‘దేశాన్ని బీజేపీకి రాసివ్వలేదు... టీఆర్ఎస్, జాతీయ పార్టీగా మారితే తప్పేంటి?’- కేసీఆర్
నరేంద్ర మోదీ పాలనలో కార్పొరేట్లకు మాత్రమే లాభం జరిగిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. శ్రీలంకలో దేశం గౌరవం పోతోందని అన్నారు. భారత ప్రధాని స్థాయి దిగజారిందని విమర్శించారు.
లైవ్ కవరేజీ
సీఐ నాగేశ్వర రావు అరెస్ట్, వివాహితను బెదిరించి, అత్యాచారం చేసిన ఆరోపణల కేసులో విచారిస్తున్న పోలీసులు
అసదుద్దీన్ ఓవైసీ: ‘పార్లమెంటు మీది జాతీయ చిహ్నాన్ని ప్రధాని ఎలా ఆవిష్కరిస్తారు...’
వైసీపీ పేరు మార్చడం సాధ్యమవుతుందా, గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా?
శ్రీలంక: 'ప్యాలెస్‌ను వదిలేదే లేదు... అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేసే దాకా ఇక్కడే ఉంటాం'
పరుగులో రికార్డులు బ్రేక్ చేస్తున్న 105 ఏళ్ల బామ్మ.. ఈమె పరుగు చూశారా..
నేటి ముఖ్యాంశాలు...
- తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో రేపట్నుంచి మూడు రోజులపాటు అన్ని విద్యా సంస్థలకు సీఎం కేసీఆర్ సెలవులు ప్రకటించారు.
- శ్రీలంకలో నిరసనల నడుమ వేగంగా రాజకీయ పరిణామాలు మారుతుంటే.. ఇక్కడి ఆర్థిక సంక్షోభాన్ని చక్కదిద్దడంపై దృష్టిపెట్టనట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వెల్లడించింది.
- అబార్షన్ హక్కుల కోసం అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో వేల మంది మహిళలు నిరసనలు చేపట్టారు.
- విజయమ్మ రాజీనామాకు రాజకీయ రంగు పులుముతున్నారని వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
‘దేశాన్ని బీజేపీకి రాసివ్వలేదు... టీఆర్ఎస్, జాతీయ పార్టీగా మారితే తప్పేంటి?’- కేసీఆర్

