లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
మళ్లీ స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం కలుద్దాం.
ఇవాళ ఉదయం ఫోర్జరీ అభియోగాలపై అయ్యన్నపాత్రుడు, అతను కుమారుడు రాజేష్ ని నర్సీపట్నంలోని ఇంట్లో అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు విశాఖపట్నం తరలించారు.
అరుణ్ శాండిల్య
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
మళ్లీ స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం కలుద్దాం.

ఫొటో సోర్స్, tdp
అయ్యన్నపాత్రుడికి రిమాండ్ విధించాలన్న సీఐడీ విజ్ఞప్తిని విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది.
ఈ కేసులో 467 సెక్షన్ వర్తించదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఇవాళ ఉదయం ఫోర్జరీ అభియోగాలపై అయ్యన్నపాత్రుడు, అతను కుమారుడు రాజేష్ ని నర్సీపట్నంలోని ఇంట్లో అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు విశాఖపట్నం తరలించారు.
వీరిని విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.
ఈ కేసులో 467 సెక్షన్ వర్తించదని స్పష్టం చేసింది.
41ఏ నోటీసు ఇచ్చి...ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోవచ్చని ఆదేశాలిచ్చింది.

ఫొటో సోర్స్, Facebook/KCR
ఇటీవల జరిగిన ‘టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు’ వ్యవహారం మీద కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు.
మునుగోడు పోలింగ్ ముగిసిన తరువాత ఆయన మీడియా ముందుకు వచ్చారు.
ఫాం హౌస్‌లో జరిగింది దానికి సంబంధించి తమ వద్ద మూడు గంటల నిడివి గల వీడియో ఉందని దాన్ని కోర్టులకు సమర్పించామని ఆయన అన్నారు.
అందులో వారు రూ.100 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చాలా ఓపెన్‌గా ఆఫర్ ఇచ్చారని ఆయన తెలిపారు.
‘రామచంద్ర భారతి కొంత కాలంగా తెలంగాణకు వచ్చి ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా మా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కాంటాక్ట్ అయ్యారు.
వారు ఎం చేస్తున్నారో తెలుసుకున్నాక రోహిత్ రెడ్డి మాకు సమాచారం ఇచ్చాడు.
8 ప్రభుత్వాలను ఇప్పటికే కూలగొట్టాం. ఇంకో నాలుగు ప్రభుత్వాలను కూలగొట్టే ప్రయత్నాల్లో ఉన్నాం.
తరువాత తెలంగాణ, దిల్లీ తరువాత ఆంధ్రప్రదేశ్ ఆ తరువాత రాజస్థాన్ రాష్ట్రాల ప్రభుత్వాలను కూలగొడతాం’ అంటూ బెదిరిస్తూ మాట్లాడారు అని కేసీఆర్ వివరించారు.
మునుగోడులో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
అయితే, సాయంత్రం 5 గంటల సరికి క్యూలో ఉన్న అందరికీ ఓటు వేసే అవకాశం ఇవ్వడంతో సాయంత్రం 6 గంటలు దాటినా పోలింగ్ కొనసాగింది.
2018లో ఇక్కడ 91.30 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి సాయంత్రం 5 వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం 77.55 శాతం నమోదైంది.

ఫొటో సోర్స్, ceo telangana
ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్‌పై జరిగిన దాడి ఘటనలో ఒకరు మృతి చెందారని, మరో 8 మంది గాయపడ్డారని వజీరాబాద్ సివిల్ హాస్పిటల్ అధికారులు తెలిపారు.
దాడి తరువాత హాస్పిటల్‌కు తెచ్చినప్పటికే ఒకరు మృతి చెందినట్లు వారు తెలిపారు.
కాగా ఈ దాడిలో గాయపడిన ఇమ్రాన్ ఖాన్‌ను లాహోర్‌లోని షౌకత్ ఖానుమ్ ఆసుపత్రికి తరలించిన తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ నేతలు చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 33 పరుగుల తేడాతో గెలిచింది.
టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
20 ఓవర్లలో 185 పరుగులు చేసింది.
ఇఫ్తికర్ అహ్మద్(51), షాదాబ్ ఖాన్(52) అర్ధ సెంచరీలు చేశారు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మరొకసారి విఫలమయ్యాడు. 6 పరుగులు మాత్రమే చేశాడు.
186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అప్పటికి 11.5 ఓవర్ల మ్యాచ్ మాత్రమే జరిగింది.
ఆ తరువాత వాన రావడంతో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. దాంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం దక్షిణాఫ్రికా టార్గెట్‌ను 14 ఓవర్లకు 142గా నిర్ణయించారు.
అయితే 14 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 108 పరుగులు మాత్రమే దక్షిణాఫ్రికా చేయగలిగింది.

