లైవ్ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.
‘ఆర్మేనియా-అజర్‌బైజాన్’ సరిహద్దుల్లో ఘర్షణల గురించి మాకు వార్తలు అందుతున్నాయి. పౌరుల నివాసాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. తక్షణమే ఈ దాడులను ఆపాలని కోరుతున్నాం’
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

ఫొటో సోర్స్, AFP
ఆర్మేనియా-అజర్‌బైజాన్ మధ్య జరుగుతున్న ఘర్షణలను ఆపాలంటూ భారత్ విజ్ఞప్తి చేసింది.
‘ఆర్మేనియా-అజర్‌బైజాన్’ సరిహద్దుల్లో ఘర్షణల గురించి మాకు వార్తలు అందుతున్నాయి. పౌరుల నివాసాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. తక్షణమే ఈ దాడులను ఆపాలని కోరుతున్నాం’ అంటూ కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఒక ప్రకటనలో తెలిపారు.
‘రెండు వైపుల చర్చలు, దౌత్యం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఎటువంటి సమస్యకైనా మిలిటరీ పరిష్కారం కాదు. శాంతిపూరితమైన పరిష్కారం దొరికే వరకు ఇద్దరూ చర్చలు జరపాలని కోరుతున్నాం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
గత కొద్ది రోజులుగా ఆర్మేనియా, అజర్‌బైజాన్ మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. గత రెండు రోజుల్లో 49 మంది సైనికులు చనిపోయినట్లు ఆర్మేనియా ప్రధాని వెల్లడించారు.
తమ రక్షణస్థావరాలను అజర్‌బైజాన్ లక్ష్యంగా చేసుకుంటోందంటూ ఆర్మేనియా రక్షణశాఖ ఆరోపిస్తోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
కెన్యా అయిదవ అధ్యక్షుడిగా విలియం సమోయి రుటో ప్రమాణ స్వీకారం చేశారు. ఉపాధ్యక్షుడిగా రిగతి గచాగువా ప్రమాణ స్వీకారం చేశారు.
కెన్యా రాజధాని నైరోబీలోని స్టేడియంలో సుమారు 60,000 మంది జనం కిక్కిరిసిపోయారు. కెన్యా కొత్త అధ్యక్షుడిగా విలియం రూటో ప్రమాణ స్వీకారాన్ని చూడడానికి వారంతా తరలివచ్చారు.
గత నెల జరిగిన ఎన్నికల్లో విలియం రూటో 50.5 శాతం ఓట్లతో విజయం సాధించారు. ప్రత్యర్థి రైలా ఒడింగాకు 48.8 శాతం ఓట్లు వచ్చాయి.

ఫొటో సోర్స్, Reuters
ప్రమాణ స్వీకార వేడుకకు జనం స్టేడియం లోపలికి వెళుతున్న సమయంలో తొక్కిసలాటలో కనీసం ఎనిమిది మందికి గాయాలయ్యాయని రిపోర్టులు వచ్చాయి.
ఎన్నికల ఫలితాలలో రిగ్గింగ్ జరిగిందని ఒడింగా ఆరోపించారు. కానీ, ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరిగాయని కెన్యా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
ప్రాచీన నాగరికతకు నిదర్శనంగా నిలిచిన మొహంజోదారో కట్టడానికి వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరిస్, విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఆ ప్రదేశాన్ని పర్యవేక్షించారు.
ఇటీవల మొహంజోదారోలో భారీ వర్షపాతం నమోదైంది. దాదాపు 4,500 ఏళ్ల కింద నిర్మించిన ఈ పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికీ పని చేస్తోందని, వర్షపు నీరంతా ఆ కాల్వల ద్వారానే బయటకు వెళ్లిందని అధికారులంటున్నారు.
"వర్షపు నీటిని బయటకు పంపేందుకు మేం చేసిన ప్రయత్నం ఏమీ లేదు. మా సిబ్బంది చేసిందల్లా... ఇక్కడి డ్రైనేజీల్లోంచి బయటకు వెళ్లాక, ఒకచోట చేరిన నీటినంతా ఖాళీ చేసేందుకు మెషీన్లు ఏర్పాటు చేయడమే" అని పాకిస్తాన్ సాంస్కృతికి శాఖ యాంటిక్విటిస్ డైరెక్టర్ మంజూర్ అహ్మద్ చెప్పారు.
అయితే, దీనికి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి మరమ్మతు పనులు అవసరం అని చెబుతున్నారు.
బీబీసీ ప్రతినిధి సహేర్ బలోచ్ అందిస్తున్న కథనం.

