నేటి ముఖ్యాంశాలు
భారతదేశంలో అమలు చేసిన సంస్కరణలను చూస్తే ఇక్కడ పెట్టుబడులు పెట్టలేని వారంతా అవకాశాన్ని కోల్పోయినట్లే" అని కోపెన్‌హాగెన్ ఇండియా -డెన్మార్క్ బిజినెస్ ఫారంలో ప్రధాని మోదీ అన్నారు.
సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 12 -17 సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు ఇచ్చే కరోనా వ్యాక్సీన్ కోవోవేక్స్ ధరను రూ. 900 నుంచి రూ. 225కి తగ్గించింది.
భారతదేశంలో 2020లో మొత్తం 81.2 లక్షల మరణాలు చోటు చేసుకున్నట్లు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా డేటా చెబుతోంది. 2020లో కరోనా కారణంగా 1.48 లక్షల మంది మరణించగా, 2021లో 3.32 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈద్ శుభాకాంక్షలు తెలిపేందుకు పలువురు బాలీవుడ్ నటులు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు.
యుక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం గురించి మాట్లడటానికి తాను రష్యా వస్తానని సందేశం పంపినప్పటికీ ఆ దేశం నుంచి జవాబు రాలేదని పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు.
రంజాన్ ప్రార్థనల సందర్భంగా కాకినాడలో శ్రీ భోగి గణపతి పీఠం నిర్వాహకులు ఈద్గా వద్ద ప్రార్థనలకు హాజరయ్యారు. ముస్లింలకు మజ్జిగ పంపిణీ చేశారు.
రాహుల్ గాంధీ పర్యటనకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగానికి చెందిన కార్యకర్తలు ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనకు దిగారు. రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేశారు.
అమెరికా సుప్రీం కోర్టు అబార్షన్ చేయించుకునే హక్కును కొట్టివేస్తుందనే వార్తలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి. అబార్షన్ చేయించుకునే హక్కును రాజ్యాంగం ఇస్తోందంటూ 1973లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
అబార్షన్ కోసం వేరే ప్రాంతాలకు ప్రయాణించే ఉద్యోగులకు ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ కింద ప్రతి ఏడాది 4 వేల డాలర్ల వరకు అంటే సుమారు రూ.3 లక్షలు ఇవ్వనున్నట్లు అమెజాన్ ప్రకటించింది.
పర్యావరణ మార్పులపై పోరాటానికి భారత్‌కు రూ.78 వేల కోట్లు సాయం అందిస్తామని జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ సోల్జ్ ప్రకటించారు.
కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలంటూ వ్యక్తులను బలవంతం చేసే హక్కు ఎవరికీ లేదని సుప్రీం కోర్టు ప్రకటించింది.
ఈ ఏడాది మార్చిలో దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే రెండో అత్యంత రద్దీ ఎయిర్‌పోర్ట్‌గా నిలిచింది. అమెరికాకు చెందిన అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు తొలి స్థానంలో ఉంది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.




















