,283 పరుగులు చేశాడు 35 ఏళ్ల రోహిత్ శర్మ. మూడు డబుల్ సెంచరీలతో సహా 29 సెంచరీలున్నాయి. యావరేజ్ 48.60గా ఉంది.
ఇక 125 టీ20 మ్యాచుల్లో 3,313 పరుగులు చేశాడు.
టెస్టుల్లో 45 మ్యాచులు ఆడి 77 ఇన్నింగ్సుల్లో 3,137 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు 14 అర్ధ సెంచరీలున్నాయి.
సచిన్, సెహ్వాగ్ తరువాత డబుల్ సెంచరీ చేసిన మూడో వ్యక్తి రోహిత్ శర్మ.
మహారాష్ట్ర: ‘మీరు కోరుకుంటే సంకీర్ణ కూటమి నుంచి శివసేన బయటకు వస్తుంది’
రెబెల్ ఎమ్మెల్యేలు కోరుకుంటే తాము మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) నుంచి తప్పుకుంటామని శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు.
గువాహాటీలో ఉన్న ఎమ్మెల్యేలు ముందు వెనక్కి వచ్చి ముఖ్యమంత్రితో చర్చించాలని ఆయన కోరారు.
ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి నుంచి శివసేన బయటకు రావడమే వారి లక్ష్యమైతే ఆ విషయాన్ని ముంబయికి వచ్చి చర్చించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన ద్రౌపది ముర్ము

ఫొటో సోర్స్, Twitter/Narendra Modi
దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని, ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము కలిశారు.
‘రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడంపై దేశవ్యాప్తంగా అన్న వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. సమస్యలను క్షేత్రస్థాయి నుంచి అర్థం చేసుకోవడంలో ఆమె ప్రతిభ అసమాన్యం.’ అని మోదీ ట్వీట్ చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఎలాంటి మదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోవడం ఎలా, కొలమానాలు ఏంటి?
బ్రేకింగ్ న్యూస్, మహారాష్ట్ర సంక్షోభం: ‘మమ్మల్ని ట్రాప్ చేసి తీసుకెళ్లారు’
మమ్మల్ని ట్రాప్ చేసి సూరత్ తీసుకెళ్లారని శివసేన రెబల్ శిబిరం నుంచి వచ్చిన ఎమ్మెల్యే కైలాష్ పాటిల్ అన్నారు.
‘అక్కడి నుంచి తప్పించుకునేందుకు కిలోమీటరు నడిచా. నన్ను ఎమ్మెల్యేను చేసిన శివసేనను ఎన్నడూ వదలను.’ అని ఆయన తెలిపారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
హైదరాబాద్: ‘మావోయిస్టుల’తో సంబంధాలున్నాయంటూ లాయర్‌ను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ
వామపక్ష తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపిస్తూ హైదరాబాద్‌లోని న్యాయవాది శిల్పను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకుంది.
అంతకు ముందు చిలుకా నగర్ దగ్గర ఉండే ఆమె ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది.
ప్రస్తుతం శిల్పను మాదాపూర్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించారు.
విశాఖలో మూడేళ్ల క్రితం కనిపించకుండా పోయిన రాధిక అనే అమ్మాయిని మావోయిస్టుల్లో చేర్చారనే ఆరోపణలపై శిల్పను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. 2017 డిసెంబరులో నమోదైన ఫిర్యాదును ప్రస్తుతం ఎన్ఐఏ విచారిస్తోంది.
తమ కుమార్తెను కిడ్నాప్ చేసి మావోయిస్టుల్లో చేర్చుకున్నారని రాధిక తల్లి ఫిర్యాదు చేసింది. సీఎంఎస్ (చైతన్య మహిళా సంఘం) నేతలు దేవేంద్ర, స్వప్న, శిల్ప తమ ఇంటికి వచ్చేవారని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు.
హైదరాబాద్‌తో పాటూ తెలంగాణలో మరో రెండు చోట్ల ఎన్ఐఎ సోదాలు నిర్వహిస్తోంది. అయితే, రాధిక కేసుతో తన భార్య శిల్పకు సంబంధం లేదని ఆమె భర్త కిరణ్ మీడియాతో చెప్పారు. చైతన్య మహిళా సంఘం నుంచి శిల్ప బయటకు వచ్చిందని ఆయన అన్నారు.
ఆత్మకూరు ఉపఎన్నిక... ఇప్పటి వరకు 44% పోలింగ్

ఫొటో సోర్స్, AP I&PR
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు 44.14శాతం ఓటింగ్ నమోదైంది.
మొత్తం 2,13,338 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 279 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో 131 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తంచి, వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఈవీఎంల ద్వారా పోలింగ్ జరుగుతోంది.
1,409 మంది ఎన్నికల సిబ్బంది, 1,100 మంది పోలీసులు విధి నిర్వహణలో ఉన్నారు. ఈ నెల 26న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఆత్మకూరు అసెంబ్లీకి 2019 సాధారణ ఎన్నికల్లో గెలిచిన మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ఈ ఉపఎన్నిక వచ్చింది.
వైసీపీ, బీజేపీతో పాటుగా మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
అలాగే త్రిపుర, దిల్లీ, జార్ఖండ్ రాష్ట్రాలలోనూ కొన్ని స్థానాలకు నేడు ఉపఎన్నికలు జరుగుతున్నాయి.

ఫొటో సోర్స్, AP I&PR
మహారాష్ట్ర: ‘మమ్మల్ని అయోధ్యకు ఎందుకు వెళ్లనివ్వలేదు’
గువహాటిలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో బల ప్రదర్శనకు దిగారు శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ శిందే.
మొత్తం 42 మంది ఉండగా అందులో 32 మంది శివసేన, ఏడుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు.
‘శిందే గారు మీరు ముందడుగు వేయండి. మీ వెనుక మేం ఉన్నాం.’ అంటూ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.
ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తమను పట్టించుకోక పోవడం వల్లే తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని ఏక్‌నాథ్ శిందే అన్నారు.
‘మాకు నిజమైన ప్రతిపక్షాలు కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. శివసేన నేతలకు మాత్రం అపాయింట్‌మెంట్ దొరకడం లేదు. ముఖ్యమంత్రిని ఎవరు కలవాలో కలవకూడదో ఆయన చుట్టూ ఉండే వాళ్లు నిర్ణయిస్తున్నారు. మాకు అవమానం జరిగినట్లుగా భావిస్తున్నాం.’ అని ఆయన చెప్పుకొచ్చారు.
‘హిందుత్వ, రామ మందిరం రెండు శివసేనకు ఎంతో కీలకం. కానీ అయోధ్యకు వెళ్లొద్దంటూ మమ్మల్ని ఎందుకు ఆపారు? ఆదిత్య ఠాక్రే అయోధ్యకు వెళ్లేటప్పుడు ఎమ్మెల్యేలను అక్కడకు పోనివ్వలేదు.’ అని శివసేన రెబల్ ఎమ్మెల్యేలు లేఖలో రాశారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రష్యా చమురు భారత్ మీదుగా దొంగచాటుగా యూరప్ వెళ్తోందా
అన్నా డీఎంకేలో ముసలం... జనరల్ కౌన్సిల్ సమావేశం నుంచి వెళ్లిపోయిన పన్నీర్ సెల్వం

ఫొటో సోర్స్, Facebook/O Panneerselvam
ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం నుంచి ఒ.పన్నీర్ సెల్వం బయటకు వెళ్లి పోయారు. స్టేజీ దిగి వెళ్లిపోయేటప్పుడు ఆయన మీదకు బాటిల్ విసిరారు.
పన్నీర్ సెల్వాన్ని పార్టీ నుంచి తొలగించాలంటూ కొందరు నినాదాలు చేశారు.
సమావేశంలో పన్నీర్ సెల్వంతోపాటు ఎడప్పాడి కె.పళనిస్వామి సూచించిన 23 ప్రతిపాదనలను జనరల్ కౌన్సిల్ తిరస్కరించింది.
పార్టీ ఒకరి నాయకత్వంలోనే ఉండాలన్నది తమ కోరికని జనరల్ కౌన్సిల్ సభ్యులు స్పష్టం చేశారు. ఇదొక్కటే తీర్మానం చేసినట్లు డిప్యూటీ సెక్రటరీ కేపీ మునుస్వామి తెలిపారు.
ప్రస్తుతం పళనిస్వామి కోకోఆర్డినేటర్, పన్నీర్ సెల్వం కోఆర్డినేటర్‌గా ఉన్నారు. పార్టీని ఒకరి నాయకత్వంలోకే తీసుకు రావడమంటే పళనిస్వామికే ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తన మద్దతుదారులతో కలిసి పన్నీర్ సెల్వం సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.
జులై 11న తదుపరి జనరల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
