తెలంగాణ: వీధి కుక్కల దాడిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

జీఎంహెచ్‌సీ అసలు ఏం చేస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. మీ నిర్లక్ష్యంతో పసిబాలుడు చనిపోయాడని మందలించింది.

లైవ్ కవరేజీ

  1. బీబీసీ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం

    ఇంతటితో నేటి లైవ్ పేజీని ముగిస్తున్నాం. న్యూస్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీలో రేపు ఉదయం కలుసుకుందాం.

    ధన్యవాదాలు.

  2. బీబీసీ ఇండియా: నిర్భయంగా వార్తలు అందించాలని సిబ్బందికి చెప్పిన డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ

  3. 'పుతిన్ యుక్రెయిన్ ఏమీ చేయలేకపోయారు... కానీ, రష్యాను మాత్రం నాశనం చేశారు'

  4. టిక్‌టాక్‌ను నిషేధించిన యూరోపియన్ కమిషన్

    టిక్‌టాక్

    ఫొటో సోర్స్, Getty Images

    యూరోపియన్ కమిషన్‌లో పనిచేస్తోన్న ఉద్యోగులు తమ ఫోన్లు, కార్పొరేట్ డివైజ్‌ల నుంచి టిక్‌టాక్‌ యాప్‌ను తొలగించాలని ఆ కమిషన్ ఆదేశించింది.

    డేటా సురక్షిత కోసం, సైబర్ సెక్యూరిటీని పెంచేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కమిషన్ తెలిపింది.

    చైనా కంపెనీ బైట్‌డ్యాన్స్‌కు చెందినది టిక్‌టాక్. ఈ యాప్ యూజర్ల డేటాను సేకరించి, ఆ డేటాను చైనాకు ఇస్తుందని ఆరోపణలున్నాయి.

    ఇతర సోషల్ మీడియా యాప్‌ల మాదిరిగానే తాము కూడా పనిచేస్తున్నామని టిక్‌టాక్ చెబుతోంది.

    ఈ నిషేధంతో యూరోపియన్ కమిషన్ ఉద్యోగులు తమ వ్యక్తిగత డివైజ్‌లలో టిక్‌టాక్‌ను వాడుకోలేరు.

    మొత్తంగా తమ కమిషన్‌లో 32 వేల మంది శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు పనిచేస్తున్నారని యూరోపియన్ కమిషన్ తెలిపింది.

    ఈ ఉద్యోగులందరూ కూడా మార్చి 15 నాటికి తమ డివైజ్‌ల నుంచి టిక్‌టాక్ యాప్‌ను తొలగించాలని కమిషన్ ఆదేశించింది.

  5. వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?

  6. రోహింజ్యా ముస్లింలతో ఈ పడవలు సముద్రం మధ్యలో ఎలా మాయం అవుతున్నాయి?

  7. తెలంగాణ: వీధి కుక్కల దాడిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

    వీధి కుక్కలు

    ఫొటో సోర్స్, Getty Images

    హైదరాబాద్‌లోని అంబర్ పేట్‌లో వీధి కుక్కల దాడి కేసును తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారించింది.

    జీఎంహెచ్‌సీ అసలు ఏం చేస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. మీ నిర్లక్ష్యంతో పసిబాలుడు చనిపోయాడని మందలించింది.

    ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించింది.

    తెలంగాణ హైకోర్టు

    ఫొటో సోర్స్, Getty Images

    తెలంగాణ చీఫ్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ కలెక్టర్, తెలంగాణ లీగల్ సేల్ అథారిటీ, అంబర్ పేట్ మున్సిపల్ అధికారులకు హైకోర్టు నోటీసులు పంపింది.

    బాలుడు మృతి బాధాకరమని కోర్టు పేర్కొంది. బాబు మృతికి నష్ట పరిహారం చెల్లింపు అంశాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది.

    పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 16కు వాయిదా వేసింది.

  8. కులవివక్షను నిషేధిస్తూ సియాటెల్ చేసిన చట్టం దక్షిణాసియా దేశాలను వేలెత్తి చూపిస్తోందా?

  9. బ్రేకింగ్ న్యూస్, పవన్ ఖేరాకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

    పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.

    పవన్ ఖేరా తనపై ఉన్న కేసులను ఒకే చోట చేర్చాలని సుప్రీంకోర్టును కోరారు. ఆ మేరకు కోర్టు అస్సాం పోలీసులకు, యూపీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

    తదుపరి విచారణ జరిగేంతవరకు పవన్ ఖేరాను బెయిల్ మీద విడిచిపెట్టాలని ద్వారాక కోర్టును ఆదేశించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    పవన్ ఖేరా తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తక్షణ విచారణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మధ్యాహ్నం 3.00 గంటలకు కోర్టు ఈ కేసును విచారించింది. పవన్ ఖేరాకు తాత్కాలిక ఉపశమనాన్ని ఆదేశించింది.

