లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. మళ్లీ రేపు ఉదయం స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో కలుద్దాం.
అంత వరకు సెలవు.
జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన రెండో వన్డేలో భారత్ 45.5 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 282 పరుగులు తీసింది.
పృథ్వి రాజ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. మళ్లీ రేపు ఉదయం స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో కలుద్దాం.
అంత వరకు సెలవు.

ఫొటో సోర్స్, ANI
సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది.
తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 278 పరుగులు తీసింది. 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియా 45.5 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది.
శ్రేయస్ అయ్యర్ 111 బంతుల్లో 113 కొట్టగా ఇషాన్ కిషన్ 84 బంతుల్లో 93 పరుగులు తీశాడు.
ఇక సౌతాఫ్రికా జట్టులో రీజా 74, మార్కరమ్ 79 పరుగులు చేశారు.

ఫొటో సోర్స్, PTI
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వార్త సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.
అనారోగ్యంతో కొద్ది రోజుల కిందట ఆయన, గురుగ్రామ్‌లోని మెదాంతా హాస్పిటల్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంజీవ్ గుప్తా తెలిపారు.
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అయిన ములాయం సింగ్ యాదవ్(82) ఆగస్టు 22 నుంచి చికిత్స తీసుకుంటున్నారు.
ములాయం ఆరోగ్యం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా అనేక మంది నేతలు వాకబు చేశారు.
1939 నవంబరు 22న పుట్టిన ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ప్రముఖ రాజకీయనేతల్లో ఒకరిగా ఎదిగారు.
గతంలో ఆయన సోషలిస్టు పార్టీ, జనతా పార్టీ, జనతా దళ్ వంటి పార్టీలతో కలిసి పని చేశారు. ఆ తరువాత జనతా దళ్ నుంచి బయటకు వచ్చి 1992లో సమాజ్‌వాదీ పార్టీని ఏర్పాటు చేశారు ములాయం సింగ్ యాదవ్.
ఉత్తరప్రదేశ్‌కు ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.
యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్ర రక్షణశాఖ మంత్రిగాను సేవలు అందించారు.
మొత్తం మీద ఆయన 10 సార్లు ఎమ్మెల్యేగా 7 సార్లు ఎంపీగా గెలిచారు.
ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా భారత్‌కు ముందు 279 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
జార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది.
ఎయిడన్ మార్క్రమ్ అత్యధికంగా 79 పరుగులు చేశారు. రీచా హెండ్రిక్స్ 74 పరుగులు సాధించారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 129 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
వీరు కాకుండా డేవిడ్ మిల్లర్ 35, హెన్రిక్ క్లాసెన్ 30, స్వీట్‌హార్ట్ మలాన్ 25 పరుగులు చేశారు.
భారత్ బౌలింగ్ బృందంలో మహమ్మద్ సిరాజ్ బాగా రాణించాడు. సిరాజ్ మూడు వికెట్లు తీసుకోగా, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.
మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0తో ఆధిక్యంలో ఉంది. లక్నోలో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 9 పరుగులు తేడాతో భారత్ మీద విజయం సాధించింది.
ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్ మంగళవారం నాడు ఢిల్లీలో జరుగనుంది.
ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న నిరసనకారులు ప్రభుత్వ టీవీ చానెల్ భవనంలోకి దూసుకెళ్లారు.
శనివారం లైవ్ ప్రోగ్రాం నడుస్తున్న సమయంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ న్యూస్ నెట్‌వర్క్(ఐఆర్‌ఐఎన్‌ఎన్) స్టూడియోలోకి దూసుకెళ్లిన నిరసనకారులు, ప్రభుత్వ వ్యతిరేక సందేశాలు ప్రదర్శించారని స్థానిక వార్తా సంస్థ తన్సిమ్ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు, రాజకీయ నాయకుడిగా మారిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరుగుతోంది.
తాజాగా బిహార్‌లో పాదయాత్ర చేస్తున్న ప్రశాంత్ కుమార్ బీజేపీ అజెండా కోసం పనిచేస్తున్నారని నితీశ్ కుమార్ ఆరోపించారు. దీనికి ప్రశాంత్ కుమార్ స్పందిస్తూ.. నితీశ్ కుమార్ వయసు ఆయన మీద ప్రభావం చూపుతోందని, ఆయనలో అలజడి స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
‘‘నేను బీజేపీ అజెండా కోసం పనిచేస్తున్నానని ఆయన అంటున్నారు. అలాగే జేడీయూని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ఆయనతో నేను చెప్పాననీ అంటున్నారు. ఇదెలా సాధ్యం? నేనే బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లయితే.. కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని వారికి ఎందుకు చెప్తాను?’’ అని ప్రశాంత్ కిశోర్ ప్రశ్నించారు.
నితీశ్ కుమార్ తన చుట్టూ ఉంచుకున్న వారినే నమ్మరని, అందువల్ల ఆయన రాజకీయంగా ఏకాకి అయ్యారని, ఫలితంగా అలజడికి లోనై తనకు ఏది తోస్తే అది మాట్లాడుతున్నారని విమర్శించారు.
నితీశ్ శనివారం నాడు నితీశ్ మీడియాతో మాట్లాడుతూ.. కొన్నేళ్ల కిందట జేడీయూను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ప్రశాంత్ కుమార్ తనకు సలహా ఇచ్చినట్లు చెప్పారు.
మరోవైపు.. తనను జేడీయూలో చేరి, పార్టీకి సారథ్యం వహించాల్సిందిగా నితీశ్ కుమార్ తనను ఆహ్వానించారని ప్రశాంత్ కుమార్ ఈ నెల 5వ తేదీన మీడియాతో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
ద్రవిడ మున్నేట్ర కళగం నేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆదివారం చెన్నైలో జరిగిన పార్టీ కొత్త సర్వసభ్య మండలి సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది.
పార్టీ ప్రధాన కార్యదర్శి, కోశాధికారులుగా అగ్రనేతలు దురైమురుగన్, టి.ఆర్.బాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ ముగ్గురు నాయకులూ తమ తమ పదవులకు ఎన్నికవటం ఇది రెండోసారి. ప్రస్తుతం 69 ఏళ్ల వయసున్న స్టాలిన్ గతంలో పార్టీ కోశాధికారిగా, యువజన విభాగం కార్యదర్శిగా కూడా పనిచేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
2018లో కరుణానిధి మరణం తర్వాత ఆయన కొడుకు స్టాలిన్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీఎంకే పార్టీకి స్టాలిన్ రెండో అధ్యక్షుడు.
1969లో డీఎంకే రాజకీయ పార్టీగా ఏర్పడినపుడు కరుణానిధి తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ద్రవిడ ఉద్యమ నాయకుడు, డీఎంకే వ్యవస్థాపకుడు సి.ఎన్.అన్నాదురై 1969లో చనిపోయే వరకూ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. డీఎంకే 1949లో స్థాపితమైంది.
డీఎంకే మహిళా విభాగం కార్యదర్శి కనిమొళి పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. మొత్తం ఐదుగురు ఉప ప్రధాన కార్యదర్శుల్లో కనిమొళి ఒక్కరే మహిళా నేత.

