స్టాలిన్: ‘నేను దిల్లీ వెళ్లేది చేతులు కట్టుకొని కూర్చోవడానికి కాదు’

తాను దిల్లీ వెళ్లేది ప్రజా పథకాల కోసమే కానీ కేంద్రం ముందు చేతులు కట్టుకోని కూర్చోవడానికి కాదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో ముగిస్తున్నాం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం. అంత వరకు సెలవు.

  2. స్టాలిన్: ‘నేను దిల్లీ వెళ్లేది చేతులు కట్టుకొని కూర్చోవడానికి కాదు’

    తాను దిల్లీ వెళ్లేది ప్రజలకు మేలు చేసే పథకాల కోసమే కానీ కేంద్రం ముందు చేతులు కట్టుకోని కూర్చోవడానికి కాదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు.

    వీసీకే 60వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

    ‘నేను చేతులు కట్టుకోవడానికి దిల్లీ వెళ్తానా? కూర్చోని వాళ్ల ఆదేశాలు వింటూ ఉంటానా? నేను కలైంగర్ కొడుకును. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రజల కోసం కేంద్రంతో మాట్లాడి పథకాలు తీసుకురావాల్సిన బాధ్యత నా మీద ఉంది’ అని ఆయన అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. హిమాలయాల్లో గల్లంతైన భారత సైనికుడి మృతదేహం 38 ఏళ్ల తర్వాత దొరికింది.

  4. Period Date Chart: పీరియడ్ రోజుల చార్టులను ఈ అమ్మాయిలు ఇంటి తలుపులపై ఎందుకు పెడుతున్నారు?

    Period Date Chart

    ఫొటో సోర్స్, SHAHBAZ ANWAR/BBC

    ఉత్తరప్రదేశ్‌ మేరఠ్‌లోని హాషిమాపురాకు చెందిన అల్‌ఫిషా ఇంట్లో తలుపుపై తనకు పీరియడ్స్ ఎప్పుడు వస్తాయో ఒక చార్టును పెట్టారు. తన తండ్రి, సోదరుడు కూడా ఇదే ఇంటిలో ఆమెతోపాటే కలిసి జీవిస్తారు. వారు కూడా అప్పుడప్పుడు ఈ చార్టువైపు చూస్తుంటారు. అయితే, ఇదేమీ వారికి కొత్తగా అనిపించడం లేదు.

    ‘‘పీరియడ్స్ సమయంలో మహిళలకు చాలా సమస్యలు వస్తుంటాయి. చికాకు, బలహీనత లాంటి చాలా సమస్యలు వారిని చుట్టుముడుతుంటాయి. ఈ చార్టును ఇంటిలో పెట్టడంతో అందరికీ నాకు పీరియడ్స్ ఎప్పుడు వస్తాయో తెలుస్తుంది. నా పీరియడ్స్‌ను నేను కూడా జాగ్రత్తగా గమనించొచ్చు. అవి సరైన సమయానికే వస్తున్నాయో లేదో తెలుసుకోవచ్చు’’అని ఆమె చెప్పారు.

    మేరఠ్‌కు చెందిన ఆలిమా ఇంటిలోనూ ఇలాంటి చార్టు కనిపిస్తోంది. ఆలిమా ఇంటిలో సోదరుడు, సోదరి, తండ్రితోపాటు మొత్తంగా ఏడుగురు ఉంటారు. వీరంతా తన రుతుచక్రం గురించి తెలుసుకోవడం ముఖ్యమని ఆలిమా భావిస్తున్నారు.

  5. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మొత్తం అప్పులు తీర్చడానికి ఆ కంపెనీ 6 నెలల లాభాలు చాలు

  6. బిల్కిస్ బానో అత్యాచార దోషులను విడుదల చేయడంపై ఆమె భర్త ఏమన్నారు?

  7. బిల్కిస్ బానోను గ్యాంగ్ రేప్ చేసి, కుటుంబ సభ్యులను చంపిన 11మందిని గుజరాత్ ప్రభుత్వం ఎందుకు విడుదల చేసింది?

  8. ఆస్కార్ వేదిక మీదనే ఆమెను అవమానించారు, 50 ఏళ్ల తర్వాత సారీ చెప్పారు

  9. హిమాలయాల్లో గల్లంతైన భారత సైనికుడి మృతదేహం 38 ఏళ్ల తర్వాత దొరికింది

  10. కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఐటీబీపీ బస్సు కూలి ఆరుగురు మృతి

    ఐటీబీపీ

    ఫొటో సోర్స్, ANI

    కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఐటీబీపీ (ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్) బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు ఐటీబీపీ సిబ్బంది మృతి చెందారు. పలువురు సైనికులు గాయపడ్డారు.

    క్షతగాత్రులను శ్రీనగర్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. బస్సు రోడ్డుపై నుంచి జారి 250 అడుగుల దిగువ నదిలో పడిపోయిందని ఐటీబీపీ ఒక ప్రకటనలో తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఈ సైనికులు చందన్‌బరి నుంచి జమ్మూ వెళుతున్నట్టు ఏఎన్ఐ వెల్లడించింది. వీరంతా అమర్‌నాథ్ యాత్ర విధులను నిర్వర్తించి తిరిగి వస్తున్నారని సరిహద్దు భద్రతా దళం ట్వీటర్ ద్వారా తెలిపింది.

    సాధుపాదవ్, చందన్‌బరి మధ్య లోయలో బస్సు పడిపోయింది. సమీపంలో ఉన్న బీఎస్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  11. ఒక సామాన్య మధ్యతరగతి ఇల్లాలిపై ధరల పెరుగుదల ప్రభావం ఎలా ఉంటుంది?

  12. ఏపీ, యూపీలలో బంగారు గనుల తవ్వకాలకు కేంద్రం అనుమతి

    బంగారు గనులు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

    మైనింగ్ రంగం ద్వారా దేశ స్థూల ఆదాయాన్ని వృద్ధిపరచే దిశలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలోని 13 బంగారు గనులలో తవ్వకాలకు అనుమతిచ్చింది.

    ఏపీలో 10 బ్లాకులు, యూపీలో 3 బ్లాకులను వేలానికి పెట్టనున్నట్టు పీటీఐ తెలిపింది.

    ఏపీలోని 10 బ్లాకుల్లో అయిదు బ్లాకులను ఆగస్టు 26న, మిగతా అయిదు బ్లాకులను ఆగస్టు 29న వేలానికి పెట్టే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని మూడు బ్లాకులను ఈ నెలలోనే వేలం వేయనున్నట్టు సమాచారం. ఇంకా తేదీలు ప్రకటించలేదు.

    ఆంధ్రప్రదేశ్‌లోని బంగారు గనులలో రామగిరి నార్త్ బ్లాక్, బొక్సంపల్లి నార్త్ బ్లాక్, బాక్సంపల్లి సౌత్ బ్లాక్, జవాకుల-ఎ బ్లాక్, జవాకుల-బి బ్లాక్, జవాకుల-సి బ్లాక్, జవాకుల-డి బ్లాక్, జవాకుల-ఈ బ్లాక్, జవాకుల-ఎఫ్ బ్లాక్ ఉన్నాయి. ఈ బంగారు గనుల్లో తవ్వకాల కోసం టెండర్లను ఆహ్వానిస్తూ మార్చిలో నోటీసులు వెలువడ్డాయి.

    ఉత్తరప్రదేశ్‌లోని మూడు గనులలో, రెండు బంగారు గనులు.. సోనాపహారి బ్లాక్, ధుర్వ-బియాదండ్ బ్లాకులు సోన్‌భద్రలో ఉన్నాయి. ఈ మూడు గనుల్లో తవ్వకాలకు టెండ్లరను ఆహ్వానిస్తూ మే 21న నోటీసులు వెలువడ్డాయని పీటీఐ తెలిపింది.

    దేశంలోని మినరల్ బ్లాకుల వేలం స్థిరపడిందని మేలో ప్రభుత్వం తెలిపింది. ఆగస్టు 4న రాష్ట్రాలు 99 మినరల్ బ్లాక్‌లను వేలం వేశాయి.

    2015లో మైనింగ్ చట్టంలో సవరణ తరువాత వేలం ద్వారా ఖనిజ బ్లాకుల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 45 మినరల్ బ్లాకుల్లో తవ్వకాలను వేలం వేశారు.

  13. అవినీతి, బంధుప్రీతిపై నరేంద్ర మోదీ ఎందుకు మాట్లాడారు? ప్రధాని టార్గెట్ ఎవరు?

  14. వాజ్‌పేయి మాటల్ని నెహ్రూ ఎందుకంత శ్రద్ధగా వినేవారు?

  15. నేడు చైనా నౌక శ్రీలంక హంబన్‌తోట ఓడరేవు చేరనుంది

    యువాన్ వాంగ్-5

    ఫొటో సోర్స్, Getty Images

    చైనాకు చెందిన యువాన్ వాంగ్-5 నౌక నేడు అంటే ఆగస్టు 16న శ్రీలంకలోని హంబన్‌తోట ఓడరేవుకు చేరుకుంటుంది. ఈ నౌక వచ్చే ఆరు రోజుల పాటు హంబన్‌తోటలోనే ఉంటుంది.

