ఆంధ్రప్రదేశ్: ‘ప్రాణానికి ప్రాణమే న్యాయం’ అని పంచాయితీ పెద్దల తీర్పు.. సొంత తమ్ముడిని చంపేసిన అన్నయ్యలు
'మా నాన్న ఎలా చనిపోయాడో.. మీవాడు కూడా అలానే చావాలి. లేకపోతే మీ ఇంట్లోని అందర్నీ చంపేస్తాం’ అంటూ ఒక కుటుంబం వారు.. మరో కుటుంబాన్ని బెదిరించారు. బాధిత కుటుంబ సభ్యులు ఏం చేయాలో తెలియక.. పంచాయతీ పెద్దలను ఆశ్రయించారు. వ్యవహారం మొత్తం విన్న పెద్దమనుషులు.. 'ప్రాణానికి ప్రాణమే' న్యాయమంటూ తీర్పు చెప్పేశారు.
లైవ్ కవరేజీ
మేజర్ మూవీ రివ్యూ: దేశభక్తి పొంగింది, ఎమోషన్ పండింది
నేటి ముఖ్యాంశాలు
- జూన్ 1 నుంచి తిరుమలలో అన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులనూ తిరుమల తిరుపతి దేవస్థానం నిషేధించింది.
- గుజరాత్‌కు చెందిన నేత హార్దిక్ పటేల్ బీజేపీలో చేరారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఆయన ఆ రాష్ట్ర బీజేపీ నేతల సమక్షంలో పార్టీలో చేరారు.
- కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కోవిడ్ సోకినట్లు ఆ పార్టీ నేత రణదీప్ సూర్జేవాలా వెల్లడించారు.
- తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, సినీ నటి దివ్యవాణి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రెండు రోజులుగా సాగుతున్న ఎపిసోడ్ కి తెరదించారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన తాజా అప్‌డేట్ల కోసం ఈ లింకును క్లిక్ చేయండి.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఏం మారింది? యువతీయువకులు ఏం చెబుతున్నారు?
ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

ఫొటో సోర్స్, UGC
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ఆయనతో 45 నిమిషాల పాటు సమావేశం జరిగిందని సీఎంవో ప్రకటించింది.
ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు అంశాలను సీఎం జగన్, ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొంది. రాష్ట్ర రెవెన్యూలోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు సహా పలు అంశాలున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఆయా సమస్యలపై ప్రధానికి వినతిపత్రం సమర్పించినట్లు చెప్పింది.
‘‘కేంద్రం నుంచి రూ.32,625 కోట్లు రెవెన్యూ లోటు ఏపీకి రావాల్సి ఉందని, ఆ నిధులు విడుదల చేయాలని సీఎం కోరారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన రూ.6,627.86 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిల వ్యవహారాన్ని వెంటనే సెటిల్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఏపీకి తక్కువ కేటాయింపులు ఉన్నాయనే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతించాలని కోరారు. వీటితో పాటు భోగాపురం క్లియరెన్స్, కడప స్టీల్ ప్లాంటు కోసం గనుల కేటాయింపు గురించి కూడా ప్రధాని మోదీకి జగన్ వినతిపత్రంల సమర్పించారని’’ సీఎంవో వెల్లడించింది.

ఫొటో సోర్స్, UGC
ఆంధ్రప్రదేశ్: ప్రాణానికి ప్రాణం అని పంచాయితీ పెద్దల తీర్పు.. సొంత తమ్ముడిని చంపేసిన అన్నయ్యలు, లక్కోజు శ్రీనివాస్, బీబీసీ కోసం

