రాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఓటు వేయని ఎమ్మెల్యేలు వీళ్లే..

పార్లమెంటు ఉభయ సభలు, రాష్ట్రాల శాసనసభల సభ్యులు, దిల్లీ, పుదుచ్చేరి శాసనసభల సభ్యులు.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు. దేశ 15వ రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలను జూలై 21వ తేదీ గురువారం ప్రకటిస్తారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్

  1. Rupee Vs Dollar: డాలరుతో మారకం విలువ చరిత్రలో తొలిసారి 80 రూపాయలకు పతనం... కారణాలు ఏమిటి?

  2. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం. అంతవరకు నమస్తే.

  3. ప్రభుత్వ కార్యక్రమంలో హిందూ పూజారి 'భూమిపూజ'పై డీఎంకే ఎంపీ సీరియస్

  4. జెన్నిఫర్ లోపెజ్, బెన్ ఆఫ్లెక్: 2003లో నిశ్చితార్థం చేసుకున్న హాలీవుడ్ జంట.. 19 ఏళ్ల తర్వాత పెళ్లి

  5. తెలంగాణ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయని ఇద్దరు ఎమ్మెల్యేలు, సురేఖ అబ్బూరి, బీబీసీ ప్రతినిధి

    ఓటు వేస్తున్న కేసీఆర్

    తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేల్లో 117 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు.

    పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ రెండు రోజుల క్రితం కోవిడ్‌-19 పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆయన ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

    వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ విదేశంలో ఉండటంతో ఓటు వేయలేదు.

    వరదప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం మధ్యాహ్నం నగరానికి చేరుకుని, ఓటు వేశారు.

    ఆంధ్ర ప్రదేశ్‌లోని కందుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎం మహిందర్‌రెడ్డి అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లో ఉంటున్నారు. దీంతో ఆయన కూడా తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  6. ఆంధ్రప్రదేశ్‌: రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌కి దూరంగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం

    నందమూరి బాలకృష్ణ

    ఫొటో సోర్స్, facebook/NandamuriBalakrishna

    రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 మందికి గానూ 173 మంది ఎమ్మెల్యేలు ఓటు వేసినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

    ఓటు హక్కు వినియోగించుకోని ఇద్దరూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు. హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేతికి గాయం కావడంతో ఓటింగ్‌కి దూరంగా ఉన్నారు. మరో సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అమెరికా పర్యటనలో ఉన్నారు. దాంతో ఆయన కూడా ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు.

    అధికార పార్టీకి చెందిన 150 మంది ఎమ్మెల్యేలు అమరావతిలో ఓటు వేయగా.. కందుకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎం మహేందర్ రెడ్డి మాత్రం హైదరాబాద్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాంతో వైఎస్సార్సీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలూ ఓటు వేసినట్టయ్యింది.

    వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ శాసన సభా భవనంలో సోమవారం ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యింది. తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఓటు వేశారు.

    సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ పూర్తయిన వెంటనే రాష్ట్రంలో పోలైన ఓట్ల బ్యాలెట్ బాక్సును ఎన్నికల పరిశీలకులు చంద్రేకర్ భారతి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కె. రాజ్ కుమార్ సమక్షంలో సీళ్లు వేసి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపర్చారు.

    మంగళవారం ఉదయం విమానంలో దిల్లీలోని పార్లమెంట్ భవనానికి పంపేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.

    రాష్ట్రపతి ఎన్నికలు
  7. UFO: అంతుచిక్కని ఫ్లయింగ్ సాసర్ల రహస్యం ఏంటి? ఒకప్పుడు అమెరికాను ఊపేసిన ఈ ‘ఏలియన్ స్పేష్ షిప్‌లు’ ఇప్పుడు ఏమయ్యాయి?

  8. రాష్ట్రపతి ఎన్నికల్లో 99 శాతానికి పైగా ఓటింగ్.. వంద శాతం ఓటేసిన రాష్ట్రాలు ఇవే..

    రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, facebook/narendramodi

    ఫొటో క్యాప్షన్, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

    భారతదేశ 15వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఓటింగ్ ముగిసిందని ఎన్నికల సంఘం ప్రకటించింది.

    దేశంలో ఓటు హక్కు ఉన్న 771 మంది పార్లమెంటు సభ్యులు, 4025 మంది శాసనసభ సభ్యుల్లో 99 శాతం మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం ప్రకటించింది.

    చత్తీశ్‌గఢ్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, మిజోరం, పుదుచ్చేరి, సిక్కిం, తమిళనాడు శాసనసభల సభ్యులు వంద శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    పార్లమెంటుతో పాటు దేశవ్యాప్తంగా 30 అసెంబ్లీల్లో ఓటింగ్ జరిగింది.

    అధికార ఎన్డీయే తరపున ద్రౌపది ముర్ము, విపక్ష పార్టీల తరపున యశ్వంత్ సిన్హా పోటీలో ఉన్నారు.

  9. నేటి నుంచి పలు ఆహార పదార్థాలపై GST అమలు

    జీఎస్టీ
  10. ‘ప్రభుత్వ కార్యక్రమంలో హిందూమత పూజలు ఎందుకు చేయిస్తున్నారు? పూజారి ఉంటే.. ఫాదర్, ఇమామ్ ఎక్కడ?’ - భూమి పూజను ఆపించిన డీఎంకే ఎంపీ

  11. దిల్లీలో అమెరికన్ యువతి కిడ్నాప్ డ్రామా.. వీడియోకాల్‌కు వాడిన వైఫైను ట్రాక్ చేసి పట్టుకున్న పోలీసులు

  12. కేరళలో మంకీపాక్స్ రెండో కేసు

    కేరళ రాష్ట్రంలో మంకీపాక్స్ రెండో పాజిటివ్ కేసు నమోదయ్యింది.

    ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

    కన్నూరు జిల్లాలో ఈ రెండో పాజిటివ్ కేసు నమోదయ్యింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన జగదీప్ ధన్కార్

    ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో జగదీప్ ధన్కార్ నామినేషన్

    ఫొటో సోర్స్, ANI

    ఉప రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్‌డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కార్ సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్ష్యంలో నామినేషన్ దాఖలు చేశారు.

    కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఇతర బీజేపీ నేతలు కూడా ఆయన వెంట వచ్చారు.

    ఉప రాష్ట్రపతి పదవికి ఆగస్టు 6వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ప్రతిపక్షాలు తమ అభ్యర్థఇగా మార్గరెట్ అల్వా పేరును ప్రకటించాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. మధ్యప్రదేశ్‌లో వంతెన మీద నుంచి నదిలో పడిపోయిన బస్సు.. 12 మంది మృతి

    మధ్యప్రదేశ్ బస్సు ప్రమాదం

    ఫొటో సోర్స్, ANI

    మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు సోమవారం మధ్యాహ్నం మధ్యప్రదేశ్‌లో ఒక వంతెన మీద నుంచి కింద నదిలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో 12 మంది చనిపోయారు.

    ఈ ఘటనలో మరో 15 మందిని సహాయ సిబ్బంది రక్షించారు. గాయపడిన ఇద్దరిని ధామ్నాడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

    ఇండోర్ నుంచి పుణె వెళుతున్న బస్సు.. ధార్ జిల్లాలోని ఖాల్ఘాట్ వద్ద సంజయ్ సేతు మీద అదుపుతప్పి నదిలోకి పల్టీ కొట్టింది. ఆ సమయంలో బస్సులో 55 మంది ప్రయాణికులున్నారు.

    ఈ ప్రమాదంలో ప్రయాణికులు చనిపోవటం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ విచారం వ్యక్తంచేశారు.

  15. జీఎస్‌టీ లో మార్పులు: పిల్లల స్టేషనరీ నుంచి పాలు, పెరుగు ప్యాకెట్ల వరకు ధరలు పెరిగేవి ఇవే

  16. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు వీల్‌చైర్‌ లో వచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

    రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన మన్మోమన్ సింగ్

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన మన్మోమన్ సింగ్

    రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు పార్లమెంటుకు చేరుకున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

    వీల్ చైర్‌లో వచ్చిన మన్మోహన్ సింగ్, సహాయకుల సహకారంతో ఓటేశారు.

    గత కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

    మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ట్వీట్లు చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన కేటీఆర్

    తెలంగాణ మంత్రి కేటీఆర్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు

    తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్ 2 లో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తెలంగాణకు చెందిన 119 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కందుకూరు శాసనసభ్యులు మహిధర్ రెడ్డి హైదరాబాదులోనే ఓటు వేయనున్నారు.

    టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, హన్మంత్ షిండే ఏజెంట్లుగా వ్యవహరిస్తుండగా, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు బీజేపీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారు.

  18. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో అందరి ఓట్లూ ద్రౌపది ముర్ముకే?

    రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

    ఫొటో సోర్స్, AP ASSEMBLY PUBLICITY CELL

    ఫొటో క్యాప్షన్, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

    రాష్ట్రపతి ఎన్నికలకు అంతా సిద్ధమయ్యింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హాల్‌లో ఈ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 గంటల నుంచి పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకూ సాగుతుంది.

    ఏపీకి చెందిన 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఎన్డీయే తరుపున ద్రౌపది ముర్ము, విపక్షాల తరుపున యశ్వంత్ సిన్హా పోటీపడుతున్నారు. ఇప్పటికే ముర్ము ఏపీలో కూడా పర్యటించారు. వైఎస్సార్సీపీ, టీడీపీ నేతలను కలిశారు. తనకు మద్ధతు ప్రకటించిన ఇరు పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు.

    ఏపీ అసెంబ్లీలో అధికారికంగా వైసీపీకి 151 మంది, టీడీపీకి 23 మంది, జనసేన తరుపున ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నారు. రెండు ప్రధాన పార్టీలు ద్రౌపది ముర్ముకి మద్ధతు ప్రకటించాయి. జనసేన బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. కానీ ఆపార్టీ ఎమ్మెల్యే ఇప్పటికే వైఎస్సార్సీపీ వైపు మొగ్గుచూపడంతో అధికారికంగా మద్ధతు ప్రకటించలేదు.

    అయినపప్పటికీ అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే సహా అందరి ఓట్లు ముర్ముకి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు కేంద్ర పరిశీలకులు వాటిని పరిశీలించారు. అసెంబ్లీ హాల్ లో చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.

    ఎన్నికల ప్రక్రియ ను వీడియో తీయబోతున్నారు. పోలింగ్ తర్వాత బాక్సులు స్ట్రాంగ్ రూమ్ కి తరలిస్తారు. ఈనెల 21వ తేదీన ఓట్లు లెక్కించబోతున్నారు.

  19. రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు, ఎలక్ట్రోరల్ కాలేజ్ అంటే ఏంటి?

  20. రాష్ట్రపతి ఎన్నికలు నేడే.. ద్రౌపది ముర్ము, యశ్వంత్‌ సిన్హాల మధ్య పోటీ

    ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హా

    ఫొటో సోర్స్, ANI

    భారత కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం నేడు (సోమవారం) పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీల్లో పోలింగ్ జరుగనుంది.

    అధికార నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ తరఫున జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హాను తమ అభ్యర్థిగా నిలిపాయి.

    రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార పార్టీదే పైచేయిగా ఉండటం పరిపాటి. ఈ ఎన్నికల్లో కూడా ద్రౌపది ముర్ముకు చాలా ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. అందువల్ల ఆమె గెలుపు ఖాయమని, మొత్తం ఓట్లలో ఆమెకు మూడింట రెండు వంతుల ఓట్లు లభిస్తాయని భావిస్తున్నారు.

    పార్లమెంటు ఉభయ సభలు, రాష్ట్రాల శాసనసభల సభ్యులు, దిల్లీ, పుదుచ్చేరి శాసనసభల సభ్యులు.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తారు.

    దేశ 15వ రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలను జూలై 21వ తేదీ గురువారం ప్రకటిస్తారు.

    రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఉప రాష్ట్రపతి పదవి కూడా ఆగస్టు 6వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ తన అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్కార్‌ను ప్రకటించగా, ప్రతిపక్షాలు మార్గరెట్ అల్వాను ప్రకటించాయి.