ట్విటర్‌కు ఎలాన్ మస్క్ ఆఫర్
‘‘నా వైపు నుంచి నేను అత్యుత్తమ ఆఫర్‌ను ఇచ్చాను. ఇదే తుది ఆఫర్ కూడా. ఒకవేళ దీన్ని మీరు అంగీకరించకపోతే, వాటాదారుగా నా స్థానం గురించి నేను పునరాలోచించాల్సి ఉంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
లైవ్ కవరేజీ
సతీష్ ఊరుగొండ, రాజేశ్ పెదగాడి
నేటి ముఖ్య పరిణామాలివీ...
మామూలుగా కన్నా 50 రెట్లు పెద్దదిగా ఉన్న ఓ తోకచుక్క గంటకు 35,000 కిలోమీటర్ల వేగంతో భూమి దిశగా దూసుకొస్తోందని నాసా చెప్పింది. ఇది ప్రస్తుతం సూర్యుడికి 200 కోట్ల మైళ్ల కన్నా తక్కువ దూరంలో ఉంది.
బాలీవుడ్ తారలు రణబీర్ కపూర్, అలియా భట్‌లు గురువారం ముంబైలో వివాహం చేసుకున్నారు. ఈ జంట వివాహానికి బాలీవుడ్ ప్రముఖులు తరలివచ్చారు.
ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ ఎలాన్ మస్క్... 41 బిలియన్ డాలర్ల (రూ. 3,12,133 లక్షల కోట్లు)కు ట్విటర్‌ను కొనుగోలు చేస్తానంటూ తాజా ఆఫర్‌ను ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమలోని యూనిట్-4లో మంటలు చెలరేగడంతో పేలుడు సంభవించి ఏడుగురు మరణించారు.
భారత్ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను 8.7 శాతం నుంచి 8 శాతానికి ప్రపంచ బ్యాంకు తగ్గించింది.
నల్ల సముద్రంలో రష్యాకు చెందిన ప్రధాన యుద్ధ నౌకల్లో ఒకటైన మోస్క్వాను నెప్ట్యూన్ క్షిపణితో పేల్చేశామని యుక్రెయిన్ ప్రకటించింది.
నాలుగైదేళ్లలో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా జమ్మూకశ్మీర్‌లో అందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించిందని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం చెప్పారు.
ఇవీ ఈ నాటి ముఖ్య పరిణామాలు. ఇక్కడితో నేటి బీబీసీ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం.
యుక్రెయిన్ మీద రష్యా యుద్ధానికి సంబంధించిన తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీని ఫాలో అవండి.
కె.జి.యఫ్-3 ఉంటుందా.. కె.జి.యఫ్-2 రివ్యూ
భారీ అంచనాలతో రిలీజైన యశ్ కె.జి.యఫ్ మూవీ ఎలా ఉంది?
దర్శకుడు ప్రశాంత్ నీల్ చాప్టర్ 2లో ఏం చూపించాడు?
ఈ సినిమా గురించి రివ్యూలు ఎలా ఉన్నాయి?
వీడియో క్యాప్షన్, KGF 2 రివ్యూ: భారీ అంచనాలతో రిలీజైన యశ్ కె.జి.యఫ్ మూవీ ఎలా ఉంది? గంటకు 35,000 కిలోమీటర్ల వేగంతో భూమివైపు దూసుకొస్తున్న అతిపెద్ద తోకచుక్క
రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి సందడి

