భారత్ Vs పాకిస్తాన్ : వర్షం కారణంగా రిజర్వ్ డే‌ రోజైన సోమవారం కొనసాగనున్న ఆట

తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు తరఫున ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, శుభమన్ గిల్‌లు మైదానంలో దిగారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం.

    మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.. గుడ్ నైట్

  2. భారత్ Vs పాకిస్తాన్: వర్షం కారణంగా రిజర్వ్ డే‌ రోజైన సోమవారం కొనసాగనున్న ఆట

    భారత్, పాక్ మ్యాచ్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, భారత్, పాక్ మ్యాచ్

    ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం జరగాల్సిన భారత్‌-పాక్‌ క్రికెట్ మ్యాచ్‌ వర్షం కారణంగా నిలిచిపోయింది.

    వర్షం పడే సమయానికి భారత జట్టు 24.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నారు.

    ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో మ్యాచ్ నిలిచిపోయింది.

    వర్షం ఆగకపోవడంతో మ్యాచ్‌ను సోమవారం కొనసాగించనున్నారు.

    సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆట (24.2 ఓవర్ల నుంచి) ప్రారంభం కానుంది.

  3. ‘సెక్స్ కోరికలు పెంచే ఆ హార్మోన్ తీసుకున్నాక నాకు కొడుకు పుట్టాడు’

  4. చంద్రబాబు రిమాండ్: వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, జనసేన నేతలు ఏమన్నారు

  5. చంద్రబాబు నాయుడుకు 14 రోజుల రిమాండ్

  6. ఆత్మహత్య చేసుకోబోయే ముందు ఏం జరుగుతుంది, ఆ ఆలోచనలను ఎలా పసిగట్టాలి?

  7. 15 ఓవర్లకు 115 కొట్టిన భారత్.. శుభమన్, రోహిత్ హాఫ్ సెంచరీలు

    శుభమన్ గిల్

    ఫొటో సోర్స్, Getty Images

    భారత్, పాకిస్తాన్ ఆసియా కప్‌ సూపర్-4 మ్యాచ్‌ ఉత్కంఠ రేపుతోంది.

    15 ఓవర్లు ముగిసేనాటికి భారత్ 115 రన్లు కొట్టింది. ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు.

    15వ ఓవర్ తొలి బంతికి సిక్స్ కొట్టడంతో రోహిత్ శర్మ స్కోర్ 50 దాటింది.

    మరోవైపు శుభమన్ గిల్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు.

  8. చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో ఏముంది?

  9. ముగిసిన జీ20 సదస్సు: అధ్యక్ష బాధ్యతలు బ్రెజిల్‌కు అప్పగించిన భారత్

    బ్రెజిల్‌కు జీ20 అధ్యక్ష బాధ్యతలు

    ఫొటో సోర్స్, ANI

    జీ20 దేశాలకు ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు నిర్వరిస్తోన్న భారత్, ఈ సదస్సు ముగింపు సందర్భంగా చైర్మన్‌షిప్‌ను బ్రెజిల్‌కు అందజేసింది.

    ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి జీ20 దేశాలకు బ్రెజిల్ అధ్యక్షత వహించనుంది. ఈ బాధ్యతలను బ్రెజిల్ అధ్యక్షుడి లులా డ సిల్వాకు అప్పగించారు.

    ‘‘నవంబర్ వరకే జీ20 అధ్యక్షతను భారత్ నిర్వహించనుంది. ఇంకా మన వద్ద రెండున్నర నెలలున్నాయి. మేం నిర్ణయించిన అంశాలపై వర్చ్యువల్‌గా సమీక్ష నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నా. మీరందరూ ఈ సమావేశాలకు హాజరవుతారని ఆశిస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా శాంతి చేకూరాలని ఆశిస్తున్నా. 140 కోట్ల భారతీయులకు ధన్యవాదాలు’’ అని ప్రధాని మోదీ తెలిపారు.

    ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్య పెరుగుదలపై కూడా ప్రధాని మోదీ ఈ సందర్భంగా మాట్లాడారు.

    సమయానుకనుగుణంగా మారాల్సి ఉందన్నారు.

    ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఐదు సభ్యదేశాలు మాత్రమే ఉన్నాయి.

    దీనిలో అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌లున్నాయి.

    శాశ్వత సభ్యదేశాలను పెంచాలని దీర్ఘకాలంగా భారత్ డిమాండ్ చేస్తోంది.

  10. BHAvsPAK: 5 ఓవర్లలో 37 పరుగులు చేసిన భారత్ జట్టు

    రోహిత్ శర్మ, బాబర్ ఆజామ్

    ఫొటో సోర్స్, Getty Images

    ఆసియా కప్ సూపర్-4లో భాగంగా భారత్, పాకిస్తాన్‌లు తలపడుతున్నాయి.

    పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

    దీంతో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు తరఫున ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, శుభమన్ గిల్‌లు మైదానంలో దిగారు.

    5 ఓవర్లు ముగిసేటప్పటికి భారత్ జట్టు వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది.

    శుభమన్ గిల్ 13 బంతుల్లో 25 పరుగులు చేసి దూకుడు చూపుతుండగా రోహిత్ శర్మ 20 బంతుల్లో 10 పరుగులు చేశాడు.

  11. G 20 - నాగరాజు నాయుడు: జాయింట్ డిక్లరేషన్ కోసం దేశాలను ఏకతాటిపైకి తెచ్చిన తెలుగు అధికారి

  12. జీ20 సదస్సు: తొలి రోజే డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం ఎలా కుదిరింది?

  13. కోడలి హత్య కేసులో ఉరిశిక్ష నుంచి తప్పించుకున్న జమీందార్, మరి చంపిందెవరు? 110 ఏళ్లయినా వీడని మిస్టరీ

  14. రాజ్‌ఘట్‌లో మహాత్ముడికి నివాళులర్పించిన జీ20 దేశాధినేతలు, ప్రతినిధులు

    రాజ్‌ఘట్

    ఫొటో సోర్స్, ANI

    జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం దిల్లీకి వచ్చిన దేశాధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు రాజ్‌ఘట్‌ను సందర్శించి, మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు.

    రాజ్‌ఘాట్‌కు వచ్చిన జీ20 నేతలు, అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం పలికారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    వారికి ఆహ్వానం పలికే ప్రదేశంలో వెనుక వైపు సబర్మతి ఆశ్రమం ఫొటోను ఉంచారు. ఈ ఫొటో గురించి అతిథులకు ప్రధాని మోదీ వివరించారు.

    మహాత్మాగాంధీ సమాధి వద్ద నేతలు నివాళులర్పించిన తర్వాత, అక్కడ నుంచి నేరుగా భారత మండపంలోని ‘లీడర్స్ లాంజ్’కి వెళ్తారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  15. అక్షర్‌ధామ్ ఆలయంలో పూజలు చేసిన రిషి సునక్

    రిషి సునక్

    ఫొటో సోర్స్, ANI

    బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ ఆదివారం ఉదయం అక్షర్‌ధామ్ టెంపుల్‌ని సందర్శించి పూజలు చేశారు.

    రిషి సునక్ రాకతో అక్షర్‌ధామ్ చుట్టు పక్కల భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

    జీ 20 సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన సునక్... తన రెండు రోజుల పర్యటనలో భాగంగా అక్షర్‌ధామ్ టెంపుల్‌ను సందర్శించాలని అంతకుముందే నిర్ణయించుకున్నారు.

    రిషి సునక్

    ఫొటో సోర్స్, ANI

    అక్షర్ ధామ్ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత, అక్కడి నుంచి రాజ్‌ఘట్‌కి వెళ్లి మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ప్రధానమంత్రి మోదీ అంటే చాలా గౌరవం ఉందని.. జీ 20 సదస్సును విజయవంతం చేసేందుకు తన వంతు పాత్ర పోషిస్తానని ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు.

    “నేను హిందువుని. హిందువులాగే పెరిగాను. అది నాకు చాలా సంతోషం. నేను అక్షర్‌ధామ్‌లోని స్వామి నారాయణ్ మందిర్ చూడాలనుకుంటున్నాను. నేనిక్కడ మరో రెండు రోజులు ఉంటాను. మనం మొన్ననే రక్షాబంధన్ జరుపుకున్నాం. నా సోదరి, తోబుట్టువుల నుంచి రాఖీలు వచ్చాయి” అని సునక్ చెప్పారు.

    రిషి సునక్

    ఫొటో సోర్స్, ANI

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    “మేం బ్రిటన్ ప్రధాని సందర్శన కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. మయూర్ ద్వార్ అని పిలిచే ప్రధాన ద్వారం వద్ద సునక్ దంపతులకు మేము స్వాగతం పలుకుతాం. వాళ్లు హారతి తీసుకునేట్లయితే అది కూడా సిద్ధం చేశాం.

    ఆలయంలో రాధాకృష్ణులు, సీతారాములు, లక్ష్మీ నారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, గణపతి విగ్రహాలు ఉన్నాయి. వాళ్లు పూజ చేస్తామంటే అందుకు కూడా ఏర్పాట్లు చేస్తాం’’ అని సునక్ ఆలయ సందర్శనకు రావడానికి ముందు అక్షర్‌ధామ్ అధికారి జ్యోతింద్ర దవే ఏఎన్ఐతో చెప్పారు.

  16. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్‌డేట్స్‌ను నిరంతరం బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీలో చూడండి.