ఫొటో సోర్స్, ANI
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ నబాన్న్ చలో ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు శుభేందు అధికారి, లాకెట్ ఛటర్జీ సహా చాలా మంది పెద్ద నాయకులు అరెస్టయ్యారు. వారిని పోలీసు ప్రధాన కార్యాలయానికి తరలించారు.
వీరంతా ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. ర్యాలీ వేదిక వద్దకు చేరుకోకముందే హుగ్లీ బ్రిడ్జి వద్ద పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
చాలాచోట్ల బీజేపీ కార్యకర్తలకు, పోలీసులతో ఘర్షణ పడ్డారు. అయితే, ఎవరూ గాయపడ్డట్టు సమాచారం లేదు.
ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా కోర్టుకు వెళతానని శుభేందు అధికారి హెచ్చరించారు. ఈరోజు కోల్‌కతాలో ఓ వైపు వర్షం, మరోవైపు బీజేపీ ప్రచారం. దీంతో నగర జనజీవనం అస్తవ్యస్తమైంది.

ఫొటో సోర్స్, Getty Images
జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు నిర్ణయం "నిరాశాజనకం, విచారకరం" అని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) సోమవారం పేర్కొంది.
అంతే కాకుండా, ప్రార్థనా స్థలాల చట్టం 1991ని పూర్తిగా అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, తమ ప్రధాన కార్యదర్శి మౌలానా ఖలీద్ సైఫుల్లా రహ్మానీ మాటలను ఉటంకిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.
"1991లో బాబ్రీ మసీదు వివాదం నేపథ్యంలో, బాబ్రీ మసీదు మినహా ఇతర మతపరమైన ప్రదేశాలు 1947లో ఎలాంటి స్థితిలో ఉన్నాయో, అదే స్థితిలో వాటి నిర్వహణ కొనసాగించేందుకు పార్లమెంటు ఆమోదించింది. దీనికి వ్యతిరేకంగా ఎటువంటి వివాదం చెల్లదని అంగీకరించింది. బాబ్రీ మసీదు కేసులో కూడా సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని ప్రస్తావించింది. ఈ చట్టం తప్పనిసరి అని ప్రకటించింది."
1991 నాటి చట్టాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలని, అన్ని పార్టీలు దీనిని అనుసరించాలని బోర్డు అంటోంది.

ఫొటో సోర్స్, SAMEERATMAJ MISHRA/BBC
జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఉన్న హిందూ దేవతలకు పూజలు నిర్వహించే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ అయిదుగురు మహిళలు వేసిన పిటిషన్‌ను వారణాసి జిల్లా కోర్టు విచారణకు స్వీకరించింది.
ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 22న జరగనుంది. ముస్లింల పక్షం వాదనలను కూడా అదే రోజు వినిపించాలని కోర్టు తెలిపింది.
సికింద్రాబాద్‌లోని ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మరణించారని, ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదని హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి తెలిపారు.
సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో భవనంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
బేస్‌మెంట్‌లో మంటలు వ్యాపించాయని, మంటల కంటే ఎక్కువగా దట్టమైన పొగ వ్యాపించడంతో కొందరు ఊపిరి అందక స్పృహ కోల్పోయారని, కొందరు భవనం నుంచి కిందకు దూకారాని పోలీసులు చెబుతున్నారు.
గాయపడినవారిలో.. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో దీపక్ యాదవ్ (38), ఉమేశ్ కుమార్ ఆచార్య (35), గాంధీ ఆస్పత్రిలో కేవీ సంతోశ్ (26), బీ యోగిత (26), సికింద్రాబాద్ అపోలోలో దీబాషి గుప్తా (36), జయంత్ (39) చికిత్స పొందుతున్నారు. కేకే కేశవన్ (27) యశోద ఆస్పత్రి నుంచి డిశార్జి అయ్యారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.
"తెలంగాణలోని సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారాన్ని పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి అందిస్తాం. క్షతగాత్రులకు రూ. 50,000 అందిస్తాం" అని మోదీ ట్వీట్ చేశారు.

ఉత్తర నైజీరియాలోని జిగావా రాష్ట్రంలో వరదల కారణంగా కనీసం తొమ్మిది మంది చనిపోయారని, ఇద్దరు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.
బాధితుల్లో మహిళలు, పురుషులు, పిల్లలు కూడా ఉన్నారు. వారంతా పడవలో ప్రయాణిస్తుండగా ప్రవాహంలో కొట్టుకుపోయారు.
రింగిమ్ ప్రాంతంలోని కనీసం ఏడు గ్రామాలు వరద ముంపు ఎదుర్కొంటున్నాయని, ఇళ్లు, పొలాలు ధ్వంసమయ్యాయని స్థానిక నాయకులు తెలిపారు.
వందలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
ఆదివారం కుండపోతగా వర్షం కురవడంతో, కంటో రాష్ట్రాంలోని ప్రధాన ఆనకట్ట వద్ద నీటిని విడుదల చేయడంతో వరదలు ముంచెత్తాయి.
వరదల కారణంగా దేశంలో ఇప్పటివరకు 5,00,000 పైగా ప్రజలు ప్రభావితమయ్యారని నైజీరియా ప్రభుత్వం తెలిపింది.