ఫొటో సోర్స్, EPA
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మీద కాల్పులు జరిగాయి.
ఈ ఘటనలో ఆయన కాలికి బుల్లెట్ తగిలినట్లు పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) జనరల్ సెక్రటరీ అసద్ ఉమర్ తెలిపారు.
పాకిస్తాన్‌లోని గుజ్రాన్‌వాలా వద్ద గల అల్లాహ్‌వాలా చౌక్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
ఎంపీ ఫైజల్ జావేద్ కూడా గాయపడినట్లు బీబీసీ ఉర్దూ తెలిపింది. మొత్తం మీద ఈ ఘటనలో ముగ్గురు లేదా నలుగురు గాయపడినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఒక వ్యక్తిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కాల్పులు జరిపింది ఆ వ్యక్తేనా కాదా అనేది ఇంకా నిర్దారించలేదు.
ఇమ్రాన్ ఖాన్‌ను ప్రస్తుతం లాహోర్‌కు తరలించారు.
ఇమ్రాన్ ఖాన్ కాలికి బుల్లెట్ తగిలినట్లు, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ జనరల్ సెక్రటరీ అసద్ ఉమర్ తెలిపారు.
ప్రస్తుతం ఆయనను లాహోర్‌కు తరలించారు.

ఫొటో సోర్స్, ceo telangana
మునుగోడు ఉప ఎన్నికలో మధ్యాహ్నం 3 గంటల వరకు 59.92 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న ఓటర్లందరికీ ఓటేసే అవకాశం కల్పిస్తారు.
కాగా బీజేపీ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ నేతలు ఎన్నికల రాష్ట్ర ప్రధాన అధికారి వికాస్ రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

ఫొటో సోర్స్, ANI
గుజరాత్ శాసనసభ ఎన్నికల షెడ్యూలును ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు.
మొత్తం 182 శాసనసభ స్థానాలున్న గుజరాత్ అంసెబ్లీ ఎన్నికలను.. డిసెంబర్ 1వ తేదీ.. 5వ తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన గురువారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో తెలిపారు.
ఈ ఏడాది రాష్ట్రంలో 4.9 కోట్ల మందికి పైగా అర్హులైన ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఎన్నికల కోసం 51,000కు పైగా పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. వీటిలో 34,000కు పైగా పోలింగ్ బూత్‌లు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయని తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఎన్నికల నేపథ్యంలో 160 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను రాష్ట్రంలో మోహరించినట్లు చెప్పారు.
గుజరాత్ శాసనసభ పదవీ కాలం 2023 ఫిబ్రవరి 18వ తేదీతో ముగియనుంది.
అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూలును ప్రకటించటంతో గుజరాత్‌లో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు, వృద్ధులు, అంగవికలురకు పోలింగ్ బూత్‌లు అందుబాటులో ఉండేలా చూడటానికి ప్రత్యేక పరిశీలకులను నియమిస్తామని చెప్పారు.
ఇందులో భాగంగా 1,274 పోలింగ్ స్టేషన్లను పూర్తిగా మహిళలు, భద్రతా సిబ్బంది మాత్రమే నిర్వహిస్తారని తెలిపారు. అలాగే 182 పోలింగ్ స్టేషన్లలో వికలాంగులు స్వాగతం చెప్తారని, మరో 33 పోలింగ్ స్టేషన్లను అత్యంత పిన్నవయసు పోలింగ్ సిబ్బందిని నియమిస్తామని సీఈసీ వివరించారు.

