నేటి ముఖ్య పరిణామాలివీ...
దిల్లీలో పాజిటివిటీ రేటు 2 శాతానికి పైగా పెరిగింది. హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారి సంఖ్య గత వారంలో 48 శాతం పెరిగింది.
యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 20 వేల మంది రష్యా సైనికులు చనిపోయారని యుక్రెయిన్ తెలిపింది.
రష్యాలో యుక్రెయిన్ ‘ఉగ్రవాదదాడులు’, ‘విధ్వంసచర్యల’కు ప్రతీకారంగా కీయెవ్‌పై మరిన్ని దాడులు చేస్తామని రష్యా హెచ్చరించింది.
ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల్లో ధాన్యం రవాణా మీద ఆంక్షలు పెట్టారు. ఏపీ వైపు నుంచి ధాన్యం లోడుతో వస్తున్న వాహనాలను తెలంగాణ అధికారులు అడ్డుకుంటున్నారు.
అవసరమైనన్ని కోర్టులు ఏర్పాటు చేసి, మౌలిక వసతులు కల్పించినప్పుడే కేసులు త్వరగా పరిష్కారం అవుతాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ అన్నారు.
నల్ల సముద్రంలో తమ ప్రధాన యుద్ధ నౌకల్లో ఒకటైన మాస్క్వా మునిగిపోయిందని రష్యా ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
తాము క్షిపణులతో దాడి చేయడం వల్లే ఈ నౌక ధ్వంసమైందని యుక్రెయిన్ తెలిపింది. అయితే, నౌకలో ఉన్న మందు గుండు సామాగ్రి పేలిందని రష్యా చెబుతోంది.
ఇవీ ఈ నాటి ముఖ్య పరిణామాలు. ఇక్కడితో నేటి బీబీసీ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం.
యుక్రెయిన్ మీద రష్యా యుద్ధానికి సంబంధించిన తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీని ఫాలో అవండి.











