ఇమ్రాన్ ఖాన్: కాల్పుల ఘటన తర్వాత తొలిసారి ర్యాలీలో పాల్గొన్న పాక్ మాజీ ప్రధాని

రావల్పిండిలో ర్యాలీ కోసం జెండాలతో వచ్చిన మద్దతుదారులతో మాట్లాడుతూ ప్రాణభయం లేకుండా జీవించాలని అన్నారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. ఇమ్రాన్ ఖాన్: కాల్పుల ఘటన తర్వాత తొలిసారి ర్యాలీలో పాల్గొన్న పాక్ మాజీ ప్రధాని, జేమ్స్ ఫిట్జ్ గెరాల్డ్, బీబీసీ న్యూస్

    సభలో ప్రసంగించడానికి వెళ్తోన్న ఇమ్రాన్ ఖాన్

    ఫొటో సోర్స్, REUTERS

    మూడు వారాల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చడంతో గాయపడిన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలిసారి శనివారం ఒక బహిరంగ ప్రదర్శనలో పాల్గొన్నారు.

    ర్యాలీ కోసం గుమిగూడిన లక్షలాది మంది మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు.

    రావల్పిండిలో ర్యాలీ కోసం జెండాలతో వచ్చిన మద్దతుదారులతో మాట్లాడుతూ ప్రాణభయం లేకుండా జీవించాలని అన్నారు.

    ఈ నెల ప్రారంభంలో ఇమ్రాన్ ఖాన్ ప్రయాణిస్తోన్న వాహనంపై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి.

    ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్ కుడి కాలికి గాయం కాగా శస్త్రచికిత్స చేశారు. వజీరాబాద్‌లో తనపై జరిగిన దాడికి ప్రస్తుత ప్రభుత్వ సభ్యులే కారణమని ఆయన ఆరోపించారు.

    ర్యాలీలో పాల్గొన్న మద్దతుదారులు

    ఫొటో సోర్స్, Reuters

  3. ‘పీల్చడానికి మీకు ఆక్సిజన్ వద్దా?’

  4. జైలు నుంచి బయటకు వచ్చాక ప్రొఫెసర్ ఆనంద్ తెల్‌తుంబ్డే ఏమన్నారు?

    ఆనంద్ తెల్‌తుంబ్డే

    ఫొటో సోర్స్, Getty Images

    మానవ హక్కుల రచయిత, దళిత మేధావి, ప్రొఫెసర్ ఆనంద్ తెల్‌తుంబ్డే బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చారు.

    ఎల్గార్ పరిషద్, మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో యూఏపీఏ చట్టం కింద అరెస్టయిన తెల్‌తుంబ్డే... నవీ ముంబైలోని తలోజా సెంట్రల్ జైలులో 31 నెలలు ఖైదీగా ఉన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    బెయిల్ మీద బయటకొచ్చిన ఆయన... 31 నెలల తర్వాత జైలు నుంచి బయటకు రావడం సంతోషంగా ఉందని అన్నట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.

    కానీ, ఒక ఫేక్ కేసులో మమ్మల్ని ఏళ్ల పాటు జైల్లో ఉంచడం చాలా బాధకరమని ఆయన వ్యాఖ్యానించినట్లు పీటీఐ తెలిపింది.

    నక్సలైట్ల నుంచి డబ్బు తీసుకుంటూ వారి భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ కొత్త నక్సలైట్లను సిద్ధం చేస్తున్నాడని 73 ఏళ్ల ఆనంద్ తెల్‌తుంబ్డేపై ఆరోపణలు ఉన్నాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  5. జెలెన్‌స్కా, జెలియెన్‌స్కీ: యుద్ధం వారిని వేరు చేసింది.. కర్తవ్యం చేరువ చేసింది

  6. ఫిఫా వరల్డ్ కప్: సౌదీ అరేబియాపై పోలాండ్ గెలుపు

    పోలాండ్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫిపా ప్రపంచకప్ తమ తొలి మ్యాచ్‌లో అర్జెంటీనాపై గెలుపొంది ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన సౌదీ అరేబియా రెండో మ్యాచ్‌లో ఓటమి పాలైంది.

    శనివారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో పోలాండ్ 2-1తో సౌదీ అరేబియాపై గెలుపొందింది.

    పోలాండ్ తరఫున మ్యాచ్ 39వ నిమిషంలో జిలెన్‌స్కీ, ఆట 89వ నిమిషంలో లెవాన్‌డోస్కీ చెరో గోల్ సాధించారు.