ఫొటో సోర్స్, ANI
దేశ రాజధాని దిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో గురువారం ఉదయం జనం నిద్రలేచేసరికి దట్టమైన ధూళి మంచు (స్మాగ్) ఆవరించి ఉంది. కాలుష్యం పరిస్థితి మళ్లీ తీవ్రస్థాయికి దిగజారింది.
ఉదయం 8 గంటల సమయంలో నగరంలో వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 364 (చాలా బాగోలేదు) కేటగిరీలో ఉంది. దానికి ఒక గంట ముందు ఏక్యూఐ 408 (తీవ్రం)గా నమోదైంది.
అననుకూల వాతావరణ పరిస్థితులు, గాలి వేగం నెమ్మదించటం, పొలాల్లో గడ్డి దహనాలు అకస్మాత్తుగా పెరగటం ఈ పరిస్థితికి కారణాలుగా చెప్తున్నారు.
ఏక్యూఐ 401 నుంచి 500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్రంగా ఉన్నట్లు వర్గీకరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (ఎస్‌ఏఎఫ్ఏఆర్) విడుదల చేసిన సమాచారం ప్రకారం.. జాతీయ రాజధాని ప్రాంతంలోని నోయిడాలో ఏక్యూఐ 393కు పడిపోగా, గురుగ్రామ్‌లో ఏక్యూఐ 318గా నమోదైంది.
ఏక్యూఐ 0 నుంచి 100 వరకూ ఉన్నట్లయితే గాలి నాణ్యత ‘బాగు’న్నట్లుగా పరిగణిస్తారు. అదే 100 నుంచి 200 వరకూ ఉంటే ఒక మోస్తరుగా ఉన్నట్లు, 200 నుంచి 300 వరకూ ‘బాగోలేదు’ అని, 300 నుంచి 400 వరకూ ‘చాలా బాగోలేదు’ అని వర్గీకరించారు.
ఉత్తర దిల్లీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఏక్యూఐ 400 పైనే నమోదవటంతో ఇక్కడ గాలి నాణ్యత ఏమాత్రం బాగోలేదు.
మందిర్ మార్గ్, సెంట్రల్ దిల్లీ వంటి కొన్ని ప్రాంతాలు మినహా రాజధానిలోని చాలా స్టేషన్లలో ఏక్యూఐ 300 పైనే నమోదైంది. మోడల్ టౌన్‌లోని ధీర్‌పూర్‌లో ఏక్యూఐ 457కు పడిపోయినట్లు ఎస్ఏఎఫ్ఏఆర్ గణాంకాలు చెప్తున్నాయి. ఈ వాతావరణంలో ఆరోగ్యవంతమైన వ్యక్తులు కూడా జబ్బుపడే అవకాశముంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, Getty Images
కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు అమాంతం పెరిగిపోయాయి. ఉత్తర, దక్షిణ కొరియాలు ఒక దేశపు సముద్ర జలాల్లోకి మరో దేశం క్షిపణులు పేల్చాయి.
బుధవారం నాడు అత్యధికంగా 23 క్షపిణులు పేల్చిన ఉత్తర కొరియా.. గురువారం ఉదయాన్నే ఒక దీర్ఘ శ్రేణి, రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను పేల్చినట్లు దక్షిణ కొరియా చెప్తోంది.
వాటిలో ఒకటి ఖండాంతర క్షిపణి కావచ్చునని జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా పేర్కొన్నారు.
బుధవారం నాడు ఉత్తర కొరియా ఒక్క రోజులో అత్యధిక క్షిపణులను పేల్చింది. వాటిలో ఒక క్షిపణి దక్షిణ కొరియా నగరమైన సోక్చోకు 60 కిలోమీటర్ల దూరంలోనే కూలింది.
దీనికి ప్రతిస్పందనగా దక్షిణ కొరియా తన యుద్ధ విమానాల నుంచి మూడు క్షిపణులు పేల్చింది. గగనతలం నుంచి భూతలానికి ప్రయోగించే ఈ క్షిపణులను.. వివాదాస్పదమైన సముద్ర జలాల విభజన రేఖ మీద వేసింది.