ఫొటో సోర్స్, CMO
దేశంలో గుణాత్మక మార్పు రావాలని, అవసరమైతే టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుందని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.
రాష్ట్రంలో భారీ వర్షాల పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో భారీ వర్షాల గురించి, దేశంలో బీజేపీ పాలన గురించి కేసీఆర్ మాట్లాడారు.
భారీ వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని సీఎం కేసీఆర్ చెప్పారు.
దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా సైక్లోన్ ఎఫెక్ట్ ఉందని, నాలుగైదు రోజులు తెలంగాణవ్యాప్తంగా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
భారీ వర్షాలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే స్పందించేలా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్దం చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వ యంత్రాంగమంతా సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రజలు బయటకు రాకుండా రాబోయే మూడు రోజులు అన్నిరకాల విద్యాసంస్థలను మూసివేస్తున్నామని ప్రకటించారు.
బీజేపీ పాలనలో దేశం ప్రమాదంలో ఉందని, దీన్ని ఆపాల్సిన బాధ్యత యువత, మేధావులు, ఉద్యోగులు, జర్నలిస్టులదేనని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
నరేంద్ర మోదీ పాలనలో కార్పొరేట్లకు మాత్రమే లాభం జరిగిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. శ్రీలంకలో దేశం గౌరవం పోతోందని అన్నారు. భారత ప్రధాని స్థాయి దిగజారిందని విమర్శించారు. దీనిపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నాడో చెప్పాలని నిలదీశారు.
టీఆర్ఎస్ జాతీయపార్టీగా మారితే తప్పేముంది?.. దేశంలో కొత్త పార్టీ రావొద్దా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. దేశమేమన్నా బీజేపీ నాయకులకు రాసిచ్చామా? అని ప్రశ్నించారు. వీళ్లు దేశానికి చేసిందేంటని నిలదీశారు.
తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు.
బీజేపీ సర్కారు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకమని విమర్శించారు. వీళ్లు హిందుత్వం పేరు చెప్పి రాజకీయ లబ్ధిపొందుతున్నారని, వీరి గురించి కార్‌పాత్ర మహారాజ్ అనే గురువు బుక్‌కూడా రాశాడని చెప్పారు.
హిందువులకు పవిత్రమైన కాశీని కూడా మోదీ తన రాజకీయం కోసం వాడుకున్నారని దుయ్యబట్టారు.
కాకినాడలో సుగంధ ద్రవ్యాలు పండిస్తున్న రైతు
‘భారత్‌కు కాళీమాత ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి’- ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Twitter/@PMOIndia
కాళీ మాత ఆశీర్వాదాలు భారతదేశానికి ఎల్లప్పుడూ తోడుంటాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
స్వామి ఆత్మస్థానంద జయంతి సందర్భంగా వర్చువల్‌గా నరేంద్ర మోదీ మాట్లాడారు. కాళీ మాత అనుగ్రహం పొందిన సాధువు రామకృష్ణ పరమహంస అని అన్నారు. తన జీవితమంతా ఆయన కాళీ మాత పాదాలకు అంకితం చేశాడని చెప్పారు. ఈ జగత్తు సమస్తం తల్లి అనుగ్రహంతోనే నిండి ఉందని వ్యాఖ్యానించారు. బెంగాల్ కాళీ పూజలో ఈ అనుగ్రహం కనిపిస్తుందని అన్నారు.
‘‘కాళీ మాత అనుగ్రహం భారత్‌పై ఎప్పుడూ ఉంటుంది. భారత్ ఇదే ఆధ్యాత్మిక స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. రామకృష్ణ పరమహంస శిష్యుడైన స్వామి విజ్ఞానంద నుంచి స్వామి ఆత్మస్థానానంద దీక్ష పొందారు. స్వామి ఆత్మస్థానానందలో పరమహంస ఆధ్యాత్మిక శక్తి స్పష్టంగా కనిపిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.
ఇటీవల కాళీ దేవిపై డాక్యుమెంటరీ పోస్టర్‌కు సంబంధించి ఒక వివాదం చెలరేగింది. ఈ పోస్టర్‌లో కాళీమాత వేషధారణలో ఉన్న ఒక మహిళ సిగరెట్ తాగుతున్నట్లు కనిపిస్తారు. దీంతో ఆ డాక్యుమెంటరీ దర్శకురాలు లీనా మణిమేకలై వివాదంలో చిక్కుకున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, కాళీ దేవి గురించి మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
శ్రీలంక: అధ్యక్ష భవనం సౌకర్యాలను ఆస్వాదిస్తోన్న నిరసనకారులు- బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
‘విజయమ్మ రాజీనామాకు రాజకీయ రంగు పులుముతున్నారు’- విజయసాయిరెడ్డి

ఫొటో సోర్స్, vijay sai reddy/fb
ఒకేసారి రెండు పార్టీల్లో పదవుల్లో ఉండటం సరికాదని, తెలంగాణలో షర్మిలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెబుతూ విజయమ్మ తన రాజీనామా గురించి ప్రకటించినప్పటికీ చంద్రబాబు, దీనికి రాజకీయ రంగు పులుముతున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు.
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్లీనరీ విజయవంతం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇంకా మాట్లాడుతూ... ‘‘సకల జనుల సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ప్లీనరీ జరిగింది. ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేదల శ్రేయస్సే లక్ష్యంగా ఈ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకున్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయంగా మహిళా సాధికారతే వైయస్సార్ సీపీ లక్ష్యం. అణగారిన వర్గాలకు, మహిళలకు 70శాతం వరకు అవకాశాలు ఇవ్వడం, స్పీకర్, మండల చైర్మన్ తదితర పదవులు అన్నీ అణగారిన వర్గాలకు ఇవ్వడం రాష్ట్రంలోనే కాదు... దేశ చరిత్రలోనే ఇది ప్రప్రథమం.
ఎంతసేపు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను విమర్శించడమే ప్రధాన అజెండాగా పెట్టుకుంటున్నారే తప్పా... ప్రతిపక్షంగానీ, చంద్రబాబు మీడియా గానీ ప్రజలు గురించి, వారి సమస్యల గురించి పోరాడిన సందర్భాలే లేవు’’ అని అన్నారు.
ప్లీనరీ అయిపోయిన పేవ్‌మెంట్ మీద నడుస్తూ ప్రమాదవశాత్తూ కాలు స్లిప్ అవ్వడంతో బస్సుకింద పడి చనిపోయిన దినేశ్ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

ఫొటో సోర్స్, bbc
జనవాణి కార్యక్రమంలో ప్రజల వినతుల్ని స్వీకరించిన పవన్ కల్యాణ్

వరుసగా రెండో వారం జరిగిన జనవాణి-జనసేన భరోసా కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చేందుకు తరలివచ్చిన వారితో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు.
తమ పార్టీ ద్వారా వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. వికలాంగులు, రైతులు, మహిళలు తమ సమస్యలని ఆయనకి విన్నవించారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఆరు వారాల పాటు ఈ కార్యక్రమం సాగుతుందని జనసేన ప్రకటించింది. గతవారం ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఓ వైపు వాతావరణం సహకరించకపోయినా బాధితులు తరలివచ్చారు. ఈ కార్యక్రమం వచ్చే వారం కూడా కొనసాగుతుందని జనసేన నాయకులు తెలిపారు.
రాష్ట్రంలో ప్రజల సమస్యలు వినే నాయకుడే లేరని, అందుకే పవన్ కల్యాణ్ చొరవ చూపారని ఆ పార్టీ నాయకుడు పోతిన మహేష్ బీబీసీకి తెలిపారు.

తెలంగాణ: మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు

ఫొటో సోర్స్, TRS PARTY/FB
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో రేపట్నుంచి మూడు రోజులపాటు అన్ని విద్యా సంస్థలకు సీఎం కేసీఆర్ సెలవులు ప్రకటించారు.
రాష్ట్రంలో వర్షాల పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం ప్రారంభమైంది.
ఈ సమావేశంలో అధికారులతో చర్చించిన సీఎం, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
‘మీ డబ్బులు మా వద్ద ఉన్నాయ్. కావాలంటే వెంటనే ఇక్కడ క్లిక్ చేయండి’ అంటూ మెయిల్ వస్తే ఇలా చేయండి..
ఆంధ్రప్రదేశ్: ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీగా వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు

ఫొటో సోర్స్, ugc
ఫొటో క్యాప్షన్, శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్సు ఉత్తరాంధ్ర జిల్లాల్లో శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు కుండపోత వర్షం కురిసింది.
విజయనగరం జిల్లా మెరకముడిదాంలో అత్యధికంగా 22 సెం.మీ వర్షపాతం నమోదైంది. మరోవైపు జిల్లాలోని గరివిడిలో 17 సెం.మీ., చీపురుపల్లిలో 13, తెర్లాంలో 12 సె.మీ. వర్షపాతం కురిసింది.
ఉమ్మడి గుంటూరు, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలతోపాటు తిరుపతిలోనూ 3 సెం.మీకు పైగా వర్షపాతం నమోదైంది.

ఫొటో సోర్స్, ugc
ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే 48 గేట్లు ఎత్తారు. శనివారం సాయంత్రానికి 2 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వెళ్లినట్లు గేట్ల పర్యవేక్షణ ఈఈ చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం బూరుగులంకరేవు వద్ద వశిష్ఠగోదావరి అనుబంధ పాయలోని తాత్కాలిక దారి తెగిపోయింది. 4 గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి.
విజయవాడలో కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ 25 గేట్లు అడుగుమేర ఎత్తారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని తోటపల్లి జలాశయం 2 గేట్లు ఎత్తారు.
అజ్ఞాతంలో రాజపక్ష, అధ్యక్ష పదవి ఖాళీగా ఉంటే శ్రీలంకలో ఏం చేస్తారు
Sri Lanka Crisis: వైరల్ అవుతున్న సైన్యం కాల్పుల వీడియో.. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది?
హజ్ యాత్రకు వెళ్లినప్పుడు ముస్లింలు ఏం చేస్తారు?
గుజరాత్ అల్లర్ల కేసు: తీస్తా సెతల్వాద్ విషయంలో సుప్రీంకోర్టు వైఖరి నాటికి, నేటికీ ఎలా మారింది
