ఏక్‌నాథ్ శిందే: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం, డిప్యూటీ సీఎంగా ఫడణవీస్
శివసేన రెబెల్ నేత ఏక్‌నాథ్ శిందే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్.
లైవ్ కవరేజీ
లైవ్ పేజీ అప్డేట్లు సమాప్తం
నేటి ముఖ్యాంశాలు:
శివసేన రెబెల్ నేత ఏక్‌నాథ్ శిందే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్.
టుపుల్ రైల్వే స్టేషన్ బిల్డింగ్ ధ్వంసమైంది. ఇప్పటి వరకు ఏడు మృతదేహాలను వెలికితీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మణిపూర్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో భారీ ప్రమాదం సంభవించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్య సాయి జిల్లాలో ఆటోకు హైటెన్షన్ వైర్లు తగిలి అయిదుగురు మహిళా కూలీలు సజీవదహనం అయ్యారు.
లైవ్ పేజీ అప్డేట్లను ఇంతటితో ముగిస్తున్నాం.
జులై 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
ఫొటో సోర్స్, ANI
జులై 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
అదే రోజున రాష్ట్రపతి ఎన్నికలు కూడా జరగనున్నాయి.
ఎన్‌డీఏ తరపున ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ నిలబెట్టింది. ఇక
కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే వంటి ప్రతిపక్షాల తరపున యశ్వంత్
సిన్హా రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా యశ్వంత్ సిన్హకు మద్దతు ప్రకటించారు.
ఈ గుంతల రోడ్డు ఎక్కడుందో తెలుసా? అక్కడి వాళ్లు ఏం చెబుతున్నారు?
రోడ్డుపై వరుసగా గుంతలు కనిపించేలా పైనుంచి తీసిన ఒక ఫొటో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయ్యింది. ఏదో ఒక రాష్ట్రానిదని చెబుతూ దానిని చాలా మంది షేర్ కూడా చేశారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.
పోస్ట్ of YouTube ముగిసింది
వరదలతో అస్సాంలో 8 మంది మృతి
అస్సాంను ముంచెత్తుతున్న వరదలతో గత 24 గంటల్లో 8 మంది చనిపోయారు.
దీంతో ఈ ఏడాది వరదల వల్ల చనిపోయిన వారి సంఖ్య 159కి చేరింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
తినడానికి ఏమీ లేక సముద్రం నీటిని తాగి స్పృహ తప్పి పడిపోయిన వృద్ధ జంట
ఈ రోడ్డుపై వెళుతుంటే నరకానికి వెళుతున్నట్లు ఉందంటున్నారు ప్రయాణికులు. ఇంత చెత్త రహదారి ఎక్కడుంది
బ్రేకింగ్ న్యూస్, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ శిందే ప్రమాణ స్వీకారం
ఫొటో సోర్స్, ANI
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన రెబెల్ నేత ఏక్‌నాథ్ శిందే ప్రమాణస్వీకారం
చేశారు. ఆ తరువాత ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు బీజేపీ నేత దేవేంద్ర
ఫడణవీస్.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ నిధులు నిజంగానే మాయమయ్యాయా, ప్రభుత్వం ఏం చెబుతోంది
తాలిబాన్‌ల నుంచి జీతాలు రావు, గుర్తింపూ ఇవ్వలేదు. మరి దిల్లీలోని అఫ్గాన్ రాయబార కార్యాలయం ఎలా నెట్టుకొస్తోంది?
ఏక్‌నాథ్ శిందే: ఆటో నడిపే వ్యక్తి నుంచి సీఏం స్థాయికి ఎలా చేరారు?
ముంబై చేరుకున్న శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే.. రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశం
ఫొటో సోర్స్, ANI
శివసేన తిరుగుబాటు సమూహం నాయకుడు ఏక్‌నాథ్ షిండే గోవా నుంచి ముంబై చేరుకున్నారు.
బీజెపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సహా గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కలిసేందుకు రాజ్‌భవన్ చేరుకున్నట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
తనతో పాటు ఉన్న 50 మంది ఎమ్మెల్యేలు తనను నాయకుడిగా ఎన్నుకున్నారని గోవా విమానాశ్రయం నుంచి బయలుదేరే ముందు షిండే స్పష్టం చేశారు.
మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ముంబై విమానాశ్రయం నుండి దక్షిణ ముంబై వరకు ఏకనాథ్ షిండే కాన్వాయ్ కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటుచేశారు.
మరోవైపు రాజ్‌భవన్‌లో సన్నాహాలు జరుగుతున్నాయి. మీడియాను కూడా లోపలికి అనుమతించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
‘సాలు దొర, సెలవు దొర’...‘సాలు మోదీ, సంపకు మోదీ’... హైదరాబాద్ వేదికగా టీఆర్‌ఎస్, బీజేపీ ప్రకటనల యుద్ధం
మణిపూర్‌లో కొండచరియలు విరిగిపడి భారీ ప్రమాదం..సహాయక చర్యలు కొనసాగుతున్నాయి
మణిపూర్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నోనీ జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయని, కొత్తగా నిర్మిస్తున్న జిరిబామ్ - ఇంఫాల్ రైల్వే లైన్‌లో భాగమైన టుపుల్ స్టేషన్ భవనానికి నష్టం వాటిల్లిందని ఎన్ఎఫ్ రైల్వే సీపీఆర్ఓ తెలినట్లు ఏఎన్ఐ వార్త సంస్థ వెల్లడించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 1
ఇప్పటివరకు ఏడుగురి మృతదేహాలను వెలికి తీశారని, ప్రమాదం నుంచి రక్షించినవారిని ఆస్పత్రికి తరలించారని నోనీ జిల్లా ఎస్‌డీఓ సోలమన్ ఎల్ ఫిమేట్ తెలిపినట్లు ఏఎన్ఐ పేర్కొంది. ఇంకా సుమారు 45 మంది కనిపించడం లేదని సమాచారం.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 2
టుపుల్‌లో పరిస్థితిని అంచనా వేయడానికి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశామని, ప్రమాదం జరిగిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ తెలిపారు.
టుపుల్ రైల్వే స్టేషన్ దగ్గర కొండచర్యలు విరిగిపడిన ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్‌తో, కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మాట్లాడానన్నారు.
ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాలుపంచుకుంటోందని, మరో రెండు బృందాలు టుపుల్‌కు వెళుతున్నాయని తెలిపారు.
వరవరరావు బెయిల్ తిరస్కరణపై జూలై 11న సుప్రీం కోర్టులో విచారణ
ఫొటో సోర్స్, FACEBOOK/BHASKER KOORAPATI
ఫొటో క్యాప్షన్, వరవరరావు
భీమా కోరేగావ్ కేసులో విచారణ ఖైదీగా ఉన్న విరసం నేత వరవరరావుకు బెయిల్ ఇచ్చేందుకు బాంబే హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.
బెయిల్ తిరస్కరణను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటీషన్‌పై జూలై 11న విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు సమ్మతించింది.
జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ముందు సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు.
జూలై 11న ఈ పిటీషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరుపుతుందని బెంచ్ సభ్యులు జస్టిస్ జే బీ పార్దివాలా తెలిపారు.
82 ఏళ్ల వరవరరావు ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్న కారణంగా ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని గతంలో బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాంబే హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
'స్పార్కింగ్ రాగానే ఎలక్ట్రికల్ లైన్ ట్రిప్ అవుతుంది.. కానీ అలా జరుగలేదు ' - ధర్మవరం ఎమ్మేల్యే కేతిరెడ్డి వెంకట రమణారెడ్డి
ఫొటో సోర్స్, UGC
సత్య సాయి జిల్లాల్లో చోటు చేసుకున్న ప్రమాదం గురించి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రమణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
కేవలం ఉడుత రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆయన అన్నారు.
ఆటోపై మంచం ఉండడం, అదే సమయంలో తీగలపై ఉడుత పడడం.. ఆ తీగలు ఆటోపై పడడం, మంటలు రావడం ఆంతా యాక్సెడెంటల్‌గా జరిగిపోయాయని ఎమ్మేల్యే అన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలను ఆయన పరామర్శించారు.
"ఓవరాల్‌గా విద్యుత్ వైర్లను చాలా నిర్లక్ష్యంగా వదిలేస్తుంటారు. రైతులు పంట దెబ్బతింటుందని, కరెంటు వారు రావడం లేటవుతుందని కట్టెలు కూడా పెట్టుకుని ఉంటారు. ఈ కేసులో ఎలక్ట్రికల్ డిపార్ట్ మెంట్ నుంచి పొరబాటు జరగలేదు. ఒక్కసారిగా స్పార్కింగ్ రాగానే ఎలక్ట్రికల్ లైన్ ట్రిప్ అవుతుంది. ఇక్కడ ఎందుకు అలా జరగలేదనే అంశాన్ని టెక్నికల్‌గా పరిశీలిస్తున్నారు. బాధిత కుటుంబాలకు వైయెస్సార్ బీమా కూడా అందజేస్తాం. అదికూడా కలిపితే మృతుల కుటుంబాలకు 15 లక్షల వరకు వస్తుంది" అని ఎమ్మెల్యే చెప్పారు.
సత్య సాయి జిల్లాలో ఆటోపై విద్యుత్ తీగలు పడి సంభవించిన ప్రమాదం గురించి పోలీసులు అందించిన వివరాలు ఇవీ..
తాడిమర్రి మండలం గుండంపల్లి, పెద్దకోట్ల గ్రామాలకు చెందిన 11 మంది మహిళా కూలీలను పొలం పనుల కోసం పొలం యజమానురాలు ఆటోలో చిల్లరకొండయ్యపల్లికి తీసుకెళుతున్నారు.
మార్గమధ్యంలో ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైరు తెగిపడింది. దీంతో ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో డైవర్‌తో సహా మెంత్తం 13 మంది ప్రయాణిస్తున్నారు.
ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న కుమారి (35), రత్నమ్మ (35), రాములమ్మ (35), లక్ష్మి దేవి (32), కాంతమ్మ (32) అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.
మరో కూలీ గాయత్రికి తీవ్రగాయాలవడంతో ఆనంతపురంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.
ఇందులో మరికొందరికి చిన్న చిన్న గాయాలు అయ్యాయని దర్మవరం రూరల్ సీఐ మన్సురుద్దీన్ మీడియాతో చెప్పారు.
చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కరంట్ తీగలపైకి ఉడుత ఎక్కడం వల్ల తీగలు ఒకదానికి ఒకటి తగిలి, విద్యుత్ తీగ తెగి ఆటోపై పడిందని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్ హరినాధరావు తెలిపారు. దీనిపై విజిలెన్స్ కమిటీ విచారణ జరుగుతుందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని సీఎండీ చెప్పారు.
‘30 లక్షల మందిని చంపేశా’ అని ఘనంగా చెప్పుకునే ఈ లీడర్‌కు ఇంత ప్రజాదరణ ఎందుకు?
తెలంగాణ: పదవ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చేశాయి
ఫొటో సోర్స్, SABITHAINDRAREDDY/FACEBOOK
తెలంగాణ రాష్ట్ర పదవ తరగతి (ఎస్ఎస్‌సీ) పరీక్షల ఫలితాలను కొద్దిసేపటి క్రితం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌లో విడుదల చేశారు.
ఈ ఏడాది పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో 90 శాతం మంది పాస్ అయ్యారు. విద్యార్థుల సౌకర్యార్థం పరీక్షా ఫలితాలను ఈ కింది వెబ్‌సైట్‌లో ఉంచారు.
తెలంగాణలో మే 23 నుంచి జూన్ 1 వరకు జరిగిన ఎస్ఎస్‌సీ పరీక్షలకు 5,03,579 మంది విద్యార్థులు హాజరు కాగా, 4,53,201 మంది పాసయ్యారు.
ఈసారి పరీక్షా ఫలితాల్లో బాలికలు 92.45 శాతంతో బాలుర కంటే ముందున్నారు. బాలురు 87.61 శాతం పాసయ్యారు.
తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లో 25 జిల్లాలు 90 శాతానికి పైగా పాస్ మార్కులు సాధించాయి. ఇక జిల్లాల వారిగా చూస్తే, 97.85 పాస్ పర్సెంటేజీతో సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. 97.73, 96.75 శాతంతో నిర్మల్, సంగారెడ్డి జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
గత రెండేళ్లుగా తెలంగాణలో ఎస్ఎస్‌సీ పరీక్షల నిర్వహణపై కరోనా ప్రభావం చూపింది. 2020లో మూడు పరీక్షలు నిర్వహించాక, లాక్ డౌన్ విధించడంతో పరీక్షలు జరగలేదు.
2021లో పరీక్షల సమయంలో కరోనా కేసుల ఉధృతి ఎక్కువగా ఉండటంతో పరీక్షలు నిర్వహించలేదు. ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ ఆధారంగా రిజల్ట్స్ ప్రకటించి 100 శాతం మంది విద్యార్థులను పాస్ చేశారు.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టాక ఈ ఏడాది నేరుగా రాతపరీక్షలను నిర్వహించారు.
"కరోనా నేపథ్యంలో 7వ తరగతి తరువాత ఇప్పుడే విద్యార్థులు పరీక్షలు రాశారు. కరోనా సమయంలో విద్యార్థులు నష్టపోకుండా టీ-శాట్ ద్వారా ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాం. పరీక్షలకు 30 శాతం సిలబస్ తగ్గించాం. 11 పేపర్లను 6 పేపర్లకు కుదించాం. పరీక్ష సమయం పెంచాం. పాసయిన విద్యార్థులకు అభినందనలు. ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి. ఫెయిలయిన విద్యార్థులకు వారానికి రెండు సార్లు స్పెషల్ క్లాసులు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చాం" అని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
కోవిడ్‌కు ముందటి స్థాయికి మించి దూసుకెళ్తున్న భారత పర్యటక రంగంలో ఎదురవుతున్న సవాళ్లేంటి?
ఉద్యోగులు, యాజమాన్యం అంతా మహిళలే... గుజరాత్‌లోని ఒక రబ్బర్ ఫ్యాక్టరీలో భారీ యంత్రాలపై పని
పారిస్ దాడులలో దోషికి ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యంత కఠినమైన శిక్ష
ఫొటో సోర్స్, BENOIT PEYRUCQ/AFP
పారిస్ దాడులకు పాల్పడిన వారిలో బతికున్న వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.
2015 నవంబర్ 13న పారిస్‌లో జరిగిన తుపాకీ, బాంబు దాడుల్లో 130 మంది చనిపోయారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఫ్రాన్స్‌లో జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇది.
ఈ దాడులు జరిపిన సమూహంలో సలాహ్ అబ్దెస్లామ్ అనే వ్యక్తి మాత్రమే బతికి ఉన్నాడు.
ఈ కేసులో మరో 19 మందిని కూడా దోషులుగా కోర్టు నిర్ధారించింది. అయితే, వీరిలో ఆరుగురు చనిపోయినట్లు తెలుస్తోంది.
ఈ కేసు విచారణ గత సెప్టెంబర్‌లో ప్రారంభమైంది. ఆధునిక ఫ్రెంచ్ చరిత్రలో సుదీర్ఘకాలం కొనసాగిన విచారణ ఇది.
2015లో ఫ్రాన్స్‌లోని పలు ప్రాంతాల్లో ఈ దాడి జరిగింది. బార్‌లు, రెస్టారెంట్లు, నేషనల్ ఫుట్బాల్ స్టేడియం, బాటాక్లాన్ సంగీత వేదిక సహా వివిధ ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో చనిపోయినవారితో పాటు వందలాదిమంది గాయపడ్డారు.
ఫొటో సోర్స్, Getty Images
విచారణ ప్రారంభంలో, అబ్దెస్లామ్ తనను తాను ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద గ్రూపుకు చెందిన "సైనికుడి"గా పేర్కొన్నాడు.
తరువాత, అబ్దెస్లామ్ బాధితులకు క్షమాపణలు చెప్పాడు. తాను హంతకుడిని కాదని, తనకు శిక్ష వేయడం అన్యాయమని కోర్టుకు చెప్పాడు.
దాడి జరిగిన రాత్రి తాను ధరించిన ఆత్మాహుతి జాకెట్‌ను పేల్చివేయకూడదని నిర్ణయించుకున్నట్టు అబ్దెస్లామ్ కోర్టుకు చెప్పాడు. తరువాత, ఆ జాకెట్‌ను పారిస్ శివార్లలో పారవేసినట్టు తెలిపాడు.
అయితే, ఆ జాకెట్‌లో లోపాలు ఉండడం వల్ల పేలలేదని, అబ్దెస్లామ్ చివరి నిమిషంలో మనసు మార్చుకున్నాడన్న వాదనను విశ్వసించట్లేదని కోర్టు తెలిపింది.
ఫ్రాన్స్‌లో జీవితకాల ఖైదు అంటే 30 సంవత్సరాల తరువాత మాత్రమే పెరోల్‌లో బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫ్రాన్స్‌లో దీన్ని అత్యంత కఠినమైన శిక్షగా పరిగణిస్తారు.