ఫొటో సోర్స్, INSTAGRAM/ALIA BHATT
రణబీర్ కపూర్, అలియా భట్ వివాహం ముంబయిలో జరిగింది.
ఈ జంట వివాహానికి బాలీవుడ్ ప్రముఖులు తరలివచ్చారు.
అమెరికాకు గట్టి జవాబు చెప్పిన భారత్... సోషల్ మీడియాలో జయశంకర్‌పై ప్రశంసలు
బ్రేకింగ్ న్యూస్, రేపు రాజీనామా చేస్తా: కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప
ఒక కాంట్రాక్టర్ అనుమానాస్పద మరణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప తన పదవికి శుక్రవారం నాడు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
‘‘నేను రేపు ముఖ్యమంత్రికి రాజీనామా లేఖను సమర్పిస్తాను’’ అని ఆయన చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టర్ ‘ఆత్మహత్య’ కేసులో ఈశ్వరప్ప ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దిల్లీలో గ్యాస్ సిలిండర్ పేలుడు
దిల్లీలోని ఒక ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది.
ఈ ప్రమాదంలో 13 మంది గాయపడ్డారు.
వారిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘ఈ చట్టం అమల్లోకి వస్తే ఫింగర్‌ప్రింట్స్, రెటీనా స్కాన్‌తో పాటు బయోలాజికల్ శాంపిల్స్ కూడా సేకరించొచ్చు’
ట్విటర్‌కు ఎలాన్ మస్క్ ఆఫర్

ఫొటో సోర్స్, Getty Images
ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ ఎలాన్ మస్క్... 41 బిలియన్ డాలర్ల (రూ. 3,12,133 లక్షల కోట్లు)కు ట్విటర్‌ను కొనుగోలు చేస్తానంటూ తాజా ఆఫర్‌ను ప్రకటించారు. కొన్ని రోజుల క్రితమే ట్విటర్ బోర్డులో తాను చేరడం లేదంటూ ఆయన తెలిపారు. అంతలోనే ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తూ తాజా ప్రకటన చేశారు.
ట్విటర్‌కు చెందిన ఒక్కో షేరుకు 54.20 డాలర్లను ఇస్తానంటూ ఆయన గురువారం రెగ్యులరేటరీ ఫిల్లింగ్‌కు సమాచారమిచ్చారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దీంతో ప్రీమార్కెట్ ట్రెడింగ్‌లో ట్విటర్ షేర్లు 12 శాతం వరకు పెరిగాయి.
ట్విటర్‌లో ఎలాన్ మస్క్‌కు 9.2 శాతం వాటా ఉంది. అంటే ట్విటర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ (2.25 శాతం) కంటే కూడా నాలుగు రెట్లు అధికంగా ఎలాన్ మస్క్‌కు వాటాలు ఉన్నాయి.
‘‘కంపెనీలో పెట్టుబడులు పెట్టిన తర్వాత నేనో విషయాన్ని గ్రహించాను. ప్రస్తుతం ఉన్న స్థితిలో కంపెనీ, దాని సామాజిక బాధ్యతలను నెరవేర్చలేదు. ముందుకూ సాగలేదు. కాబట్టి ట్విటర్‌ను ప్రైవేటు కంపెనీగా మార్చాలి’’ అని ట్విటర్ చైర్మన్ బ్రెట్ టేలర్‌కు ఆయన ఒక లేఖ రాశారు.
‘‘నా వైపు నుంచి నేను అత్యుత్తమ ఆఫర్‌ను ఇచ్చాను. ఇదే తుది ఆఫర్ కూడా. ఒకవేళ దీన్ని మీరు అంగీకరించకపోతే, వాటాదారుగా నా స్థానం గురించి నేను పునరాలోచించాల్సి ఉంటుంది’’ అని ఆయన అందులో పేర్కొన్నారు.
రష్యా ప్రధాన యుద్ధ నౌక మునిగిపోతోందన్న యుక్రెయిన్

ఫొటో సోర్స్, Reuters
నల్ల సముద్రంలో రష్యాకు చెందిన ప్రధాన యుద్ధ నౌకల్లో ఒకటైన మోస్క్వాను నెప్ట్యూన్ క్షిపణితో పేల్చేశామని యుక్రెయిన్ వెల్లడించింది.
క్షిపణి దాడి అనంతరం నౌకలో మంటలు చెలరేగాయని, ఆ తర్వాత నౌకలో ఉన్న బాంబులు పేలాయని తెలిపింది.
186 మీ. పొడవైన మోస్క్వా నౌక తీవ్రంగా ధ్వంసమైందని కూడా యుక్రెయిన్ చెప్పింది.
ప్రతికూల వాతావరణం, నౌకలో పేలుళ్లు జరగడం వల్ల రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు రష్యాకు వీలు కలగలేదని పేర్కొంది.
తిరగబడిన నౌక మునిగిపోవడం మొదలుపెట్టిందని యుక్రెయిన్ చెప్పింది.
అయితే, మోస్క్వా నౌక మునిగిపోలేదని రష్యా సైన్యం ప్రకటించింది.
మోదీ నియోజకవర్గంలో ఎంఎల్‌సీ ఎన్నికల్లో బీజేపీ ఎందుకు ఓడిపోయింది?
దిల్లీ స్కూల్‌లో కోవిడ్ కలకలం
దిల్లీలోని ఒక ప్రైవేటు స్కూల్‌లో ఒక విద్యార్థి, టీచర్‌కు బుధవారం కోవిడ్ సోకింది.
ఆ విషయం తెలిసిన తర్వాత ఆ తరగతిలోని ఇతర విద్యార్థులను ఇంటికి పంపించారు.
విద్యార్థి, టీచర్ ఆరోగ్యం నిలకడగా ఉందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
మూడు రోజులు వరుస సెలవులు రావడంతో స్కూల్‌ను మూసేశారు.
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దిల్లీలోని స్కూళ్లు పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి.
మరోవైపు, దిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న 299 కేసులు నమోదయ్యాయి.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దిల్లీలో అగ్నిప్రమాదం
దిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలోని ఒక క్లబ్‌లో అగ్నిప్రమాదం జరిగింది.
12 అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పివేశాయి.
ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని దిల్లీ పోలీసులు వెల్లడించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అంబేడ్కర్: ‘కులాంతర వివాహాలు, కలిసి భోజనాలు చేయడం వల్ల కుల వ్యవస్థ అంతం కాదు’
కేజీఎఫ్ 2 రివ్యూ: చాప్టర్ 2లో అసలు కథ ఎంత? యష్, ప్రశాంత్ నీల్ విజయం సాధించారా?
తమిళనాడులో ఆరో తరగతి విద్యార్థి మతం మార్చేందుకు ఉపాధ్యాయుడి యత్నం

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, తమిళనాడు విద్యా శాఖ మంత్రి అంబిల్ మహేశ్ తమిళనాడులో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి మతం మార్చేందుకు ఓ ఉపాధ్యాయుడు ప్రయత్నించారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ వార్త వైరల్ కావడంతో సదరు ఉపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి అంబిల్ మహేశ్ చెప్పారు.
‘‘ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ పూర్తయ్యాక చర్యలు ఉంటాయి’’అని ఆయన చెప్పారు. ఈ కేసుతో ఎవరూ రాజకీయాలు చేయొద్దని ఆయన అభ్యర్థించారు.
ఆరో తరగతి చదువుతున్న సదరు విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు విద్యా శాఖ తెలిపింది.
‘‘ఆ ఉపాధ్యాయుడు క్రైస్తవ మతం గురించి గొప్పగా చెప్పేవారు. హిందూ మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసేవారు’’అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అలాంటి ఉపాధ్యాయులను వెంటనే జైలుకు పంపించాలని రాష్ట్ర సమాచార, ప్రసార శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా వ్యాఖ్యానించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె ఆత్మహత్య

ఫొటో సోర్స్, Facebook/MâhâlàkshmîThati
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె తాటి మహాలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నారు.
గురువారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఉరివేసుకుని కనిపించిన మహాలక్ష్మిని చూసి కుటుంబ సభ్యులు భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే మృతి చెందడంతో మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఎంబీబీఎస్ పూర్తి చేసి, ప్రస్తుతం పీజీ ఎంట్రన్స్‌కి ఆమె ప్రిపేర్ అవుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఈ ఆత్మహత్యకు సంబంధించి బూర్గంపహాడ్ పోలీసులు కేసు నమోదుచేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
భారత్‌లో విద్వేష వ్యాఖ్యలు చేసి శిక్షలు పడకుండా తప్పించుకోవడం చాలా తేలికా?
ఆంధ్రప్రదేశ్: ఏలూరు కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి