భారత ముస్లింలు హజ్ యాత్రకు రావచ్చునన్న సౌదీ అరేబియా.. ఇండియా కోటా 79,237 మంది

హజ్ యాత్రికులు ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకోవటం, కోవిడ్ వ్యాక్సిన్లు రెండూ తీసుకోవటం తప్పనిసరి అని సౌదీ అరేబియా ప్రభుత్వం చెప్పినట్లు అధికారులు తెలిపారు.

లైవ్ కవరేజీ

వరికూటి రామకృష్ణ & పృథ్వీరాజ్

  1. శివసేనతో పెట్టుకుంటే 20 అడుగుల గొయ్యి తీసి పాతేస్తాం: సంజయ్ రౌత్

  2. ఔరంగజేబ్ నిజంగానే హిందువులను ద్వేషించారా?

  3. నవనీత్ కౌర్ రానా: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను ఢీకొడుతున్న తెలుగు మాజీ హీరోయిన్

  4. కోవిడ్‌తో 505 రోజులు పోరాడిన వ్యక్తి

  5. ఈనాటి ముఖ్య పరిణామాలు...

    • భారత ముస్లింలు ఈ ఏడాది హజ్ యాత్ర చేపట్టవచ్చునని సౌదీ అరేబియా భారతదేశానికి తెలిపింది. భారతీయ హజ్ యాత్రికుల కోటాను 79,237 మందిగా నిర్ణయించింది.
    • యుక్రెయిన్‌లో ఫిబ్రవరి 24వ తేదీన యుద్ధం మొదలైనప్పటి నుంచీ ఇప్పటి వరకూ సుమారు 51,33,747 మంది ప్రజలు ఆ దేశం విడిచి పారిపోయారని ఐక్యరాజ్యసమితి హైకమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ తెలిపింది.
    • భారత క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు ఇర్ఫాన్ పఠాన్ చేసిన ఒక ట్వీట్, దానికి జవాబుగా క్రికెటర్ అమిత్ మిశ్రా చేసిన ట్వీట్ వైరల్ అయ్యాయి.
    • మంగోలియాలో జరుగుతున్న ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ 2022 పోటీల్లో శుక్రవారం నాడు భారత రెజ్లర్లు అన్షు మాలిక్, రాధికలు తమ తమ విభాగాల్లో రజత పతకాలు గెలుచుకున్నారు.
    • ఇండొనేసియా పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధించింది. దీంతో భారత్‌తో పాటు ప్రపంచమంతటా వంట నూనెల ధరలు పెరగనున్నాయి.
    • రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే విషయంలో పార్టీలో కొన్ని సందేహాలున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్వజయ్ సింగ్ పేర్కొన్నారు.
    • నీరవ్ మోదీ, విజయ్ వాల్యాలను భారత్‌కు అప్పగించాలని తమ ప్రభుత్వం ఆదేశించినట్లు.. భారత్‌లో పర్యటిస్తున్న బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు. బోరిస్ జాన్సన్ ప్రధాని మోదీతో సమావేశమై ద్వైపాక్షిక వాణిజ్యం, ఒప్పందాలపై చర్చలు జరిపారు.
    • ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు ఈ నెల 27వ తేదీ విచారణకు హాజరుకావాలని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ నోటీసులు జారీ చేశారు.
    • తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య కేసులో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌కు తెలంగాణ హై కోర్టు నోటీసులు జారీ చేసింది.
    • కర్నాటక రాష్ట్రంలోని పాఠశాలల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధించడంపై కోర్టులో సవాలు చేసిన ఇద్దరు అమ్మాయిలు మరొకసారి వార్తల్లోకి వచ్చారు. ప్రీ యూనివర్సిటీ పరీక్షలు రాసేందుకు హిజాబ్ ధరించి వచ్చిన ఆలియా, రేష్మాలను అధికారులు లోపలకు అనుమతించలేదు.
    • గత ఏడాది దిల్లీలో జరిగిన హిందూ యువ వాహిని సమావేశంలో విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో దిల్లీ పోలీసుల తీరుపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
    • ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సప్పెన్షన్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. వెంటనే ఆయన్ను సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

    ఈరోజు ఇప్పటివరకూ జరిగన ముఖ్య పరిణామాలు ఇవీ.

    ఇంతటితో నేటి బీబీసీ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం.

    యుక్రెయిన్ యుద్ధం మీద తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీని ఫాలో అవండి.

  6. భారత ముస్లింలు హజ్ యాత్రకు రావచ్చునన్న సౌదీ అరేబియా

    హజ్ యాత్ర

    ఫొటో సోర్స్, Getty Images

    భారత ముస్లింలు ఈ ఏడాది హజ్ యాత్ర చేపట్టవచ్చునని సౌదీ అరేబియా భారతదేశానికి తెలిపింది.