ఆ తర్వాత ఉత్తర కొరియా మరో ఆరు మిసైళ్లు పేల్చటంతో పాటు వరుసపెట్టి 100 ఆర్టిలరీ షెల్స్‌ను పేల్చింది.
దక్షిణ కొరియా, అమెరికా దేశాలు ప్రస్తుతం నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలకు ప్రతిస్పందనగా తాము ఈ క్షిపణులను పేల్చినట్లు ఉత్తర కొరియా చెప్తోంది. ఆ సైనిక విన్యాసాలు దుందుడుకు చర్య అని, రెచ్చగొట్టే చర్య అని అభివర్ణించింది.
దక్షిణ కొరియా, అమెరికాలు వాటి సంయుక్త సైనిక విన్యాసాలను కొనసాగిస్తే ఆ దేశాలు ‘‘చరిత్రలోనే అత్యంత భయానక మూల్యం’’ చెల్లిస్తాయని ఉత్తర కొరియా మంగళవారం నాడు హెచ్చరించింది. ఇది.. అణ్వాయుధాలను ఉపయోగిస్తామని పరోక్షంగా హెచ్చరించటమేనని పరిశీలకులు భావిస్తున్నారు.
ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణులను ప్రయోగించటం ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్య అంటూ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లిన్కెన్; దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి పార్క్ జిన్‌లు ఖండించారు.
ఉత్తర కొరియా ఈ ఏడాది రికార్డు సంఖ్యలో క్షిపణులను పరీక్షించింది.

ఫొటో సోర్స్, UGC
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడును, ఆయన కుమారుడు రాజేష్‌ను సీఐడీ పోలీసులు గురువారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.
గోడ కూల్చిన వివాదంలో అయ్యన్నపాత్రుడు కోర్టుకు నకిలీ డాక్యుమెంట్లు సమర్పించారనే అభియోగాలపై సీఐడీ నోటీసులు ఇచ్చి వారిని నర్సీపట్నంలో అరెస్టు చేసింది. ఇదే అంశాన్ని సెక్షన్ సీఆర్పీసీ 50 ఎ ప్రకారం ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల మధ్య అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏలూరు కోర్టులో హాజరుపరిచేందుకు తరలించారు.
ఇదిలావుంటే.. పోలీసులు ఇంటి గోడ దూకి లోపలకి ప్రవేశించిచారని అయ్యన్నపాత్రుడు భార్య పద్మావతి ఆరోపించారు.
ఈ విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న అభిమానులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యుల అందరి ఫోన్లను పోలీసులు తీసుకున్నారని అన్నారు. తన భర్తకు, కుమారుడికి ప్రాణహాని ఉందని, ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె అన్నారు.
అయ్యన పాత్రుడిని వెంటనే విడుదల చేయాలంటూ నర్సీపట్నంలో టీడీపీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది.

ఫొటో సోర్స్, ANI
తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికకు గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. దీనికోసం అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.
నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఉపఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు నిలిచారు. నోటా కలిపి ఒక్కో ఈవీఎంలో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం. ఇందుకోసం 1,192 బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేశారు కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను 596 చొప్పున అందుబాటులో ఉంచారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఉండే అవసరాలతో పాటు 10 శాతం అదనంగా సిద్ధం చేసి ఉంచారు.
తెలంగాణలోని మునుగోడుతో సహా దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు గురువారం నాడు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
మొత్తం 2,41,855 మంది ఓటర్లు...
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన జాబితా ప్రకారం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 41 వేల 855 మంది ఉండగా.. అందులో పురుషులు లక్షా 21 వేల 662 మంది.. మహిళలు లక్షా 20 వేల 126 మంది ఉన్నారు.
ఓటర్ల వర్గీకరణ చూస్తే అత్యధికంగా 31 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారున్నారు. 31 నుంచి 40 ఏళ్ల మధ్య 64 వేల 721 మంది ఉండగా.. 41 నుంచి 50 ఏళ్ల మధ్యలో 47,430 ఓటర్లున్నారు. 51 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు వారు 32,120 మంది.. 26 నుంచి 30 ఏళ్ల మధ్యలో 28,204 మంది ఓటర్లు ఉన్నారు.
ఓటర్లలో 20,472 మంది 22 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు వారు కాగా.. 61 నుంచి 70 ఏళ్ల మధ్య 19,655 మంది ఉన్నారు. ఓటర్ల జాబితాలో దివ్యాంగులు 5,686 మంది ఉన్నారు.
ఓటర్లలో 80 ఏళ్లు పైబడినవారికి, దివ్యాంగులకు ఈసీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించింది. 798 మంది ఈ సదుపాయాన్ని ఎంచుకోగా అందులో 685 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది