వైఎస్ జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్న అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని ముఖ్యమంత్రి జగన్ తానే చేస్తునట్లు చెప్తుకుంటూ, ఆ పథకాల పోస్టర్లపై జగన్ తన ఫోటోనే వేసుకుంటున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్‌ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం. మరిన్ని వార్తలతో సోమవారం ఉదయం కలుద్దాం.

    ధన్యవాదాలు.

  2. గ్రామస్థులకు ప్రత్యేకమైన పోటీ పెట్టిన సర్పంచ్, విజేతకు బంగారు నాణెం

  3. వైఎస్ జగన్ ప్రభుత్వం అవినీతిలో మునిగితేలుతోందన్న అమిత్ షా

    అమిత్ షా

    ఫొటో సోర్స్, FB/amitshahofficial

    కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందిస్తున్న సహాయాన్ని ముఖ్యమంత్రి జగన్ తానే చేస్తునట్లు చెప్తుకుంటూ, ఆ పథకాలపై జగన్ తన ఫోటోనే వేసుకుంటున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనపై విశాఖలో జరిగిన సభలో అమిత్ షా ఏపీ ప్రభుత్వం, జగన్‌పై విమర్శలు చేశారు.

    రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకుంటున్న ఏపీ ప్రభుత్వం, దేశంలోనే రైతుల ఆత్మహత్యల విషయంలో 3వ స్థానంలో ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. కోవిడ్ సమయం నుంచి దేశంలో 80 కోట్ల మందికి 5 కిలోల చొప్పున్న బియ్యాన్ని కేంద్రం ఉచితంగా అందిస్తోందని, అయితే వాటిని తామే ఇస్తున్నట్లు జగన్ సర్కర్ చెప్పుకుంటోందని, ఆ బియ్యం సంచులపైనా జగన్ తన ఫోటోలు వేసుకుంటున్నారని అమిత్ షా విమర్శించారు.

    నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తొమ్మిదేళ్లలో కేంద్రం లక్షల కోట్ల రూపాయలు ఏపీకి ఇస్తే ఆ సొమ్ము అంతా ఎక్కడికి పోయిందో తెలియడం లేదన్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల మేరకైనా రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదన్నారు.

    జగన్ నాలుగేళ్ల పరిపాలనంతా అవినీతిమయం అన్నారు. మోదీ తొమ్మిదేళ్ల పాలనపై ఒక్క అవినీతి ఆరోపణ లేదని అమిత్ షా చెప్పారు. విశాఖ నగరం అంతా జగన్ పాలనలో అవినీతికి అడ్డగా మారిందన్నారు. వైసీపీ నేతలు భూదందాలు, ఫార్మా కంపెనీలలో కల్తీ మందులు తయారు చేస్తూ విశాఖను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శలు చేశారు.

    కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జాతీయ రహదారుల కోసం కేంద్రం రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, 4 వేల కోట్ల కిలోమీటర్లున్న జాతీయ రహదారులను 11 వేల కిలోమీటర్లకు పెంచిందని చెప్పారు. అలాగే ప్రధాని మోదీ సికింద్రాబాద్- విశాఖపట్నం, సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ రైళ్లు ఇచ్చారని, విశాఖ రైల్వే స్టేషన్‌ను రూ.450 కోట్లతో అభివృద్ధి చయడమే కాకుండా, విశాఖ, కాకినాడ, తిరుపతి, అమరావతి నగరాలను స్మార్ట్ సిటీలుగా కేంద్రం అభివృద్ధి చేస్తోందన్నారు.

    వచ్చే ఎన్నికల్లో మోదీ మళ్లీ 300 సీట్లతో ప్రధాని అవుతారని, అందుకు ఏపీ నుంచి 20 సీట్లు బీజెపీ గెలవాలని అమిత్ షా తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

  4. ఎవరికీ తెలియని రహస్య పర్వతం ఉన్న ప్రాంతాన్ని సమంత టీం ఎలా గుర్తించింది?

  5. హాకీ: ఆసియా కప్ గెలిచిన భారత జూనియర్ మహిళల జట్టు

    Hockey India team

    ఫొటో సోర్స్, Hockey India

    జపాన్‌లో జరిగిన హాకీ ఆసియా కప్ ఫైనల్లో భారత జూనియర్ మహిళల జట్టు 2-1తో దక్షిణ కొరియాను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

    నాలుగుసార్లు విజేతగా నిలిచిన దక్షిణ కొరియాను భారత్ ఓడించి, మొదటిసారి ఈ టైటిల్‌ గెలుచుకుంది.

    ఈ చరిత్రాత్మక విజయం గొప్ప బహుమతికి అర్హమైందని హాకీ ఇండియా ట్విట్టర్‌లో పేర్కొంది.

    ఒక్కో ప్లేయర్‌కు రూ.2 లక్షలు, సహాయక సిబ్బందికి రూ. లక్ష నగదు బహుమతిని హాకీ ఇండియా ప్రకటించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. కర్ణాటక బస్సుల్లో పక్క రాష్ట్రాల మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చా?

  7. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్: విజేత ఆస్ట్రేలియా, 209 పరుగులతో భారత్ ఓటమి

    వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్

    ఫొటో సోర్స్, Getty Images

    వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు గెలుపొందింది. 209 పరుగులతో భారత్‌పై విజయం సాధించింది.