'మా నాన్న ఎలా చనిపోయాడో.. మీవాడు కూడా అలానే చావాలి. లేకపోతే మీ ఇంట్లోని అందర్నీ చంపేస్తాం’ అంటూ ఒక కుటుంబం వారు.. మరో కుటుంబాన్ని బెదిరించారు. బాధిత కుటుంబ సభ్యులు ఏం చేయాలో తెలియక.. పంచాయతీ పెద్దలను ఆశ్రయించారు. వ్యవహారం మొత్తం విన్న పెద్దమనుషులు.. 'ప్రాణానికి ప్రాణమే' న్యాయమంటూ తీర్పు చెప్పేశారు.
ఈ దారుణ సంఘటనకు సంబంధించి పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి వెల్లడించిన వివరాలు ఆమె మాటల్లోనే...
'పెళ్ళి వేడుకలో వివాదం'
సీతంపేట మండలం రేగులగూడలో మే 27న జరిగిన ఓ పెళ్లి జరిగింది.
ఈ వేడుకలో గ్రామానికి చెందిన సవర గయా(60) కుమార్తె పద్మను.. ఉసిరికిపాడుకు చెందిన మతిస్థిమితం లేని సవర సింగన్న(33) కర్రతో కొట్టాడు.
ఈ విషయం తెలుసుకున్న గయా వచ్చి.. సింగన్నను కిందకు తోసేశాడు. దీంతో.. మతి స్థిమితం లేని సింగన్న కోపంతో గయాపై కర్రతో దాడిచేశాడు. గయా అక్కడికక్కడే మృతిచెందాడు.
మర్నాడు గయా కుమారులు, స్థానికులు.. సింగన్న కాళ్లు, చేతులు కట్టేసి ఓ ఇంట్లో బంధించారు. అతని కుటుంబసభ్యులు, గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. అంతా వచ్చాక పంచాయతీ నిర్వహించి, తమ తండ్రి ఎలా చనిపోయాడో.. సింగన్న కూడా అలాగే చావాలని డిమాండ్ చేశారు. లేకపోతే అందర్నీ చంపేస్తామని బెదిరించారు.
దీంతో.. సింగన్న ఇద్దరు అన్నయ్యలు, కుటుంబ సభ్యులు పెద్దలను ఆశ్రయించారు.
‘ప్రాణానికి ప్రాణం’ అని తీర్పు...
వ్యవహారం మొత్తం విన్న పెద్దమనుషులు.. 'ప్రాణానికి ప్రాణమే' న్యాయమంటూ తీర్పు చెప్పేశారు.
కుటుంబంలో అందరి ప్రాణాలు తీస్తారని భయపడిన సింగన్న కుటుంబసభ్యులు.. పెద్దలు చెప్పిన తీర్పు అమలుకు అంగీకరించారు.
ఈనెల 28న సింగన్నకు కల్లులో నాగుపాము విషం కలిపి ఇచ్చారు ఆయన అన్నయ్యలు. అయితే సింగన్న మరణించాడో లేదో అనే అనుమానంతో గయా కుమారులు సింగన్నకు ఉరేశారు. ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా శవాన్ని కాల్చేశారు.
గయా, సింగన్న మరణాలు సాధారణమైనవని మొదట భావించినా.. గ్రామంలోని రెవెన్యూ సిబ్బంది, వాలంటీర్ల ద్వారా సమాచారం తెలుసుకుని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేశాం.
రెండు రోజుల్లో మిస్టరీని ఛేదించాం. హత్యలకు ప్రేరేపించినవారు, హత్య చేసిన సింగన్న అన్నయ్యలు, పంచాయతీ నిర్వహించిన పెద్దలు.. ఇలా మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేశాం.
టీటీడీ: తిరుమలలో పూర్తిస్థాయి ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి.. భక్తులు, వ్యాపారులు ఏమంటున్నారు?
జానీ డెప్-అంబర్ హెర్డ్: మాజీ భార్యపై కేసు గెలిచి, నష్టపరిహారంగా రూ. 80 కోట్లు పొందిన హాలీవుడ్ నటుడు
టీడీపీకి దివ్యవాణి రాజీనామా : పార్టీ వీడడానికి ఆమె చెబుతున్న కారణాలివే, వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం

ఫొటో సోర్స్, Divya Vani TDP
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, సినీ నటి దివ్యవాణి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రెండు రోజులుగా సాగుతున్న ఎపిసోడ్ కి తెరదించారు.
తొలుత తాను టీడీపీని వీడుతున్నట్టు ట్విట్టర్ లో ప్రకటించిన ఆమె ఆ తర్వాత వెనక్కి తగ్గారు. పార్టీ అధినేత పిలుపుతో నేరుగా చంద్రబాబుతో భేటీ అయ్యారు. కానీ వారి సమావేశం తర్వాత కూడా ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు.
గురువారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తన రాజీనామాకు కారణాలు వెల్లడించారు. టీడీపీ అధికార ప్రతినిధి పదవికి, ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన రాజీనామా లేఖను టీడీపీ అధిష్టానానికి పంపించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దివ్యవాణి పలువురు టీడీపీ నేతల మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. నా బాధను మీడియాతో పంచుకోవడమే నేను చేసిన తప్పా..? అంటూ ఆమె ప్రశ్నించారు.
"అచ్చెన్నాయుడు లా పార్టీ లేదు, -- లేదు అన్నానా.. సాధినేని యామినిలా విమర్శలు చేశానా. నన్ను తప్పుబట్టిన వాళ్లు అచ్చెన్నని ఏం శిక్షించారు" అంటూ ఆమె నిలదీశారు. "నాలాగా పార్టీలో ఇబ్బందులు పడేవారు చాలా మంది ఉన్నారు.. కానీ వాళ్లకు పదవులు అవసరం కాబట్టి -- పడి ఉంటున్నారు. నారీ-భేరీకి మేకప్ వేసుకుని కూర్చొవడం నాకు రాదు. చంద్రబాబు నాకు తండ్రిలాంటి వారు. ఆయన సతీమణి మీద విమర్శలు రాగానే నేనే ముందుగా కౌంటర్ ఇచ్చాను. అయినా గానీ గౌరవం లేని చోట ఉండలేను. అందుకే పార్టీకి రాజీనామా లేఖ పంపించాను." అంటూ వెల్లడించారు.
"మతమార్పిడుల విషయంలో చంద్రబాబు చేసిన కామెంట్లు క్రైస్తవులు ఆగ్రహనికి గురయ్యారు. క్రైస్తవులు పడే బాధలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లలేకపోయాను. నేను ఇచ్చిన సమాచారంతో వేరే వారితో ప్రెస్ మీట్ పెట్టించారు.. నేను చాలా బాధ పడ్డాను.నెమ్మదిగా టీడీపీలో నా డౌన్ ఫాల్ మొదలైంది. ప్రెస్ మీట్లు పెట్టడానికి నలుగురు దగ్గరకు తిప్పుతున్నారు. టీడీ జనార్జన్ అనే వ్యక్తిని ప్రశ్నించినందుకే నన్ను ఇబ్బందులు పెట్టారు. నన్ను కుక్క పిల్లలా ఆడుకున్నారు. కరివేపాకులా వాడుకుని వదిలేస్తారని నాకు చాలా మంది చెప్పినా వినలేదు. మహానాడు వేదిక మీద కూర్చొవడానికి వీల్లేకుండా చేశారు.. మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు" అంటూ వాపోయారు.
జగన్ ప్రభుత్వం మీద తాను విమర్శలు చేసినా.. తనను ఏనాడూ ఇబ్బంది పెట్టలేదంటూ దివ్యవాణి వ్యాఖ్యానించారు.
దివ్యవాణి రాజీనామాపై టీడీపీ నేతలు ఇప్పటి వరకూ అధికారికంగా స్పందించలేదు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం.. లోక్‌సభలో బిల్లు పెట్టిన రోజు ఏం జరిగింది? ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో సుష్మా స్వరాజ్ పాత్ర ఏంటి?
80వ పడిలోకి ఇళయరాజా

ఫొటో సోర్స్, Facebook/Ilaiyaraaja
ఇళయరాజా... సంగీత ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. మ్యూజిక్ మ్యాస్ట్రో అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఇళయరాజా నేటితో 80వ పడిలోకి అడుగు పెట్టారు.
బ్రిటిష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీలో 1943 జూన్ 2న జన్మించారు ఇళయరాజా. ఆయన సంగీత ప్రస్థానం 1970లలో ప్రారంభమైంది. సుమారు 4 దశాబ్దాల కెరియర్‌లో అనేక తరాల వారిని ఇళయరాజా అలరించారు.
తెలుగు సినిమాతో ఇళయరాజాకు ఎంతో అనుబంధం ఉంది. చిరంజీవి నుంచి నాని వరకు వివిధ తరాల హీరోల సినిమాలకు ఆయన సంగీతం అందించారు.
మద్రాసు ప్రెసిడెన్సీలోని థేనీ జిల్లాలో గల పన్నియపురంలో ఇళయరాజా జన్మించారు. ఆయనకు వరదరాజన్, గంగై అమరన్ అనే ఇద్దరు సోదరులున్నారు.
ఆరోజుల్లో వరదరాజన్, కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో సంగీత ప్రదర్శనలు ఇస్తూ ఉండేవారు. ఇళయరాజా కూడా ఆ కచేరీల్లో పాల్గొంటూ ఉండేవారు. నాడు కచేరీలు చేస్తున్న సందర్భంలో పరిచయలు పెంచుకుని తద్వారా సినిమాల్లోకి ఇళయరాజా ప్రవేశించారు.
ఇళయరాజా అసలు పేరు జ్ఞానదేశికన్. ఆ తరువాత సంగీతం నేర్చుకునే రోజుల్లో ధనరాజ్ మాస్టర్, ఆయన పేరును 'రాజా'గా మార్చారు. చివరకు సినీ నిర్మాత పంచు అరుణాచలం ఆయనకు 'ఇళయరాజా' అనే పేరు పెట్టారు. 'అన్నాకిలి' సినిమా ద్వారా ఇళయరాజాను సినిమా ప్రపంచానికి పరిచయం చేశారు అరుణాచలం.
సినిమాల్లోకి రాకముందు ఇళయరాజా చిన్నచిన్న ప్రదర్శనలు ఇస్తూ ఉండేవారు. తన ఊరిలోనూ గ్రామస్థుల కోసం సాయంత్రం పూట కచేరీ పెట్టే వారు.
తమిళ సినిమాల్లో కర్నాటక సంగీత రాగమైన రీతిగౌలను ప్రవేశపెట్టిన తొలి మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.
ఇళయరాజాకు ఆధ్యాత్మిక చింత కూడా ఎక్కువే. సమయం దొరికినప్పుడల్లా తిరువన్నమలైలోని రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్తుంటారు.
జమ్ముకశ్మీర్: బ్యాంక్ మేనేజర్‌ను కాల్చి చంపిన మిలిటెంట్లు
జమ్ముకశ్మీర్‌లో మిలిటెంట్లు ఓ బ్యాంక్ మేనేజర్‌ను హత్య చేశారు.
కుల్‌గామ్‌లోని అరే మోహన్‌పొరా ప్రాంతంలో ఉన్న ఎల్లఖీ దేహతీ బ్యాంకులో గురువారం ఉదయం కొందరు ప్రవేశించారు.
ఆయుధాలతో వచ్చిన వారు బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్‌పై కాల్పులు జరిపారు.
తీవ్రంగా గాయపడిన విజయ్ కుమార్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు.
మృతుడిది రాజస్థాన్.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సోనియా గాంధీకి కోవిడ్ పాజిటివ్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కోవిడ్ సోకినట్లు ఆ పార్టీ నేత రణదీప్ సూర్జేవాలా వెల్లడించారు.
స్వల్ప జరం, ఇతర కోవిడ్ లక్షణాలతో ఆమె బాధపడుతున్నారని ఆయన చెప్పారు.
ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉన్నారని.. వైద్యం అందుతోందని తెలిపారు.
కాగా సోనియా గాంధీ జనవరి 8న ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్
గుజరాత్‌కు చెందిన నేత హార్దిక్ పటేల్ బీజేపీలో చేరారు.
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఆయన ఆ రాష్ట్ర బీజేపీ నేతల సమక్షంలో పార్టీలో చేరారు.
హార్దిక్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడారు.
ఒకప్పుడు మోదీని తీవ్రంగా విమర్శించిన హార్దిక్ కొద్దికాలంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలను సమర్థిస్తూ వస్తున్నారు.
తాజాగా ఆయన బీజేపీలో చేరారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రష్యా సైనికులు చిత్రహింసలు పెడుతున్నారు: యుక్రెయిన్ పౌరులు
నడుము నొప్పి వస్తోందా? క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చు
దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

ఫొటో సోర్స్, ani
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గురువారం మొత్తం 3,712 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ముందురోజు బుధవారం 2,745 కేసులు నమోదు కాగా ఒక్క రోజులోనే సుమారు వెయ్యి కేసులు పెరిగాయి.
రోజువారీ కేసుల సంఖ్య 3 వేలు దాటడం గత మూడు వారాల్లో ఇదే తొలిసారి.
మే 9న 3,207 కేసులు నమోదైన తరువాత క్రమంగా కేసుల సంఖ్య తగ్గడం మొదలైంది. తాజాగా మళ్లీ కేసుల సంఖ్య పెరిగింది.
ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 19,509 కాగా 2,584 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే కొట్టారంటూ ఇంజినీరు ఫిర్యాదు

ఫొటో సోర్స్, Facebook/Jakkampudi Raja
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వివాదంలో చిక్కుకున్నారు.
నీటిపారుదలకు సంబంధించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే తనను కొట్టారంటూ ఏఈఈ సూర్యకిరణ్, రాజమండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పుష్కర ఎత్తిపోతల పథకం రివ్యూ సమయంలో ఇతర అధికారుల సమక్షంలో తన మీద చేయి చేసుకున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన వివరణకు ఎమ్మెల్యే ఆగ్రహం చెంది మూడు సార్లు చెంపదెబ్బ కొట్టారని సూర్య కిరణ్ తెలిపారు.
జక్కంపూడి రాజా తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షునిగా కూడా ఉన్నారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు కుమారుడైన జక్కంపూడి రాజా 2019లో రాజానగరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
పెద్ద నోట్లను రద్దు చేసి ఆరేళ్లయినా ఇంకా నకిలీ కరెన్సీ ఎందుకు ఉంది
తిరుమలకు ఏ వస్తువులు తీసుకెళ్లొచ్చు... ఏవి తీసుకెళ్లకూడదు?
జూన్ 1 నుంచి తిరుమలలో అన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులనూ తిరుమల తిరుపతి దేవస్థానం నిషేధించింది.
తిరుమలలోని దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులతో జరిగిన సమావేశంలో బుధవారం నుంచి సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులు ఎలాంటి వస్తువులు తీసుకురాకూడదు? తిరుమలలో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి? వంటి వివరాలను టీటీడీ ఎస్టేట్ అధికారి మల్లికార్జున బీబీసీకి వివరించారు.
పోస్ట్ YouTube స్కిప్ చేయండిGoogle YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
