ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్కర్

ఉపరాష్ట్రపతి పదవికి పోటీపడేందుకు తమ తరఫున జగ్‌దీప్ ధన్కర్‌ను ఎంపిక చేసినట్లు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ప్రకటించారు. జగ్‌దీప్ ధన్కర్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్నారు.

లైవ్ కవరేజీ

ఆలమూరు సౌమ్య

  1. నేటి ముఖ్యాంశాలు

    • ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా జగ్‌దీప్ ధన్కర్ పేరును ఎన్డీయే ప్రకటించింది.
    • తన బంధువుల కంపెనీలు అన్నీ తనవేనంటూ టీడీపీ ఆరోపిస్తోందని, అలాగైతే.. హెరిటేజ్ కూడా తనదే అవుతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
    • గత నెలలో ఒహియో పోలీసుల చేతిలో చనిపోయిన 25 ఏళ్ల నల్లజాతి వ్యక్తి శరీరంపై 45 బుల్లెట్ గాయాలు ఉన్నాయని శవపరీక్షలో తేలింది.
    • ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. 2020 ఫిబ్రవరి 29న మోదీ ఈ ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేశారు. 28 నెలల్లో ఈ ఎక్స్‌ప్రెస్‌వేను పూర్తిచేశారు.

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైప్ అప్డేట్లను ముగిస్తున్నాం.

  2. బాబర్ ఆజమ్ ట్వీట్‌కు కోహ్లి ఏమని జవాబిచ్చాడంటే...

    విరాట్ కోహ్లితో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్

    ఫొటో సోర్స్, Twitter

    ఫొటో క్యాప్షన్, విరాట్ కోహ్లితో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్

    పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్, విరాట్ కోహ్లితో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఒక ట్వీట్ చేశాడు.

    అందులో ‘‘ఈ సమయం వెళ్లిపోతుంది. ధైర్యంగా ఉండండి’’ అని పేర్కొన్నాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    బాబర్ ఆజమ్ చేసిన ఈ ట్వీట్‌పై చాలా చర్చ జరిగింది.

    దీని తర్వాత భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, బాబర్ చేసిన ట్వీట్‌కు బదులిచ్చాడు.

    ‘‘థాంక్యూ. ఆటలో ఎదుగుతూనే ఉండు. ఆల్ ద బెస్ట్’’ అని కోహ్లి ట్వీట్ చేశారు.

    కోహ్లి ట్వీట్

    ఫొటో సోర్స్, Twitter

    33 ఏళ్ల విరాట్ కోహ్లి ప్రస్తుతం ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. భారీ పరుగులు చేయడంలో విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో పలువురు క్రికెటర్లు, కోహ్లికి మద్దతుగా నిలుస్తున్నారు

  3. శ్రీలంక: సేంద్రీయ వ్యవసాయ విధానమే ఈ సంక్షోభానికి కారణమా?

  4. శ్రీలంక: రాజకీయ నాయకత్వం మారింది.. ఆర్థిక వ్యవస్థ గట్టెక్కుతుందా?

  5. భద్రాచలంలో తగ్గుతున్న వరద ఉధృతి, బళ్ల సతీశ్, బీబీసీ ప్రతినిధి

    గోదావరి

    భద్రాచలం వద్ద వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 69.7 అడుగుల దగ్గర ఉంది. నీటి విడుదల 23,58,533 క్యూసెక్కుల వద్ద ఉంది.

    వరద తగ్గుతున్నప్పటికీ ప్రజలెవరూ ఇళ్లకు రావొద్దని, పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని ప్రభుత్వం కోరింది.

    పునరావాస కేంద్రాల్లో ప్రజలకు నాణ్యమైన ఆహారం, సురక్షిత మంచినీరు వంటి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్, అధికారులను ఆదేశించారు.

    ఈరోజు మధ్యాహ్నం నుంచి వరద తగ్గుతున్నట్లుగా రికార్డులు తెలుపుతున్నాయి.

    ఉదయం నుంచి ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్నవారిని తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా హెలికాప్టర్లను పంపించింది.

