ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన రోజు ఏం చేశారు?
నేను గత నాలుగేళ్ళుగా డోనల్డ్ ట్రంప్‌ను చాలా దగ్గరగా చూస్తూ వచ్చాను. మంచి - చెడు కాలాల్లో ఆయనతోనే ఉన్నాను. కానీ, నవంబర్ 7న ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన రోజు లాంటిది నేను అంతకు ముందెప్పుడూ చూడలేదు.
బ్లాక్ జాకెట్, డార్క్ ట్రౌజర్, తెల్ల 'మాగా' (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) టోపీ ధరించిన అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఉదయం 10 గంటల కంటే కొన్ని నిమిషాల ముందు వైట్ హౌస్ నుంచి బయటికొచ్చారు. అంతకు ముందు వరకూ ఆయన 'ఎన్నికల్లో మోసాలు జరిగాయని' ట్వీట్లు చేస్తూనే గడిపారు.
ఇప్పుడు, ఆయన గాలి నెడుతున్నట్టుగా కాస్త ముందుకు వాలి నడుస్తున్నారు. ఒక నల్లటి కారులో ఎక్కిన ట్రంప్ వర్జీనియా, స్టెర్లింగ్‌లోని ట్రంప్ నేషనల్‌లో తన గోల్ఫ్ క్లబ్‌కు బయల్దేరారు. అది వైట్‌హౌస్ నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ సమయంలో గాలి తనకు అనుకూలంగా ఉంటుందని ఆయన అంచనా వేశారు. అదొక అందమైన రోజు, గోల్ఫ్ ఆడ్డానికి చక్కటి రోజు. ఈ రోజును ఆయన క్లబ్‌లో గడపబోతున్నారు.
కానీ, ఆయన కోసం పనిచేసేవారు కాస్త అంటీముట్టనట్లు ఉండడం కనిపించింది. జూనియర్ సిబ్బందిలో ఒకరిని నేను 'ఎలా ఉన్నారు' అని అడిగాను. ఆమె 'బాగున్నా' అన్నారు. చిన్నగా నవ్వి, చూపులు తిప్పుకున్నారు. తన పోన్ చూసుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Reuters
