    అయితే కరోనావైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టకుని.. ఈ ఏడాది భారతీయ హజ్ యాత్రికుల కోటాను 79,237 మందిగా సౌదీ అరేబియా నిర్ణయించింది.

    అలాగే ఈ ఏడాది 65 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారు మాత్రమే హజ్ యాత్రకు అనుమతిస్తామని కూడా సౌదీ అరేబియా చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

    భారత్ తరఫున హజ్ యాత్రకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ చెప్పారు.

    హజ్ యాత్రికులు ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకోవటం, కోవిడ్ వ్యాక్సిన్లు రెండూ తీసుకోవటం తప్పనిసరి అని సౌదీ అరేబియా ప్రభుత్వం చెప్పినట్లు అధికారులు తెలిపారు.

    కరోనా మహమ్మారి మొదలైన తర్వాత భారత హజ్ యాత్రికులు సౌదీ అరేబియాకు ప్రయాణించటం ఇదే మొదటిసారి అవుతుంది.

    ఈ ఏడాదికి భారత హజ్ యాత్రికుల విషయంలో సౌదీ అరేబియా నిర్ణయించిన 79,237 మంది కోటాలో 56,601 మంది హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా, 22,636 మంది హజ్ గ్రూప్ ఆర్గనైజర్ల ద్వారా వెళతారని కూడా అధికారులు తెలిపారు.

  7. ప్రజాస్వామ్యంలో ‘బుల్డోజర్ న్యాయం’ దేనికి సంకేతం?

  8. బుల్డోజర్ ఎక్కిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌పై విమర్శలు.. ఎందుకు?

  9. యుక్రెయిన్ వీడివెళ్లిన శరణార్థులు 50 లక్షల మందికి పైనే: ఐరాస

    యుక్రెయిన్‌లో ఫిబ్రవరి 24వ తేదీన యుద్ధం మొదలైనప్పటి నుంచీ శుక్రవారం వరకూ సుమారు 51,33,747 మంది ప్రజలు ఆ దేశం విడిచి పారిపోయారని ఐక్యరాజ్యసమితి హైకమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ తెలిపింది.

    వీరిలో మహిళలు, పిల్లలు 90 శాతం వరకూ ఉన్నారని వెల్లడించింది.

    యుక్రెయిన్ శరణార్థులకు పలు దేశాలు ఆశ్రయమిచ్చాయి. అత్యధికంగా పొరుగు దేశం పోలండ్‌కు వెళ్లారు.

    యుక్రెయిన్ విడిచి వెళుతున్న ప్రతి పది మందిలో దాదాపు ఆరుగురు పోలండ్‌ చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో 28,67,241 మంది యుక్రెయిన్ శరణార్థులు ఉన్నారు.

    యుక్రెయిన్ శరణార్థులు
  10. ‘దేశ సామర్థ్యం’పై ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్‌కు అమిత్ మిశ్రా జవాబు.. వైరల్ అయిన ట్వీట్లు

    ఇర్ఫాన్ పఠాన్, అమిత్ మిశ్రా

    ఫొటో సోర్స్, Hindustan Times/AFP/GettyImages

    భారత క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు ఇర్ఫాన్ పఠాన్ చేసిన ఒక ట్వీట్, దానికి జవాబుగా క్రికెటర్ అమిత్ మిశ్రా చేసిన ట్వీట్ వైరల్ అయ్యాయి.

    నిజానికి ఇర్ఫాన్ పఠాన్ విషయం చెప్పకుండా.. దేశ సామర్థ్యం గురించి రాశారు. అయితే ఆ ట్వీట్‌ను చూస్తే ఆయన ప్రస్తుతం దేశంలో నెలకొన్న సామాజిక రాజకీయ పరిస్థితి గురించి ప్రస్తావిస్తున్నట్లుగా, ట్వీట్‌లో విషయాన్ని అసంపూర్ణంగా వదిలేసినట్లుగా కనిపిస్తుంది.

    ‘‘నా దేశం, నా అందమైన దేశం, ప్రపంచంలో అతి గొప్ప దేశమయ్యే సామర్థ్యం ఉన్న దేశమిది. కానీ...’’ అని ఇర్ఫాన్ తన ట్వీట్‌లో రాశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఇర్ఫాన్ అసంపూర్తిగా వదిలేసిన ఈ ట్వీట్‌ను పూర్తి చేయటానికి నెటిజెన్లు వివిధ పదాలు రాస్తున్నారు.

    ఈ ట్వీట్‌కు క్రికెటర్ అమిత్ మిశ్రా కూడా స్పందించారు.

    ‘‘నా దేశం, నా అందమైన దేశం, ప్రపంచంలో అతి గొప్ప దేశమయ్యే సామర్థ్యమున్న దేశమిది.... కానీ అనుసరించాల్సిన ప్రథమ పుస్తకం మన రాజ్యంగమని కొంతమందికి అర్థమైనప్పుడు మాత్రమే’’ అని ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    ఈ వార్త రాసేటప్పటికి ఇర్ఫాన్ ట్వీట్‌ను 4 వేల సార్లకు పైగా రీట్వీట్ చేయగా, 50 వేలకు పైగా లైకులు వచ్చాయి.

    అదే సమయంలో అమిత్ మిశ్రా ట్వీట్‌కు దాదాపు 24 వేల రీట్వీట్లు, లక్షకు పైగా లైకులు వచ్చాయి.

  11. శ్రీకాకుళం జిల్లా: ‘భూతవైద్యులు చెప్పారని లాక్‌డౌన్ విధించుకుని, హిజ్రాలతో పూజలు’ చేయించిన గ్రామంలో ఇప్పుడేం జరుగుతోంది?

  12. ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్: అన్షు మాలిక్, రాధికలకు రజత పతకాలు, మనీషాకు కాంశ్యం

    అన్షు మాలిక్

    ఫొటో సోర్స్, SAI Media (ANI)

    మంగోలియాలో జరుగుతున్న ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ 2022 పోటీల్లో శుక్రవారం నాడు భారత రెజ్లర్లు అన్షు మాలిక్ 57 కిలోల విభాగంలో, రాధిక 65 కిలోల విభాగంలో రజత పతకాలు గెలుచుకున్నారు. 62 కిలోల విభాగంలో పోటీపడిన మనీషా కాంశ్య పతకంతో సరిపెట్టుకున్నారు.

    ఏఎన్ఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. 2021 చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన అన్షు మాలిక్ ఈసారి ఫైనల్‌లో జపాన్ క్రీడాకారిణి త్సుగుమి సకురాయ్‌తో పోటీపడి 0-4 స్కోరుతో ఓడిపోయారు.

    మరోవైపు రాధిక 65 కిలోల విభాగంలో నాలుగు మ్యాచ్‌లలో మూడింట గెలిచి రజత పతకం ఖాయం చేసుకున్నారు. జపాన్ క్రీడాకారిణి మియా మొరికావాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే రాధిక ఓడిపోయారు.

    ఇక 62 కిలోల కేటగిరీలో తలపడిన మనీషా దక్షిణ కొరియా క్రీడాకారిణి హన్బిట్ లీని ఓడించి కాంశ్య పతకం గెలుపొందారు.

    వీరికిముందు ఈ చాంపియన్‌షిప్ పోటీల్లో గురువారం నాడు భారత క్రీడాకారిణిలు సరితా మోర్, సుష్మా సోకీన్‌లు తమ తమ మహిళల ఫ్రీస్టైల్ కేటగిరీల్లో చెరో కాంశ్య పతకం గెలుచుకున్నారు.

  13. పామాయిల్ ఎగుమతులపై ఇండొనేసియా నిషేధం.. భారత్‌లో పెరగనున్న ధరలు

    పామాయిల్

    ఫొటో సోర్స్, Getty Images

    ఇండొనేసియాలో ఆహార ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశం నుంచి వంట నూనెలు, వాటి ముడిసరకుల ఎగుమతులను ఈ నెల 28వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్లు దేశాధ్యక్షుడు జోకో విడోడో ప్రకటించారు. దీంతో ఇండొనేసియా నుంచి పామాయిల్ ఎగుమతులపై నిషేధం అమలులోకి రానుంది.

    ఇంతకుముందు జనవరిలో కూడా ఇండొనేసియా పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధించింది. అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పామాయిల్ సహా చాలా సరకుల ధరలు పెరిగాయి. ఈ నేషాధాన్ని ఇండొనేసియా మార్చిలో ఎత్తివేసింది.

    ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే వెజిటబుల్ వంట నూనె పామాయిల్. రోజు వారీ జీవితంలో ఉపయోగించే సగం ఉత్పత్తుల్లో ఈ నూనెను ఉపయోగిస్తారు. పరిశ్రమల్లో సైతం పామాయిల్‌ను వాడతారు.

    పామాయిల్ ఉత్పత్తి, ఎగుమతులు అత్యధికంగా ఇండొనేసియా నుంచే జరుగుతున్నాయి. దేశంలో ధరలను స్థిరీకరించటానికి ఎగుమతులపై నిషేధం విధించినపుడు అంతర్జాతీయ మార్కెట్‌ మీద అది ప్రభావం చూపుతుంది.