    ప్రభుత్వ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష జరిపారు. వరద ప్రభావం తగ్గిన తర్వాత చేపట్టాల్సిన పునరుద్దరణ చర్యల గురించి చర్చించారు.

    మరోవైపు భద్రాచలంలో వరద వల్ల తీవ్రంగా ప్రభావితమైన సుభాష్ కాలనీ వాసులు ఆందోళనలు చేశారు. కరకట్టలు పటిష్టం చేయాలని డిమాండ్ చేస్తూ చాలా సేపు ధర్నా చేశారు.

    భద్రాచలం రోడ్
    ఫొటో క్యాప్షన్, భద్రాచలం రోడ్
  6. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగ్‌దీప్ ధన్కర్

    హోం మంత్రి అమిత్ షాతో జగదీప్ ధన్కర్

    ఫొటో సోర్స్, JAGDEEP DHANKAR/FB

    ఫొటో క్యాప్షన్, హోం మంత్రి అమిత్ షాతో జగదీప్ ధన్కర్

    భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్డీయే తమ అభ్యర్థిని ఎంపిక చేసింది.

    ఉపరాష్ట్రపతి పదవికి పోటీపడేందుకు తమ తరఫున జగ్‌దీప్ ధన్కర్‌ను ఎంపిక చేసినట్లు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ప్రకటించారని వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    ‘‘రైతు బిడ్డ జగ్‌దీప్ ధన్కర్‌ను ఉపరాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా బీజేపీ, ఎన్డీయే ఎన్నుకున్నాయి. ఆయన ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ముప్పై ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నారు’’ అని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.

    ఈ ప్రకటనకు ఒకరోజు ముందు జగ్‌దీప్ ధన్కర్, దిల్లీలో హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ప్రస్తుత భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం 2022 ఆగస్టు 10తో ముగియనుంది.

    షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 6వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది.

    అదే రోజు ఓట్లను లెక్కించి ఫలితాలను విడుదల చేస్తారు.

  7. ఆంధ్రప్రదేశ్: 100 రోజులు దాటినా పులి ఎందుకు దొరకట్లేదు? ఆడ తోడు కోసమే వెదుకుతోందా?

  8. ఈ దేశంలో కుక్కలు, పిల్లుల్ని పెంచితే జైలుకే.. పార్లమెంటుకు 'జంతువుల నుంచి మానవ హక్కుల పరిరక్షణ' బిల్లు

  9. గోదావరి వరదలు: ఏటిగట్లకు 12 చోట్ల పొంచి ఉన్న ప్రమాదం.. భయాందోళనల్లో కోనసీమ గ్రామాలు

  10. విజయసాయిరెడ్డి: ‘చంద్రబాబు వరుసకు నాకు అన్న.. నా బంధువుల కంపెనీలన్నీ నావే అయితే హెరిటేజ్ కూడా నాదే’

    విజయసాయి రెడ్డి, చంద్రబాబు నాయుడు

    ఫొటో సోర్స్, facebook/VijayaSaiReddyOfficial/TDP.Official

    తన బంధువుల కంపెనీలు అన్నీ తనవేనంటూ టీడీపీ ఆరోపిస్తోందని, అలాగైతే.. హెరిటేజ్ కూడా తనదే అవుతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

    ‘‘చంద్రబాబు నాయుడు నాకు నిజంగానే బంధువు అవుతాడు. చంద్రబాబు వరుసకు నాకు అన్న అవుతాడు. అది ఎలా అంటే.... ఎన్టీఆర్‌ గారి మనవడు తారకరత్న నా భార్య సోదరి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అంటే చంద్రబాబు నాకు అన్నే కదా?.అలా బంధువు అయినంత మాత్రాన నా ఆస్తులు ఆయనవి, చంద్రబాబు ఆస్తులు నావి అయిపోతాయా? హెరిటేజ్‌, అరబిందో ఒకటైపోతుందా?’’ అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.

    చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలు చాలా కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్నారంటూ ఆయన ఒక జాబితాను విడుదల చేశారు.

  11. లఖ్‌నవూ లులు మాల్‌లో నమాజ్, వీడియో వైరల్.. అసలు ఏం జరిగింది?

  12. కళాత్మక ప్రతిభకు అంగ వైకల్యం అడ్డు కాదని నిరూపిస్తోన్న సూరత్ మహిళ

  13. గోదావరి వరదలు: గట్లు తెగే ప్రమాదం.. ఆందోళనలో ప్రజలు

    గోదావరి వరదలు
    ఫొటో క్యాప్షన్, పాత నవరసపురం, నర్సాపురం మండలం

    కోనసీమలో నాగుల్లంక, అప్పన రాముని లంక, పాశర్ల పూడి అనే ఈ మూడు ప్రాంతాలలో గోదావరి గట్లకు గండి పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

    పాశర్లపూడి దగ్గర ఏటి గట్టు మీద నుంచి వరద ప్రవహిస్తోంది. ఇక్కడ ఏ క్షణమైనా గండి పడే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు. మరో రెండు చోట్ల కూడా గట్లు అత్యంత బలహీనంగా ఉన్నట్లు వారు చెబుతున్నారు.

    ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళనతో స్థానికులు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు.

    ఈ ప్రాంతాల్లో ఎక్కడ గట్టు తెగినా, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల పరిధిలోని 30 గ్రామాలకు తీవ్రమైన వరద ముక్కు తప్పదని భావిస్తున్న అధికారులు రక్షణ చర్యలకు పూనుకున్నారు.

    ఇసుక బస్తాల సహాయంతో గట్లు పరిరక్షించడానికి ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వరద తాకిడి మరికొన్ని గంటల వరకు ఇంకా పెరిగే సూచనలు ఉండడంతో ఎలాంటి ముప్పు ఎదురవుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

    పురుషోత్తపట్నం లిఫ్ట్ స్కీమ్ లోకి చేరిన వరద నీరు చేరింది. పంపులు నీట మునిగాయి. గట్టు కాపాడేందుకు రక్షణ చర్యలు చేపడుతున్నారు.

    గోదావరి వరదలు
    గోదావరి వరదలు
    ఫొటో క్యాప్షన్, సహాయక చర్యల్లో కాకినాడ జిల్లా పోలీసులు, sdrf బృందాలు

    పురుషోత్తపట్నం లిఫ్ట్ స్కీమ్ లోకి చేరిన వరద నీరు చేరింది. పంపులు నీట మునిగాయి. గట్టు కాపాడేందుకు రక్షణ చర్యలు చేపడుతున్నారు.

    గోదావరి వరదలు
    ఫొటో క్యాప్షన్, పురుషోత్తపట్నం లిఫ్ట్ స్కీమ్ లోకి చేరిన వరద నీరు
  14. లలిత్ మోదీ: ఈయన కొందరికి విలన్, మరి కొందరికి మాత్రం హీరో

  15. పి.గన్నవరం మండలం నాగుల్లంక వద్ద బలహీనమవుతున్న గోదావరి గట్టు .

    నాగుల్లంక ఊలలు

    ఫొటో సోర్స్, UGC

    కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక వద్ద గోదావరి గట్టు బలహీనమవుతోంది. మానేపల్లి ఏటిగట్టు వద్ద సుమారు నాలుగు చోట్ల ఊలలు ఏర్పడి వరద నీరు లీకయ్యి చెంతనే ఉన్న కాలువలోకి వస్తుండటంతో నాగుల్లంక , మానేపల్లి, చాకలిపాలెం గ్రామ ప్రజలుభయాందోళనలకు గురవుతున్నారు.

    గట్టు రక్షణ కోసం అధికార యంత్రాంగం రంగంలోకి దింగింది. యుద్ధప్రాతిపదికన ఇసుకబస్తాలు రప్పించి రక్షణ చర్యలు చేపడుతున్నారు.

    గతంలో నాగుల్లంక ఎగువున 2006 వరదలో సమయంలో గండి పడింది. ఇప్పుడు దానికి 2 కిమీ దిగువున ఈ స్థాయిలో ఊలలు రావడంతో ఇది పెను ప్రమాదానికి దారితీయవచ్చని స్థానికులు భయపడుతున్నారు.

