భారత కొత్త ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్.. ఎన్నికల్లో ఘన విజయం

ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో పార్లమెంటు ఉభయసభలైన రాజ్యసభ, లోక్‌సభలకు ఎన్నికైన, నామినేట్ అయిన మొత్తం 780 మంది ఎలక్టర్లకు గాను.. 725 మంది ఓట్లు వేశారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యావాదాలు!

    ఈనాటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ఇక్కడితో ముగిస్తున్నాం.

    ధన్యవాదాలు.

  2. కామన్వెల్త్ క్రీడలు 2022: బాక్సింగ్‌లో రజతం గెలిచిన జాస్మిన్ లాంబోరియా

    జాస్మిన్ లాంబోరియా (బ్లూ జెర్సీ)

    ఫొటో సోర్స్, Francois Nel/Getty Images

    ఫొటో క్యాప్షన్, భారత బాక్సర్ జాస్మిన్ లాంబోరియా (బ్లూ జెర్సీ)

    బ్రిటన్‌లోని బర్మింఘామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో.. మహిళల 60 కిలోల లైట్‌వెయిట్ విభాగంలో భారత బాక్సర్ జాస్మిన్ లాంబోరియా కాంశ్య పతకం గెలుపొందారు.

    శనివారం నాడు ఇంగ్లండ్ క్రీడాకారిణి జెమ్మా పేజ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 3-2 స్కోరుతో జాస్మిన్ ఓడిపోయారు.

    ఈ విభాగంలో ఫేవరేట్ అయిన జెమ్మాకు 20 ఏళ్ల జాస్మిన్ గట్టి సవాల్ విసిరారు.

    ఈ మ్యాచ్‌లో గెలిచిన జెమ్మా ఫైనల్‌కు చేరుకున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఫ్లైవెయిట్ పోటీల్లో ఫైనల్‌కు చేరుకున్న నిఖత్ జరీన్

    మరోవైపు.. ఇవే కామన్వెల్త్ క్రీడలు మహిళల ఫ్లైవెయిట్ బాక్సింగ్ పోటీల్లో భారత బాక్సర్ నిఖత్ జరీన్.. ఫైనల్‌కు చేరుకున్నారు.

    ఇంగ్లండ్ క్రీడాకారిణి సవన్నా ఆల్ఫియాను ఓడించి ఆమె ఫైనల్‌కు దూసుకెళ్లారు.

    ఫ్లైవెయిట్ కేటగిరీలో నిఖత్ జరీన్ ప్రస్తుతం ప్రపంచ చాంపియన్‌గా ఉన్నారు.

    నిఖత్ జరీన్ (రెడ్ జెర్సీ)

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, నిఖత్ జరీన్ (రెడ్ జెర్సీ)
  3. బాసర ట్రిపుల్ ఐటీ: సమస్యలకు నిలయంగా ఎందుకు మారింది?

  4. తల్లిపై అత్యాచారం జరిగిన 28 ఏళ్ల తర్వాత నిందితులపై కేసు పెట్టి అరెస్టు చేయించిన కొడుకు

  5. 'బిన్ లాడెన్ తల తీసుకురా': అల్ ఖైదా అధినేతను వేటాడటానికి అమెరికా పంపిన సీఐఏ గూఢచారి

  6. బ్రేకింగ్ న్యూస్, భారత కొత్త ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్.. ఎన్నికల్లో ఘన విజయం

    జగదీప్ ధన్కర్, ద్రౌపది ముర్ము

    ఫొటో సోర్స్, @jdhankhar1

    ఫొటో క్యాప్షన్, కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కొత్త ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ (ఫైల్ ఫొటో)

    భారత 16వ ఉప రాష్ట్రపతిగా ఎన్‌డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కర్ గెలుపొందారు.

    ఆయన తన ప్రత్యర్థి, ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వా మీద 346 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

    ఉప రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలను శనివారం ఓట్ల లెక్కింపు అనంతరం లోక్‌సభ జనరల్ సెక్రటరీ ఉత్పల్ కె సింగ్ ప్రకటించారు.