ఫొటో సోర్స్, PRASAD
గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది.
ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.08 లక్షల క్యూసెక్కులు ఉందని, కాసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారిచేసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
వరద ముంపు ప్రభావిత మండలాల అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేశారు. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని సూచించారు.
పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద నీటిలో ఈతకు వెళ్ళడం, ప్రయాణం లాంటివి చేయరాదని విపత్తుల సంస్థ ఎండీ హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్, యుద్ధంలో ముందుకు సాగుతూ రష్యాని వెనక్కి తరిమి కొడుతోందని, ఆక్రమిత భాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటోందని జెలియెన్‌స్కీ చెప్పారు.
సెప్టెంబర్‌లో తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో రష్యా ఆక్రమించిన భూభాగంలో 6,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తమ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ చెప్పారు.
బీబీసీ ఈ గణాంకాలను స్వతంత్రంగా ధృవీకరించలేదు.

ఫొటో సోర్స్, REUTERS
ఈశాన్య ఖార్కియెవ్ ప్రాంతంలోని కీలక నగరాలను కోల్పోయినట్లు రష్యా అంగీకరించింది. యుద్ధంలో ఇది కీలక మలుపు అని నిపుణులు భావిస్తున్నారు.
అయితే, యుక్రెయిన్ భూభాగాల నుంచి రష్యా సైన్యం వైదోలగడాన్ని ఆ దేశం "పునఃసమీకరణ" (రీగ్రూపింగ్) గా చెప్పుకొచ్చింది. లుహాన్స్క్, దోన్యస్క్ భూభాగాలపై దృష్టి సారించే లక్ష్యంతో సైన్యన్ని కూడదీసుకుంటున్నామని చెప్పింది.

ఫొటో సోర్స్, UGC
సికింద్రాబాద్‌లోని పాస్‌పోర్ట్ ఆఫీసు దగ్గరలో ఒక భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనలో ఆరుగురు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. వారికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం జరిగిన భవనంలో కింద రెండు అంతస్తుల్లో ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్, పై అంతస్తుల్లో లాడ్జీ ఉన్నాయి.

ఫొటో సోర్స్, UGC
సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో భవనంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మంటలు ఏర్పడి మంటలు బైక్ షోరూంలో వ్యాపించాయి. బైక్ బ్యాటరీలు కూడా పేలి ఉండొచ్చని అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు.
అక్కడి నుంచి మంటల కంటే ఎక్కువగా దట్టమైన పొగ వ్యాపించింది. పొగ పైన ఉన్న లాడ్జీకి వ్యాపించడంతో లాడ్జీలో ఉన్న వారికి ఊపిరి అందక ఎక్కడ వారు అక్కడ పడిపోయారు. కొందరు కిందకు దూకారు. ప్రస్తుతం అందర్నీ బయటకు తీసుకువచ్చారు. మంటలు అదుపులో ఉన్నాయి.

ఫొటో సోర్స్, UGC
ప్రమాద సమయంలో కనీసం 23 మంది లాడ్జీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.
అగ్నిమాపక, పోలీసు శాఖ అధికారులు వెంటనే ప్రమాదం జరిగిన చోటుకు చేరుకుని సహాయ కార్యక్రమాలు అందించారు. కొందర్ని కాపాడారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. క్రేన్ ఉపయోగించి కొందర్ని రక్షించే ప్రయత్నం చేశారు. స్థానికులు పెద్ద ఎత్తున సహాయం చేశారు.

ఫొటో సోర్స్, UGC
‘‘ఇంకా ప్రమాద కారణాలు తెలీదు. షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేక బైకులు చార్జింగ్ పెట్టడం వల్లనా అని తెలీదు. 23 వరకూ రూమ్స్ ఉన్నాయి. మొదటి, రెండు అంతస్తుల్లో పొగ వ్యాపించింది. లాడ్జీలో వారు ఎక్కువగా వ్యాపారం పనులపై ఉత్తర భారతదేశం నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. నిద్రలో ఉండడం వల్ల ఊపిరి ఆడక, కారిడార్లో పొగ వల్ల ఏమీ కనిపించక, ఒక మహిళ సహా మొత్తం ఆరుగురు మరణించారు’’ అని నగర పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ మీడియాతో చెప్పారు.
మృతుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల వారు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఎక్కువ మంది 30-40 ఏళ్ల వయసున్న మధ్య వయస్కులే.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఈ లైవ్ పేజీని ఫాలో అవ్వండి.