ఈనాటి ముఖ్య పరిణామాలు ఇవీ
- పంజాబ్‌లోని పటియాలాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘర్షణకు సంబంధించి శివసేన నాయకుడు హరీష్ సింగ్లాను అరెస్ట్ చేశారు.
- భారతదేశపు విదేశీ మారక ద్రవ్యం నిల్వలు గత వారంలో 327.1 కోట్ల డాలర్ల మేర తగ్గిపోయాయని ఆర్‌బీఐ సమాచారాన్ని ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
- విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా సైట్ ట్విటర్‌ను కొనుగోలు చేయటానికి ఒప్పందం చేసుకున్న కొన్ని రోజుల్లోనే తన టెస్లా కంపెనీలో దాదాపు 400 కోట్ల డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు.
- యుక్రెయిన్ యుద్ధం ముగియడానికి చాలా సంవత్సరాలు పట్టొచ్చని నాటో డిప్యూటీ సెక్రటరీ జనరల్ మిర్సియా అభిప్రాయపడ్డారు.
- భవిష్యత్తు తరాల కోసం తీసుకునే అప్పులను అప్పులుగా చూడకూడదని.. తాము తీసుకునే ప్రతి పైసా అప్పు మరొక పైసను సృష్టిస్తుందని దాన్ని పెట్టుబడిగా చూడాలని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
- దేశంలో గత 24 గంటల్లో 3,377 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. 2,496 మంది కోలుకోగా 60 మంది చనిపోయారు. మొత్తం 17,801 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
ఇవీ ఈనాటి ముఖ్య పరిణామాలు. దీనితో నేటి బీబీసీ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం.
రష్యా - యుక్రెయిన్ యుద్ధం తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీనిఫాలో అవండి.











