అరవింద్ కేజ్రీవాల్: ‘ఉచితాలు రద్దు చేయాలంటున్నారు.. కేంద్రం దగ్గర డబ్బంతా ఎటు పోయింది?’

‘‘ఈ ప్రభుత్వ డబ్బుతో తమ స్నేహితుల రుణాలు మాఫీ చేస్తున్నారు. వాళ్లు తమ బిలియనీర్ స్నేహితులకు పన్నులు కూడా మాఫీ చేస్తున్నారు’’ అని కేజ్రీవాల్ విమర్శించారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ నేటి అప్‌డేట్లను ఇక్కడితో ముగిస్తున్నాం.

    ధన్యవాదాలు.

  2. దేశంలో నిరుద్యోగిత పెరుగుతోందా? ఎందుకు

  3. ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా సినిమా ఎలా ఉంది?

  4. అరవింద్ కేజ్రీవాల్: ‘ఉచితాలు రద్దు చేయాలంటున్నారు.. కేంద్రం దగ్గర డబ్బంతా ఎటు పోయింది?’

    అరవింద్ కేజ్రీవాల్

    ఫొటో సోర్స్, ANI

    కేంద్ర ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసే పన్నులతో తమ స్నేహితుల రుణాలను మాఫీ చేస్తోందని.. మరోవైపు ప్రజలకు ఉచితంగా ఏమీ ఇవ్వవద్దని అంటోందని దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు.

    ‘‘దేశంలో గత 75 ఏళ్లలో ఎన్నడూ ప్రభుత్వం కనీస ఆహార ధాన్యాల మీద పన్ను విధించలేదు. పెట్రోల్, డీజిల్‌ల మీద పన్ను 1000 కోట్ల రూపాయలు దాటింది. వాళ్లు ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేవాటినన్నిటినీ ఆపేయాలని అంటున్నారు. ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల్లో ఫీజులు వసూలు చేయాలని అంటున్నారు. ఉచిత రేషన్లు ఆపేయాలని అంటున్నారు’’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    కేంద్రం తన దగ్గర డబ్బులు లేవని పదే పదే చెప్తోందని, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన డబ్బులను తగ్గిస్తోందని కేజ్రీవాల్ అన్నారు. 2014తో పోలిస్తే చాలా ఎక్కువగా పన్నులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.

    ‘‘కేంద్ర ప్రభుత్వం దగ్గరి డబ్బులన్నీ ఎటు పోయాయి? వాళ్లు ఈ ప్రభుత్వ డబ్బుతో తమ స్నేహితుల రుణాలు మాఫీ చేస్తున్నారు. వాళ్లు తమ బిలియనీర్ స్నేహితులకు పన్నులు కూడా మాఫీ చేస్తున్నారు’’ అని కేజ్రీవాల్ విమర్శించినట్లు ఏఎన్ఐ చెప్పింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    కేజ్రీవాల్ వక్రీకరించి మాట్లాడుతున్నారు: నిర్మలా సీతారామన్

    కేజ్రీవాల్ విమర్శలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ..ఆరోగ్యం, విద్య అంశాలపై ఆయన వక్రీకరించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

    ‘‘ఇది ప్రజలను భయపెట్టటానికి. ఉచితాల మీద చర్చ జరగాలని మేం కోరుతున్నాం’’ అని ఆమె పేర్కొన్నారు.

    సుప్రీంకోర్టు

    ఫొటో సోర్స్, ANI

    ఉచిత పంపిణీలు, హామీలు తీవ్రమైన అంశం: సుప్రీంకోర్టు

    ఇదిలావుంటే.. ఎన్నికల సమయంలో ఉచిత పంపిణీలు, ఉచితాల హామీలు ఇవ్వటం ‘‘తీవ్రమైన అంశం’’ అని సుప్రీంకోర్టు బుధవారం నాడు వ్యాఖ్యానించింది. వీటి కోసం ఖర్చు చేసే డబ్బును మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి వాటి కోసం ఖర్చుచేయాలని పేర్కొంది.

    ప్రజల డబ్బు నుంచి ఏవేవో ఉచితంగా ఇస్తామని, పంపిణీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయాలని, వాటి ఎన్నికల చిహ్నాలను స్వాధీనం చేసుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద సుప్రీంకోర్టు గురువారం విచారించింది.

    చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం.. ఆర్థిక వ్యవస్థ డబ్బు కోల్పోతోందని, ప్రజాసంక్షేమానికి, ఆర్థిక వ్యవస్థకు సంతులనం ఉండాలని పేర్కొంది.

    ‘‘అందుకే ఈ చర్చ జరుగుతోంది. ఇది సీరియస్ ఇష్యూ. దీనిని వ్యతిరేకిస్తున్న వారు.. దీనికి తాము పన్నులు కడుతున్నామని అంటున్నారు. వారి డబ్బును మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పనుల మీద ఖర్చు చేయాలి కానీ. ప్రజలను విభజించరాదు’’ అని ఈ కేసులో ఇరుపక్షాలకూ సుప్రీంకోర్టు చెప్పింది.

    ఈ అంశంపై మరింత చర్చ జరగాలని పేర్కొంది. ‘‘ఇది కచ్చితంగా ఆందోళనకరమైన విషయమే. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. కానీ పేదరికం ఉన్న భారత్ వంటి దేశంలో ఇటువంటి అంశాన్ని విస్మరించలేం’’ అని వ్యాఖ్యానించింది.

    దిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఈ పిల్‌ను వ్యతిరేకిస్తూ.. వస్తువుల పంపిణీకి, ప్రజా సంక్షేమం కోసం ఉచిత పథకాలకు తేడా ఉందన్నారు. ఈ కేసులో ఉచితాలు అనే పదాన్ని తప్పుడు అన్వయంతో ఉపయోగించారని పేర్కొన్నారు.

  5. సింగపూర్ జైలులో కాల్పుల నుంచి తప్పించుకున్న తెలుగువాడు, దక్షిణ భారతాన తొలి రాజకీయ ఖైదీ

  6. ఉత్తరప్రదేశ్: యమునా నదిలో పడవ మునక.. ముగ్గురు మృతి, మరో 17 మంది గల్లంతు

    యమునా నదిలో పడవ ప్రమాదం

    ఫొటో సోర్స్, ANI

    ఉత్తరప్రదేశ్‌లో యమునా నదిలో ప్రయాణిస్తున్న ఒక పడవ తల్లకిందులైన దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది గల్లంతైనట్లు అధికారులు చెప్పారు.

    పడవ నిండుగా ప్రయాణికులతో ఫతేపూర్ నుంచి మార్కా గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బలమైన గాలుల వల్ల బోటు తల్లకిందులైందని బండా ఎస్‌పీ అభినందన్ చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    ఈ ప్రమాదంలో 15 మందిని రక్షించారని, ముగ్గురి మృతదేహాలను వెలికితీశామని, ఇంకా 17 మంది ఆచూకీ తెలియటం లేదని ఆయన చెప్పారు.

    భారీ స్థాయిలో గాలింపు, సహాయ చర్యలు నిర్వహిస్తున్నామని, ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బలగాలు కూడా ఘటనా స్థలానికి చేరుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. 'స్నేహానికి దేశాలు, సరిహద్దులు లేవు' - పాక్ మహిళతో స్నేహం గురించి భారతీయ మహిళ షేర్ చేసిన ఫొటోపై సోషల్ మీడియాలో ప్రశంసలు

  8. సంపన్నులు ఎగ్గొట్టిన రుణాల వల్లే వడ్డీ రేట్లు పెరుగుతున్నాయా, గత 5 ఏళ్లలో రూ.10 లక్షల కోట్లు రైటాఫ్ చేసిన బ్యాంకులు

  9. ఫ్రాన్స్‌లో చెలరేగుతున్న రాకాసి కార్చిచ్చు.. నిలువరించటానికి 1,000 మందికి పైగా పోరాటం

    ఫ్రాన్స్‌లో రాకాసి కార్చిచ్చు

    ఫొటో సోర్స్, EPA

    ఫ్రాన్స్‌లో గత రెండు రోజులుగా భారీ కార్చిచ్చు చెలరేగుతోంది. నైరుతి ప్రాంతంలోని బోర్డాక్స్ నగరం సమీపంలో రాజుకున్న ఈ కార్చిచ్చు ఇప్పటికే 17,300 ఎకరాల అడవితో పాటు అనేక ఇళ్లను కూడా దహించి వేసింది.

    ఆ ప్రాంతంలో దాదాపు 10,000 మంది జనాభా ఇళ్లు విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది.

    దావానలాన్ని అదుపు చేయటానికి 1,000 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది పోరాడుతున్నారు. కానీ బలమైన గాలులు, అధిక ఉష్ణోగ్రతలు ఈ ఆపరేషన్‌కు అడ్డంకులుగా మారాయి.