    అధికారులు యుద్ధప్త్రాతిపదికన రక్షణ చర్యలకు పూనుకుంటున్నారు.

  16. ‘‘ఇప్పుడు మేం, మా పిల్లలు మాత్రం బతికున్నాం. ఇంకేమీ మిగల్లేదు''

  17. అమెరికా: నల్లజాతీయుడైన జేలండ్ వాకర్ శరీరంపై 46 బుల్లెట్ గాయాలు.. అటాప్సీ నివేదిక

    జేలండ్ వాకర్

    ఫొటో సోర్స్, Getty Images

    గత నెలలో ఒహియో పోలీసుల చేతిలో చనిపోయిన 25 ఏళ్ల నల్లజాతి వ్యక్తి శరీరంపై 45 బుల్లెట్ గాయాలు ఉన్నాయని శవపరీక్షలో తేలింది.

    జేలండ్ వాకర్ ఏ తుపాకీ గుండుకు చనిపోయారో తెలుసుకోవడం కష్టమని, అలాగే మొత్తంగా ఎన్నిసార్లు కాల్చారో కూడా తెలుసుకోలేమని శవపరీక్ష జరిపిన వైద్యుడు చెప్పారు. జేలండ్ గుండె, ఊపిరితిత్తులు, ధమనులకు తీవ్ర గాయాలయ్యాయని వైద్యుడు తెలిపారు.

    ఒహియోలోని ఆక్రన్ నగరంలో రెండు రోజుల క్రితం వందలాది మంది జేలండ్ మరణానికి సంతాపం తెలిపారు. జేలండ్ మరణాన్ని నిరసిస్తూ రోజూ ప్రదర్శనలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి పోలీసులు కర్ఫ్యూ విధించారు.

    2022 జూన్ 27న ఆక్రన్ నగరంలో పోలీసులు జేలండ్ కారును ఆపడానికి ప్రయత్నించారు. ట్రాఫిక్ రూల్స్ అధిగమించాడన్న కారణంగా పోలీసులు కారు ఆపమన్నారు. కానీ, జేలండ్ ఆగకుండా ముందుకు దూసుకుపోయారు. దాంతో, పోలీసులు వెంబడించారు. పోలీసులు కాల్పులు జరపడంతో జేలండ్ మరణించారు.

    అయితే, జేలండ్ దగ్గర తుపాకి ఉందని, ఆయన ఒకసారి కాల్పులు జరిపారని పోలీసులు చెబుతున్నారు.

    జేలండ్ స్కీ మాస్క్ తొడుక్కుని ఉన్నట్టు పోలీసుల బాడీ కెమేరా ఫుటేజీలో కనిపించింది. ప్రయాణిస్తున్న కారు నుంచి జేలండ్ కిందకు దూకి, పార్కింగ్ లాట్‌లోకి పరిగెత్తారు. అక్కడ పోలీసులు అన్ని దిక్కుల నుంచి ఆయనపై కాల్పులు జరిపారు.

    జేలండ్ దగ్గర ఆయుధాలు లేవని, ఆయన్ను చంపవలసిన అవసరం లేదని జేలండ్ కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు.

  18. నేడు బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

    బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే

    ఫొటో సోర్స్, Twitter/@narendramodi

    ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. 2020 ఫిబ్రవరి 29న మోదీ ఈ ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేశారు. 28 నెలల్లో ఈ ఎక్స్‌ప్రెస్‌వేను పూర్తిచేశారు.

    జలౌన్ జిల్లాలోని ఒరాయ్ తహసీల్‌లోని కైథారి గ్రామంలో ఈ రోజు ప్రధాని మోదీ దీనిని ప్రారంభించనున్నారు.

    నాలుగు లేన్ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే 296 కి.మీ. పొడవుతో చిత్రకూట్ జిల్లాలోని గోండా గ్రామం వద్ద NH-35 నుంచి ఇటావా జిల్లాలోని కుడ్రైల్ గ్రామం వరకు కొనసాగుతుంది. ఆపై ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేతో కలుస్తుంది.

    ఇది చిత్రకూట్, బందా, మహోబా, హమీర్‌పూర్, జలౌన్, ఔరైయా, ఇటావా అనే ఏడు జిల్లాల గుండా వెళుతుంది.

    బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే దాదాపు రూ. 14,850 కోట్లతో పూర్తయింది. దీన్ని ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించారు.

    దీని వల్ల కనెక్టివిటీ పెరగడమే కాకుండా ఉద్యోగాలు పెరుగుతాయని, ఆర్థికాభివృద్ధి చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇదే విషయాన్ని మోదీ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  19. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన ఇద్దరు భారత అథ్లెట్లు

    భారత అథ్లెట్లు

    ఫొటో సోర్స్, Andy Lyons/Getty Images for World Athletics

    శనివారం జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఇద్దరు భారత అథ్లెట్లు విజయం సాధించారు.

    3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్‌లో అథ్లెట్ అవినాశ్ సాబలే మెడల్ రేసుకు అర్హత సాధించాడు. ఇందుకోసం 8 నిమిషాల 18:75 సెకన్లు సమయం తీసుకున్నాడు. మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మొదటి స్థానాన్ని ఇథియోపియా, రెండో స్థానాన్ని అమెరికా కైవసం చేసుకున్నాయి.

    సాబలే ఆట బాగా ప్రారంభించాడు. మొదటి 1000 మీటర్ల తరువాత అందరి కన్నా ముందున్నాడు. కానీ, తరువాత వెనుకబడ్డాడు. ఒక దశలో ఆరో స్థానానికి చేరుకున్నాడు. చివరికి మూడవ స్థానంలో నిలిచి, క్వాలిఫై అయ్యాడు.

    మరోవైపు, పురుషుల లాంగ్‌జంప్‌లో అథ్లెట్‌ మురళీ శ్రీశంకర్‌ ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఎనిమిది మీటర్ల జంప్‌తో తన సత్తా చాటాడు. టాప్ 12లో ఏడో స్థానంలో నిలిచాడు. ఫైనల్‌కు అర్హత సాధించిన ఏకైక భారతీయుడు శ్రీశంకర్‌.

    వీరితో పాటు భారత అథ్లెట్లు జాస్విన్ ఆల్డ్రిన్, మహ్మద్ అనీస్ యాహియా కూడా ఈ పోటీల్లో పాల్గొన్నప్పటికీ, క్వాలిఫై అవ్వలేదు.

  20. గోదావరి వరద ఉధృతి.. ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న మూడవ ప్రమాద హెచ్చరిక

    గోదావరి వరద

    ఫొటో సోర్స్, CMO

    గోదావరి వరదనీటితో ఉప్పొంగుతోందని, ధవళేశ్వరం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

    ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 23.20 లక్షల క్యూసెక్కులు ఉన్నట్టు సమాచారం. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని నిరంతర పర్యవేక్షిస్తున్నారు.

    25 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉందని, 6 జిల్లాల్లోని 44 మండలాల్లో 628 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచన వేసోంది. ఆ మేరకు, సంబంధిత అధికారుల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.

    అంబేద్కర్ కోనసీమలో 21, తూర్పుగోదావరిలో 9, అల్లూరిసీతారామరాజు జిల్లాలో 5, పశ్చిమ గోదావరిలో 4, ఏలూరులో 3, కాకినాడ జిల్లాలో 2 మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశం ఉంది.

    వరద ఉదృతం దృష్ట్యా అదనపు సహాయక బృందాలను రప్పిస్తున్నారు. సహాయక చర్యల్లో మొత్తం 10 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాలుపంచుకోనున్నాయి.

    ఇప్పటివరకు ఆరు జిల్లాల్లోని 42 మండలాల్లో 279 గ్రామాలు వరద బారిన పడ్డాయని, మరో 177 గ్రామల్లో వరద ప్రవాహం ఉందని, 62,337 మందిని 220 పునరావాస కేంద్రాలకు తరలించామని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

    గోదావరితో పాటు, వివిధ ప్రాజెక్టుల్లో కృష్ణా, తుంగభద్ర నదుల్లో వరద ప్రవాహం ఎక్కువగా ఉందని లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.