తమిళనాడులో 84.60, పశ్చిమ బెంగాల్‌లో 91.68 శాతం పోలింగ్
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం, తమిళనాడులో 84.60 శాతం, బెంగాల్‌లో 91.68 శాతం పోలింగ్ నమోదైంది.
సారాంశం
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది.
తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు పోలింగ్ జరిగింది.
పశ్చిమ బెంగాల్‌లో తొలివిడతలో భాగంగా 152 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది.
అమెరికా నేవీ సెక్రటరీ 'తక్షణమే' పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పెంటగాన్ ప్రకటన
డోనల్డ్ ట్రంప్ ప్రకటించిన యుద్ధ విరామ పొడిగింపుపై స్పందించిన ఇరాన్.
రాజకీయ పరిణామాలను తెహ్రాన్ నిశితంగా గమనిస్తోందని ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ చెప్పారు.
లైవ్ కవరేజీ
తమిళనాడులో 84.60, పశ్చిమ బెంగాల్‌లో 91.68 శాతం పోలింగ్
ఫొటో సోర్స్, ANI
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది.
తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు, పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశ పోలింగ్‌లో భాగంగా 152 స్థానాలకు గురువారం పోలింగ్ జరిగింది.
ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం, తమిళనాడులో 84.60 శాతం, బెంగాల్‌లో 91.68 శాతం పోలింగ్ నమోదైంది.
పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది.
ఈ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.
చెర్నోబిల్: 1986 నాటి భారీ అణు ప్రమాదంలో అసలేం జరిగింది?.. 4 ప్రశ్నలు- జవాబులు
పిఠాపురం: ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య వివాదం ఏంటి?
మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితుల విడుదల - దర్యాప్తు సంస్థలు భిన్నమైన రిపోర్టులు ఇవ్వడంపై బాంబే హైకోర్టు ఏమన్నది?
టిక్‌టాక్ స్టార్, సింగర్ డేవిడ్ కారు డిక్కీలో 14 ఏళ్ల బాలిక శవం, అసలేం జరిగిందంటే..
ఒంటిగంట సమయానికి తమిళనాడులో 56.81, పశ్చిమ బెంగాల్‌లో 62.18 శాతం ఓటింగ్
ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, చెన్నైలో ఓట్లు వేసేందుకు వచ్చిన నూతన వధూవరుల జంట
పశ్చిమ బెంగాల్‌లోని 152 స్థానాలకు, తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది.
ఎలక్షన్ కమిషన్ గణాంకాల ప్రకారం, మధ్యాహ్నం 1 గంట వరకు బెంగాల్‌లో 62.18 శాతం, తమిళనాడులో 56.81 శాతం ఓటింగ్ నమోదైంది.
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా డోమ్‌కల్‌లో టీఎంసీ, సీపీఎం కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. ఝర్‌గ్రామ్‌లోని ఒక పోలింగ్ కేంద్రంలోకి అడవి ఏనుగు రావడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వార్తలు నిజం కాదు: కేంద్రం స్పష్టత
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
ఎన్నికల
అనంతరం పెట్రోల్, డీజిల్
ధరలు భారీగా పెరుగుతాయంటూ వస్తున్న వార్తలను కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు
మంత్రిత్వ శాఖ ఖండించింది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకే ఇలాంటి తప్పుడు
ప్రచారాలు చేస్తున్నారని తెలిపింది.
పెట్రోల్,
డీజిల్ లీటరుకు రూ. 25-28 మేర పెరగొచ్చంటూ వచ్చిన కొన్ని
మీడియా కథనాలను ఈ సందర్భంగా కొట్టి పారేసింది. అలాంటి ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం పరిశీలనలో లేదని
పెట్రోలియం శాఖ ‘ఎక్స్’ పోస్టులో పేర్కొంది.
అంతర్జాతీయంగా
ధరలు పెరిగినా ఆ భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వం, చమురు సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయని
తెలిపింది.
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ బూత్ సమీపంలో బాంబు పేలుడు వార్తలు
ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, పశ్చిమ బెంగాల్‌లో మొదటి విడతలో 152 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.
పశ్చిమ
బెంగాల్‌లో పోలింగ్ ప్రారంభమైన తర్వాత వేర్వేరు ప్రాంతాలలో చెదురుమదురు
హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
ముర్షిదాబాద్
జిల్లాలోని డోంకల్ నియోజకవర్గంలో సీపీఐ(ఎం), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)
కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు గాయపడ్డారు. దీంతో స్థానికులు బూత్
నంబర్ 217 వద్ద ఓటు
వేయడానికి వెళ్లలేకపోయారు.
