ఆమిర్ ఖాన్ నటించిన యాడ్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందా... ఎందుకు వివాదం
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కోసం తీసిన ఒక ప్రకటనలో ఆమిర్ ఖాన్‌తో పాటు బాలీవుడ్ నటి కైరా అడ్వాణీ కూడా నటించారు.
లైవ్ కవరేజీ
లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.
‘‘నేను ప్రతి మూడు, నాలుగు నెలలకు ఒకసారి పొడవు పెరుగుతుంటాను’’
ఆమిర్ ఖాన్ నటించిన యాడ్ చుట్టూ వివాదం
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ నటించిన ఒక యాడ్ చుట్టూ వివాదం రేగుతోంది.
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కోసం తీసిన ఒక ప్రకటనలో ఆమిర్ ఖాన్‌తో పాటు బాలీవుడ్ నటి కైరా అడ్వాణీ కూడా నటించారు.
ఈ ప్రకటనలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటగా వారు నటించారు. తొలిసారి వధువు ఇంటికి వెళ్లినప్పుడు వరుడు కుడి కాలు ముందు పెట్టి లోపలకు ప్రవేశిస్తాడు. ‘మార్పు కోసం ఒక పెద్ద అడుగు’ అంటు వారు చెబుతారు.
అయితే ఇలా సంప్రదాయాలను వక్రీకరించడం ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని, భారత సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని ఆమిర్ ఖాన్ ప్రకటనల్లో నటించాలని మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు.
హిందువుల మనోభావాలను దెబ్బతీసే హక్కు ఆమిర్ ఖాన్‌కు లేదని విమర్శించారు.
అంతకు ముందు కశ్మీర్ ఫైల్స్ సినిమా దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి కూడా ఆ ప్రకటనను తప్పు పట్టారు. సంప్రదాయాలను మార్చడమేంటని? ప్రశ్నించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘హిందీని రుద్దుతున్నారు’ అంటూ ఎందుకు విమర్శలు పెరుగుతున్నాయి,అమిత్ షా కమిటీ సిఫారసుల్లో ఏముంది?
కెనడా: సాల్మన్ చేపలు ఎందుకు చనిపోతున్నాయి?
BCCI: బీజేపీలో చేరనందుకే గంగూలీకి రెండోసారి ఛైర్మన్ పదవి దక్కలేదా, ఇండియన్ క్రికెట్ పై రోజర్ బిన్నీ ముద్ర ఏంటి
వీర్యం శరీరంపై పడితే దురద వస్తుందా... సెమెన్ అలర్జీ నుంచి బయటపడటం ఎలా?
ఆ ఊర్లో రాత్రి ఏడు కాగానే గంట మోగుతుంది, అందరూ ఫోన్లు, టీవీలు ఆపేస్తారు, ఎందుకు
పెద్ద నోట్ల రద్దు మీద కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు
పెద్దనోట్ల రద్దు మీద దాఖలు చేసిన అన్ని పిటిషన్ల మీద కేంద్రం, ఆర్‌బీఐకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
నల్లధనాన్ని నిర్మూలించడానికి అని చెబుతూ 2016లో రూ.500, రూ.1,000 నోట్లు చెల్లవు అని అకస్మాత్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.
పెద్ద నోట్ల వల్ల నల్లధనం పెరుగతోందని చెప్పిన ప్రభుత్వం, మళ్లీ రూ.2,000 నోటును తీసుకొచ్చింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రైల్వే ఉద్యోగులకు రూ.1,832 కోట్ల బోనస్
రైల్వే ఉద్యోగులకు పనితీరు ఆధారంగా రూ.1,832 కోట్ల బోనస్ ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ తెలిపారు.
ఈమేరకు 11.27 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
ఉద్యోగులకు 78 రోజుల కాలానికి గరిష్టంగా రూ.17,951 బోనస్‌గా ఇస్తారని ఆయన తెలిపారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దగ్గు మందు వివాదం: ఈ సిరప్ ఇండియా నుంచి గాంబియా వరకూ ఎలా వెళ్లింది?
భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు డాలర్‌తో రూపాయి విలువ 3.30.. ఇప్పుడు 82.30 రూపాయలు.. కారణాలేంటి?
సాజిద్ ఖాన్ మీద ఫిర్యాదు చేశాను.. నాకు ‘రేప్’ బెదిరింపులు వచ్చాయి: దిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్

దర్శకుడు, హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సాజిద్ ఖాన్ తమను లైంగికంగా వేధించినట్లు పది మంది మహిళలు #MeToo ఉద్యమంలో భాగంగా ఫిర్యాదు చేశారని దిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలీవల్ చెప్పారు.
సాజిద్ ఖాన్ తన ‘హౌస్‌ఫుల్-4’, ‘హమ్‌షకల్స్’ సినిమాల్లో అవకాశాల కోసం నిర్వహించిన ఆడిషన్‌లో కొందరు మైనర్లను దుస్తులు విప్పి నగ్నంగా కనిపించాలని అడిగారని ఆమె ఆరోపించారు.
‘‘బిగ్ బాస్ షో నుంచి అతడిని తక్షణమే తొలగించాలని, బిగ్ బాస్ మీద చర్యలు చేపట్టాలని, అన్ని ఫిర్యాదుల మీద దర్యాప్తు జరపాలని సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు నేను ఫిర్యాదు సమర్పించాను’’ అని ఆమె తెలిపారు.
‘‘నా ఫిర్యాదు మీద ఇంతవరకూ ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ఈ అంశం లేవనెత్తినందుకు నాకు రేప్ బెదిరింపులు వచ్చాయి’’ అని చెప్పారు. దీనిపై దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కేరళలో నరబలి వివాదం: 'మంత్రగాడి సలహాతో' ఇద్దరు మహిళలను హత్య చేసిన దంపతులు.. ఏం జరిగింది?
గోవాలో కూలిన నౌకాదళ యుద్ధ విమానం