    మొత్తం పోలైన 725 ఓట్లలో జగదీప్ ధన్కర్‌కు 528 ఓట్లు వచ్చాయి.

    మార్గరెట్ అల్వాకు 182 ఓట్లు లభించాయి.

    ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో పార్లమెంటు ఉభయసభలైన రాజ్యసభ, లోక్‌సభలకు ఎన్నికైన, నామినేట్ అయిన మొత్తం 780 మంది ఎలక్టర్లకు గాను.. 725 మంది ఓట్లు వేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. బాసర ట్రిపుల్ ఐటీ: సమస్యలకు నిలయంగా ఎందుకు మారింది, లోపం ఎక్కడుంది?

  8. కామన్వెల్త్ గేమ్స్: క్రికెట్ టీ-ట్వంటీ సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్న భారత మహిళా జట్టు

    భారత మహిళా క్రికెట్ జట్టు

    ఫొటో సోర్స్, ICC via ANI

    కామన్వెల్త్ క్రీడా పోటీల్లో భారత మహిళా క్రికెట్ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది.

    శనివారం జరిగిన ట్వంటీ-20 సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను నాలుగు పరుగుల తేడాతో భారత మహిళా జట్టు ఓడించింది.

    తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. స్మృతి మందాన 32 బంతుల్లో 61 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ 31 బంతుల్లో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.

    ఇంగ్లండ్ జట్టు 165 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించగా.. 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేసింది. భారత జట్టు బౌలర్లు స్నేహ రాణా 2 వికెట్లు తీయగా, దిప్తి శర్మ 1 వికెట్ పడగొట్టారు. మరో ముగ్గురు బ్యాట్స్‌వుమన్‌ రనవుట్ అయ్యారు.

    కామన్వెల్త్ క్రీడలు మహిళా క్రికెట్ విభాగంలో రెండో సెమీ ఫైనల్ భారత కాలమానం ప్రకారం ఆదివారం జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా – న్యూజీలాండ్ జట్లు తలపడనున్నాయి.

    ఫైనల్ మ్యాచ్ సోమవారం జరుగుతుంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. నాడు 2జీ స్పెక్ట్రమ్‌లో కుంభకోణం అని గొడవ చేశారు.. ఇప్పుడు 5జీ స్పెక్ట్రమ్ స్కామ్ కాదా?

    కేసీఆర్

    ఫొటో సోర్స్, @TelanganaCMO

    ‘‘ఎన్‌డీఏలో ఎన్‌పీఏ దందా జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ బాగా పనిచేస్తే ఎన్‌పీఏలు తగ్గాలి కదా? కానీ 10 రెట్లు ఎందుకు పెరిగింది? దేశంలో 2 లక్షల కోట్ల ఎన్‌పీఏ 20 లక్షల కోట్లకు పెరిగిందంటే.. ఇది దేనికి సంకేతం? మీ పనితనమా? దోపిడీయా? బ్యాంకుల రుణాల ఎగవేతలు లక్షల కోట్లకు పెరుగుతాయి? ఇది ప్రగతికి సంకేతమా?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు.

    ఆయన ఇంకా ఏమన్నారంటే...

    ‘‘దేశంలో ఎక్కడ ప్రొడక్టివిటీ పెరిగింది? మేక్ ఇన్ ఇండియా అన్నారు. మరి పతంగుల మాంజా, దీపావళి టపాసులు, షేవింగ్ చేసుకునే బ్లేడ్లు కూడా చైనా నుంచి ఎందుకు వస్తున్నాయి? మొబైల్ ఫోన్లు, పీపీయే కిట్లు, నేషనల్ ఫ్లాగ్స్ కూడా చైనా నుంచి వస్తే.. ఇది మేక్ ఇన్ ఇండియానా? దిగుమతులు తగ్గాలా? పెరగాలా?

    భారతదేశపు భూమిలో 50 శాతం భూమి సాగుయోగ్యమైన భూమి. ప్రపంచంలో మరే దేశానికీ ఇలాంటి అవకాశం లేదు. ప్రతి ఎకరానికీ నీళ్లు ఇవ్వగలిగే సదుపాయం ఉంది. ఇవ్వాళ కూడా కందిపప్పు, పామాయిల్ దిగుమతి చేసుకుంటోంది. ఇదా నీతి ఆయోగ్ మేధో సంపత్తి? కేంద్ర ప్రభుత్వ ప్రజ్ఞ. మీ కార్పొరేట్ అనుకూల వైఖరి వల్ల నూనెగింజలు పండించాల్సిన రైతులు దిల్లీ సరిహద్దు దగ్గర నిరసనలు చేస్తున్నారు.

    అంతా ప్రైవేటైజేషన్. ఎయిర్‌పోర్టు, రైల్వేలు, కరెంటు అన్నీ. ఇదేం దౌర్భాగ్యం. బ్యాంకుల రుణాల ఎగవేత. బ్యాంకుల లూటీలు ఏమిటి? బ్యాంకులు లూటీ చేసి బయటి దేశాలకు పారిపోతున్నారు. మొదటి దశలో మేధో సంపత్తి వలస పోయింది. ఇవ్వాళ పెట్టుబడులు వలస పోతున్నాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు హరించుకుపోతున్నాయి. శ్రీలంక లాంటి పరిస్థితులు వస్తాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    కానీ..రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సబ్సిడీ పథకాలు ఇస్తుంటే..అవి ఉచిత పథకాలు, వాటిని నిలిపివేయాలని చెప్తారా? పేద ప్రజల నోళ్లు కొట్టి కాకులకు గద్దలకు వేయాలా? ఇదెక్కడి నీతి?

    అప్పుడు 2జీ స్పెక్ట్రమ్‌ వేలంలో అన్యాయం జరిగినట్లు పెడబొబ్బలు పెట్టారు? మరి ఈ రోజు 5జీ వేలం సంగతేమిటి? 5 లక్షలకు ఎస్టిమేట్ వేస్తే.. లక్షా యాభై వేల కోట్లే వస్తాయా? ఇది కుంభకోణం కాదా?

    ఒకవైపు గాలి తప్ప అన్నిటి మీదా జీఎస్‌టీ పన్నులు వేస్తున్నారు. పాల మీద, స్మశానాల మీద, అల్పాదాయ వర్గాల మీద జీఎస్‌టీ పన్ను వేస్తారు.

    రాష్ట్రాల అభివృద్ధిని కుంటు పరచకండి. బలమైన రాష్ట్రాలు ఉంటేనే బలమైన భారతదేశంగా ఉంటుంది. అదే నిజమైన సమాఖ్య స్ఫూర్తి. దానిని పాటించండి.

    ఇప్పుడు మాటలుగా అడుగుతున్నాం. అవసరమైతే కలిసివచ్చే వారిని కలుపుకుని బలీయమైన ఉద్యమాలను కూడా నిర్మిస్తాం. మోదీ నాకు మిత్రుడు. వ్యక్తిగత విభేదాల్లేవు. కానీ సంఘర్షణ తప్పదు.’’ అని కేసీఆర్ మీడియా సమావేశంలో అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. బ్రేకింగ్ న్యూస్, కేసీఆర్ ప్రెస్‌మీట్: ‘నేనే దేవుణ్ని అన్న హిరణ్యకశిపుడు.. పొట్టుపొట్టు అయిండు’

    కేసీఆర్

    ఫొటో సోర్స్, @TelanganaCMO

    ‘‘ఏదైనా ముఖ్యమైన నిర్ణయం మీద నీతి ఆయోగ్‌లో చర్చ చేస్తున్నారా? ఇది కోఆపరేటివ్ ఫెడరలిజమా? లేదంటే ఇంపీరియల్ డిక్టేటరిజమా?’’ అని కేసీఆర్ కేంద్రం తీరును విమర్శించారు.