    అంతకుముందు ఈ నౌక ఆగస్టు 11న హంబన్‌తోట చేరాల్సి ఉండగా, దీని రాకపోకలపై భారత్ ఆందోళనలు వ్యక్తం చేసింది. చైనా ఈ నౌకాశ్రయాన్ని సైనిక కార్యకలాపాలకు ఉపయోగించుకోవచ్చని భారత్ భయపడుతోంది.

    కాగా, ఇంధనం నింపుకోడానికే చైనా నౌక హంబన్‌తోటలో ఆగుతోందని శ్రీలంక వివరణ ఇచ్చింది.

    భారతదేశం అభ్యంతరాలు వ్యక్తం చేసిన తరువాత, ఈ నౌక రాకను వాయిదా వేయాలని శ్రీలంక కోరింది. దాంతో, యువాన్ వాంగ్ 5 నౌక శ్రీలంకలో హాల్ట్ అయే తేదీలు సమయం వాయిదా పడ్డాయి.

    చివరకు, ఆగస్టు 16 నుంచి 22 వరకు హంబన్‌తోట ఓడరేవులో పోర్ట్ చేయడానికి ఆమోదించామని శ్రీలంక విదేశాంగ శాఖ గత శుక్రవారం ధృవీకరించింది.

    యువాన్ వాంగ్ 5 నౌక అంతర్జాతీయ షిప్పింగ్, పరిశోధన-సర్వే నౌక అని చైనా చెబుతోంది. అయితే, ద్వంద్వ ప్రయోజనాలను నెరవేర్చే ఈ నౌకను ’గూఢచారి నౌక’ అని కూడా పిలుస్తున్నారు.

    1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 11,944 కోట్లు) విలువ గల హంబన్‌తోట నౌకాశ్రయం ఆసియా, యూరప్‌ మధ్య ప్రధాన నౌకా మార్గానికి సమీపంలో ఉంది.

    శ్రీలంకలోని ఈ ప్రాంతం తమిళనాడుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున, జాఫ్నాలో చైనా ఉనికి భారతదేశానికి ముప్పుగా పరిణమించవచ్చని భావిస్తున్నారు.

  16. పీరియడ్ రోజుల చార్టులను ఈ అమ్మాయిలు ఇంటి తలుపులపై ఎందుకు పెడుతున్నారు?

  17. పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లో హింసాత్మక నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి?

  18. భారత ఫుట్‌బాల్ అసోసియేషన్‌ను సస్పెండ్ చేసిన ఫిఫా.. అండర్-17 మహిళల ప్రపంచ కప్ ఆతిథ్యం రద్దు

    FIFA

    ఫొటో సోర్స్, Getty Images

    అంతర్జాతీయ ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ ఫిఫా (FIFA) భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను సస్పెండ్ చేసింది.

    "థర్డ్ పార్టీ జోక్యం" ఉందన్న కారణంగా భారత ఫుట్‌బాల్ అసోసియేషన్‌ను సస్పెండ్ చేయాలని కౌన్సిల్ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ఫిఫా ఒక ప్రకటనలో తెలిపింది.

    థర్డ్ పార్టీ జోక్యం ఫిఫా నియమాల తీవ్ర ఉల్లంఘన అని కూడా స్పష్టం చేసింది. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.

    ఈ సస్పెన్షన్ వల్ల భారత్‌లో అక్టోబర్ 11న ప్రారంభం కానున్న అండర్-17 మహిళల వరల్డ్ కప్ రద్దవుతుంది. ఈ టోర్నమెంట్ అక్టోబర్ 11 నుంచి 30 వరకు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరగాల్సి ఉంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఈ ఏడాది మేలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని రద్దు చేసింది. ఈ క్రీడను నియంత్రించడానికి ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. అయితే, ఫిఫా సభ్యులు చట్టపరమైన, రాజకీయ జోక్యానికి దూరంగా ఉండాలన్నది నియమం.

    ఈ నెల ప్రారంభంలో ఫిఫా, భారత ఫుట్‌బాల్‌ను సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది. ఏఐఎఫ్ఎఫ్, నిర్వహణ అధికారం కలిగిన కమిటీని ఏర్పాటు చేసిన తరువాతే సస్పెన్షన్ ఎత్తివేస్తామని చెప్పింది.

    వార్తా సంస్థ ఏఎఫ్‌పీ అందించిన ప్రకారం, ఇప్పటివరకు ఏఐఎఫ్ఎఫ్ ఒక కమిటీ ద్వారా నడుస్తోంది. మాజీ చీఫ్ ప్రఫుల్ పటేల్ పదవీకాలం ముగిసినా, ఎన్నికలు లేకుండా ఆ పదవిలో కొనసాగుతున్నారు.

  19. మహారాష్ట్ర: బండరాళ్లపై ప్రముఖుల చిత్రాలు.. స్టోన్ ఆర్ట్‌తో ఆకట్టుకుంటున్న యువకుడు