ధన్యవాదాలు..
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్‌డేట్ల కోసంఈ లింకునుక్లిక్ చేయండి.
‘‘దిల్లీలో జరిగిన సమావేశంలో రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిగా నా పేరును విపక్షాలు సూచించినందుకు ధన్యవాదాలు. అయితే, ఆ అభ్యర్థనను నేను తిరస్కరిస్తున్నాను’’అని శరద్ పవర్ ట్వీట్ చేశారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్‌డేట్ల కోసంఈ లింకునుక్లిక్ చేయండి.
‘అగ్నిపథ్’ స్కీంలో భాగంగా సైన్యంలో పని చేసే ‘అగ్నివీరుల’కు కేంద్ర హోంశాఖ ప్రాధాన్యం ఇస్తుందని ఆ శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.
తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లే భక్తులు ఇకపై టీఎస్ఆర్టీసీ ద్వారా కూడా 300 రూపాయల ప్రత్యేక దర్శనం బుక్ చేసుకోవచ్చు.
నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ట్రిపుల్ ఐటి)లోగత రెండు రోజులుగా విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. ల్యాప్ టాప్‌లు పంపిణీ, నాణ్యమైన భోజనం, యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీ నియామకం వంటి డిమాండ్‌లతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకానికి వ్యతిరేకంగా రాజస్థాన్‌లో కొందరు యువకులు నిరసన చేపట్టారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నాయకుడు షేక్ హుస్సేన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో హుస్సేన్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ను బీజేపీ డిమాండ్ చేసింది.
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు శరద్ పవార్ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించారు.

