ద్రౌపది ముర్ము: రాష్ట్రపతి పదవికి ఎన్‌డీఏ అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ గవర్నర్ పేరును ప్రకటించిన జె.పి. నడ్డా

రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్‌డీఏ అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ గవర్నర్‌ ద్రౌపది ముర్ము పేరును ప్రకటించారు. ‘‘మొట్టమొదటిసారి ఒక గిరిజన మహిళా అభ్యర్థికి ప్రాధాన్యం ఇచ్చాం. రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటిస్తున్నాం’’ అని బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా చెప్పారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    నేటి బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.

    ధన్యవాదాలు.

  2. ఆర్మీలో చేరకపోతే ఈ దేశాల్లో జైల్లో పెడతారు

  3. మహారాష్ట్ర: శివసేనలో ముసలం... సీఎం ఉద్ధవ్ ఠాక్రే తన ప్రభుత్వాన్ని కాపాడుకోగలరా?

  4. బ్రేకింగ్ న్యూస్, ద్రౌపది ముర్ము: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ గవర్నర్ పేరును ప్రకటించిన జె.పి. నడ్డా

    ద్రౌపది ముర్ము

    ఫొటో సోర్స్, Ministry of Tribal Affairs

    రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్‌డీఏ అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ గవర్నర్‌ ద్రౌపది ముర్ము పేరును ప్రకటించారు.

    బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా మంగళవారం రాత్రి దిల్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు.

    ‘‘మొట్టమొదటిసారి ఒక గిరిజన మహిళా అభ్యర్థికి ప్రాధాన్యం ఇచ్చాం. రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటిస్తున్నాం’’ అని ఆయన చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఈ ప్రకటన చేయటానికి ముందు బీజేపీ పార్లమెంటరీ బోర్డు దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది.

    ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితర నేతలు ఈ భేటీకి హాజరయ్యారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    ఒడిషాకు చెందిన గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాతో పోటీ పడనున్నారు.

    ఒడిషాలో బీజేపీ, బిజూ జనతా దళ్ సంకీర్ణ ప్రభుత్వంలో 2000 నుంచి 2004 సంవత్సరాల మధ్య ద్రౌపది ముర్ము రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.

  5. శివసేన: సూరత్‌లో పార్టీ నేత ఏక్‌నాథ్ షిండేతో ఉద్ధవ్ దూతల మంతనాలు, పార్టీ శాసనసభా పక్ష నేత పదవి నుంచి ఏక్‌నాథ్ షిండేను తొలగించిన శివసేన

    శివసేన నేత ఏక్‌నాథ్ షిండే

    ఫొటో సోర్స్, @mieknathshinde

    ఫొటో క్యాప్షన్, శివసేన నేత ఏక్‌నాథ్ షిండే

    గుజరాత్‌లోని సూరత్‌లో ఒక హోటల్‌లో.. కొంత మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మకాం వేసిన శివసేన మంత్రి ఎక్‌నాథ్ షిండేను.. పార్టీ అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు మిలింద్ నార్వేకర్ మంగళవారం సాయంత్రం కలిసి చర్చలు జరిపారు.

    మిలింద్ నార్వేకర్ శివసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

    దాదాపు గంటసేపు జరిగిన ఈ భేటీలో మిలింద్ నార్వేకర్‌తో పాటు శివసేన నాయకుడు రవీంద్ర పాఠక్ కూడా ఉన్నారు. సమావేశం తర్వాత నార్వేకర్, పాఠక్‌లు తిరిగి ముంబై వెళ్లారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండే కొంత మంది పార్టీ శాసనసభ్యులను వెంటబెట్టుకుని గుజరాత్‌లోని సూరత్‌కే చేరుకోవటంతో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంలో సంక్షోభం తలెత్తింది.

    సూరత్‌లోని లె మెరిడియన్ హోటల్‌లో బస చేసివున్న ఏక్‌నాథ్ షిండేతో మాట్లాడి ఒప్పించే పనిని నార్వేకర్, పాఠక్‌లకు అప్పగించారు.

