ఈనాటి లైవ్ పేజీ ముఖ్యాంశాలు..
స్థానికం:
- నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని హిండిస్ ల్యాబ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
జాతీయం:
- ఆసియాలో అతిపెద్ద సంపన్నుడైన గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ కంపెనీ, ఎన్‌డీటీవీ మీడియా సంస్థలో 29.18 శాతం వాటాను పరోక్షంగా కొనుగోలు చేసింది.
- బిహార్‌లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని మహాఘటబంధన్ ప్రభుత్వం అసెంబ్లీ బలపరీక్షలో మెజారిటీ సాధించింది. 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి పోరాడతాయన్నారు నితీశ్.
- దిల్లీలో ఆప్ ఎమ్మెల్యేలను కొనటానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. దానికి స్పందనగా, మనీష్ సిసోడియా అవినీతికి పాల్పడ్డారన్న దానికి ఆధారాలు ఉన్నాయని, ఆయన తప్పించుకోలేరని బీజేపీ అన్నది.
- ఈ ఏడాది మార్చిలో పాకిస్తాన్ భూభాగంలోకి ప్రమాదవశాత్తు పేలిన క్షిపణికి సంబంధించి భారత ప్రభుత్వం ముగ్గురు ఎయిర్ ఫోర్స్ అధికారులను పదవి నుంచి తొలగించింది.
- బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు మరోసారి కరోనావైరస్ సోకింది. తనను కలిసిన వారందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని బచ్చన్ విజ్ఞప్తి చేశారు.
అంతర్జాతీయం:
- రష్యాతో యుద్ధం మధ్యలో యుక్రెయిన్ స్వతంత్ర దినోత్సవం సాధారణంగా ముగిసింది.
- జపాన్ కొత్త అణు విద్యుత్ ప్లాంట్లను నిర్మించే అవకాశాలను పరిశీలించాలని ప్రధాని ఫుమియో కిషిదా అన్నారు.
ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం. ముఖ్యమైన కథనాలు, విశ్లేషణలకు బీబీసీ తెలుగు పేజీ చూస్తుండండి.













