శ్రీలంక సంక్షోభం: పెట్రోల్ నిల్వలు ఒక రోజుకే సరిపోతాయి – కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘె

ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు సెంట్రల్ బ్యాంకు కొత్తగా కరెన్సీని ముద్రిస్తుందని శ్రీలంక కొత్త ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘె వివరించారు. ప్రభుత్వ విమానయాన సంస్థను కూడా ప్రైవేటు చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

లైవ్ కవరేజీ

ఆలమూరు సౌమ్య

  1. ధన్యవాదాలు..

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

    రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్‌డేట్ల కోసంఈ లింకునుక్లిక్ చేయండి.

  2. నరేంద్ర మోదీ నేపాల్ కొత్త విమానాశ్రయంలో ఎందుకు అడుగుపెట్టలేదు?

  3. నేటి ముఖ్యాంశాలు

    రష్యా చమురు ఎగుమతులపై ఆంక్షలు విధిస్తేయూరప్ భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు.

    ఆర్థిక సంక్షోభం నడుమ పెట్రోల్ నిల్వలు ఒక రోజుకు సరిపడా మాత్రమే ఉన్నాయని శ్రీలంక కొత్త ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘె వెల్లడించారు.

    జ్ఞాన్‌వాపి మసీదు సర్వేలో అడ్వొకేట్ కమిషనర్‌గా వ్యవహరించిన అజయ్ కుమార్ మిశ్రను ఆ పదవి నుంచి జిల్లా న్యాయస్థానం తొలగించింది.

    కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం ఇంటిలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు సోదాలు నిర్వహించారు.

  4. , యుక్రెయిన్ సంక్షోభం: యూరప్ భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు – పుతిన్ హెచ్చరిక

    పుతిన్

    ఫొటో సోర్స్, EPA

    రష్యా చమురుపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధిస్తే ఐరోపా దేశాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు.

    ఆంక్షలు విధించొచ్చనే ఆందోళన నడుమ ఇప్పటికే ధరలు పెరిగాయనే సంగతిని ఆయన గుర్తుచేశారు.

    రష్యా చమురు సంస్థలు, ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి ప్రభుత్వ టీవీ ఛానెల్‌లో పుతిన్ మాట్లాడారు.

    రాజకీయ లక్ష్యాలతో రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాలని చూస్తున్నాయని పుతిన్ వ్యాఖ్యానించారు.

    ‘‘కొన్ని యూరప్ దేశాలు చమురు కోసం రష్యాపై భారీగా ఆధారపడుతున్నాయి. ఆ దేశాలు రష్యాను పూర్తిగా దూరంగా పెట్టడం అసాధ్యం’’అని పుతిన్ వ్యాఖ్యానించారు.

  5. రెండు అడుగులే ఉన్నావు ఉద్యోగానికి పనికిరావన్నారు.. ఆమె ఏం చేశారంటే..

  6. జ్ఞాన్‌వాపి మసీదు కేసు: అడ్వొకేట్ కమిషనర్ అజయ్ కుమార్ మిశ్రను తొలగించిన కోర్టు

    అడ్వొకేట్ కమిషనర్ అజయ్ కుమార్ మిశ్ర

    ఫొటో సోర్స్, Ani

    ఫొటో క్యాప్షన్, అడ్వొకేట్ కమిషనర్ అజయ్ కుమార్ మిశ్ర

    జ్ఞాన్‌వాపి మసీదు పరిసరాల్లో సర్వే కోసం నియమించిన అజయ్ కుమార్ మిశ్రను అడ్వొకేట్ కమిషనర్పదవి నుంచి కోర్టు తొలగించింది.

    అజయ్ కుమార్ మిశ్ర పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని మసీదును పర్యవేక్షించే అంజుమాన్ ఇంతేజామియాకమిటీ తరఫు నాయవాది వారణాసి జిల్లా కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు చర్యలు తీసుకుంది. ఇదివరకు కూడా అజయ్ కుమార్‌ను ఈ పదవి నుంచి తొలగించాలని ఫిర్యాదులు వచ్చాయి.

    సర్వేకు సంబంధించి రెండు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కొత్త అడ్వొకేట్ కమిషనర్ విశాల్ సింగ్‌కు కోర్టు సూచించింది. వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలపై మే 12న జ్ఞాన్‌వాపి మసీదు పరిసరాల్లో సర్వే మొదలైంది. మూడు రోజులపాటు ఈ సర్వే కొనసాగింది.

    మూడో రోజు మసీదు పరిసరాల్లో శివలింగం కనిపించిందని వార్తలు వచ్చాయి. దీంతో ఆ ప్రాంతాన్ని వెంటనే సీల్ చేయాలని కోర్టు సూచించింది. అయితే, అది శివ లింగంకాదని, కేవలం ఫౌంటెయిన్ మాత్రమేనని మసీదు తరఫు న్యాయవాదులు చెబుతున్నారు.