  7. కస్టమర్ కేర్ ఉద్యోగాల పేరుతో వ్యభిచారం, సైబర్ క్రైమ్‌లోకి

  8. సముద్రంలో పడిపోయిన వ్యక్తి.. 15 గంటల తర్వాత ప్రాణాలతో బయటకు

    క్రూయిజ్ పడవ

    ఫొటో సోర్స్, Getty Images

    గల్ఫ్ ఆఫ్ మెక్సికో గుండా ప్రయాణిస్తోన్న ఒక క్రూయిజ్ పడవ నుంచి తప్పిపోయిన వ్యక్తిని 15 గంటల తర్వాత కోస్ట్‌గార్డ్ సిబ్బంది రక్షించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

    28 ఏళ్ల వ్యక్తి బుధవారం చివరిసారిగా తన సోదరితో కలిసి కనిపించారు. తర్వాత బాత్రూంలోకి వెళ్లిన ఆయన మళ్లీ బయటకు రాలేదు.

    అతని కోసం సహాయక సిబ్బంది సముద్రంలో తీవ్రంగా గాలించారు. తప్పిపోయిన దాదాపు 15 గంటల తర్వాత గురువారం సాయంత్రం లూసియానా తీరానికి 30 కి.మీ దూరంలో ఆయనను కనుగొన్నారు.

    ఈ విషయాన్ని యూఎస్ కోస్ట్‌గార్డ్ సభ్యులు ధ్రువీకరించారు.

    అతను దాదాపు 15 గంటలకు పైగా సముద్రం లోపల ఉండొచ్చని కోస్ట్‌గార్డ్ లెఫ్టినెంట్ సేథ్ గ్రాస్ తెలిపారు. నీటి లోపల ఇంత సమయం పాటు ప్రాణాలతో ఉండటం ఒక అద్భుతమని ఆయన వ్యాఖ్యానించారు.

    ఆ వ్యక్తిని కాపాడే దృశ్యాన్ని కింది వీడియోలో చూడండి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. హాయిగా నిద్ర పట్టాలంటే ఇంట్లో ఎలాంటి మార్పులు చేయాలి?

  10. ఈ భారీ బిలాల రహస్యం ఏమిటి, హఠాత్తుగా భూమి ఎందుకు విస్ఫోటం చెందుతోంది?

  11. ఫిఫా వరల్డ్ కప్: ఉత్కంఠ పోరులో ట్యూనీషియాపై ఆస్ట్రేలియా గెలుపు

    ఫుట్‌బాల్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫిఫా ప్రపంచకప్‌ గ్రూప్ ‘డి’లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 1-0తో ట్యూనీషియాపై గెలుపొందింది.

    మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను ఆస్ట్రేలియా క్రీడాకారుడు మిచెల్ డ్యూక్ చేశాడు.

    మ్యాచ్ 23వ నిమిషంలో ఈ గోల్ నమోదైంది.

    మరోవైపు ట్యూనీషియాకు మ్యాచ్‌లో పలుమార్లు గోల్ చేసే అవకాశం వచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది.

    ట్యూనీషియా ప్లేయర్ యూసుఫ్ సకినీ ఆరుసార్లు గోల్ పోస్ట్‌లోకి బంతిని పంపేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.

  12. గోదావరి (మరాఠీ) చిత్ర నటుడు విక్రమ్ గోఖలే మృతి

    విక్రమ్

    ఫొటో సోర్స్, Getty Images

    హిందీ, మరాఠీ ప్రముఖ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూశారు.

    కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న 77 ఏళ్ల విక్రమ్ గోఖలే శనివారం పుణేలోని దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.

    ఈ వార్తను ఆయన కుమార్తె ధ్రువీకరించారు.

    విక్రమ్ గోఖలే మరాఠీ చిత్రాలతో పాటు అగ్నిపథ్, హమ్ దిల్ చుకే సనమ్ (1999), భూల్ భూలయ్య (2007) వంటి హిందీ సినిమాల్లో కూడా నటించారు.

    ఆయన నటించిన మరాఠీ చిత్రం ‘గోదావరి’ థియేటర్లలో నడుస్తోంది.

  13. 26/11 ముంబై దాడులు: అజ్మల్ కసబ్‌తో పాటు మిగిలిన 9 మంది మృతదేహాలను ఏం చేశారు?

  14. రిషబ్ పంత్, సంజూ శాంసన్.. టీమ్ ఇండియాలో చోటు ఎవరికి దక్కాలి?

  15. కోహ్లి చేసిన ట్వీట్ తర్వాత రిటైర్మెంట్ ఊహాగానాలు ఊపందుకున్నాయి ఎందుకు?