బీబీసీ బంగ్లా కథనం ప్రకారం, ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన ముర్షిదాబాద్ పోలీసులు.. ఓటర్లు నిర్భయంగా వచ్చి ఓటు వేయాలని మైకుల ద్వారా విజ్ఞప్తి చేశారు. వారికి పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ముర్షిదాబాద్ జిల్లాలో నౌదా అసెంబ్లీ
నియోజకవర్గ పరిధిలోని శివనగర్‌లో ఒక పోలింగ్ కేంద్రం సమీపంలో బాంబు పేలుడు
జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు,
మాల్దా జిల్లాలోని మోతాబారిలో ఈవీఎంలు మొరాయించడంతో ఉదయం కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. అధికారులు అక్కడికి చేరుకోగా, వారు
ఆలస్యంగా వచ్చారని ఆరోపిస్తూ స్థానికులు నిరసన తెలిపారు. సమస్య పరిష్కారం కావడంతో
పోలింగ్ తిరిగి ప్రారంభమైందని ఎన్నికల సంఘం వెల్లడించింది.
పదవి నుంచి తప్పుకున్న అమెరికా నేవీ చీఫ్
ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ 2024లో జాన్ ఫెలోన్‌ను నేవీ సెక్రటరీ పదవికి నామినేట్ చేశారు(ఫైల్ ఫోటో).
అమెరికా
నేవీ సెక్రటరీ జాన్ ఫెలోన్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పెంటగాన్ బుధవారం
ప్రకటించింది.
ఆయన
నిష్క్రమణ ‘తక్షణమే
అమలులోకి వస్తుంది’ అని
పెంటగాన్ ప్రతినిధి సీన్ పర్నెల్ 'ఎక్స్' పోస్ట్‌లో తెలిపారు.
నేవీ
అండర్ సెక్రటరీ హంగ్ కావో తాత్కాలిక సెక్రటరీగా బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు.
ఇరాన్‌తో
అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం, హార్ముజ్ జలసంధిని అమెరికా నిరంతరం దిగ్బంధిస్తున్న
ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఫెలోన్ తప్పుకోవడం చర్చనీయాంశమైంది.
"రక్షణ
శాఖకు, అమెరికా నేవీకి సెక్రటరీ ఫెలోన్ అందించిన సేవలకు కృతజ్ఞతలు
తెలుపుతున్నాం. ఆయన భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాం" అని పర్నెల్
రాశారు.
అయితే
ఫెలోన్ నిష్క్రమణకు గల కారణాలను నేవీ వెల్లడించలేదు.
ఆర్మీ
చీఫ్ ఆఫ్ స్టాఫ్ రాండీ జార్జ్‌ను పదవి నుంచి తప్పుకోవాలని అమెరికా రక్షణ మంత్రి
పీట్ హెగ్‌సెత్ కోరిన కొద్ది వారాలకే ఈ ఘటన చోటుచేసుకుంది. మరో ఇద్దరు ఆర్మీ
అధికారులు జనరల్ డేవిడ్ హాడ్నే, మేజర్
జనరల్ విలియం గ్రీన్‌లను కూడా ఇటీవల తమ బాధ్యతల నుంచి తప్పించారు.
చెన్నైలో ఓటేసిన రజనీ, విజయ్, అజిత్
ఫొటో సోర్స్, ANI
నటుడు
రజనీకాంత్ చెన్నైలోని స్టెల్లా మారిస్ స్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అలాగే, నటుడు అజిత్ కుమార్ చెన్నైలోని తిరువాన్మియూర్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు.
టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ చెన్నైలోని నీలంకరై పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఎంఎన్ఎం చీఫ్, నటుడు కమల్ హాసన్ తన కుమార్తె శృతి హాసన్‌తో కలిసి చెన్నైలో ఓటు వేశారు.
ఫొటో సోర్స్, ANI
అమెరికాతో చర్చలకు ఇరాన్ ఎందుకు ఆసక్తి చూపడం లేదు, తెరవెనుక ఏం జరుగుతోంది?
ఫొటో సోర్స్, Getty Images
కాల్పుల
విరమణ పొడిగించినప్పటికీ, ఇస్లామాబాద్‌లో
జరగాల్సిన రెండో విడత చర్చలపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు
జేడీ వాన్స్ నాయకత్వంలో ప్రతినిధి బృందాన్ని పాకిస్తాన్‌కు పంపుతున్నట్లు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గతంలోనే ప్రకటించారు.
నిజానికి
వాన్స్ బుధవారం ఉదయం పాకిస్తాన్ చేరుకోవాల్సి ఉందని అమెరికా మీడియా తెలిపింది. అయితే, ఆయన పర్యటన రద్దయింది,
ఎందుకంటే అమెరికా ప్రతినిధి బృందం వచ్చినప్పుడు మీటింగ్ టేబుల్ వద్ద
ఇరాన్ నుంచి ఎవరైనా ఉంటారా లేదా అనే ప్రశ్నకు ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్ వద్ద
కూడా ఇప్పటివరకు సమాధానం లేదు.
చర్చలకు
ప్రతినిధులను పంపడం తప్ప ఇరాన్‌కు మరో మార్గం లేదని ట్రంప్ మంగళవారం ఒక
ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, అమెరికాతో చర్చలపై ఇరాన్ అధికారుల నుంచి ఎటువంటి
సానుకూల సంకేతాలు రాలేదు.
ఈ
నేపథ్యంలో, రెండో
విడత చర్చల్లో ఇరాన్ ఎందుకు పాల్గొనడం లేదనే ప్రశ్నలు
తలెత్తుతున్నాయి.