    అయితే, తను కోర్టు గోప్యతకు భంగం కలిగించే పనులేమీ చేయలేదని అజయ్ కుమార్ మీడియాతో చెప్పారు.

    ‘‘నాతోపాటు వచ్చిన ఫోటోగ్రాఫర్ సమాచారాన్ని లీక్ చేశారని విశాల్ సింగే ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన మోసాన్ని నేను ఎప్పటికీ మరచిపోను’’అని అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.

  7. శ్రీలంక సంక్షోభం: పెట్రోల్ నిల్వలు ఒక రోజుకే సరిపోతాయి – కొత్త ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘె

    శ్రీలంక

    ఫొటో సోర్స్, REUTERS

    శ్రీలంకలో పెట్రోల్ నిల్వలు ఒక రోజుకు సరిపడా మాత్రమే ఉన్నాయని కొత్తగా ప్రధాన మంత్రి బాధ్యతలు తీసుకున్న రణిల్ విక్రమసింఘె చెప్పారు.

    శ్రీలంక ప్రజలను ఉద్దేశించి టీవీలో ఆయన మాట్లాడారు. నిత్యావసరాలను దిగుమతి చేసుకునేందుకు తమ దేశానికి 75 మిలియన్ డాలర్లు (రూ.581 కోట్లు) అవసరమని ఆయన చెప్పారు.

    ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు సెంట్రల్ బ్యాంకు కొత్తగా కరెన్సీని ముద్రిస్తుందని ఆయన వివరించారు. ప్రభుత్వ విమానయాన సంస్థను కూడా ప్రైవేటు చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

    ఇంధన ధరల పెరుగుదల, కోవిడ్-19 సంక్షోభం, రష్యా-యుక్రెయిన్ యుద్ధం తదితర పరిణామాల నడుమ శ్రీలంక గత 70ఏళ్లలో ఎన్నడూచూడని సంక్షోభం ఎదుర్కొంటోంది.

  8. చేతనా రాజ్: బరువు తగ్గించుకునే శస్త్రచికిత్స తరువాత మరణించిన కన్నడ నటి, అసలేం జరిగింది?

  9. వారణాసి: విశ్వనాథ మందిరం, జ్ఞాన్‌వాపి మసీదు పక్కపక్కనే ఎలా నిర్మించారు?

  10. రాజ్యసభకు వైసీపీ అభ్యర్థుల ప్రకటన.. చిరంజీవి ఆచార్య నిర్మాతకు, ఇద్దరు తెలంగాణ వారికి ఎంపీ పదవులు ఎందుకు ఇచ్చారంటే..

  11. వంటగది అపరిశుభ్రత వల్లే అనేక జబ్బులు... సాధారణంగా చేసే 9 తప్పులు, సరిదిద్దుకునే మార్గాలు

  12. తాజ్‌మహల్‌ బేస్‌మెంట్లో మూసేసిన ఆ 22 గదుల్లో దాగిన రహస్యాలేంటి?

  13. ఆన్‌లైన్ గేమ్సా... జూద క్రీడలా?

  14. తెలంగాణలో ఆ జిల్లా ప్రైవేటు ఆసుపత్రుల్లో వెయ్యికి 928 మందికి సిజేరియన్లే

  15. సీబీఐ సోదాలు: ‘‘ఆ టైమింగ్ చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది’’ - చిదంబరం

    చిదంబరం

    ఫొటో సోర్స్, ANI

    కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు మంగళవారం ఉదయం తన ఇళ్లలో సోదాలు నిర్వహించడంపై ట్విటర్ వేదికగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం స్పందించారు.

    ‘‘ఈ రోజు ఉదయం చెన్నై, దిల్లీల్లోని మా ఇళ్లలో సీబీఐ బృందం సోదాలు చేపట్టింది. అధికారులు నాకు ఒక ప్రాథమిక విచారణ నివేదిక (ఎఫ్ఐఆర్) చూపించారు. కానీ, అందులో నిందితుడిగా నా పేరు పేర్కొనలేదు. వారు చేపట్టిన సోదాల్లో ఏమీ దొరకలేదు. వారు ఏమీ స్వాధీనం చేసుకోలేదు. అయితే, వారు అంత తెల్లవారుజామున సోదాలకు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది’’అని చిదంబరం వ్యాఖ్యానించారు.

    అక్రమ ఆస్తుల కేసులో చిదంబరం కుమారుడు, లోక్‌సభ ఎంపీ కార్తి చిదంబరంపై సీబీఐ అధికారులు కొత్త కేసు నమోదు చేశారని సీబీఐ వర్గాలు పీటీఐతో చెప్పాయి. ఈ కేసుకు సంబంధించే తాజా సోదాలు జరిగినట్లు పేర్కొన్నాయి.

    మరోవైపు ఈ అంశంపై కార్తి చిదంబరం కూడా స్పందించారు.