ఫొటో సోర్స్, ANI
భారతదేశపు జనాభా గురించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆందోళన చెందుతున్నారని, కానీ దేశంలో కండోమ్‌లు అధికంగా ఉపయోగించేది ముస్లింలేననే ‘వాస్తవం’ గురించి ఆయన ఎన్నడూ మాట్లాడరని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.
ఆయన హైదరాబాద్‌లో ఒక సమావేశంలో మాట్లాడుతూ.. పలు ప్రశ్నలు లేవనెత్తారు.
దసరా రోజున మోహన్ భాగవత్ ప్రసంగిస్తూ.. మతపరమైన జనాభా అసమతుల్యత విస్మరించరాదని, ఇది ముఖ్యమైన విషయమని పేర్కొన్నారు.
దీనికి ఒవైసీ స్పందిస్తూ.. ‘‘ముస్లింల జనాభా పెరగటమే లేదు. మీరు ఎందుకు అనవసరంగా ఆందోళన చెందుతున్నారు? ముస్లింల జనాభా తగ్గిపోతోంది’’ అని వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘‘భారతదేశంలో మతపరమైన అసమతుల్యత ఉందని మోహన్ భాగవత్ చెప్తున్నారు. మన దేశంలో మొత్తం జననాల రేటు చాలా పడిపోయింది. అత్యధికంగా తగ్గిపోయింది ముస్లింలలోనే. ముస్లింల జనాభా పెరగటం లేదని మోహన్ భాగవత్‌కు చెప్పదలచుకున్నాం. మా జనాభా తగ్గుతోంది. అత్యధిక కండోమ్‌లను ఉపయోగించేది ఎవరు? మేము. కానీ మోహన్ భాగవత్ ఈ విషయం చెప్పరు’’ అని ఆయన పేర్కొన్నారు.
భారతదేశంలో కూతుర్లను కడపులోనే చంపుతున్న అంశాన్ని కూడా ఒవైసీ లేవనెత్తారు. దీనిపై మోహన్ భాగవత్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, @RSSORG
‘‘కుటుంబ నియంత్రణను తప్పనిసరి చేయలేమని మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కానీ మోహన్ భాగవత్ జనాభా పెరుగుదల గురించి మాట్లాడుతున్నారు. ముస్లింల పట్ల ద్వేషం, భయం పెంచటానికే ఈ మాటలు. 2031 నాటికి 20 కోట్ల మంది జనం 60 ఏళ్ల వయసు దాటిపోతారు. భారతదేశంలో మన జనాభా ముసలిదవుతోంది. నేను చెప్తున్న అంశాన్ని బీజేపీ నిరాకరించేట్లయితే, నిరాకరించమనండి’’ అని ఒవైసీ వ్యాఖ్యానించారు.
భారతదేశంలో ముస్లింలు ఆర్ఎస్ఎస్, బీజేపీ దయ వల్ల జీవించటం లేదని, భారత రాజ్యాంగం వారికి హక్కులు ఇచ్చిందని ఒవైసీ అన్నారు.
గుడ్ మార్నింగ్!
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలు, విశేషాల కోసం ఈ పేజీని ఫాలో అవుతూ ఉండండి.