    ‘‘అధికార పార్టీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతాడు. డైరెక్ట్‌గా. మొత్తం భారతదేశంలో ఏకస్వామ్య పార్టీ ఉంటుంది, మిగతా వాటిని మింగేస్తాం, అని ఓపెన్‌గా చెప్తారు. ఇదేనా టీమ్ ఇండియా.?

    ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాస్తూ రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ఇవే రేపు మిమ్మల్ని కూడా కబళిస్తాయి కదా? చర్యకు ప్రతి చర్య ఉంటుంది కదా?

    ఏక్‌నాథ్ షిండేలను సృష్టిస్తారా? ఇవన్నీ ఎవరి ప్రోత్సాహంతో జరుగుతున్నాయి? ఏం తమాషాగా ఉందా? ఇంత అహంకారమా? బెంగాల్‌లో, తెలంగాణలో, తమిళనాడులో ప్రకటిస్తారు.

    ప్రజలంటే ఇంత నిర్లక్ష్యమా? ఏమైనా మాట్లాడితే జైల్లో వేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఇదేం పద్ధతి?

    టెంపరరీ ఫేజ్ కదా. హిరణ్యకశిపుడు కూడా నేనే దేవుణ్ని, నన్నే మొక్కాలి అన్నాడు. చివరికి ఏమైంది? పొట్టుపొట్టు అయిండు’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

  11. బ్రేకింగ్ న్యూస్, కేసీఆర్ ప్రెస్‌మీట్: ‘తెలంగాణకు గత ఏడాది కేంద్రం నుంచి రూ. 5 వేల కోట్లు కూడా ఇవ్వలేదు’

    తెలంగాణ రాష్ట్రం గత ఆర్థిక సంవత్సరంలో 1.95 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అందులో కేంద్ర ప్రభుత్వ పథకాల కింద వచ్చిన డబ్బు రూ.5 వేల కోట్లు కూడా లేదు.

    కేంద్ర ప్రభుత్వ అవార్డులు, నీతి ఆయోగ్ ప్రశంసలు అందుకోని డిపార్ట్‌మెంటే లేదు తెలంగాణలో. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు.

    మరొక విషయం.. తెలంగాణకు రూ.6,000 కోట్లు గ్రాంట్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి 15వ ఆర్థిక సంఘం నిర్దిష్టంగా సిఫారసు చేసింది. కానీ ఐదు పైసలు కూడా ఇవ్వలేదు.

    పైగా రావాల్సిన వాటిలో బకాయిలు పెడతారు. ఇవ్వాళ కూడా తెలంగాణకు 3,200 కోట్లు బకాయిలు ఉంది కేంద్ర ప్రభుత్వం.

  12. బ్రేకింగ్ న్యూస్, కేసీఆర్ ప్రెస్‌మీట్: ‘నీతి ఆయోగ్ రూ.24 వేల కోట్లు ఇవ్వాలని చెప్పినా.. 24 పైసలు కూడా ఇవ్వలేదు’

    కేసీఆర్

    ఫొటో సోర్స్, @TelanganaCMO

    ‘‘మిషన్ కాకతీయకు రూ. 5 వేల కోట్లు ఇవ్వాలని, మిషన్ భగీరధకు రూ. 19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫారసు చేసింది. మొత్తం రూ.24 కోట్లు ఇవ్వాలని చెప్పింది. ఆరేళ్లు దాటినా 24 పైసలు కూడా ఇవ్వలేదు’’ అని కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

    నీతి ఆయోగ్ కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని కాకెత్తుకుపోయింది. దాని అజెండాను ఎవరు తయారు చేస్తారో, ఎక్కడ చేస్తారో తెలీదు. సమస్యలను ఎలా పరిష్కరించాలి, అందరం కలిసి ఏం చేద్దాం అనే ముచ్చట లేదు. ఆలోచన లేదు.

    దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. దేశంలో ద్వేషం, అసహనం పెరిగిపోయింది. దేశ రాజధానిలో సైతం పట్టపగలు కత్తులు పట్టుకుని స్వైర విహారం చేస్తున్నారు. అన్ని రంగాల్లో దేశం సర్వనాశనమైపోయింది. అంతర్జాతీయ విపణిలో మన పరువు రోజు రోజుకూ పోతోంది.

    కొన్ని రకాల పన్నుల్లో రాష్ట్రాల వాటా ఇవ్వాలి. కానీ దాదాపు 13, 14 లక్షల కోట్లు రాష్ట్రాల వాటాను సెస్సుల పేరుతో ఎగ్గొట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇది కోఆపరేటివ్ ఫెడరలిజమా? ఇది టీమ్ ఇండియా చేసే పనేనా? ఏ నీతి ఆయోగ్ సమావేశంలోనైనా చర్చకు ఆస్కారముంటుందా? నీతి ఆయోగ్ సమావేశమైతే ఒక భజన మండలి. అందులో ముఖ్యమంత్రుల స్థాయి వారికి కూడా పూర్తిగా మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదు

  13. బ్రేకింగ్ న్యూస్, కేసీఆర్ ప్రెస్‌మీట్: ‘నీతి ఆయోగ్ నిరర్ధక, నిష్క్రియా సంస్థగా మారిపోయింది’

    కేసీఆర్

    ఫొటో సోర్స్, @TelanganaCMO

    ‘‘బీజేపీ ప్రభుత్వం ఏడేళ్ల కిందట ప్రణాళిక సంఘానికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన నీతి ఆయోగ్.. దురదృష్ట వశాత్తూ ఒక నిరర్థక సంస్థగా, నిష్క్రియాపరమైన సంస్థగా మారిపోయింది’’ అని కేసీఆర్ విమర్శించారు.

    ‘‘ప్రధానమంత్రికి నాలుగు కార్యక్రమాలు చెప్పి భజన చేసే మండలిగా మారిపోయింది. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటదో నీతి ఆయోగ్‌లో నీతి అంతే ఉంది’’ అని ఆయన ఎద్దేవా చేశారు.

    ఆయన ఇంకా ఏం చెప్పారంటే...

    ‘‘ స్వతంత్ర పోరాట కాలంలో ఓ సందర్భంలో జరిగిన అనేక మేధోమధనాల పర్యవసానంగా.. ఏ దేశమైనా, సమాజమైనా ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలి, స్వల్పకాలిక, మధ్యకాలిక ప్రణాళికలు ఉండాలి, ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఈ కర్తవ్యాన్ని అప్పగించాలి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరించాలి అని నిర్ణయాలు చేశారు. వాటి స్వరూపమే గతంలో మనకున్న ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా’’ అని కేసీఆర్ చెప్పారు.

    వార్షిక ప్రణాళికలు ఉండాలి, పంచవర్ష ప్రణాళికలు ఉండాలి.. వాటిని అనుసరించి 20, 30 సంవత్సరాల విజన్ కూడా ఉండాలని ఆలోచించారు. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండగా ప్లానింగ్ కమిషన్ మనుగడలోకి వచ్చింది. పరిశ్రమలు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఎల్ఐసీ వంటివి నిర్మించారు.’’

    ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మంచి సలహాలు ఇస్తే స్వీకరించే ప్రధానమంత్రులు ఉండేవారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    2014లో యూపీఏ ప్రభుత్వం ఓడిపోయి బీజేపీ ప్రభుత్వం నరేంద్రమోదీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది. వారు నీతి ఆయోగ్ అని తెచ్చారు.

    నీతి ఆయోగ్ అంటే.. ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా’. ఇది ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ప్రత్యామ్నాయం. సహకార సమాఖ్య స్ఫూర్తిని తెస్తామని, ముఖ్యమంత్రులందరినీ ఇందులో సభ్యులను చేస్తామని, దీనిని టీమ్ ఇండియా అని పిలుస్తామని ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు. నిజంగానే దేశానికి మంచి రోజులు వచ్చాయని నేను ఆశపడ్డా. కానీ మోదీ వాగ్దానాలు, బీజేపీ వాగ్దానాలు, నీతి ఆయోగ్ సృష్టి పెద్ద జోక్‌గా మారిపోయింది.

    తాగటానికి మంచి నీళ్లు లేవు. పంటలకు నీళ్లు దొరకవు. కరెంటు దొరకదు. పని చేయటానికి ఉద్యోగాలు లేవు. ప్రభుత్వ ఉద్యోగులందరూ రోడ్డున పడుతున్నారు.

    దేశం నుంచి లక్షల కోట్లు పెరిగిపోతున్నాయి. ఉపాధి హామీ కూలీలు కూడా 15, 16 రాష్ట్రాల నుంచి దేశ రాజధాని జంతర్ మంతర్ పోయి నిరసన చేసే పరిస్థితి ఉంది.

    బీడీ కార్మికుల నోట్లో మట్టి కొట్టారు. అదుపు లేకుండా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం. విపరీతంగా పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు. జీడీపీ పతనం. ఎన్నడూ లేనంత తీవ్రస్థాయి నిరుద్యోగిత. రూపాయి అయితే చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణంగా పడిపోతోంది.

    మరి నీతి ఆయోగ్ ఏం చేస్తున్నట్లు? ఏం సాధించినట్లు? అది నిరర్ధక సంస్థగా మారిపోయిందని బాధ్యతా రహితంగా అనలేదు. చాలా బాధతోని అంటున్నా.

  14. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా: కేసీఆర్ ప్రకటన

    కేసీఆర్

    ఫొటో సోర్స్, @TelanganaCMO

    ‘‘కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల నిరసన తెలియజేయటానికి.. రేపు దిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను బహిష్కరిస్తున్నా’’ అని సీఎం కె.చంద్రశేఖరరావు ప్రకటించారు.

    ఆయన శనివారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు.

    నీతి ఆయోగ్ సిఫార్సులను కేంద్రం పట్టించుకోవటం లేదంటూ ఆయన తప్పుపట్టారు. ‘‘నా నిరసనను బహిరంగ లేఖ ద్వారా ప్రధానమంత్రికి స్వయంగా తెలియజేస్తున్నా’’ అని చెప్పారు.

    ఆ బహిరంగ లేఖను మీడియాకు విడుదల చేశారు.

    ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
  15. సయఫ్ అల్ అదల్: జవహిరి తర్వాత అల్‌ఖైదా నాయకుడు ఇతడేనా, ఇరాన్ గృహ నిర్బంధంలో ఉంటూ నాయకత్వ బాధ్యతలు సాధ్యమేనా

  16. లంపీ వైరస్: ఒక్కసారిగా వేల సంఖ్యలో ఆవులు ఎందుకు చనిపోతున్నాయి, వీటికి సోకిన వ్యాధికి చికిత్స అంత కష్టమా?

  17. దిల్లీలో చంద్రబాబు.. స్వాగతం పలికేందుకు వెళ్లిన ఎంపీ కేశినేని నాని అసహనం, వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం

    దిల్లీలో చంద్రబాబు.. స్వాగతం చెప్పేందుకు ఎంపీ కేశినేని నాని అసహనం

    ఫొటో సోర్స్, UGC

    తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దిల్లీ పర్యటన సందర్భంగా ఆ పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని తీరు చర్చనీయాంశంగా మారింది.

    చంద్రబాబు దిల్లీకి చేరుకున్న సందర్భంగా ఎయిర్ పోర్టులో టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. ఆ సమయంలో పార్టీ అధినేతకు బొకే అందించాలని కేశినేని నానిని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆహ్వానించారు.

    కానీ దానిని కేసినేని నాని అసహనంగా తిరస్కరించారు. ‘మీరే ఇవ్వండి’ అన్నట్లుగా ఆయన చేతులతో సైగ చేసి, దూరంగానే నిలబడి ఫొటోలు దిగారు.

    కాగా, పార్టీ అధినేతపై కేశినేని నాని అసహనం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    శనివారం హైదరాబాద్ నుంచి దిల్లీ చేరుకున్న చంద్రబాబు, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాద పూర్వకంగా కలుస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్ లో జరిగే ఆజాది కా అమృత్ మహోత్సవ్ నేషనల్ కమిటీ సమావేశం లో పాల్గొంటారు.రాత్రికి దిల్లీ నుంచి మళ్లీ హైదరాబాద్ కి చేరుకుంటారు.

    చంద్రబాబు, కేశినేని నాని

    ఫొటో సోర్స్, UGC

    చంద్రబాబు దిల్లీ పర్యటనలో కేశినేని నాని వ్యవహారశైలిపై రాజకీయంగా చర్చ సాగుతోంది.

    కొంతకాలంగా టీడీపీ నాయకత్వం పట్ల నాని అసంతృప్తిగా ఉన్నారు. పలు సందర్భాల్లో తన అసహనాన్ని బహిరంగంగా ప్రదర్శించారు.

    అయితే ఇటీవల కేశినేని నాని కుమార్తె వివాహ వేడుకలో చంద్రబాబు, నారా లోకేష్ వంటి వారితో ఆయన సన్నిహితంగా మెలిగారు. దాంతో అంతా సర్డుమణుగుతుందని టీడీపీ శ్రేణులు భావించాయి.

    విజయవాడ కేంద్రంగా ఇటీవల కేశినేని నాని సోదరుడు చిన్ని కొంత దూకుడుగా కనిపిస్తున్నారు. రాజకీయంగా క్రియాశీలంగా మారే ప్రయత్నంలో ఉన్నారు. వచ్చే ఎన్నికల బరిలో దిగాలని ఆశిస్తున్నట్టు వెల్లడించారు.

    దాంతో నాని స్థానంలో చిన్నికి టీడీపీలో కొందరు సహకరిస్తున్నారనే కథనాలు వచ్చాయి. విజయవాడ నగర టీడీపీలో నాయకులుగా ఉన్న బోండా ఉమా, బుద్ధా వెంకన్న తదితరులతో కేశినేని నాని కి విబేధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్థానికంగా తనకు వ్యతిరేకంగా ఉన్న వారికి అధిష్టానం ఆశీస్సులు అందుతున్నాయనే అభిప్రాయం గతంలో నాని వ్యక్త పరిచారు. ఇతర కారణాలు కూడా కలిసి రావడంతో టీడీపీ కి విజయవాడ ఎంపి దూరం అవుతారన్న ఊహాగానాలు వినిపించాయి.

    తాజాగా అధినేత పట్ల ఆయన స్పందించిన తీరు అలాంటి అంచనాలకు ఊతమిచ్చేలా కనిపిస్తోంది.

  18. క్రిస్ హెమ్స్‌వర్త్‌: ‘నువ్వు లెజెండ్‌’.. మీరాబాయి చానుకు థోర్ హీరో ప్రశంస

  19. వైట్ హౌస్ దగ్గర పిడుగు తాకిడి -ముగ్గురి మరణం

    డోనా ముల్లర్, జేమ్స్ ముల్లర్

    ఫొటో సోర్స్, MICHELLE MCNETT/CBS

    వాషింగ్టన్ డీసీలోని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలో గురువారం పిడుగు పడింది. ఈ పిడుగుపాటుకు విస్కాన్సిన్ కు చెందిన వృద్ధ దంపతులు జేమ్స్ ముల్లర్ (76), డోనా ముల్లర్ (75) మరణించినట్లు పోలీసులు తెలిపారు.

    ఈ దంపతులు తమ 57వ వివాహ వార్షికోత్సవం జరుపుకోవడానికి వాషింగ్టన్ వచ్చినట్లు వారి బంధువు చెప్పారు.

    పిడుగు తాకిడికి గుర్తు తెలియని 29 సంవత్సరాల వ్యక్తి కూడా శుక్రవారం మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

    గురువారం పిడుగు పడిన సమయంలో బాధితులు లఫాయెట్ పార్కులో ఉన్నారు.

