ముదురుతున్న ‘గూఢచారి బెలూన్’ వివాదం, అమెరికా విదేశాంగ మంత్రి చైనా పర్యటన వాయిదా

చైనా 'గూఢచారి బెలూన్' అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఎగురుతున్నట్టు కనిపించడంతో, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటన వాయిదా పడింది. ఇది చైనా నిఘా బెలూనేనని అమెరికా అనుమానిస్తోంది.

లైవ్ కవరేజీ

  1. బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో ముగిస్తున్నాం

    మళ్లీ రేపు ఉదయం తాజా వార్తలతో కలుసుకుందాం.

    ధన్యవాదాలు.

  2. బ్రేకింగ్ న్యూస్, చైనా 'గూఢచారి బెలూన్' అంశంలో ఉద్రిక్తతలు.. అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ చైనా పర్యటన వాయిదా

    బ్లింకెన్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, బ్లింకెన్

    చైనా 'గూఢచారి బెలూన్' అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఎగురుతున్నట్టు కనిపించడంతో, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటన వాయిదా పడింది.

    వచ్చే వారం బ్లింకెన్ చైనాలో పర్యటించి, ఆ దేశ విదేశాంగ మంత్రిని, అధ్యక్షుడుషీ జిన్‌పింగ్‌ను కలవాల్సి ఉంది.

    అయితే, ఈ నిఘా బెలూన్ వల్ల ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో ఈ పర్యటన వాయిదా పడింది.

    చైనా 'గూఢచారి బెలూన్'

    ఫొటో సోర్స్, Reuters

    కాగా, ఆ బెలూన్‌ను వాతావరణ పరిశోధన కోసం ఉపయోగిస్తున్నారని, ప్రతికూల వాతావరణం కారణంగా అది దారి తప్పి అమెరికా వైపు వచ్చినట్టు చైనా తెలిపింది.

    ఈ సంఘటనపై "చింతిస్తున్నామని" చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

    అయితే, అది చైనా నిఘా బెలూనేనని గట్టిగా విశ్వసిస్తున్నట్టు అమెరికా అధికారులు చెబుతున్నారు.

  3. అదానీ: ఆందోళనలపై ఆర్‌బీఐ స్పందన.. 'బ్యాంకింగ్ రంగం బలంగా, స్థిరంగా ఉంది'

    ఆర్‌బీఐ

    ఫొటో సోర్స్, PTI

    అదానీ గ్రూపుకు భారతీయ బ్యాంకుల నుంచి అందిన రుణాలపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

    ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ఒక ప్రకటన జారీ చేసింది. దేశ బ్యాంకింగ్ వ్యవస్థ సరళంగా, స్థిరంగా ఉందని ఆర్‌బీఐ పేర్కొంది.

    "నియంత్రణ, పర్యవేక్షణ దృష్ట్యా ఆర్‌బీఐ నిరంతరం బ్యాంకింగ్ రంగాన్ని పరిశీలిస్తుంది. ఆర్థిక స్థిరత్వం దిశగా చర్యలు తీసుకుంటుంది.పెద్ద రుణాలకు సబంధించి ఆర్‌బీఐ దగ్గర డాటాబేస్ ఉంది. ఇందులో అయిదు కోట్లకు పైగా ఇచ్చిన రుణాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది.

    ఆర్‌బీఐ అంచనా ప్రకారం, దేశంలో బ్యాంకింగ్ రంగం సరళంగా, స్థిరంగా ఉంది. మూలధన సమృద్ధి, ఆస్తి నాణ్యత, ద్రవ్యత, లాభదాయకతకు సంబంధించిన వివిధ ప్రమాణాలు అన్నీ బావున్నాయి. బ్యాంకులు అన్నీ ఆర్‌బీఐ 'లార్జ్ ఎక్స్‌పోజర్ ఫ్రేమ్‌వర్క్' మార్గదర్శకాలను అనుసరిస్తున్నాయి" అని ఆ ప్రకటనలో తెలిపింది.

    అదానీ గ్రూపు స్టాక్ రిగ్గింగ్, అకౌంటింగ్ మోసాలకు పాల్పడినట్లు ఇటీవల హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపించింది.

    అయితే, ఆ నివేదిక నిరాధారమైనదని, దేశంపై దాడి అని అదానీ గ్రూపు ఖండించింది.

    ఈ నివేదిక వెలువడిన దగ్గర నుంచి అదానీ గ్రూపు షేర్లు పడిపోతున్నాయి. అదానీ గ్రూపు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

  4. అమెరికా ఆకాశంలో చైనా 'గూఢచారి బెలూన్' ఎగురుతోందా?

  5. గౌతం అదానీ రూ. 20,000 కోట్ల పబ్లిక్ ఆఫర్‌ను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది?

  6. వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన మంగళగిరి క్రికెట్ స్టేడియం నేటికీ ఎందుకు పూర్తి కాలేదు?

  7. గౌతమ్ అదానీ కంపెనీలపై హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్... 10 రోజుల్లో 8 లక్షల కోట్లు మాయం

  8. హిండెన్‌బర్గ్ మీద విచారణ కోరుతూ సుప్రీం కోర్టులో పిల్

    సుప్రీం కోర్టు

    ఫొటో సోర్స్, ANI

    అదానీ గ్రూప్ మీద ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కంపెనీ మీద విచారణ చేపట్టేలా ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో పిల్ వేశారు.

    హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో ‘అమాయకులైన మదుపర్లు నష్టపోయారు’ అంటూ ఎంఎల్ శర్మ అనే లాయర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు.

    హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్‌ మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టాలని పిటిషనర్‌దారు కోరారు.

    అదానీ గ్రూప్ ‘మోసాలకు పాల్పడింది’ అంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్, జనవరి 24న రిపోర్ట్‌ను విడుదల చేసింది.

    ఆ నివేదికను అదానీ గ్రూప్ ఖండించింది. హిండెన్‌బర్గ్ సంస్థ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

    ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్‌కు చెందిన షేర్లు కొన్ని రోజులుగా భారీ నష్టాలను చవి చూస్తున్నాయి. గత 10 రోజుల్లో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ సుమారు రూ.8 లక్షల కోట్లు తగ్గిపోయింది.

  9. రిటైర్మెంట్ ప్రకటించిన టీ20 వరల్డ్‌ కప్ ‘హీరో’ జోగిందర్ శర్మ

    జోగిందర్ శర్మ

    ఫొటో సోర్స్, Getty Images

    క్రికెటర్ జోగిందర్ శర్మ తన కెరియర్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.

    మీడియం పేసర్ అయిన జోగిందర్ శర్మ, 2007 టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో పాకిస్తాన్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో చివరి ఓవర్ వేశాడు.

    చివరి ఓవర్లలో పాకిస్తాన్ బ్యాటర్ మిస్బాహ్ ఉల్ హక్‌ను అవుట్ చేయడం ద్వారా భారత్‌కు గెలుపు అందించాడు.

    జోగిందర్ శర్మ తన కెరియర్‌లో నాలుగు అంతర్జాతీయ వన్డేలు, నాలుగు టీ20లు ఆడాడు. ఆ తరువాత హరియాణ పోలీసు విభాగంలో ఆయనకు డీఎస్‌పీ ఉద్యోగం ఇచ్చారు.

    రిటైర్మెంట్ సందర్భంగా బీసీసీఐ, హరియాణ క్రికెట్ అసోసియేషన్, చెన్నై సూపర్ కింగ్స్, హరియాణ ప్రభుత్వానికి జోగిందర్ శర్మ ధన్యవాదాలు తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. మైఖేల్ సినిమా రివ్యూ: గ్యాంగ్‌స్ట‌ర్ సందీప్ కిషన్ బుల్లెట్ దించాడా... లేదా?

  11. ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

  12. బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు

    నరేంద్ర మోదీ మీద బీబీసీ డాక్యుమెంటరీ

    ఫొటో సోర్స్, Getty Images

    బీబీసీ డాక్యుమెంటరీని ‘నిషేధించడం’ మీద కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

    నరేంద్ర మోదీ మీద బీబీసీ తీసిన ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ అనే డాక్యుమెంటరీ వీడియో లింకులను షేర్ చేయకుండా ట్విటర్, యూట్యూబ్‌లను కేంద్రం ఆదేశించినట్లు వార్తాలు వచ్చాయి.

    దీన్ని చాలెంజ్ చేస్తూ సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్, ది హిందూ మాజీ ఎడిటర్ ఎన్.రామ్ వంటి వారు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.

    ఆ పిటిషన్‌ను నేడు విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం, బీబీసీ డాక్యుమెంటరీ నిషేధం మీద స్పందించాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

    నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఒరిజనల్ డాక్యుమెంట్స్‌ను సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని సుప్రీం కోర్టు అడిగింది.

    తదుపరి విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ‘ద మోదీ క్వశ్చన్ అనే రెండు భాగాల బీబీసీ డాక్యుమెంటరీ నిషేధాన్ని సవాల్ చేస్తూ మేం (ఎన్.రామ్, మహువా మోయిత్ర, నేను) వేసిన పిటిషన్ మీద సుప్రీం కోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

    మొత్తం ఫైల్‌ను కోర్టు ముందు ఉంచాల్సిందిగా కోరింది’ అంటూ సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు.

    ఇందుకు సంబంధించి మహువా మోయిత్ర కూడా ట్వీట్ చేశారు.

    బీబీసీ డాక్యుమెంటరీ మీద ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలంటూ న్యాయవాది మనోహర్ లాల్ శర్మ వేసిన పిటిషన్ మీద కూడా సుప్రీం కోర్టు విచారణ జరపుతోంది.

    2002లో గుజరాత్ అల్లర్లలో ముస్లింలు చనిపోవడానికి సంబంధించి నాడు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ పాత్ర మీద ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ పేరిట రెండు భాగాలను విడుదల చేసింది.

    ఆ డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం ఖండించింది.

    బీబీసీ డాక్యుమెంటరీకి నిరసనగా బీజేపీ నేతలు, హిందుత్వగ్రూపులకు చెందిన వారు నిరసనలకు దిగారు.

    కొన్ని యూనివర్సిటీలలో కొందరు విద్యార్థులు బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించాలని ప్రయత్నించడంతో వివాదాలు చెలరేగాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  13. రష్యా, యుక్రెయిన్ యుద్ధం: ‘యుద్ధ ఖైదీలను మా సైనికులు కాల్చి చంపారు’ - బీబీసీకి రష్యా మాజీ సైనికాధికారి వెల్లడి

  14. అమెరికా స్టాక్ సూచీ నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్ తొలగింపు

    గౌతమ్ అదానీ

    ఫొటో సోర్స్, Reuters

    అదానీ గ్రూపు సంస్థలకు అమెరికా స్టాక్ మార్కెట్ నుంచి భారీ ఎదురు దెబ్బ తగిలింది.

    అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను డవ్ సస్టైనబిలిటీ సూచీల నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు అమెరికా ఎస్ అండ్ పి డవ్ జోన్స్ ఇండీసెస్ గురువారం నాడు ప్రకటించింది.

    అదానీ ఎంటర్‌ప్రైజెస్ మీద స్టాక్‌ల అవకతవకలు, ఖాతాల మోసాల ఆరోపణల నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు డవ్ జోన్స్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

    అదానీ ఎంటర్‌ప్రైజెస్

    ఫొటో సోర్స్, www.spglobal.com

    ఈ నిర్ణయాన్ని ఫిబ్రవరి 7వ తేదీన అమలు చేయనున్నట్లు తెలిపింది.

    ఈ వార్త నేపథ్యంలో.. అంతర్జాతీయ సూచీలు అదానీ స్టాక్ సభ్యత్వాన్ని పునఃపరిశీలిస్తుండగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ అలా ఎందుకు చేయటం లేదని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ప్రశ్నించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. అమూల్ పాల ధరల పెంపు: లీటరుకు రూ. 3 చొప్పున పెరిగిన ధర.. తక్షణమే అమల్లోకి

    అమూల్ పాలు

    ఫొటో సోర్స్, Getty Images

    అమూల్ సంస్థ తన అన్ని రకాల పాల ప్యాకెట్ల ధరలను లీటరుకు రూ. 3 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది.

    ఈ పెంపు తక్షణమే అమలులోకి వచ్చినట్లు ఆ సంస్థ చెప్పింది.

    గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.

    ఆ ప్రకటన ప్రకారం.. ‘అమూల్ గోల్డ్’ పాల ధర లీటరు 66 రూపాయలకు పెరిగింది. ‘అమూల్ తాజా’ పాల ధర లీటరు 54 రూపాయలు అయింది.

    అమూల్ ఆవు పాల ధర లీటరు 56 రూపాయలకు పెరిగింది. అమూల్ బఫెలో పాల ధర లీటరు 70 రూపాయలకు పెరిగింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. ‘అతడు నన్ను చంపేసుండేవాడు.. ఇద్దరు పిల్లలు పుట్టాక విడిపోయినా హింస కొనసాగింది’

  17. అదానీ గ్రూపులో ఎల్ఐసీ, ఎస్‌బీఐ పెట్టుబడులపై స్వతంత్ర దర్యాప్తు డిమాండ్‌తో విపక్ష నేతల భేటీ

    ప్రతిపక్ష నేతల భేటీ

    ఫొటో సోర్స్, Getty Images

    అదానీ గ్రూప్ సంస్థల షేర్లు దారుణంగా పడిపోవటంతో తలెత్తిన పరిస్థితిపై చర్చించటానికి ప్రతిపక్ష పార్టీల నాయకులు శుక్రవారం పార్లమెంటులో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే చాంబర్‌లో సమావేశమయ్యారు.

