You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఉద్ధవ్ ఠాక్రే: ‘‘శివసేనను అంతం చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతోంది’’

తమ పార్టీని అంతం చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు.

లైవ్ కవరేజీ

శారద మియాపురం

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ముగిస్తున్నాం. అమెరికా ఇండిపెండెన్స్ డే పరేడ్‌ కాల్పుల ఘటన అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  2. సిడ్నీని ముంచెత్తిన భారీ వరదలు.. ఏడాదిన్నరలో మూడోసారి ముంపులో నగరవాసులు

  3. విశాఖపట్నం: అగస్ట్ 14 నుంచి అగ్నివీరుల రిక్రూట్‌మెంట్, శ్రీనివాస్ లక్కోజు, బీబీసీ కోసం

    విశాఖపట్నంలో ఈ ఏడాది అగస్ట్ 14 నుంచి 31 వరకు అగ్నిపథ్ కింద రిక్రూట్‌మెంట్ ర్యాలీ చేపట్టనున్నారు. వన్ టౌన్ ఏరియాలో ఉన్న ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ ర్యాలీ నిర్వహిస్తారని వైజాగ్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయం తెలిపింది.

    అభ్యర్థులు www.joinindianarmy.nic ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

    ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, పార్వతీపురం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్, యానాంల అభ్యర్థులు పాల్గొనవచ్చు.

    అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్, అగ్నివీర్ టెక్నికల్ విభాగాలకు రిక్రూట్‌మెంట్ చేపట్టనున్నారు.

    ఈ పోస్టులకు 8, 10వ తరగతి ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించారు.

  4. ఉత్తర్ ప్రదేశ్: హిందూ దేవుళ్ల బొమ్మలున్న న్యూస్ పేపర్లో చికెన్ అమ్మినందుకు ముస్లిం వ్యక్తి అరెస్టు

  5. ‘పిల్లల ఆకలి తీర్చడానికి బిస్కెట్ కొనలేకపోతున్నా.. పాలు కూడా ఇవ్వలేకపోతున్నా’- ఓ తల్లి వేదన

  6. కేరళ మంత్రి: ‘భారత్ రాజ్యాంగం ప్రజలను దోచుకుంటోంది’

    భారత రాజ్యాంగం ప్రజలను దోచుకుంటోందంటూ కేరళ రాష్ట్ర మంత్రి సాజీ చెరియన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.

    ‘బ్రిటీషర్లు తయారు చేశారు. దాన్ని భారత్ రాసి, అమలు చేసింది. ప్రజలను దోచుకోవడానికి అందమైన రాజ్యాంగాన్ని భారత్ రాసింది.’ అని సీపీఐఎం కార్యక్రమంలో మాట్లాడుతూ చెరియన్ అన్నారు.

    అయితే చెరియన్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి వి.మురళీధరన్ తప్పు పట్టారు. ‘సాజీ చెరియన్ రాజ్యాంగాన్ని అవమానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయి.’ అని మురళీధరన్ విమర్శించారు.

  7. IND vs ENG: ఐదో టెస్టులో ఇంగ్లండ్ చరిత్రాత్మక విజయం.. టీమిండియా పొరపాట్లు ఇవేనా?

  8. జమ్మూకశ్మీర్‌లో జీ-20 సదస్సు నిర్వహించడంపై వివాదం దేనికి... పాకిస్తాన్‌ ఎందుకు వద్దంటోంది?

  9. పాకిస్తాన్‌లో అత్యవసరంగా దిగిన స్పైస్‌జెట్ విమానం

    దిల్లీ నుంచి దుబాయి వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం పాకిస్తాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది.

    స్పైస్‌జెట్‌కు చెందిన ఎస్‌జీ-11 విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల కరాచీ విమానాశ్రయంలో దించినట్లు డీజీసీఏ అధికారులు వెల్లడించారు.

    విమానంలోని సాంకేతికత లోపం ఇండికేటర్ లైట్‌కు సంబంధించినదిగా స్పైస్‌జెట్ వెల్లడించింది.

    కరాచీలో విమానం సురక్షితంగా ల్యాండ్ కాగా ప్రయాణికులందరూ బాగానే ఉన్నారని, ప్రయాణికుల కోసం మరొక విమానాన్ని పంపుతున్నట్లు తెలిపింది.