    కోహ్లి

    ఫొటో సోర్స్, Getty Images

    భారత క్రికెటర్ విరాట్ కోహ్లి శనివారం ట్విటర్‌లో ఒక ఫొటో పోస్ట్ చేశాడు. దీని తర్వాత అతని రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు మొదలయ్యాయి.

    ప్రస్తుతం న్యూజీలాండ్‌ సిరీస్‌ నుంచి కోహ్లికి విశ్రాంతి ఇచ్చారు. ఈ సమయంలో ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వేదికల్లో మెల్‌బోర్న్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు సంబంధించిన తన ఫొటోను విరాట్ పోస్ట్ చేశాడు. చేతిలో బ్యాట్ పట్టుకొని కోహ్లి వెళ్లిపోతున్నట్లుగా ఆ ఫొటో ఉంది.

    ‘‘2022 అక్టోబర్ 23కు నా మనస్సులో ఎప్పుడూ ప్రత్యేక చోటు ఉంటుంది. ఇంతకుముందెన్నడూ ఏ మ్యాచ్‌లోనూ అలాంటి అనుభూతిని అనుభవించలేదు. ఎంత అద్భుతమైన సాయంత్రం అది’’ అని కోహ్లి ఆ ఫోటోకు వ్యాఖ్యను జోడించాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఆ మ్యాచ్‌లో కోహ్లి 53 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఆఖరి వరకు ఉత్కంఠ రేకెత్తించిన ఆ మ్యాచ్‌లో కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌ వల్ల భారత్ గెలుపొందింది.

    విరాట్ కోహ్లి ఆ ట్వీట్ చేసిన తర్వాత రిటైర్మెంట్ గురించి అతను ఏమైనా సూచనలు ఇస్తున్నాడా? అని క్రికెట్ అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    ఒక ట్విటర్ యూజర్ ఇలా రాసుకొచ్చాడు. ‘‘సోదరా, అలాంటి ఫొటో పెట్టి దయచేసి ఏమీ రాయొద్దు. ఎక్కడ రిటైర్మెంట్ ప్రకటిస్తావో అని మా గుండె కొట్టుకునే వేగం పెరుగుతోంది’’ అని తన భయాన్ని బయటపెట్టాడు.

    సోనీ అనే మరో ఖాతాదారు కూడా ఇలాగే తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘‘ఆ ట్వీట్ చూడగానే ‘ఆర్’ శబ్ధాన్ని వినాల్సి వస్తుందేమో అని భయపడ్డా’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

    ‘‘వేరే ఏదైనా మంచి ఫొటోను పంచుకుంటే బాగుండేది. పొద్దుపొద్దున్నే హార్ట్ ఎటాక్ తెప్పించే పని చేశావ్’’ అని కాఫీ బుక్స్ అనే వినియోగదారుడు రాసుకొచ్చారు.

    కోహ్లితో పాటు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, అశ్విన్, షమీ, దినేశ్ కార్తీక్ కూడా కివీస్ సిరీస్‌కు దూరంగా ఉన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

  16. గుజరాత్‌లో మళ్లీ అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు – బీజేపీ మేనిఫెస్టో

    బీజేపీ గుజరాత్ ఎన్నికల ప్రణాళిక

    ఫొటో సోర్స్, @BJP4India

    గుజరాత్‌లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అందిస్తామని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల నుంచి 10 లక్షల కోట్లకు పెంచుతామని ఆ పార్టీ హామీ ఇచ్చింది.

    అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌లు శనివారం విడుదల చేశారు.

    • ఆయుష్మాన్ భారత్ కింద అందించే ఆరోగ్య బీమా కవరేజీని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచుతామని చెప్పారు.
    • సుజలాం సుఫలాం పథకం కింద 25,000 కోట్లు ఖర్చు చేసి సాగు నీటి సదుపాయాలను పెంపొందిస్తామన్నారు.
    • ఆర్థికంగా బలహీన వర్గాల వారికి అన్ని రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేయిస్తామని చెప్పారు.
    • వచ్చే ఐదేళ్లలో 10,000 కోట్ల రూపాయల ఖర్చుతో 20 వేల ప్రభుత్వ పాఠశాలలను స్కూల్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు.
    • అగ్రస్థాయి కాలేజీల్లో అడ్మిషన్లు పొందే ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ, ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులకు రూ. 50,000 ప్రోత్సాహకంగా అందిస్తామన్నారు.
    • రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కుటుంబాలకు అందించటానికి కుటుంబ గుర్తింపు కార్డులు ఏర్పాటు చేస్తామన్నారు.
    • కార్మికుల కోసం లేబర్ క్రెడిట్ కార్డులు అందిస్తామని, వాటి ద్వారా 2 లక్షల రూపాయల వరకూ వడ్డీ లేని రుణాలు పొందవచ్చునని చెప్పారు.
    • దక్షిణ గుజరాత్, సౌరాష్ట్రల్లో రెండు సీ ఫుడ్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు.
    • నాలుగు గుజరాత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యా సంస్థలను అభివృద్ధి చేస్తామన్నారు.
    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. ఆసియా కప్‌ పోటీలకు భారత జట్టు పాకిస్తాన్ రాకపోతే.. భారత్‌లో జరిగే ప్రపంచ కప్ టోర్నీకి పాక్ జట్టు వెళ్లదు: రమీజ్ రాజా