    ‘‘అది రాకాసి కార్చిచ్చు’’ అని అగ్నిమాపకశాఖ అధికార ప్రతినిధి గ్రెగరీ అలియోన్ ఫ్రాన్స్ ఆర్‌టీఎల్ రేడియోతో చెప్పారు.

    ఫ్రాన్స్ కార్చిచ్చు

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, కార్చిచ్చు వ్యాపించకుండా అడ్డుకోవటానికి అగ్నిమాపక విమానాల ద్వారా ప్రయత్నిస్తున్నారు

    కార్చిచ్చుతో పోరాటానికి సాయం చేసేందుకు ఆస్ట్రియా, జర్మనీ, గ్రీస్, పోలండ్ దేశాలు ముందుకు వచ్చాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ ట్వీట్ చేశారు.

    ఈ వేసవి కాలంలో ఫ్రాన్స్‌తో పాటు అనేక యూరప్ దేశాల్లో భీకర కార్చిచ్చులు చెలరేగాయి. యూరప్ ఖండమంతటా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవటం, కరవుల కారణంగా ఈ కార్చిచ్చులు పెరిగిపోయాయి.

    పోర్చుగల్, స్పెయిన్ దేశాల్లో వాతావరణం అధికంగా వేడెక్కటం వల్ల 1,000 పైగా మరణాలు నమోదయ్యాయి.

    ఫ్రాన్స్ కార్చిచ్చు

    ఫొటో సోర్స్, AFP VIA GETTY IMAGES

    ఫొటో క్యాప్షన్, కార్చిచ్చులో కాలిపోయిన ప్రాంతం యుద్ధభూమిని తలపిస్తోంది
    ఫ్రాన్స్ కార్చిచ్చు
  10. లాల్ సింగ్ చ‌డ్డా రివ్యూ: సుదీర్ఘంగా సాగిన ఎమోష‌నల్ జ‌ర్నీ

  11. తెలంగాణ: 8 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ రైస్ కొనేందుకు కేంద్రం అంగీకారం

    తెలంగాణ నుంచి 2021-22 రబీ సీజన్‌కు సంబంధించి 8 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని కొనేందుకు అంగీకరించింనట్లు కేంద్ర పౌరసఫరాలశాఖ తెలిపింది.

    ఇప్పటికే 6.05 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని కొనేందుకు కేంద్రం అంగీకరించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. కర్నాటకలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు... ఇద్దరు మృతి

    కర్నాటకలో రెండు వర్గాల మధ్య గొడవలు

    ఫొటో సోర్స్, ANI

    కర్నాటకలోని కొప్పల్ జిల్లాలో గల హులిహైదర్ గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి.

    ఈ గొడవల్లో ఇద్దరు చనిపోగా ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

    ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ విధించారు.

    ఇండియా టుడే కథనం ప్రకారం... అక్కడ ఒక ముస్లిం అమ్మాయిని హిందూ అబ్బాయి ప్రేమిస్తున్నాడు. మొహర్రం రోజున ఆ అమ్మాయిని కలవడానికి ఆ అబ్బాయి వెళ్లాడు. గొడవ ఇక్కడి నుంచే మొదలైనట్లుగా తెలుస్తోంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. చైనాలో కనిపిస్తున్న లాంగ్యా వైరస్ ప్రాణాంతకమా? నిపుణులు ఏమి చెబుతున్నారు?

  14. జమ్మూ కశ్మీర్: మిలిటెంట్ల దాడిలో చనిపోయిన సైనికులు వీరే

    జమ్మూ కశ్మీర్‌లోని రజౌరీలో భారత సైనిక శిబిరం మీద జరిగిన దాడిలో చనిపోయిన సైనికుల వివరాలను వార్తా సంస్థ ఏఎన్‌ఐ వెల్లడించింది.

    చనిపోయిన సైనికులు:

    • రాజేంద్ర ప్రసాద్ (సుబేదార్)
    • మనోజ్ కుమార్ (రైఫిల్ మ్యాన్)
    • లక్ష్మణన్ (రైఫిల్ మ్యాన్)

    రజౌరీ జిల్లాలోని దరహాల్ ప్రాంతంలో ఉండే భారత సైనిక శిబిరం మీద మిలిటెంట్లు దాడి చేశారు.

    ఈ ఘటనలో సైనికులు, మిలిటెంట్ల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇద్దరు మిలిటెంట్లను చంపివేయగా ముగ్గురు సైనికులు కూడా మరణించినట్లు సైనిక అధికారులు తెలిపారు.

    దరహాల్ పోలీసు స్టేషన్‌కు 6 కిలోమీటర్ల దూరంలో సైనిక శిబిరం ఉంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. ఇసుక తవ్వకాలే గోదావరికి చేటు చేస్తున్నాయా?

    గోదావరికి ఈసారి భారీ వరద వచ్చింది.

    వందల గ్రామాలు, వేల ఎకరాల పంట నీట మునిగి చాలామంది నష్టాల పాలయ్యారు. ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన కోనసీమ ప్రాంతం ఈ వరదల మూలంగా బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది.

    గోదావరి వరదలు ఇంతగా ముంచెత్తడానికి కారణం ఏంటి? పరిష్కారం లేదా?

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  16. బ్రేకింగ్ న్యూస్, ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖర్ ప్రమాణ స్వీకారం

    భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్

    ఫొటో సోర్స్, Sansad TV

    వైస్ ప్రెసిడెంట్‌గా జగదీప్ ధన్‌ఖర్ ప్రమాణ స్వీకారం చేశారు.

    ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

    ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు.

    ఇతర కేంద్ర మంత్రులు, ప్రతిపక్షాల నాయకులు కూడా వచ్చారు.

  17. ‘అది బోగస్, నేను ఉపరాష్ట్రపతి కావాలని అనుకోలేదు’

    తాను ఉపరాష్ట్రపతి కావాలని కోరుకోలేదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. తనకు అలాంటి ఉద్దేశమే లేదని ఆయన చెప్పారు.

    సుశీల్ కుమార్ మోదీ చెప్పినవన్నీ బోగస్ అని అన్నారు.

    నితీశ్ కుమార్ ఉపరాష్ట్రపతి కావాలని కోరుకున్నారని, ఆయన పార్టీకి చెందిన నేతలు ఈమేరకు బీజేపీని అడిగారని బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ అన్న విషయం తెలిసిందే.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  18. వంట గ్యాస్ ధర పెరగడంతో కట్టెల పొయ్యిని ఆశ్రయిస్తున్నారా?

    వంటగదిలో ఉక్కిరిబిక్కిరి చేసే పొగ నుంచి నిరుపేద మహిళలకు విముక్తిని ప్రసాదించే లక్ష్యంతో 2016లో ఉజ్వల పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం.

    ఆ పథకం కింద, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్, స్టవ్‌లతో పాటు నింపిన గ్యాస్ సిలిండర్ ఇచ్చారు.

    ప్రస్తుతం సిలిండర్ ధర భారీగా పెరిగిన నేపథ్యంలో నిరుపేద కుటుంబాలు ఏం చేస్తున్నాయి?

    మహారాష్ట్రలోని మేల్ఘాట్ ప్రాంతంలో ఓ ఆదివాసీ గ్రామం నుంచి బీబీసీ ప్రతినిధి నితేష్ రావుత్ అందిస్తున్న కథనం.

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  19. ‘నేడు థాయిలాండ్‌కు గోటబయ రాజపక్ష’

    శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్ష

    ఫొటో సోర్స్, Getty Images

    శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్ష థాయిలాండ్‌లో తాత్కాలికంగా కొంతకాలం ఉండనున్నట్లు అల్‌జజీరా, రాయిటర్స్ తెలిపాయి.

    ఈమేరకు నేడు ఆయన బ్యాంకాక్‌కు చేరుకోనున్నారు.

    శ్రీలంక దివాలా తీయడానికి గోటబయ విధానాలే కారణమంటూ జులైలో అక్కడి ప్రజలు నిరసనలకు దిగిన విషయం తెలిసిందే.

    నాడు నిరసనలు ఉధృతం అవుతున్న తరుణంలో గోటబయ రాజపక్ష శ్రీలంక విడిచి పారిపోయారు. మాల్దీవుల మీదుగా జులై 14న సింగపూర్ చేరుకున్నారు.

    మానవీయ దృక్పథంతో గోటబయను తమ దేశంలో కొంత కాలం ఉండనిస్తున్నట్లు థాయిలాండ్ ప్రధాని ప్రయుత్ చాన్ ఒచా తెలిపారు.

    డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ ఉన్న గోటబయ రాజపక్ష థాయిలాండ్‌లో 90 రోజుల వరకు ఉండొచ్చని అధికారులు తెలిపారు.

  20. కోరుకొండ సుబ్బారెడ్డి: ఈ ఆదివాసీ నాయకుడిని బ్రిటిషర్లు ఉరితీసి, రాజమండ్రి కోటగుమ్మం దగ్గర వేలాడదీశారా?