ధన్యవాదాలు..
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్‌డేట్ల కోసంఈ లింకునుక్లిక్ చేయండి.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తన తల్లి సోనియా గాంధీ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఈ నెల 17, 18న విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కోరారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్‌డేట్ల కోసంఈ లింకునుక్లిక్ చేయండి.
రాహుల్ గాంధీని ఈడీ విచారించడానికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన రాజ్‌భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది.
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పూజ పేరుతో ఓ తండ్రి నడిపిన ప్రహసనం బిడ్డ ప్రాణం తీసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పునర్విక అనే మూడేళ్ల చిన్నారి చనిపోయింది.
నేడు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం, ద్రవ్యోల్బణ భయాలు ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయి.
తన తల్లి సోనియా గాంధీ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఈ నెల 17, 18న విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కోరారు.
కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులను అదుపు చేసే సందర్భంలో రేణుకా చౌదరి తన కాలర్ పట్టుకున్నారంటూ పంజాగుట్ట ఎస్ఐ ఉపేంద్ర బాబు అదే స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తన తల్లి సోనియా గాంధీ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఈ నెల 17, 18న విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కోరారు.
జూన్ 20న విచారణకు హాజరు అవుతానని రాహుల్ చెప్పారు.
అయితే, ఆయన అభ్యర్థనపై ఇంకా ఈడీ అధికారులు స్పందించలేదు.
నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై సోనియా, రాహుల్‌లను ఈడీ ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులను అదుపు చేసే సందర్భంలో రేణుకా చౌదరి తన కాలర్ పట్టుకున్నారంటూ పంజాగుట్ట ఎస్ఐ ఉపేంద్ర బాబు అదే స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఆయన ఫిర్యాదు మేరకు ఐపీసీ 353 సెక్షన్ ప్రకారం రేణుకా చౌదరిపై కేసు నమోదు చేశారు.
కాగా ఎస్‌ఐ కాలర్ పట్టుకున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలపై రేణుక చౌదరి స్పందించారు.
పోలీసులపై చేయి చేసుకోవాలన్న ఉద్దేశం తనకు లేదని.. తాను బ్యాలన్స్ కోల్పోయి ఆ పోలీస్‌పై పడబోయానని.. ఆ క్రమంలో పడిపోకుండా ఆయన కాలర్ పట్టుకున్నానని చెప్పారు.
నేడు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం, ద్రవ్యోల్బణ భయాలు ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయి.
సెన్సెక్స్ సుమారు 2శాతం నష్టంతో అంటే 1045 పాయింట్లు కోల్పోయి 51,495 వద్ద క్లోజ్ అయింది.
నిఫ్టీ కూడా 2.11శాతం నష్టంతో అంటే 331 పాయింట్లు కోల్పోయి 15,360 వద్ద ముగిసింది.
నిఫ్టీ బ్యాంక్(2.17%), ఐటీ(2.43%), ఫైనాన్సియల్ సర్వీసెస్(2.16%), ఆటో(2.23%), ఎఫ్‌ఎంసీజీ(0.57%), మెటల్(5.24%), ఫార్మా(1.59%) వంటి రంగాల్లో భారీగా అమ్మకాలు కనిపించాయి.
టాటా స్టీల్, హిందాల్కో, కోల్ ఇండియా, ఓన్‌జీసీ, టాటా మోటార్స్ వంటి కంపెనీలు భారీగా నష్టపోయాయి.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు 75 బేసిస్ పాయింట్లు పెంచింది. అయితే ద్రవ్యోల్బణ భయం దృష్ట్యా ఈ ఏడాదిలో వడ్డీ రేట్లను మరొక 1.75శాతం పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుడటం కూడా మరొక కారణం. ఈ నెలలో ఇప్పటి వరకు రూ.24,949 కోట్లను వెనక్కి తీసుకున్నారు.
ఆర్థికమాంద్యం భయాలతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా నాస్‌డాక్, డోజోన్స్‌తో పాటు యూరప్, ఆసియా మార్కెట్లు భారీగా నష్టపోవడం భారత్ స్టాక్ మార్కెట్ల మీద చూపించింది.
బిహార్‌లో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో భాగంగా సుమారు మూడు రెళ్లకు నిప్పు పెట్టారు.
చాప్రా, గోపాల్‌గంజ్, కైమూరు జిల్లాల్లో గురువారం యువకులు తీవ్రమైన ఆందోళనలు చేపట్టారు.
రైల్వే పట్టాల మీద బైటాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకారులను రైల్వే పట్టాల మీద నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని కైమూరు ఎస్పీ రాకేశ్ కుమార్ తెలిపారు.
తమిళనాడులో కూడా సైన్యంలో చేరాలనుకునే అభ్యర్థులు నిరసనలకు దిగారు.
వెల్లూరులో సుమారు 100 మంది యువకులు వీధుల్లోకి వచ్చి ఆందోళనకు చేపట్టారు.
కలెక్టరేట్‌ను చుట్టుముట్టాలని యువకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
బిహార్‌లో యువకుల ఆందోళనలు తీవ్రంగా మారాయి. అనేక రైల్వే స్టేషన్లలో నిరసనలు చేపట్టిన అభ్యర్థులు, ఒక ప్యాసింజర్ రైలుకు నిప్పు పెట్టారు.
వెంటనే ‘అగ్నిపథ్’ను రద్దు చేసి పాత పద్ధతిలోనే నియామకాలు చేపట్టాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.
‘అగ్నిపథ్’ స్కీంలో భాగంగా నాలుగేళ్ల కాలానికి 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్నవారిని రిక్రూట్ చేసుకుంటారు. వారిలో 25శాతం సైనికుల సర్వీసును రెగ్యులరైజ్ చేస్తారు.
‘అగ్నివీరులు’ అని పిలిచే వీరికి నెలకు రూ.30 నుంచి 40 వేల వరకు జీతం ఇస్తారు. ఈ ఏడాది 46 వేల మందిని నియమించుకోనున్నారు.
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పూజ పేరుతో ఓ తండ్రి నడిపిన ప్రహసనం బిడ్డ ప్రాణం తీసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పునర్విక అనే మూడేళ్ల చిన్నారి చనిపోయింది.
పోలీసులు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం... ఆత్మకూరు పట్టణంలోని పేరారెడ్డిపల్లెలో వేణుగోపాల్ తన కుటుంబంతో నివశిస్తున్నారు. ఆయన ఆరోగ్య కారణాలతో కొంతకాలంగా ఇంట్లోనే ఉంటున్నారు. తన పరిస్థితి మెరుగుపడడం కోసమంటూ పలు పూజలు చేస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం ఇంట్లో చేస్తున్న పూజల్లో తన కుమార్తెను కూడా కూర్చోబెట్టారు. కొంతసేపటికి ఆ పాపను పడుకోబెట్టి నోట్లో కుంకుమ పోశారు. నోటినిండా కుంకుమ కుక్కడంతో ఆ పాప భయంతో కేకలు వేసింది.
కానీ పూజ నుంచి లేవకుండా పాప గొంతు నొక్కి కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. ఇంతలో చుట్టు పక్కల వారు పాప కేకలు విని, ఇంట్లోకి వచ్చి బాలికను రక్షించేందుకు ప్రయత్నించారు.
వెంటనే పాపను ఆత్మకూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పాప అపస్మారక స్థితికి చేరడంతో నెల్లూరు తరలించారు. కానీ పాప అక్కడే చికిత్స పొందుతూ చనిపోయింది.
ప్రస్తుతం నిందితుడు వేణుగోపాల్ పోలీసుల అదుపులో ఉన్నారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామనిఆత్మకూరు ఎస్సై శివశంకర్ తెలిపారు.
రాహుల్ గాంధీని ఈడీ విచారించడానికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన రాజ్‌భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది.
పోలీసుల లాఠీచార్జీలో కొందరు కాంగ్రెస్ నాయకులకు గాయాలు అయ్యాయి. పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ నిలిచి పోయింది.
నిరసన చేపట్టే క్రమంలో ఖైరతాబాద్‌లో రోడ్డుపై ఒక బైక్ తగలబెట్టారు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు. ఆర్టీసీ బస్సు ఎక్కి ఆందోళన చేశారు.
నిరసనకారులను తీసుకెళ్తోన్న పోలీసు బస్సుపై కూడా ఎక్కారు.
తనను అడ్డకున్న ఎస్సై చొక్కా పట్టుకున్న రేణుకా చౌదరి... ‘మీ స్టేషన్లోనే మిమ్మల్ని కొడతాను. దొంగలు అసెంబ్లీలో ఉంటే వాళ్లను వదిలేసి ఇక్కడ ఆడవాళ్లను పట్టుకుంటారా?’ అని పోలీసులను ప్రశ్నించారు.
పోలీసు జీపులో కాకుండా తన కారులో తనను స్టేషన్‌కు తరలించాలంటూ ఒత్తిడి చేసి జీపు ఎక్కడానికి నిరాకరించారు. చివరకు ఆవిడను పోలీసు వాహనంలోనే తరలించారు.
ఇక తోపులాటలో జగ్గా రెడ్డి చొక్కా చిరిగింది. అటు భట్టీ విక్రమార్క డీసీపీ జోయల్ డేవిస్ చొక్కాపై చేయి వేయడం పోలీసులకు ఆగ్రహం తెప్పించింది.
రాహుల్ గాంధీని గంటల తరబడి విచారించడం, ఏఐసీసీ కార్యాయలంలోకి పోలీసులు వెళ్లి కాంగ్రెస్ కార్యకర్తలను కొట్టడాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఖండించింది. జూన్ 17వ తేదీన అన్ని జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన చేయాలని పిలుపునిచ్చింది.
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి.
ఇప్పటికే రాజస్థాన్, బిహార్‌లో జరుగుతుండగా తమిళనాడులో కూడా సైన్యంలో చేరాలనుకునే అభ్యర్థులు నిరసనలకు దిగారు.
వెల్లూరులో సుమారు 100 మంది యువకులు వీధుల్లోకి వచ్చి ఆందోళనకు చేపట్టారు.
కలెక్టరేట్‌ను చుట్టుముట్టాలని యువకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
బిహార్‌లో యువకుల ఆందోళనలు తీవ్రంగా మారాయి. అనేక రైల్వే స్టేషన్లలో నిరసనలు చేపట్టిన అభ్యర్థులు, ఒక ప్యాసింజర్ రైలుకు నిప్పు పెట్టారు.
బాసర ట్రిపుల్ ఐటీలో మూడో రోజు విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
నిన్న విద్యార్థుల ప్రతినిధి బృందంతో నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి.
రెగ్యులర్ వైస్ చాన్సలర్‌ను నియమించడంతోపాటు హాస్టల్ భవనాల మరమ్మతులు, లైబ్రరీలో పుస్తకాలను పెంచడం, మెస్‌లో నాణ్యమైన భోజనం పెట్టడం వంటి డిమాండ్లతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
రెండు రోజులుగా క్యాంపస్ గేట్ వద్ద ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులను ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు.
విద్యార్థులు క్యాంపస్ బయటకు రాకుండా మెయిన్ గేట్ వద్ద బందోబస్తు పెంచారు. మీడియా మీద ఆంక్షలు కొనసాగుతున్నాయి.
విద్యార్థుల నిరసనలకు బీజేపి, కాంగ్రెస్, వైఎస్సార్ తెలంగాణ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. క్యాంపస్ గేటు బయట ఆ పార్టీల కార్యకర్తలు నిరసనలకు దిగారు.
కరోనా సంక్షోభం వల్ల విద్యా వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తాయని, ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు మరింత సమయం పడుతుందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
విద్యార్థి సంఘాలు సైతం బాసర ట్రిపుల్ ఐటీని చుట్టుముట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
ట్రిపుల్ ఐటీకి నీళ్ల సరఫరాను నిలిపివేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
ఇళ్ల కూల్చివేత మీద వస్తున్న అభ్యంతరాలపై మూడు రోజుల్లో స్పందించాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.