    ఈ పార్కు అమెరికా అధ్యక్ష భవనానికి దగ్గర్లో ఉండటంతో బాధితుల్లో ముందుగా యూఎస్ సీక్రెట్ సర్వీస్ కు చెందినవారు ఉంటారని భావించారు.

    ముల్లర్ దంపతులకు ఐదుగురు పిల్లలు, 10 మంది మనవలు, మనవరాళ్లు, నలుగురు ముని మనవలు, మనవరాళ్లు ఉన్నట్లు వారి బంధువు మిషెల్ మెక్ నెట్ మిల్వాకీ జర్నల్ సెంటినల్ పత్రికకు చెప్పారు.

    పిడుగుపాటుకు గురై మరణించిన వారి కుటుంబాలకు వైట్ హౌస్ సంతాపం ప్రకటించింది. "ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న వారి కోసం ప్రార్థిస్తున్నాం" అని వైట్ హౌస్ ప్రకటనలో ప్రెస్ కార్యదర్శి కరీన్ జీన్ పియరీ పేర్కొన్నారు.

    వైట్ హౌస్ సమీపంలో ఉన్న చెట్టు కంచె దగ్గర పడిన పిడుగుకు నలుగురు వ్యక్తులు ప్రభావితమయ్యారు.

    ఈ సంఘటన తర్వాత పార్కులో కొంత ప్రాంతాన్ని మూసివేశారు.

    వైట్ హౌస్ కు దగ్గర్లో ఉన్న లఫాయెట్ పార్క్ 7 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇదొక పబ్లిక్ పార్క్.

    ఈ పార్కు సాధారణంగా సందర్శకులతో రద్దీగా ఉంటుంది. వేసవిలో ఇక్కడకు వచ్చేవారు ఎక్కువగా ఉంటారు.

    అమెరికాలో ఏటా సుమారు 40 మిలియన్ పిడుగులు భూమిని తాకుతాయని యూఎస్ హెల్త్ డేటా చెబుతోంది.

    కానీ, పిడుగు తాకిడికి లోనయ్యేవారు 10 లక్షల్లో ఒకరు ఉంటారని పేర్కొంది. అందులో 90% మంది ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడతారని తెలిపింది.

  20. ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనా మిలిటెంట్ మృతి

    యోలాండా నెల్, రఫీ బర్గ్

    గాజా స్ట్రిప్ దగ్గర జరిగిన వైమానిక దాడుల్లో కనీసం 10 మంది మరణించారు.మరణించిన వారిలో పాలస్తీనా మిలిటెంట్ గ్రూపుకు చెందిన అత్యున్నత కమాండర్ కూడా ఉన్నారు.

    మృతుల్లో ఒక చిన్నారి ఉండటంతో పాటు అనేక మంది చిన్నారులు ఈ దాడుల్లో గాయపడ్డారని స్థానిక వైద్యాధికారులు చెబుతున్నారు.

    ఈ వారం ప్రారంభంలో పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ (పీఐజి) సభ్యుల్లో ఒకరిని అరెస్ట్ చేసిన తర్వాత పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని తెలిపారు.

    దాడులను ఎదుర్కొనేందుకు పీఐజి తొలుత ఇజ్రాయెల్ పై 100 రాకెట్లను ప్రయోగించినట్లు చెప్పారు.

    ఈ రాకెట్లలో చాలా వాటిని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ మిస్సైల్ డిఫెన్స్ షీల్డ్ అడ్డుకుంది. ఇజ్రాయెల్‌లోని చాలా నగరాల్లో సైరెన్ శబ్దాలు వినిపించాయి.

    ఇజ్రాయెల్ సైన్యం తిరిగి శుక్రవారం మిలిటెంట్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులను మొదలుపెట్టినట్లు చెప్పారు.

    తమ దేశానికి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకే ఈ దాడులను నిర్వహించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని యాయిర్ లాపిడ్ ప్రకటించారు.