    రమీజ్ రజా

    ఫొటో సోర్స్, ANI

    వచ్చే ఏడాది పాకిస్తాన్‌లో జరగబోయే ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌కు భారత జట్టు హాజరు కాకపోతే.. 2023లో భారత్‌లో జరిగే ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటుకు పాక్ జట్టు హాజరు కాదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) చైర్మన్ రమీజ్ రజా చెప్పారు.

    ఆసియా కప్ టోర్నమెంటు కోసం భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లే ప్రసక్తే లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) కార్యదర్శి జే షా అక్టోబర్‌లో స్పష్టం చేశారు. ఆసియా కప్ టోర్నమెంటును తటస్థ వేదిక మీద నిర్వహిస్తారని పేర్కొన్నారు.

    ఈ అంశంపై రమీజ్ రజా స్పందిస్తూ.. తాము కఠిన వైఖరి అవలంబిస్తామన్నారు. పాక్ జట్టు ఏడాది కాలంలో రెండు సార్లు ‘బోర్డ్ ఆఫ్ బిలియన్ డాలర్ ఎకానమీ’ని ఓడించి గొప్ప ప్రదర్శన చూపిందని పేర్కొన్నారు. పాక్ జట్టు 2021 టీట్వంటీ వరల్డ్ కప్ పోటీల్లోను, ఈ ఏడాది ఆసియా కప్ పోటీల్లోను భారత జట్టును ఓడించటాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    ‘‘మా వైఖరిలో మొహమాటం లేదు. వాళ్లు (భారత జట్టు) వస్తే మేం ప్రపంచ కప్‌కు వెళ్తాం. వాళ్లు రాకపోతే రాకపోనివ్వండి. పాకిస్తాన్ లేకుండానే ఆడుకోనివ్వండి. వచ్చే ఏడాది భారతదేశంలో జరిగే ప్రపంచ కప్ (50 ఓవర్ల వన్‌ డే క్రికెట్ ప్రపంచ కప్) పోటీల్లో పాకిస్తాన్ పాల్గొనకపోతే దానిని ఎవరు చూస్తారు?’’ అని రమీజ్ రజా చెప్పారు.

  18. పంజాబ్: పాక్ సరిహద్దులో అనుమానాస్పద డ్రోన్ కూల్చివేత

    డ్రోన్

    ఫొటో సోర్స్, Getty Images

    పంజాబ్‌లోని అమృత్‌సర్ సెక్టార్‌లో భారత్ – పాకిస్తాన్ సరిహద్దు వద్ద ఒక డ్రోన్‌ను బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపి నేలకు కూల్చారు.

    సరిహద్దు దగ్గరి డోక్ గ్రామం వద్ద శుక్రవారం ఈ సంఘటన జరిగింది. ఆ డ్రోన్ పాకిస్తాన్ నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించిందని బీఎస్ఎఫ్ చెప్తోంది.

    జవాన్లు అనుమానాస్పద డ్రోన్ ఎగురుతున్న శబ్దం విని ఈ డ్రోన్‌ను కూల్చివేసినట్లు తెలిపింది. అనంతరం ఈ ప్రాంతం మొత్తాన్నీ మూసివేసి పోలీసులకు, సంబంధిత విభాగాలకు సమాచారం అందించారు.

    ఏఎన్ఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఈ డ్రోన్ నుంచి 2.5 కిలోల బరువున్న రెండు మాదకద్రవ్యాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  19. నూరా, ఆదిలా: లెస్బియన్ జంటకు పెళ్లి కళ..వెడ్డింగ్ ఫొటోషూట్‌కు అభినందనల వెల్లువ

  20. యాంటీబయాటిక్స్ ఇష్టారాజ్యంగా వాడేస్తున్నామా? వీటితో ప్రాణాలు పోయే పరిస్థితి ఎందుకు వస్తుంది?