కానీ కూల్చివేతల మీద స్టే ఇవ్వడానికి మాత్రం నిరాకరించింది. అయితే ఇళ్ల కూల్చివేత చట్టం ప్రకారం జరిగేలా చూడాలని ఆదేశించింది.
ఉత్తర్ ప్రదేశ్‌లో బుల్‌డోజర్లతో ఇళ్లను కూల్చడాన్ని ఆపాలంటూ సుప్రీం కోర్టులో జమైత్ ఇ ఉలేమా పిటీషన్ వేసింది.
కర్నాటకలోని మంగళూరులో శ్రీనివాస్ గౌడ అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి గాడిదల డెయిరీ ఫాం పెట్టుకున్నారు.
ప్రస్తుతం 20 గాడిదలు ఉన్నాయని, ఈ డెయిరీ ఫాం పెట్టేందుకు సుమారు రూ.42 లక్షలు పెట్టుబడి పెట్టానని శ్రీనివాస్ గౌడ తెలిపారు.
‘గాడిద పాలు ఆరోగ్యానికి మంచివి. వాటిలో ఓషధ గుణాలున్నాయి. దేశంలో అందరికీ గాడిద పాలు అందుబాటులోకి రావాలన్నది మా కల.’ అని వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ శ్రీనివాస్ గౌడ అన్నారు.
మనీకంట్రోల్ వెబ్‌సైట్ ప్రకారం కుందేళ్లు, మేకలు, కడక్‌నాథ్ కోళ్లను కూడా శ్రీనివాస్ గౌడ కొంతకాలం పెంచారు. ఇప్పుడు 2.3 ఎకరాల్లో గాడిదల డెయిరీ ఫాం ఏర్పాటు చేశారు.
గాడిదల పాల ఖరీదు ఎక్కువగా ఉంటుందని, 30 మిల్లీలీటర్ల ప్యాకెట్‌ను రూ.150కు అమ్మనున్నట్లు శ్రీనివాస్ గౌడ తెలిపారు.
సైనిక నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకానికి వ్యతిరేకంగా బిహార్‌లో నిరసనలు చెలరేగాయి.
బిహార్‌లోని చాలా ప్రాంతాల్లో యువకులు రోడ్ల మీదకు వచ్చారు. ‘సర్వీసు నాలుగేళ్లపాటు మాత్రమే ఉండటం, పెన్షన్ సదుపాయం లేకపోవడం, వయసు మీద పరిమితి పెట్టడం’ వంటివి తమకు ఇబ్బందికరంగా ఉన్నాయంటూ వారు చెబుతున్నారు.
వెంటనే ‘అగ్నిపథ్’ను రద్దు చేసి పాత పద్ధతిలోనే నియామకాలు చేపట్టాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.
కొందరు రోడ్ల మీద టైర్లు తగులబెట్టగా మరికొందరు రైళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
‘అగ్నిపథ్’ స్కీంలో భాగంగా నాలుగేళ్ల కాలానికి 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్నవారిని రిక్రూట్ చేసుకుంటారు. వారిలో 25శాతం సైనికుల సర్వీసును రెగ్యులరైజ్ చేస్తారు.
‘అగ్నివీరులు’ అని పిలిచే వీరికి నెలకు రూ.30 నుంచి 40 వేల వరకు జీతం ఇస్తారు. ఈ ఏడాది 46 వేల మందిని నియమించుకోనున్నారు.
సుమారు మూడు నెలల తరువాత భారత్‌లో కరోనా కేసులు 12 వేల మార్కును దాటాయి. గత 24 గంటల్లో 12,213 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి 26న 11,499 కేసులు రికార్డు కాగా మళ్లీ ఆ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
ప్రధానంగా మహారాష్ట్రలో కొత్త కేసులు 36శాతం పెరిగి 4,024కు చేరాయి. ఇక కేరళ(1,950), దిల్లీ(1,375), కర్నాటక(648)లలోనూ కేసులు పెరుగుతున్నాయి.
భారత్ మొత్తం మీద కోవిడ్-19 కేసులు 4,32,57,730 చేరగా ప్రస్తుతం 58,215 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి.
ఇప్పటి వరకు దేశంలో 195.67 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.