ఫొటో సోర్స్, AFP
భారత నౌకాదళానికి చెందిన మిగ్-29కె యుద్ధ విమానం ఒకటి గోవా సమీపంలో సముద్రంలో కూలిపోయింది.
విమానం పైలట్ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. సముద్రం నుంచి ఆయనను తీసుకువచ్చినట్లు నేవీ తెలిపింది.
రొటీన్ ఫ్లైట్‌లో భాగంగా నింగికి ఎగిరిన యుద్ధ విమానం తన బేస్‌కు తిరిగి వస్తున్నపుడు కూలిపోయిందని చెప్పింది.
ప్రాధమిక సమాచారం ప్రకారం.. విమానం కూలిపోవటానికి కారణం సాంకేతిక లోపమని చెప్తున్నారు. దీనిపై నౌకాదళం దర్యాప్తుకు ఆదేశించింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరలేదు, కాబట్టే మళ్లీ బీసీసీఐ అధ్యక్షుడు కావట్లేదు – టీఎంసీ ఆరోపణ

ఫొటో సోర్స్, Getty Images
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) అధ్యక్ష పదవిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈనెల 18వ తేదీన జరిగే బీసీసీఐ వార్షిక సమావేశంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి రెండోసారి అధ్యక్షుడిగా అవకాశం లభించకపోవచ్చునని, రోజర్ బిన్నీని కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకోవచ్చునని మీడియా కథనాలు వెలువడ్డాయి.
కాగా, ఈ ఎన్నికలకు ముందే రాజకీయాలు వేడెక్కాయి.
సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరలేదని, దీంతో ఆయనను కించపర్చేందుకే బీజేపీ మరొకసారి ఆయనకు బీసీసీఐ అధ్యక్ష పదవిని ఇవ్వట్లేదని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
టీఎంసీ ఎంపీ శంతను సేన్ మాట్లాడుతూ.. ‘‘హోం శాఖ మంత్రి అమిత్ షా గంగూలీ ఇంటికి భోజనానికి వచ్చారు. బీజేపీలో చేరాలని ఆయన గంగూలీని కోరారు. బీజేపీలో చేరమని గంగూలీని చాలాసార్లు అడిగారు. కానీ, ఆయన బీజేపీలో చేరలేదు. పైగా, ఆయన మమతా బెనర్జీ రాష్ట్రానికి (పశ్చిమ బెంగాల్‌కు) చెందినవాడు. బహుశా అందుకే అతను మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది’’ అని అన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దీనికి బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ స్పందిస్తూ..‘‘టీఎంసీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. బెంగాల్ ఒకప్పుడు క్రీడల్లో చాలా ముందుండేది. ఇప్పుడు క్రీడల్లో బెంగాల్ ఎక్కడ ఉంది? క్రికెట్, ఫుట్‌బాల్.. సౌరవ్ గంగూలీ వంటి క్రికెట్ ఎక్కడ దొరికాడో అక్కడ ఇప్పుడు క్రికెట్ ఎక్కడ ఉంది? ఇప్పుడు జాతీయ జట్టులో ఎంత మంది (బెంగాల్) క్రికెటర్లు ఉన్నారు? ఎన్నడూ సౌరవ్ గంగూలీ కోసం గొంతు విప్పని వాళ్లు, ఇప్పుడు ఆయన కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆయన పదవీకాలం పూర్తయ్యింది. దీనిపై ఇంత రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది?’’ అని ప్రశ్నించారు.
కాగా, హోం మంత్రి అమిత్ షా కుమారుడు జయ్ షా రెండోసారి కూడా బీసీసీఐ కార్యదర్శి బాధ్యతలు చేపడుతున్నప్పుడు, గంగూలీ అధ్యక్ష బాధ్యతలను రెండోసారి ఎందుకు చేపట్టలేడు? అని టీఎంసీ ప్రశ్నిస్తోంది.
వాయుసేనలో ‘అగ్నివీర్‌వాయు’ నియామకాలకు నవంబర్ 1 నుంచి రిజిస్ట్రేషన్లు

ఫొటో సోర్స్, @IAF_MCC
భారత వాయుసేన ‘అగ్నివీర్‌వాయు’ నియామకాలకు నవంబర్ 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు మొదలుపెట్టనుంది.
2023 జనవరి బ్యాచ్ నియామకాల కోసం అర్హులైన స్త్రీ, పురుషులు నమోదు చేసుకోవచ్చునని తెలిపింది.
అభ్యర్థులకు 2023 జనవరి మధ్యలో రాత పరీక్ష నిర్వహిస్తామని చెప్పింది.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం https://agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
గుడ్ మార్నింగ్!
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలు, విశేషాల కోసం ఈ పేజీని ఫాలో అవుతూ ఉండండి.