    అదానీ గ్రూప్‌లో ఎల్ఐసీ, ఎస్‌బీఐ తదితర సంస్థల పెట్టుబడులపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ‘‘ప్రధానమంత్రి బలవంతంగా ఈ సంస్థలతో అదానీ గ్రూపులో పెట్టుబడులు పెట్టించారు. స్వతంత్ర దర్యాప్తు మాత్రమే ఈ సంస్థలను రక్షించగలదు. ఆ డిమాండ్‌తో ప్రతిపక్ష నేతలు సమావేశమవుతున్నారు’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు.

    ఈ అంశంపై గురువారం నాడు పార్లమెంటులో నోటీసులు ఇచ్చామని కానీ ఎలాంటి చర్చా జరగలేదని ఖర్గే ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు. తదుపరి కార్యాచరణ గురించి ప్రతిపక్ష నేతల భేటీలో చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  18. ఐఫోన్: రికార్డు స్థాయిలో పడిపోయిన యాపిల్ అమ్మకాలు

    ఐఫోన్

    ఫొటో సోర్స్, Getty Images

    ఐఫోన్ దిగ్గజ సంస్థ యాపిల్‌ అమ్మకాలు 2021 సంవత్సరం చివరి మూడు నెలలతో పోలిస్తే 2022 చివరి మూడు నెలల్లో 5 శాతం పడిపోయాయి.

    యాపిల్ విక్రయాల్లో 2019 తర్వాత అతి పెద్ద పతనం ఇది. ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా అమ్మకాలు తగ్గిపోయాయి.

    మహమ్మారి కాలంలో వృద్ధి బాటలో సాగిన టెక్ రంగంలో ఆర్థిక మాంద్యం తీవ్రమవుతోందని చాలా సంస్థలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో యాపిల్ అమ్మకాల పతనం వివరాలు వెల్లడయ్యాయి.

    యాపిల్ ‘సవాళ్ల పరిస్థితిల’ను ఎదుర్కొంటోందని సంస్థ అధినేత టిమ్ కుక్ పేర్కొన్నారు.

    ఐఫోన్లు తయారయ్యే చైనాలో కోవిడ్ అవాంతరాల వల్ల సరఫరాలు తగ్గటం, డాలర్ బలోపేతం కావటం, ధరల పెరుగుదల వల్ల ఆర్థిక వ్యవస్థ బలహీన పడుతుండటం.. అమ్మకాలు తగ్గటానికి కారణాలని ఆయన చెప్పారు.

    ఐఫోన్ల అమ్మకాలు 8 శాతం తగ్గగా, మ్యాక్ కంప్యూటర్ల అమ్మకాలు 29 శాతం తగ్గినట్లు యాపిల్ వెల్లడించింది. ఈ తగ్గుదల కారణంగా సంస్థ లాభాలు 13 శాతం తగ్గిపోయి 3,000 కోట్ల డాలర్లకు దిగజారినట్లు వివరించింది.

    మార్కెట్ ఎనాలిసిస్ సంస్థ కానలిస్ చెప్తున్నదాని ప్రకారం.. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల సరఫరా 12 శాతం తగ్గిపోయింది.

  19. గౌతమ్ అదానీ: 25 ఏళ్ల క్రితం గుజరాత్‌లో అదానీని కిడ్నాప్ చేసింది ఎవరు? అప్పుడు ఏం జరిగింది?

  20. కె.విశ్వనాథ్‌ మృతికి అనిల్ కపూర్ సంతాపం

    కె.విశ్వనాథ్‌తో అనిల్ కపూర్

    ఫొటో సోర్స్, Anil Kapoor/Twitter

    సీనియర్ సినిమా దర్శకుడు కె.విశ్వనాథ్ మృతికి బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ సంతాపం తెలియజేశారు.

    ‘కె.విశ్వనాథ్ గారు, మీరు నాకు చాలా నేర్పించారు. ఈశ్వర్ సినిమా సెట్‌లో మీరు ఉంటే గుడిలో ఉన్నట్లు అనిపించేది.

    గురువు గారు, మీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ అనిల్ కపూర్ ట్వీట్ చేశారు.

    కె.విశ్వనాథ్ హిందీలోనూ కొన్ని సినిమాలు తీశారు.

    అనిల్ కపూర్, జితేంద్ర, మిథున్ చక్రవర్తి వంటి నటులు ఆయన సినిమాలలో నటించారు.

    తెలుగులోని స్వాతిముత్యం సినిమాను అనిల్ కపూర్‌తో ఈశ్వర్ పేరుతో హిందీలో కె.విశ్వనాథ్ రీమేక్ చేశారు.