    అంటే.. పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధిస్తూ ఇండొనేసియా తీసుకున్న నిర్ణయం భారతదేశం మీద కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది.

    ‘‘ఇప్పుడు వంట నూనెల ధరలు ఆకాశానికి పెరుగుతాయి. యుక్రెయిన్ యుద్ధం వల్ల సన్‌ఫ్లవర్ ఆయిల్ సరఫరాలు పడిపోవటంతో ప్రజలు ఎక్కువగా పామాయిల్ మీద ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఇండొనేసియా నుంచి పామాయిల్ ఎగుమతులు ఆగిపోతే కొనుగోలుదార్లకు మరో ప్రత్యామ్నాయం లేదు’’ అని ముంబైకి చెందిన ఒక డీలర్ వివరించారు.

    ఇండొనేసియాలో వంట నూనెల ధరలు ఇటీవల విపరీతంగా పెరిగాయి. దీనిపై చాలా నగరాల్లో ప్రజలు నిరసనలు కూడా నిర్వహించారు.

  14. కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిశోర్ చేరికపై కొన్ని సందేహాలున్నాయి: దిగ్విజయ్

    దిగ్విజయ్ సింగ్

    ఫొటో సోర్స్, Getty Images

    రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే విషయంలో పార్టీలో కొన్ని సందేహాలున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్వజయ్ సింగ్ పేర్కొన్నారు.

    ఆయన ఎన్‌డీటీవీ వార్తా చానల్‌తో మాట్లాడుతూ.. ఈ విషయంలో పార్టీ ‘ఓపెన్ మైండ్’తో పనిచేస్తోందని చెప్పారు.

    ప్రశాంత్ కిశోర్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. 2024 పార్లమెంటు ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థాగత స్థాయిలో భారీ ప్రణాళికతో ఆయన ముందుకు వచ్చారని చెప్తున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    బీజేపీ సహా పలు పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ గతంలో జనతా దళ్ యునైటెడ్ పార్టీలో చేరారు. కానీ ఆ తర్వాత నితీశ్ కుమార్ పక్షం వీడారు.

    ప్రశాంత్ కిశోర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంప్రదింపులు జరుపుతున్న పార్టీ సీనియర్ నాయకుల్లో దిగ్విజయ్ సింగ్ ఒకరు.

    ప్రశాంత్ కిశోర్

    ఫొటో సోర్స్, Getty Images

    ప్రశాంత్ కిశోర్‌ను పార్టీలో చేర్చుకోవటానికి ఎలాంటి వ్యతిరేకతా లేదని ఆయన ఎన్‌డీటీవీతో చెప్పారు. అయితే అది ఎంతవరకూ ఉంటుంది, ఎలా ఉంటుందనేదే ప్రశ్న అన్నారు.

    ‘‘ఆయన ప్రయాణం ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి సాగుతూ వచ్చింది. అందువల్లనే ఆయన రాజకీయ నిబద్ధత, సైద్ధాంతిక నిబద్ధత మీద స్పష్టత లేదు’’ అని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు.

  15. విజయ్ మాల్యా, నీరవ్ మోదీపై బోరిస్ జాన్సన్ ఏం చెప్పారు?

    బోరిస్ జాన్సన్

    ఫొటో సోర్స్, Getty Images

    భారత్‌లో పర్యటిస్తున్న బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్.. మీడియా సమావేశంలో వివిధ అంశాలపై విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు.

    నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, ఖలిస్తానీ తీవ్రవాదుల గురించి అడిగిన ప్రశ్నలకు బోరిస్ సమాధానం చెప్తూ.. బ్రిటన్‌లో తీవ్రవాద వ్యవతిరేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

    ‘‘ఇతర దేశాలకు ముప్పుగా ఉండే, భారతదేశానికి ముప్పుగా ఉండే తీవ్రవాద బృందాలను మేం సహించబోం. భారతదేశానికి సాయం చేయటానికి మేం ఒక తీవ్రవాద వ్యతిరేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశాం’’ అని వివరించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    అలాగే.. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వంటి కేసుల్లో వారిని భారత్‌కు అప్పగించాలని బ్రిటన్ ప్రభుత్వం ఆదేశించినట్లు జాన్సన్ తెలిపారు.

    ‘‘ఇలాంటి కేసుల్లో చాలా న్యాయ ప్రక్రియలు ఉన్నాయి. అందువల్ల ఈ ప్రక్రియ కష్టమవుతుంది. వారిని భారత్‌కు అప్పగించాలని బ్రిటన్ ప్రభుత్వం ఆదేశించింది. భారతదేశంలో చట్టాలను తప్పించుకోవటానికి మా న్యాయ వ్యవస్థను ఉపయోగించుకోవటానికి మేం అనుమతించం’’ అని పేర్కొన్నారు.

  16. అమెరికాలో పీహెచ్‌డీ చేసిన ఈ తెలంగాణ అమ్మాయి ఇంట్లో చెప్పకుండా దిల్లీ బాబా దగ్గరికి ఎందుకొచ్చారు?

  17. చంద్రబాబు Vs వాసిరెడ్డి పద్మ: ఏం జరిగింది? చంద్రబాబుకు మహిళా కమిషన్ నోటీసులు ఎందుకు?, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    చంద్రబాబు Vs వాసిరెడ్డి పద్మ

    ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబుకి ఏపీ మహిళా కమిషన్ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఈనెల 27వ తేదీ ఉదయం 11గంటలకు కమిషన్ ముందు విచారణకు హాజరుకావాలని కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ నోటీసులు జారీ చేశారు. చంద్రబాబుతో పాటుగా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావుకి కూడా ఈ నోటీసులు వెళ్లాయి.

    శుక్రవారం మధ్యాహ్నం విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద జరిగిన పరిణామాల పట్ల మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. సామూహిక అత్యాచారానికి గురయిన బాధితురాలిని పరామర్శించిన సమయంలో జరిగిన పరిణామాల పట్ల వాసిరెడ్డి పద్మ తీవ్రంగా స్పందించారు.

    టీడీపీ శ్రేణులతో పాటుగా చంద్రబాబు కూడా ఆస్పత్రి ప్రాంగణంలో పద్మతో వాగ్వాదానికి దిగారు. కొందరు కార్యకర్తలు ఆమెను అడ్డుకుని నిరసనకు పూనుకున్నారు. బోండా ఉమా, పంచుమర్తి అనురాధ వంటి నేతలు నేరుగా పద్మతో తలపడ్డారు. అదే సమయంలో అక్కడికెళ్లిన చంద్రబాబు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. దాంతో మహిళా కమిషన్ చైర్ పర్సన్ పట్ల అనుచితంగా వ్యవహరించారంటూ వాసిరెడ్డి పద్మ మీడియా ముందు వ్యాఖ్యానించారు. చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దానికి అనుగుణంగా తాజాగా నోటీసులు జారీ చేశారు.

    ఏపీ మహిళా కమిషన్చట్టం-1998లోని సెక్షన్ 14(1) ప్రకారం ఈ నోటీసులు జారీ చేసినట్టు పేర్కొన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 195 ప్రకారం చర్యలకు పూనుకుంటున్నట్టు నోటీసులు తెలిపారు. మహిళా కమిషన్ చట్టాలను అనుసరించి తదుపరి చర్యలుంటాయని, విచారణకు హాజరుకావాలని నోటీసులో ఉంది.

  18. కిమ్ కర్దాషియన్: తల్లి సెక్స్‌ టేప్‌ ప్రకటన చూసిన ఆరేళ్ల కొడుకు.. ఆ తర్వాత..

  19. బోరిస్ జాన్సన్: ‘నరేంద్ర మోదీ నాకు చాలా ప్రత్యేకమైన మిత్రుడు’

    భారత ప్రధాని నరేంద్ర మోదీతో బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్

    ఫొటో సోర్స్, Boris Johnson/Twitter

    భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు చాలా ప్రత్యేకమైన స్నేహితుడని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు.

    తనకు భారత్‌లో అపూర్వమైన స్వాగతం లభించిందని తాను సచిన్ తెందూల్కర్, అమితాబ్ బచ్చన్‌లా ఫీలయ్యానని బోరిస్ తెలిపారు.

    తొలిసారి భారత పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

    బ్రిటన్, భారత్ దౌత్యసంబంధాలతో పాటు అనేక అంతర్జాతీయ అంశాల మీద ఇద్దరు చర్చించారు.

    బ్రిటన్, భారత్ మధ్య గ్లోబల్ ఇన్నోవేషన్ పార్టనర్‌షిప్ కోసం అవగాహన ఒప్పందం కుదిరింది.

    భారత్, బ్రిటన్ మధ్య గ్లోబల్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ భాగస్వామ్యం మీద అవగాహన ఒప్పందం చేసుకున్నారు.

  20. ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి పర్యటన కోసం సామాన్యుల కార్లు ఎందుకు? సీఎంకు ప్రత్యేక కార్లు ఉండవా?