ఫొటో సోర్స్, ani
బిహార్‌లోని కటియార్‌లో నడుస్తున్న రైలులో నుంచి ఒక మహిళా కానిస్టేబుల్‌ను ఓ వ్యక్తి కిందకు తోసేశాడు.
‘‘అతడు నా ఫోన్‌ను దొంగిలించాలని ప్రయత్నించాడు. నేడు అడ్డుకోవడంతో కదులుతున్న రైలులో నుంచి నన్ను తోసేశాడు’’అని ఆమె చెప్పారు.
‘‘ఆ రైలులో కొంతమంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. రైలులో నుంచి తోసేసిన 20 నిమిషాల తర్వాత కొందరు నన్ను రక్షించారు’’అని ఆమె చెప్పారు.
ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో పండించిన గోదుమలు, అక్కడ తయారు చేసిన గోదుమ పిండిని తమ దేశం నుంచి ఎగుమతి చేయడాన్ని యూఏఈ నిషేధించింది.
మే నెల 13లోపు యూఏఈలోకి దిగుమతి అయిన భారత గోదుమలు లేదా గోదుమ పిండిని ఎగుమతి చేయాలనుకునే వాళ్లు యూఏఈ ఎకానమీ మంత్రిత్వశాఖ అనుమతి తీసుకోవాలని అక్కడి ప్రభుత్వం తెలిపింది.
భారత్‌తో కుదుర్చుకున్న కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ ట్రేడ్ అగ్రిమెంట్‌తో పాటు ఇతర అంతర్జాతీయ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ వెల్లడించింది.
పోయిన నెల 14న గోదుమల ఎగుమతిని నిషేధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలు, ఆహార భద్రత దృష్ట్యా కొన్ని దేశాలకు ఎగుమతులు ఉంటాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు శరద్ పవార్ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించారు.
‘‘దిల్లీలో జరిగిన సమావేశంలో రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిగా నా పేరును విపక్షాలు సూచించినందుకు ధన్యవాదాలు. అయితే, ఆ అభ్యర్థనను నేను తిరస్కరిస్తున్నాను’’అని శరద్ పవర్ ట్వీట్ చేశారు.
దిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో విపక్ష నాయకులు బుధవారం సమావేశమై.. రాష్ట్రపతి ఎన్నికల్లో తమవైపు నుంచి నిలబెట్టే అభ్యర్థిపై చర్చలు జరిపాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపుపై విపక్షాల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
సమావేశం అనంతరం విపక్షాలన్నీ కలిసి శరద్ పవర్ సూచించినట్లు మమతా బెనర్జీ వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
తమిళనాడులోని ఈరోడ్ జిల్లా, కరంగల్‌పాలయంలో ఉన్న ఒక చిన్న కొట్టు ఇడ్లీలకు చాలా ఫేమస్.
మహిళల ఆధ్వర్యంలో ఓ కుటుంబం నడిపే ఈ కొట్టుకు...పెళ్లిళ్లు, పండగల ఆర్డర్లు భారీగా వస్తుంటాయి.
ఈ మహిళలు రోజుకు వెయ్యి నుంచి లక్ష వరకూ ఇడ్లీలను తయారు చేస్తుంటారు. సమయానికి ఆర్డర్లు డెలివరీ చేస్తుంటారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నాయకుడు షేక్ హుస్సేన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో హుస్సేన్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ను బీజేపీ డిమాండ్ చేసింది.
ఈ వివాదంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ బుధవారం మీడియాతో మాట్లాడారు.
‘‘కాంగ్రెస్ తీవ్రమైన నిరాశలో కూరుకుపోయింది. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటిపై షేక్ హుస్సేన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి’’అని ఠాకుర్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మరోవైపు నాగ్‌పుర్‌లో షేక్ హుస్సేన్‌పై కేసు కూడా నమోదు చేశారు. అయితే, తను ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన పనిలేదని మీడియాతో ఆయన అన్నారు. తాను ఒక సామెత మాత్రమే చెప్పానని వివరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
రాష్ట్రపతి ఎన్నికలలో విపక్షాల తరఫున ఉమ్మడిగా ఒక అభ్యర్థిని నిలపాలని నిర్ణయించారని ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది.
పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన సమావేశానికి 16 పార్టీల నేతలు హాజరయ్యారు.
సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.
భారత ప్రజాస్వామ్యానికి, సామాజిక అల్లికకు మోదీ ప్రభుత్వం మరింత నష్టం కలిగించకుండా అడ్డుకోగలిగే... రాజ్యాంగానికి రక్షకుడిగా ఉండే నేతను ఈ పదవికి పోటీ చేయించాలని నిర్ణయించినట్లు సమావేశం అనంతరం సుధీంద్ర కులకర్ణి చెప్పారు.
వివిధ పార్టీలు సమావేశానికి వచ్చాయని, వీరంతా నిర్ణయించే అభ్యర్థికి అందరి మద్దతు ఉంటుందని మమత బెనర్జీ చెప్పారు.
అనేక నెలల తరువాత విపక్షాల నేతలందరం కలిసి చర్చించుకున్నామని, మరోసారి భేటీ అవుతామని ఆమె చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ నేతృత్వంలో సమావేశానికి 16 పార్టీల నేతలు హాజరైనట్లు చెబుతున్నారు.
జేడీ(ఎస్) నేత హెచ్‌డీ దేవే గౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి దీనికి హాజరయ్యారు.
ఇక ఈ సమావేశానికి తాము రావడం లేదని టీఆర్‌ఎస్ పార్టీ ప్రకటించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, Mohar Singh Meena
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకానికి వ్యతిరేకంగా రాజస్థాన్‌లో కొందరు యువకులు నిరసనకు దిగారు.
రాజస్థాన్ నుంచి చాలా ఎక్కువ సంఖ్యలో యువత సైన్యంలో చేరుతూ ఉంటుంది.
ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న యువత, నాలుగేళ్లు మాత్రమే సైన్యంలో ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జైపుర్‌లోని కల్వార్ రోడ్‌లో యువత ఆందోళనకు దిగింది. గంట పాటు ఆ దారిని నిర్బంధించారు.
గత రెండున్నర ఏళ్లుగా సైన్యంలో నియామకాలు చేపట్టలేదని, ఇప్పుడు కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.
ఇలా చేయడం వల్ల యువత భవిష్యత్తుతో పాటు దేశ భద్రత ప్రమాదంలో పడుతుందని యువకులు ఆందోళనవ్యక్తం చేశారు.
వెంటనే అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, ANI
అత్యధిక వేగంగా డేటాను ట్రాన్సఫర్ చేయగల 5జీ స్పెక్ట్రమ్ వేలానికి ప్రభుత్వం తుది అనుమతులు జారీ చేసింది.
ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.
మొత్తం 72097.85 మెగా హెట్జ్ స్పెక్ట్రాన్ని 20 ఏళ్ల కాలానికి వేలం వేయనున్నారు. జులై చివరి నాటికి వేలం వేయనున్నారు.
రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఈ వేలంలో పాల్గొనే అవకాశాలున్నాయి.
5జీ అందుబాటులోకి వస్తే 4జీ కంటే పది రెట్ల వేగంగా డేటా ట్రాన్సఫర్ అవుతుంది.

ఫొటో సోర్స్, ANI
నేషనల్ హెరాల్డ్ కేసులో మూడో రోజు ఈడీ ముందు రాహుల్ గాంధీ హాజరయ్యారు.
సోమవారం సుమారు 11 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ, మంగళవారం కూడా ఎనిమిది గంటలకుపైగా రాహుల్ గాంధీని విచారించింది.
రాహుల్ గాంధీ విచారణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శనలు చేపట్టింది.
ఆయా రాష్ట్రాల నుంచి సీనియర్ కాంగ్రెస్ నేతలు దిల్లీకి చేరుకుని నిరసనలు చేపడుతున్నారు. దీంతో పలు చోట్ల పోలీసులు 144 సెక్షన్ పెట్టారు.
నిరసనలకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లనివ్వకుండా ప్రధాన నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు.
మరొకవైపు ఈడీ కార్యాలయం ముందు నిరసనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు టైర్లు తగుల బెట్టారు.

ఫొటో సోర్స్, UGC
నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ట్రిపుల్ ఐటి)లోగత రెండు రోజులుగా విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి.
ల్యాప్ టాప్‌లు పంపిణీ, నాణ్యమైన భోజనం, యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీ నియామకం వంటి డిమాండ్‌లతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
తాత్కాలిక వీసీల పాలనలో తమ సమస్యలకు పరిష్కారంలభించడం లేదని విద్యార్థులు చెబుతున్నారు.
విద్యార్థుల నిరసనల నేపథ్యంలో క్యాంపస్ మెయిన్ గేట్ వద్ద పోలీసుల బందోబస్తు పెంచారు.
మీడియాను ప్రధాన గేట్ వద్దే నిలువరించారు. మీడియాతో మాట్లాడేందుకు ట్రిపుల్ ఐటి యాజమాన్యం విద్యార్థులను అనుమతించడం లేదు.
నిధుల కొరతతో బాసర ట్రిపుల్ ఐటి ఇబ్బంది పడుతోంది. ఆ ప్రభావం క్యాంపస్‌లోని విద్యా ప్రమాణాలు, పాలన, పరిశోధన, భోజనం, వేతనాలు, పారిశుద్ధ్య నిర్వహణ మీద పడుతోంది.
గత ఎనిమిదేళ్లుగా యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీలేరు. నాలుగేళ్లుగా విద్యార్థులకు కొత్త ల్యాప్ టాప్‌లు ఇవ్వడం లేదు.
విద్యార్థుల సమస్యలన్నీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ట్రిపుల్ ఐటీ వీసీతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
విద్యార్థులను కలవడానికి ప్రయత్నించిన బీజేపీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

ఫొటో సోర్స్, UGC

ఫొటో సోర్స్, UGC

ఫొటో సోర్స్, Facebook/AITMC
రాష్ట్రపతి ఎన్నిలకలకు సంబంధించి దిల్లీలో నేడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశం నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశానికి దేశంలోని అనేక ప్రతిపక్ష పార్టీల నేతలను ఆహ్వానించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థికి పోటీగా ప్రతిపక్షాలన్నీ కలిసి ఒక అభ్యర్థిని నిలబెట్టే అంశం కూడా చర్చలోకి రానుంది.
కానీ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈ సమావేశానికి వచ్చే అవకాశాలు లేవని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాలు చెప్పినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది. అలాగే పార్టీ ప్రతినిధులను కూడా పంపే సూచనలు కూడా లేవని వెల్లడించింది.
ఇక ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ సమావేశానికి రావడం లేదు. రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో ప్రకటించిన తరువాతే ఈ విషయం మీద స్పందిస్తామని ఆప్ వర్గాలు చెబుతున్నాయి.
జనతా దళ్ (ఎస్) నేతలు హెచ్‌డీ దేవే గౌడ, ఆయన కుమారుడు కుమార స్వామి, ఆర్‌ఎల్‌డీ నేత జయంత్ చౌదరి, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ, డీఎంకే నుంచి టీఆర్ బాలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు.
సమాజ్‌వాదీ పార్టీ, ఎన్సీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కూడా ఈ సమావేశానికి వస్తున్నాయి.
బీజూ జనతా దళ్ నేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయ్‌కు కూడా ఆహ్వానం అందింది. కాకపోతే ఆయన వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.