  10. పుష్ప గ్యాంగ్: సరికొత్తగా చందనం స్మగ్లింగ్... పగలంతా రెక్కీ, రాత్రిపూట పక్కాగా చోరీ

  11. కుటుంబ నియంత్రణ కార్యక్రమానికి మార్గదర్శి ఈ లాయర్

  12. పుంగనూరు ఆవులు: చూడడానికి చాలా చిన్నగా ఉండే ఈ ఆవులంటే ఎందుకంత క్రేజ్?

  13. స్టార్టప్స్ ప్రోత్సాహంలో టాప్ పెర్ఫార్మర్‌గా తెలంగాణ

    భారత్‌లో స్టార్టప్స్‌ను ప్రోత్సహించే రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ‘టాప్ పెర్ఫార్మర్’ కేటగిరీలో నిలిచింది.

    కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సోమవారం స్టార్టప్ స్టేట్ ర్యాంకులను విడుదల చేశారు.

    బెస్ట్ పెర్ఫార్మర్స్, టాప్ ఫెర్ఫార్మర్స్, ద లీడర్స్, ఎమర్జింగ్ స్టార్టప్ ఎకో సిస్టమ్ విభాగాలుగా రాష్టాలను విభజించారు.

    ఇందులో బెస్ట్ పెర్ఫార్మర్స్ కేటగిరీలో గుజరాత్, కర్ణాటక, మేఘాలయ ఉన్నాయి.

    టాప్ ఫెర్ఫార్మర్స్ విభాగంలో తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, జమ్మూ కశ్మీర్ ఉన్నాయి

    లీడర్స్ విభాగంలో తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్,పంజాబ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్, గోవా ఉండగా... చివరిదైన ఎమర్జింగ్ స్టార్టప్ కేటగిరీలో బిహార్, ఆంధ్రప్రదేశ్, మిజోరామ్, లడఖ్ చోటు దక్కించుకున్నాయి.

  14. భారత్‌లో కొత్తగా 13,086 కరోనా కేసులు

    భారత్‌లో సోమవారం కొత్తగా 13,086 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిథ్వ శాఖ తెలిపింది.

    గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 19 మంది చనిపోయారు. 12,456 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

    తాజా కేసులతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 1,14,475గా ఉంది.

  15. అగ్నిపథ్: విశాఖపట్నంలో అగస్ట్ 14 నుంచి రిక్రూట్‌‌మెంట్ డ్రైవ్

  16. జమ్మూకశ్మీర్‌: అరెస్టయిన అనుమానిత లష్కరే తోయిబా మిలిటెంట్‌తో బీజేపీకి సంబంధం ఏంటి?

  17. తెలంగాణ: నర్సరీలు పెట్టి పెంచిన ఈ మొక్క ఇప్పుడు ప్రభుత్వాలను ఎందుకు భయపెడుతోంది?

  18. ధన్యవాదాలు..

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్డేట్ల కోసంఈ లింకునుక్లిక్ చేయండి.

  19. నేటి ముఖ్యాంశాలు

    అల్లూరి సీతారామరాజును గుండెల్లో పెట్టుకున్నాం. అందుకే జిల్లాల పునర్విభజనలో ఒక జిల్లాకు ఆయన పేరును పెట్టామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.

    ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి, వీరభూమి. ఇలాంటి ప్రదేశానికి రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నా అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

    మహారాష్ట్ర శాసనసభలో జరిగిన విశ్వాస పరీక్షలో ఏక్‌నాథ్ శిందే ప్రభుత్వం విజయం సాధించింది. విజయానికి 143 ఓట్లు అవసరం కాగా, శిందే ప్రభుత్వానికి 164 ఓట్లు లభించాయి.

    కులు జిల్లాలో లోయలో పడిన బస్సు ప్రమాదంలో 12 మంది మరణించినట్లు, ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు హిమాచల్ ప్రదేశ్ మంత్రి సురేశ్ భరద్వాజ్‌‌ను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలకకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

  20. కుక్క మొరుగుతోందని ఇనుప రాడ్డుతో దాడి