    ఏఎన్ఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ‘‘ఎక్‌నాథ్ షిండేతో చర్చలు జరిపాం. ఆయనతో మాకు మంచి సంబంధాలున్నాయి. మేం బీజేపీని ఎందుకు వీడామో ప్రతి ఒక్కరికీ తెలుసు’’ అని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    ఇదిలావుంటే.. ముంబైలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసమైన ‘వర్ష’లో శివసేన ఎమ్మెల్యేలు, ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది.

    అసెంబ్లీలో పార్టీ శాసనసభా పక్ష నేత పదవి నుంచి ఎక్‌నాథ్ షిండేను తొలగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

    ముంబైలోని షివిడీ నియోజకవర్గ ఎమ్మెల్యే అజయ్ చౌదరిని పార్టీ శాసనభా పక్ష నేతగా ఎంపిక చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

    ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం మీద శివసైనికులకు విశ్వాసముందని, సూరత్‌లో జరుగుతున్న పరిణామాలు త్వరలో ముగుస్తాయని.. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాహుల్ పాటిల్ పేర్కొన్నారు.

    ఏక్‌నాథ్ షిండేతో పాటు ప్రస్తుతం ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే విషయం చెప్పటానికి రాహుల్ పటేల్ తిరస్కరించారు.

    బీబీసీ మరాఠీ ప్రతినిధి కథనం ప్రకారం.. ఏక్‌నాథ్ షిండేతో పాటు 11 మంది శివసేన ఎమ్మెల్యేలు ఉన్నారు.

  6. ఉత్తరప్రదేశ్‌ మదరసాలలో యోగా చేయించిన యోగీ ఆదిత్యనాథ్ సర్కార్, విద్యార్థులు ఏమంటున్నారు?

  7. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషరఫ్‌‌కు వచ్చిన వ్యాధి ఏంటి, దానికి కావల్సిన మెడిసిన్ పాక్‌లో దొరకదా?

  8. నూరేళ్ళు జీవించేందుకు ఫార్ములా ఉందా?

  9. యశ్వంత్ సిన్హా: రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటన

    యశ్వంత్ సిన్హా

    ఫొటో సోర్స్, Getty Images

    రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను పోటీకి నిలపాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ప్రకటించారు.

    ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి అంశంపై మంగళవారం మధ్యాహ్నం దిల్లిలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ నివాసంలో సమావేశమైన ప్రతిపక్షాల నేతలు యశ్వంత్ పేరును ప్రకటించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయటానికి ఈ నెల (జూన్) 29వ తేదీ తుది గడువు. జూలై 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. జూలై 21న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

    ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24వ తేదీతో ముగియనుంది.

    ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఈ నెల 27వ తేదీన నామినేషన్ వేస్తారని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    మాజీ ప్రభుత్వాధికారి అయిన యశ్వంత్ సిన్హా గత బీజేపీ ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన గత ఏడాది మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

    ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తన పేరును ప్రకటించటానికి కొన్ని గంటల ముందు యశ్వంత్.. మంగళవారం నాడు పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

    ‘‘ప్రతిపక్ష పార్టీల ఐక్యత కోసం పనిచేయటానికి నేను పార్టీ నుంచి వైదొలగక తప్పదు’’ అంటూ ట్వీట్ చేశారు.

  10. నోబెల్ శాంతి బహుమతిని 807 కోట్ల రూపాయలకు వేలంలో అమ్మిన రష్యా ఎడిటర్, జార్జ్ రైట్, బీబీసీ న్యూస్

    నోబెల్ శాంతి బహుమతితో దిమిత్రి మురతోవ్

    ఫొటో సోర్స్, Getty Images

    రష్యాలో స్వతంత్ర వార్తాపత్రిక నొవాయా గజెటా ఎడిటర్-ఇన్-చీఫ్ దిమిత్రి మురతోవ్ తన నోబెల్ శాంతి బహుమతి పతకాన్ని వేలంలో 10.35 కోట్ల డాలర్లకు (సుమారు 807.35 కోట్ల రూపాయలు) విక్రయించారు.

    ఈ డబ్బు మొత్తాన్నీ యుక్రెయిన్ యుద్ధం నుంచి తప్పించుకుని బయటపడ్డ శరణార్థులకు సాయం చేయటానికి అందించనున్నట్లు మురతోవ్ చెప్పారు.

    వేలంలో ఈ నోబెల్ పతకాన్ని కొనుగోలు చేసిన వారి వివరాలను ఈ వేలం కార్యక్రమాన్ని నిర్వహించిన హెరిటేజ్ ఆక్షన్స్ వెల్లడించలేదు.

    రష్యాలో భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడుతున్నందుకు గాను.. దిమిత్రీ మురతోవ్‌కు, మరొకరికి కలిపి 2021లో ఈ నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు.

    యుక్రెయిన్ మీద ఫిబ్రవరి చివర్లో రష్యా సైనిక దండయాత్ర మొదలు పెట్టిన కొద్ది రోజులకే మార్చి నెలలో నొవాయా గజెటా ప్రచురణ నిలిచిపోయింది.

    దిమిత్రి మురతోవ్

    ఫొటో సోర్స్, AFP via Getty Images

  11. హాంగ్‌ కాంగ్: నీటిపై తేలే ప్రఖ్యాత జంబో రెస్టారెంట్.. దక్షిణ చైనా సముద్రంలో మునక, జార్జ్ రైట్, బీబీసీ న్యూస్

    హాంగ్‌ కాంగ్ జంబో రెస్టారెంట్

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    హాంగ్ కాంగ్‌లో నీటిపై నడిచే ప్రఖ్యాత జంబో రెస్టారెంట్ దక్షిణ చైనా సముద్రంలో మునిగిపోయింది.

    దాదాపు 50 ఏళ్ల పాటు నడిచిన ఈ నౌకా రెస్టారెంట్‌.. కోవిడ్ మహమ్మారి పంజా విసిరినపుడు 2020 మార్చిలో మూతపడింది.

    దీనిని గుర్తు తెలియని ప్రాంతానికి తరలిస్తుండగా దక్షిణ చైనా సముద్రంలో మునిగిపోయినట్లు యాజమాన్య సంస్థ అబర్డీన్ రెస్టారెంట్ ఎంటర్‌ప్రైజెస్ చెప్పింది.

    ఈ ఘటనలో నౌకా రెస్టారెంట్ సిబ్బంది ఎవరూ గాయపడలేదని పేర్కొంది.

    1976లో ప్రారంభించిన ఈ జంబో నౌకా రెస్టారెంట్‌లో బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్, హాలీవుడ్ నటులు టామ్ క్రూజ్, రిచర్డ్ బ్రాన్సస్ వంటి ప్రముఖులు సందర్శించారు.

    ఒక జేమ్స్ బాండ్ మూవీ సహా అనేక సినిమాల్లో ఈ రెస్టారెంట్ కనిపించింది. ఇప్పటివరకూ 30 లక్షల మందికి పైగా అతిథులు ఈ రెస్టారెంట్‌కు వచ్చినట్లు అంచనా.

    కానీ కోవిడ్ మహమ్మారి ఈ రెస్టారెంట్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. అలా మూతపడిన ఈ నౌకా రెస్టారెంట్‌ను కొద్ది రోజుల కిందట హాంగ్ కాంగ్ హార్బర్ నుంచి వేరే ప్రాంతానికి తరలించటం ప్రారంభించారు.

    కానీ ఆదివారం నాడు పారాసెల్ దీవుల సమీపంలో ప్రతికూల పరిస్థితులు ఎదురవటంతో సముద్రంలో మునిగిపోయిందని అబర్డీన్ రెస్టారెంట్ ఎంటర్‌ప్రైజెస్ వివరించింది.

    ఆ ప్రాంతంలో నీటి లోతు 1,000 మీటర్లకు పైగా ఉందని, నౌక శిథిలాలను వెలికి తీసే పనులు చేపట్టటం అసాధ్యమని పేర్కొంది.

    హాంగ్‌ కాంగ్: నీటిపై తేలే ప్రఖ్యాత జంబో రెస్టారెంట్.
  12. ఉద్దానం: ఈ ప్రాంతంలో యువతీ యువకుల పెళ్లిళ్లు క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఎందుకంటే...

  13. అగ్నిపథ్ నిరసనలు: ‘కోచింగ్ సెంటర్లు యువతను ఎగదోస్తున్నాయ్’... అజిత్ డోబాల్

    అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను తాము ముందే ఊహించామని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ అన్నారు.

    తమ ప్రయోజనాల కోసం కోచింగ్ సెంటర్లు యువతను తప్పు దారి పట్టించి ఎగదోస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.

    ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంటుందని... కానీ హింసను సృష్టించడం, విధ్వంసానికి పాల్పడితేచట్టం తన పని తాను చేస్తుందని ఆయన హెచ్చరించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. అజిత్ డోబాల్: ‘సైన్యంలో రెజిమెంట్లు వలసవాద అవశేషాలు’

    కొత్త భారత్‌కు తగినట్లుగా భారత సైన్య నిర్మాణం ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ అన్నారు.

    ప్రస్తుతం సైన్యంలో ఉన్న రెజిమెంట్లు వలసపాలనకు అవశేషాలని ఆయన విమర్శించారు.

    ‘రెజిమెంట్ల వల్ల ఇండియన్ ఆర్మీలో ఆల్ ఇండియా స్పిరిట్ కనిపించడం లేదు.

    భారత సైన్యంలో పాన్-ఇండియా క్యారెక్టర్ ఉండాలని బ్రిటిషర్లు కోరుకోలేదు. మన సైన్యం ప్రతి భారతీయునికి చెందిందనే భావన కల్పించాలి.’ అని ఆయన అన్నారు.

    కానీ రెజిమెంటల్ వ్యవస్థ అయితే కొనసాగుతుందని అజిత్ డోబాల్ స్పష్టం చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. అగ్నిపథ్: అగ్నివీరులకు ఉద్యోగాలిస్తామన్న ఆనంద్ మహీంద్రాపై మాజీ సైనికాధికారులు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు?

  16. అజిత్ డోబాల్: యుద్ధం తీరు మారుతోంది... అగ్నిపథ్ కావాల్సిందే

    యుద్ధం చేసే పరిస్థితులు మారుతున్నాయని అందుకు అనుగుణంగా సైన్యాన్ని కూడా సంస్కరించాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ అన్నారు.

    యువత ఎక్కువగా ఉన్న దేశంలో పాత సైనిక వ్యవస్థ ఉండకూడదని అని వార్తా సంస్థ ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు.

    కాంటాక్ట్‌లెస్ యుద్ధాలు, కంటికి కనిపించని శత్రువులతో పోరాడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి కాబట్టి అందుకు తగినట్లుగా మనం కూడా మారాలని స్పష్టం చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. గులాం నబీ ఆజాద్‌కు కోవిడ్ పాజిటివ్

    కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్

    ఫొటో సోర్స్, Facebook/Ghulam Nabi Azad

    కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌కు కరోనా సోకింది.

    ‘ఈరోజు నాకు కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నా.’ అని ఆయన ట్వీట్ చేశారు.

    సోమవారం దేశవ్యాప్తంగా 12,781 కొత్త కరోనా కేసులు నమోదు కాగా 18 మంది చనిపోయారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  18. మహారాష్ట్ర సంక్షోభం: దిల్లీలో దేవేంద్ర ఫడణవీస్... అమిత్ షాతో భేటీ!

    బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్

    ఫొటో సోర్స్, Facebook/Devendra Fadnavis

    మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే సర్కారు సంక్షోభంలో పడింది. సుమారు 26 మంది శివసేన ఎమ్మెల్యేలు సూరత్‌లో ఉన్నట్లు ఎన్‌డీటీవీ, ఇండియాటుడే వంటి ఇంగ్లిష్ న్యూస్ చానెల్స్ రిపోర్ట్ చేస్తున్నాయి.

    మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేండ్ర ఫడణవీస్ ప్రస్తుతం దిల్లీలో ఉన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆయన కలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    మహారాష్ట్రలో మొత్తం 285 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 143 సీట్లు వస్తే మెజారిటీ సాధించినట్లు. ప్రస్తుతం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమికి 151 సీట్లు ఉన్నాయి. బీజేపీకి 134 సీట్లు ఉన్నాయి.

  19. బైజూస్: మెరుపు వేగంతో వృద్ధి వెనుక ‘చీకటి నిజం’.. ఆందోళనలో కస్టమర్లు, ఉద్యోగులు

  20. దళితుడినన్న కారణంతో తన నుంచి ఫుడ్ తీసుకోలేదని కస్టమర్‌పై ఆరోపణలు చేసిన జొమాటో డెలివరీ బాయ్-ఎఫ్ఐఆర్ లో ఏముంది?