    గురువారం ఉదయం కాంగ్రెస్ నేత పవన్ ఖేరాను దిల్లీ విమానాశ్రయంలో అస్సాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనపై అస్సాంలో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

  10. పవన్ ఖేరా అరెస్ట్.. అస్సాం పోలీస్ స్టేషన్‌లో కేసు దాఖలు

    పవన ఖేరా

    ఫొటో సోర్స్, ANI

    అస్సాం పోలీసులు కాంగ్రెస్ నేత పవన్ ఖేరాను అరెస్ట్ చేశారు. ఆయన్ను దిల్లీ కోర్టులో హాజరుపరచి ఆక్కడి నుంచి అస్సాం తీసుకెళ్లనున్నట్టు ఏఎన్‌ఐ తెలిపింది.

    అస్సాంలోని దిమా సహావో జిల్లాలో హాఫ్‌లాన్ పోలీస్ స్టేషన్‌లో పవన్ ఖేరాపై కేసు నమోదు చేసినట్టు అస్సాం పోలీసులు తెలిపారు.

    ప్రధాని నరేంద్ర మోదీపై పవన్ ఖేరా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అస్సాం పోలీసులు కేసు నమోదు చేసినట్లు పీటీఐ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    దిల్లీ విమానాశ్రయం నుంచి రాయపూర్ వెళ్లేందుకు ఇండిగో విమానం ఎక్కిన పవన్ ఖేరాను దిల్లీ పోలీసులు కిందకు దింపారు.

    "మీ సామాన్లు చూడాలి అని నాతో చెప్పారు. నా దగ్గర సామాను లేదని, కేవలం హ్యాండ్‌బ్యాగ్ ఉందని చెప్పాను. ఏదో కంఫ్యూజన్ ఉంది. మీరు కిందకు దిగండి అన్నారు. దిగిన తరువాత, మీరు విమానం ఎక్కలేరు అని చెప్పారు. కాసేపట్లో డీఎస్‌పీ మీతో మాట్లాడతారన్నారు. నన్నెందుకు ఆపారు? ఏ సెక్షన్ కింద ఆపారు? ఇవేవీ నాకు తెలీవు" అని పవన్ ఖేరా చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    రాయపూర్‌లో కాంగ్రెస్ 85వ ప్లీనరీ సెషన్‌కు హాజరు కావడానికి పలువురు కాంగ్రెస్ నేతలు దిల్లీ నుంచి బయలుదేరారు.

    విమానాశ్రయంలో పవన్ ఖేరాను విమానం నుంచి కిందకు దింపాక మిగతా కాంగ్రెస్ నాయకులు కూడా విమానం దిగిపోయారు. అక్కడే నిరసనలు వ్యక్తం చేశారు. పరిస్థితిని అదుపు చేయడానికి సీఐఎస్ఎస్ సిబ్బంది రంగంలోకి దిగింది.

  11. మేఘాలయ ఎన్నికల్లో మతం ప్రాధాన్యత ఎంత?

  12. దిల్లీ: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాను విమానం నుంచి కిందకు దింపారు

    పవన్ ఖేరా

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, పవన్ ఖేరా

    కాంగ్రెస్ నేత పవన్ ఖేరాను దిల్లీలో విమానం నుంచి కిందకు దింపారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే ఆరోపించారు.

    సుప్రియా శ్రీనాతే ట్విట్టర్‌లో ఈ ఘటనపై సమాచారమిస్తూ, "ఇదేం వ్యవహారం?" అంటూ విరుచుకుపడ్డారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    "మేమంతా రాయపూర్ వెళ్లాల్సిన ఇండిగో 6ఈ 204 ఎక్కాం. సడన్‌గా నా కలీగ్‌ను విమానం దిగమని చెప్పారు. ఇదేం ఏకపక్ష వ్యవహారం? చట్టం అంటూ ఏదైనా ఉందా? ఏ ఆధారాలతో ఆయన్ను విమానం దిగమన్నారు? ఎవరి ఆదేశాలతో ఇలా చేశారు?" అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    కాగా, పవన్ ఖేరా దిల్లీ నుంచి రాయపూర్ వెళ్తున్న ఇండిగో విమానం ఎక్కాల్సి ఉండగా, ఆయన్ను ఆపాలని అస్సాం పోలీసులు కోరడంతో అలా చేశామని దిల్లీ పోలీసులు తెలిపారు.

    ఈ ఘటన అనంతరం కాంగ్రెస్ నేతలు దిల్లీ విమానాశ్రయంలో నిరసనలకు దిగారు.

  13. చిన్నారి పాప ప్రాణాలు నిలపడానికి రూ. 25 కోట్ల ఖర్చుతో జీన్ థెరపీ.. కానీ ఆమె అక్కను కాపాడే వీలు లేదు

  14. అన్నాడీఏంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఈకే పళనిస్వామి కొనసాగాలని చెప్పిన సుప్రీంకోర్టు

    ఈకే పళనిస్వామి

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ఈకే పళనిస్వామి

    తమిళనాడు ఏఐఏడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఈకే పళనిస్వామి కొనసాగాలని మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నేడు ధృవపరిచింది.

    ఈ కేసులో ఓ పన్నీర్‌సెల్వం వర్గం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

    అన్నాడీఏంకే నాయకత్వంపై తమిళనాడు మాజీ ముఖ్యమత్రులు ఓ పన్నీర్‌సెల్వం, ఈకే పళనిస్వామి మధ్య నెలకొన్న వివాదానికి సంబంధించి దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది.

    జస్టిస్ దినేష్ మహేశ్వరి నేతృత్వంలో జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది.

    మద్రాస్ హైకోర్టు బెంచ్ 2.9.22 ఇచ్చిన ఆదేశాన్ని సమర్థిస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును శాశ్వతం చేసినట్టు వెల్లడించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే పార్టీ పగ్గాల కోసం ఈకే పళనిస్వామి, ఓ పన్నీర్‌సెల్వం మధ్య పోటీ మొదలైంది.

    ఇందులో పళనిస్వామి పైచేయి సాధించారు. 2022 జూలైలో జరిగిన అన్నాడీఎంకే జనరల్ బాడీ సమావేశంలో తాత్కాలిక జనరల్ సెక్రటరీగా పళనిస్వామిని నియమితులయ్యారు.

    దీనిపై పన్నీర్‌సెల్వం వర్గం కోర్టు మెట్లెక్కింది. కానీ, తీర్పు ఆ వర్గానికి అనుగుణంగా రాలేదు.

    నేడు సుప్రీంకోర్టు తీర్పుతో చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో పళనిస్వామి వర్గం సంబరాలు చేసుకుంది.

  15. ఈపీఎస్: అధిక పెన్షన్ పొందాలంటే ఏం చేయాలి?

  16. చైనా స్పై బెలూన్ కంటే ఎత్తులో ఎగిరిన అమెరికా విమానం.. పైలట్ సెల్ఫీ విడుదల

    అమెరికన్ పైలట్ సెల్ఫీ ఫొటో

    ఫొటో సోర్స్, US DEPARTMENT OF DEFENSE

    ఫొటో క్యాప్షన్, అమెరికన్ పైలట్ సెల్ఫీ ఫొటో

    అమెరికా ఈ నెల ప్రారంభంలో తమ దేశ గగనతలంలో ఎగురుతున్న చైనా బెలూన్‌ను నిఘా బెలూన్‌గా అనుమానించి నేలకూల్చింది.

    దానికి ముందు చైనా స్పై బెలూన్ కంటే ఎత్తులో ఎగురుతున్న ఒక అమెరికన్ పైలట్ సెల్ఫీ ఫొటోను అమెరికా రక్షణ శాఖ బుధవారం విడుదల చేసింది.

    యూ-2 గూఢచారి విమానం కాక్‌పిట్ నుంచి ఈ సెల్ఫీ తీసుకున్నారు.

    అమెరికా ఖండంపై ఎగురుతున్న స్పై బెలూన్ పోకడను ఆ దేశ సైనికాధిరులు కొన్ని రోజులు గమనించారు. ఆ క్రమంలో ఈ సెల్ఫీ తీసుకున్నారు.

    అయితే, అది వాతావరణ పరిశోధన కోసం ఉపయోగించే బెలూన్ అని, పొరపాటున అమెరికా గగనతలంలోకి ప్రవేశించిందని చైనా చెప్పింది.

    కానీ, ఆ బెలూన్ చైనా నిఘా సమాచార సేకరణలో భాగమని అమెరికా చెబుతోంది.

    చైనా స్పై బెలూన్

    ఫొటో సోర్స్, REUTERS

    ఫొటో క్యాప్షన్, చైనా స్పై బెలూన్

    చైనా స్పై బెలూన్ అమెరికా రాష్ట్రాలపై ఎగురుతున్నప్పుడు రెండు అమెరికా విమానాలు దాన్ని ట్రాక్ చేశాయి. బెలూన్ లక్షణాలు, పరిధిపై సమాచారాన్ని సేకరించాయి.

    ఆ బెలూన్ "సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ సేకరణ కార్యకలాపాలను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని" దాన్ని ట్రాక్ చేస్తున్న విమానాలు వెల్లడించినట్లు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ సీనియర్ అధికారి ఒకరు ఈ నెల ప్రారంభంలో చెప్పారు.

    ఈ బెలూన్ జనవరి 28న అలస్కాన్ గగనతలంలోకి ప్రవేశించినప్పుడు అమెరికా దీన్ని మొదటిసారి గమనించింది. దాన్ని కూల్చితే బెలూన్ శిథిలాలు కిందపడి సాధారణ ప్రజలకు హాని కలగవచ్చని మొదట సంశయించింది. చివరికి ఫిబ్రవరి 4న దాన్ని గాల్లో పేల్చేసింది.

    బుధవారం విడుదల చేసిన సెల్ఫీ ఫొటో బెలూన్‌ను కూల్చడానికి ఒకరోజు ముందు తీసుకున్నది. ఈ ఫొటో అమెరికా రక్షణ శాఖలో పాపులర్ అయినట్టు సమాచారం.

    చైనా స్పై బెలూన్ భూమి నుంచి 60,000 ఎత్తులో ఎత్తులో ఎగిరింది. అమెరికా యూ-2 విమానాలు సాధారణంగా 70,000 అడుగుల ఎత్తులో ఎగురుతాయని ఆ దేశ ఎయిర్ ఫోర్స్ తెలిపింది.

  17. పాకిస్తాన్ అమ్మాయి, ఇండియా అబ్బాయి - లూడో గేమ్‌లో పరిచయం, ప్రేమ, పెళ్లి.. చివరకు ఏమైందంటే...

  18. కోవిడ్ భయంతో మూడేళ్లుగా ‘లాక్‌డౌన్’లో తల్లీ కొడుకులు.. భర్తను సైతం ఇంట్లోకి రానివ్వని వైనం

  19. వెస్ట్ బ్యాంక్‌పై ఇజ్రాయెల్ సైన్యం దాడి.. 11 మంది పాలస్తీనియన్లు మృతి

    ఇజ్రాయెల్

    ఫొటో సోర్స్, REUTERS

    ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌పై ఇజ్రాయెల్ భద్రతా దళాలు జరిపిన దాడిలో 11 మంది పాలస్తీనియన్లు చనిపోయారని, పదుల సంఖ్యలో గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు.

    బుధవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ భద్రతా బలగాలు నాబ్లస్‌ పాత బస్తీలోకి ప్రవేశించడంతో, అక్కడి నుంచి పేలుళ్లు, కాల్పుల శబ్దాలు వినిపించాయి.

    ఓ ఇంట్లో దాక్కున్న ముగ్గురు వాంటెడ్ తీవ్రవాదులను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.

    ఈ ఘర్షణల్లో అనేకమంది సాధారణ వ్యక్తులు మృతిచెందారు. వారిలో ఇద్దరు వృద్ధులు కూడా ఉన్నారు.

    వృద్ధుల్లో ఒకరైన 72 ఏళ్ల అద్నాన్ సబే బారా మృతదేహం ఒక రద్దీ మార్కెట్ ప్రదేశంలో పడి ఉన్నట్టు ఓ వీడియోలో కనిపించిందని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది.

    61 ఏళ్ల అబ్దుల్ హదీ అష్కర్, 16 ఏళ్ల బాలుడు మహ్మద్ షాబాన్ కూడా ఈ ఘర్షణల్లో చనిపోయారని వెల్లడించింది.

    మరో వృద్ధుడు అనన్ షౌకత్ అన్నాబ్ (66) టియర్ గ్యాస్ పీల్చడంతో బుధవారం సాయంత్రం ఆస్పత్రిలో మరణించారు.

    తీవ్రవాద సంస్థ లయన్స్ డెన్, ఇతర మిలిటెంట్ గ్రూపులకు చెందిన ఆరుగురు సభ్యులు ఈ ఘర్షణల్లో చనిపోయినట్లు లయన్స్ డెన్ టెలిగ్రాంలో వెల్లడించింది.

    2005 తరువాత వెస్ట్ బ్యాంక్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇదే అత్యధిక మరణాల సంఖ్య. ఇజ్రాయెల్ సైన్యం గత నెలలో జెనిన్‌లో ఇలాంటి దాడులే నిర్వహించింది. అందులో పది మంది మరణించారు.

  20. తజికిస్తాన్‌లో భూకంపం.. 6.8 తీవ్రత నమోదు, చైనాలోనూ ప్రకంపనలు

    భూకంపం

    ఫొటో సోర్స్, Getty Images

    తజికిస్తాన్‌లో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.

    స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం 5:37 గంటల (భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 6 గంటల) సమయంలో ఈ భూకంపం సంభవించింది.

    భూకంప కేంద్రం తూర్పు తజకిస్తాన్‌లోని ముర్గాబ్‌కు 67 కిలోమీటర్ల దూరంలో, ఉపరితలానికి 20.5 కిలోమీటర్ల లోతులో ఉంది.

    ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం గురించి ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం అందలేదు.

    జనాభా చాలా తక్కువగా ఉన్న గోర్నో-బాదాక్షాన్ పర్వతాల సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే చెప్తోంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది