నేటి లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో ముగిస్తున్నాం.
మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.
అంత వరకు సెలవు.
ధన్యవాదాలు!
దేశంలో ప్రస్తుతం రోజుకు దాదాపు 10,000 కొత్త కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో.. కరోనావైరస్ మహమ్మారి ఇంకా తొలగిపోలేదని నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్ వి.కె.పాల్ హెచ్చరించారు.
నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో ముగిస్తున్నాం.
మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.
అంత వరకు సెలవు.
ధన్యవాదాలు!

ఫొటో సోర్స్, Getty Images
దేశంలో ప్రస్తుతం రోజుకు దాదాపు 10,000 కొత్త కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో.. కరోనావైరస్ మహమ్మారి ఇంకా తొలగిపోలేదని నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్ వి.కె.పాల్ హెచ్చరించారు.
ప్రజలు ముందు జాగ్రత్తగా కోవిడ్ వ్యాక్సీన్ డోసులు తీసుకోవటం పెరగాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రికాషన్ డోసు తీసుకుంటున్న రేటు మందకొడిగా ఉండటం గురించి డాక్టర్ పాల్ మాట్లాడుతూ.. ఈ రేటు ఇప్పుడిప్పుడే పెరుగుతోందని చెప్పారు. వ్యాక్లీన్ల కొరత ఏమీ లేదని, కాబట్టి అర్హులైన వ్యక్తులు ప్రికాషన్ డోసు వేయించుకోవాలని సూచించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘‘మనం మనల్ని కాపాడుకోవాల్సిన అవసరముంది. ప్రికాషన్ డోసు తీసుకోవాల్సిన అవసరముంది. (కోవిడ్ వ్యాక్సీన్) రెండో డోసు తీసుకుని ఆరు నెలలు దాటిన వారు త్వరగా ప్రికాషన్ డోసు తీసుకోవాలి’’ అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, ANI
విమానాల్లో కోవిడ్ ప్రొటోకాల్‌ను కచ్చితంగా పాటించాలి: డీజీసీఏ
ఇదిలావుంటే.. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగతుండటంతో విమానాల్లో కోవిడ్-19 ప్రొటోకాల్‌ను కచ్చితంగా పాటించాలని డైరెక్టొరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విమానయాన సంస్థలకు నిర్దేశించింది.
ప్రయాణికులు విమాన ప్రయాణమంతటా ఫేస్ మాస్కులు ధరించి ఉండేలా చూడాలని, సరైన రీతిలో సానిటైజ్ చేయాలని డీజీసీఏ మంగళవారం నాడు సూచించింది.
ఒకవేళ ప్రయాణికులెవరైనా ఈ మార్గర్శకాలను పాటించకపోతే వారిపై విమానయాన సంస్థలు కఠిన చర్యలు చేపడుతుందని పేర్కొంది.

ఫొటో సోర్స్, ANI
ఒక మహిళ ‘లైంగికంగా రెచ్చగొట్టే’ దుస్తులు ధరించివున్నట్లయితే.. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 354ఎ (లైంగిక వేధింపులు) ప్రాధమికంగా వర్తించబోదని కేరళ కోర్టు ఒకటి బుధవారం నాడు పేర్కొంది.
కోజికోడ్ సెషన్స్ కోర్టు.. 74 ఏళ్ల వయసున్న సామాజిక కార్యకర్త సివిక్ చంద్రన్‌కు.. ఓ లైంగిక వేధింపుల కేసులో బెయిల్ మంజూరు చేస్తూ ఈ ఆదేశాలిచ్చింది.
‘‘నిందితుడు బెయిల్ దరఖాస్తుతో పాటు సమర్పించిన ఫొటోగ్రాఫులు.. ఫిర్యాదుదారు లైంగికంగా రెచ్చగొట్టే దుస్తులు ధరించి ఉన్నట్లు వెల్లడిస్తున్నాయి. కాబట్టి నిందితుడి మీద ఐపీసీ సెక్షన్ 354ఎ ప్రాథమికంగా నిలవదు. శరీరం తగిలిందని అంగీకరించినా కూడా.. 74 ఏళ్ల వయసున్న, అంగవైకల్యం గల వ్యక్తి.. ఫిర్యాదుదారుని బలవంతంగా తన ఒడిలోకి లాక్కున్నట్లు నమ్మటం అసాధ్యం’’ అని ఆ ఉత్తర్వు చెప్తోంది.
2020 ఫిబ్రవరి 8వ తేదీన నిందితుడు, ఫిర్యాదుదారు మరికొందరితో కలిసి నంది బీచ్ వద్ద శిబిరంలో ఉన్నప్పుడు.. ఫిర్యాదుదారు చేతులను బలంగా పట్టుకుని నిందితుడు ఏకాంత ప్రదేశానికి బలవంతంగా తీసుకెళ్లాడని ఆరోపణ. ఆ తర్వాత నిందితుడు ఫిర్యాదుదారుని తన ఒడిలో కూర్చోవాలని చెప్పాడని, అనంతరం ఆమెను మానభంగం చేయటానికి ప్రయత్నించాడని ఫిర్యాదుదారు ఆరోపించారు.
ఈ ఆరోపణలపై కోయిలాండి పోలీసులు ఐపీసీ 354ఎ (2), 341, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇది కల్పిత కేసు అని, ఆరోపిస్తున్న ఘటన 2020 ఫిబ్రవరిలో జరిగిందని చెప్తుండగా.. 2022 జూలై 29న కేసు నమోదు చేశారని నిందితుడి తరఫు న్యాయవాది ఆరోపించారు.
ఈ కేసులో ఈ నెల 12వ తేదీన నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ సెషన్స్ కోర్టు పైవ్యాఖ్యలు చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

ఫొటో సోర్స్, @IndiaCoastGuard
అరేబియా సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను ఇండియన్ కోస్ట్ గార్డ్ తీవ్ర ప్రతికూల వాతావరణంలో సహాయ చర్యలు చేపట్టి రక్షించింది.
దామన్ సమీపంలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన తుల్సీ దేవి బోటు ఇంజన్ విఫలమవటంతో అందులోని 14 మంది మత్స్యకారులు నడిసముద్రంలో చిక్కుకుపోయారు.
దీంతో బోటు నుంచి అత్యవసర సహాయ సంకేతం పంపించారని, తాము తీవ్ర ప్రతికూల వాతావరణంలో వేగంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి వారిని రక్షించామని ఇండియన్ కోస్ట్ గార్డ్ తెలిపింది.
మత్స్యకారులను ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించినట్లు చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Facebook/Dr.K Laxman
తెలంగాణలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ మరోక కీలక నిర్ణయం తీసుకుంది.
రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ను కేంద్రీయ ఎన్నికల సమితి(సీఈసీ)లోకి సభ్యునిగా పార్టీ అవకాశం కల్పించింది.
ఇక మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వాన్ని కూల్చడంతో కీలక పాత్ర పోషించిన బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్‌ను కూడా సీఈసీలోకి తీసుకున్నారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లను సీఈసీ నుంచి తొలగించారు.
జేపీ నడ్డా అధ్యక్షునిగా ఉన్న ఈ కమిటీలో నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ వంటి వారు ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
వినియోగదారులకు నాసిరకం కుక్కర్లు విక్రయిస్తున్నారంటూ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు లక్ష రూపాయలు జరిమాన విధించింది సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ.
నాణ్యత ప్రమాణాలు సరిగ్గా లేని 598 కుక్కర్లను వెనక్కి తీసుకోవడంతోపాటు వినియోగదారులకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
హిందువులు తలచుకుంటే శివమొగ్గలో ముస్లింలు ఉండలేరంటూ కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే కె.ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
శివమొగ్గలో ఏర్పాటు చేసిన వీర్ సావర్కర్ ఫ్లెక్సీని టిప్పు సుల్తాన్ అభిమానులు చించడానికి ప్రయత్నించిన నేపథ్యంలో అక్కడ ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ తమ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, దీనికి బాధ్యులు ఎవరిని ఆయన ప్రశ్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
శివమొగ్గలోనే కాకుండా దక్షిణ భారతదేశం అంతటా పీఎఫ్‌ఐ, ఎస్‌డీపీఐ వంటి దేశవ్యతిరేకులకు కాంగ్రెస్ సాయం చేస్తోందని విమర్శించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ‘హిందువులు, ముస్లింల మధ్య సంబంధాలు బాగా ఉండేవి. కానీ జరిగిన హత్యలు మమ్మల్ని షాక్‌కు గురి చేశాయి. ఎవరిని అరెస్టు చేయాలి? ఎవరిని చేయకూడదనేది పోలీసుల ఇష్టం.
కానీ హిందువులు తలచుకుంటే శివమొగ్గలో ముస్లింలు ఉండలేరు. హిందువులను కానీ పోలీసులను కానీ బలహీనులని ఎవరూ అనుకోకండి’ అని ఈశ్వరప్ప అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, Facebook/Rahul Gandhi
గుజరాత్ అల్లర్లలో భాగంగా బిల్కిస్ బానోను రేప్ చేసి శిక్ష అనుభవిస్తున్న 11 మందిని ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు.
‘5 నెలల గర్భంతో ఉన్న మహిళను రేప్ చేసి, ఆమె మూడేళ్ల బిడ్డను చంపేసిన వారిని ఆజాదీ కే అమృత్ మహోత్సవ్ ద్వారా విడుదల చేశారు.
నారీ శక్తి గురించి అబద్ధాలు మాట్లాడే వాళ్లు ఈ చర్యల ద్వారా దేశంలోని మహిళలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు?
ప్రధానమంత్రి గారు... మీ మాటలకు చేతలకు మధ్య తేడాను దేశం మొత్తం చూస్తోంది.’ అంటూ రాహూల్ గాంధీ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గుజరాత్‌లోని అంకలేశ్వర్ ప్రాంతంలో డ్రగ్స్ తయారు చేస్తున్న ఒక యూనిట్ మీద యాంటీ నార్కోటిక్ సెల్ విభాగం దాడి చేసి 513 కేజీల పౌడర్‌ను సీజ్ చేసింది. దీని విలువ సుమారు రూ.1,026 కోట్లు.
ఆ యూనిట్ యజమాని గిరిరాజ్ దీక్షిత్‌ను అరెస్టు చేసినట్లుగా వార్తా సంస్థ పీటఐ రిపోర్ట్ చేసింది.
గుజరాత్ ఇండస్ట్రీయల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ పనోలీ ప్రాంతంలో దాడులు చేసి మరో రూ.1,383 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు భరూచ్ డీఎస్పీ లీనా పాటిల్ తెలిపారు.
1,300 లీటర్ల లిక్విడ్, 82.3 కేజీల పొడి దొరికింది.
మొత్తం మీద తాజా దాడుల్లో రూ.2,409 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
ఉత్తర్ ప్రదేశ్‌లోని మెయిన్‌పురీలో గల నాగ్లా నాథ్‌పుర అనే గ్రామంలో కనీస సౌకర్యాలు కూడా లేనట్లుగా స్థానిక ప్రజలు చెబుతున్నారని వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.
‘తాము మెయిన్ రోడ్‌కు చేరాలంటే పొలాల గుండా నడుచుకుంటూ వెళ్లాలి. మా ఊరు కనీసం మ్యాపులో కూడా లేదు’ అని గ్రామస్థులు చెబుతున్నారు.
అయితే ఈ వార్తలపై అధికారులు స్పందించారు. ఆ గ్రామం గురించి విచారణ చేపడతామని తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Facebook/AIADMK
మద్రాసు హైకోర్టులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వంకు ఊరట లభించింది.
జులైలో జరిగిన అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ మీటింగ్ నిర్ణయాలను కోర్టు రద్దు చేసి, మళ్లీ సమావేశం నిర్వహించాలంటూ ఆదేశించింది.
జులైలో జరిగిన సమావేశంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని అన్నాడీఎంకే తాత్కాలిక జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నారు.
ఆ సమయంలోనే ఒ.పన్నీర్‌సెల్వంను పార్టీ నుంచి తొలగించారు.
పార్టీ నియమాలకు విరుద్ధంగా జనరల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారంటూ ఒ.పన్నీర్‌సెల్వం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.