    ‘‘ఎన్నిసార్లు మా ఇంటిలో సోదాలు చేపట్టారో నాకు గుర్తు కూడా లేదు. ఇప్పుడు మరోసారి మళ్లీ’’అని ఆయన ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. భారతదేశంలో ఇప్పటికీ కొడుకే పుట్టాలని కోరుకునే వారే ఎక్కువ.... జాతీయ సర్వేలో మనసు విప్పిన జంటలు

  17. యుక్రెయిన్‌లో యుద్ధం: మరియుపూల్‌లోని అజోవ్‌స్టాల్ స్టీల్ వర్క్స్‌లో సైనికులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు

    యుక్రెయిన్‌లో యుద్ధం

    ఫొటో సోర్స్, REUTERS

    ఫొటో క్యాప్షన్, గాయపడిన వారిని తరలిస్తున్న దృశ్యం

    మరియుపూల్‌లోని అజోవ్‌స్టాల్ స్టీల్ వర్క్స్‌లో రెండు నెలలుగా చిక్కుకున్న వందల మంది సైనికులను సురక్షిత ప్రాంతానికి తరలించామని యుక్రెయిన్ తెలిపింది.

    అజోవ్‌స్టాల్ ప్లాంట్‌కు చెందిన 264 మంది సైనికులను డాన్‌బాస్ ప్రాంతానికి తరలించినట్లు యుక్రెయిన్ రక్షణ శాఖ చెప్పింది. వీరిలో 53 మంది సైనికులు బాగా గాయపడ్డారని తెలిపింది. తమ దేశ హీరోలు బతికే ఉండాలని ఆ దేశ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ అన్నారు.

    మరోవైపు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, యుద్ధానికి సంబంధించి రోజువారీ వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తున్నారని, జూనియర్ ఆఫీసర్లు తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా ఆయనే తీసుకుంటున్నారని పశ్చిమ దేశాల సైనిక వర్గాలు చెబుతున్నాయి. అంటే, రష్యా వ్యూహాలు అనుకున్న ప్రకారం సాగట్లేదని, ఎదురుదెబ్బలతో పుతిన్ విసిగిపోతున్నారని వారిలో ఒకరు బీబీసీతో చెప్పారు.

  18. 'మతాంతర వివాహం చేసుకున్నందుకే మా ఇల్లు కూలగొట్టారు'

  19. ఎల్‌ఐసీ: ఇన్వెస్టర్లకు తొలిరోజే నిరాశ ఎదురైంది.. 8.11 శాతం నష్టంతో లిస్టింగ్

    LIC

    ఫొటో సోర్స్, Getty Images

    దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) షేర్లు ఆఫర్ ధరతో పోలిస్తే 8.11 శాతం నష్టంతో లిస్టయ్యాయి.

    మంగళవారం నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్(NSE), బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్(BSE)లలో ఎల్ఐసీ షేర్లు నమోదయ్యాయి.

    ఎల్ఐసీ షేర్లు NSEలో రూ. 872 వద్ద, BSEలో రూ. 867.20 వద్ద నమోదయ్యాయి. ప్రారంభ ఇష్యూ ధర కన్నా ఈ ధర చాలా తక్కువ.

    ఐపీఓ ప్రారంభించిన సమయంలో ఎల్ఐసీ షేర్లను రూ.949 వద్ద విక్రయించారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.20,557 కోట్లు లభించాయి.

    ఎల్‌ఐసీ పాలసీదారులు షేరుకు రూ.889 చెల్లించగా, రిటైల్ ఇన్వెస్టర్లు రూ.904 చెల్లించాల్సి వచ్చింది. ప్రభుత్వం, ఎల్‌ఐసీలో తన వాటాలో 3.5 శాతాన్ని విక్రయించింది.

  20. ఎల్ఐసీ: రూ. 872 వద్ద ప్రారంభమైన షేర్ల ట్రేడింగ్

    ఎల్ఐసీ

    ఫొటో సోర్స్, Getty Images

    లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) షేర్లు ఈరోజు స్టాక్ మార్కెట్లో నమోదు అయ్యాయి. రూ. 872 వద్ద ప్రారంభమైన షేరు ధర రూ. 900కు అటూ ఇటుగా ట్రేడ్ అవుతోంది. ఆఫర్ ధర రూ. 949తో పోలిస్తే 3 నుంచీ 4 శాతం తక్కువగా ట్రేడ్ అవుతోంది.

    ఈరోజు ఉదయం నుంచీ మదుపరులు ఆతృతగా ఎల్ఐసీ లిస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎల్ఐసీ స్టాక్ రూ. 900 - రూ. 949 మధ్యలో లిస్ట్ అయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు.

    ఎల్‌ఐసీ ఐపీఓ మే 4న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఐపీఒకు పెట్టుబడిదారుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఎల్ఐసీ ఆఫర్‌ చేసిన షేర్లకు దాదాపు మూడు రెట్లు అధికంగా స్పందన లభించింది. షేర్లు కొనుగోలు చేసినవారిలో పాలసీదారులు కూడా ఉన్నారు.

    ఈ ఉదయం స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. గత కొద్ది రోజులుగా నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్ సోమవారం, మంగళవారం లాభాల బాట పట్టింది.