    444 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ 63.3 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా గెలిచింది.

    164/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం భారత్ రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించింది.

    ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి (78 బంతుల్లో 49; 7 ఫోర్లు), అజింక్య రహానే (108 బంతుల్లో 46; 7 ఫోర్లు) త్వరగానే వెనుదిరిగారు.

    రవీంద్ర జడేజా డకౌట్ కాగా, శ్రీకర్ భరత్ (41 బంతుల్లో 23; 2 ఫోర్లు) కూడా పెద్దగా స్కోర్ చేయలేకపోయాడు.

    ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లయన్ 4 వికెట్లు, స్కాట్ బోలాండ్ 3 వికెట్లు పడగొట్టారు. మిచెల్ స్కార్క్‌కు 2 వికెట్లు దక్కగా, ప్యాట్ కమిన్స్ ఒక వికెట్ తీశాడు.

    ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేయగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. రహానే (129 బంతుల్లో 89; 11 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్.

    రెండో ఇన్నింగ్స్‌ను 270/8వద్ద డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా భారత్‌కు 444 పరుగుల లక్ష్యాన్ని విధించింది.

    లక్ష్య ఛేదనలో భారత్ విఫలం అయింది.

  8. మెదడు మార్పిడి ఎందుకు సాధ్యం కావట్లేదు? కోతి తలను మార్చినప్పుడు ఏం జరిగింది?

  9. శుభమాన్ గిల్ ఔట్‌పై సందేహాలు, మూడో అంపైర్ నిర్ణయం సరైంది కాదా?

    శుభమాన్ గిల్

    ఫొటో సోర్స్, ANI

    భారత్, ఆస్ట్రేలియా మధ్యలో ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది.

    నాలుగో రోజు ఇన్నింగ్స్ తర్వాత, ఈ మ్యాచ్‌లో గెలవాలంటే భారత్‌కు 280 పరుగులు కావాల్సి ఉంది.

    భారత ఓపెన్ శుభమాన్ గిల్‌తో పాటు ముగ్గురు భారత ఆటగాళ్లు ఔటయ్యారు. గిల్ ఔట్ అయినట్లు మూడో అంపైర్ ఇచ్చిన నిర్ణయంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

    వీరేంద్ర సెహ్వాగ్, వాసిమ్ జాఫర్ నుంచి చాలా మంది శుభమాన్‌కి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. థర్డ్ అంపైర్ నిర్ణయం సరైంది కాదని అంటున్నారు.

    భారత టీమ్ 41 పరుగులు చేసిన తర్వాత, స్కాట్ బోలాండ్ వేసిన బాల్ శుభమాన్ గిల్ బ్యాట్ చివరిన తగిలి, స్లిప్‌వైపుకి దూసుకెళ్లింది. అక్కడే నిల్చున్న కామెరాన్ గ్రీన్ ఆ బాలును పట్టుకున్నారు.

    ఆన్-ఫీల్డ్ అంపైర్‌కి ఈ క్యాచ్ విషయంలో అనుమానం రావడంతో, మూడో అంపైర్ సాయం తీసుకున్నారు. చివరికి ఈ మూడో అంపైర్ ఈ క్యాచ్ సరైందేనని, శుభమాన్ గిల్ ఔట్‌ను ప్రకటించారు.

    కామెరాన్ గ్రీన్ క్యాచ్ పట్టుకున్నప్పుడు, బాల్ నేలను తాకిందని క్రీడాభిమానులు అంటున్నారు.

    దీనిపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ నిర్ణయాన్ని ప్రశ్నించారు. ఎలాంటి సాక్ష్యం లేనప్పుడు, సందేహముంటే, అది నాటౌట్ అని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  10. కొలంబియా - అమెజాన్: దట్టమైన అడవిలో ఆ నలుగురు పిల్లలు 40 రోజులు ఏం తిన్నారు, ఎలా నిద్రపోయారు? అడవే వారిని కాపాడిందా?

  11. #ONDC: ఏమిటీ ఓఎన్‌డీసీ? ఇది వస్తే స్విగ్గీ, జొమటో, అమెజాన్‌లు పడిపోతాయా?

  12. అలీనా: 13 వేల మందికి ఒకే డాక్టర్, చెరగని చిరునవ్వుతో వైద్యం చేస్తుంటే రోగులే ఆమెను బెదిరిస్తున్నారు...

  13. రష్యాపై ప్రతి దాడులు ప్రారంభించాం: యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

    యుక్రెయిన్ అధ్యక్షుడు

    ఫొటో సోర్స్, EPA

    రష్యాపై ప్రతీకార దాడులు చేయడం ప్రారంభించినట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ చెప్పారు.

    ‘‘మమ్మల్ని మేం రక్షించుకోవడంతో పాటు, కౌంటర్ అటాక్ కూడా చేస్తున్నాం. రష్యాలో ఈ దాడులను మా ఆర్మీ చేస్తుంది. ’’ అని తెలిపారు.

    ప్రతీకార దాడుల గురించి వివరాలు ఇవ్వనని ఆయన చెప్పారు.

    ఈస్ట్రన్ యుక్రెయిన్ నగరమైన బుఖ్ముత్‌లో, దక్షిణాన ఉన్న జపోరిజియాలో రష్యా దాడులను తిప్పికొడుతూ యుక్రెయిన్ ఆర్మీ ముందుకు సాగుతుందని తెలిసింది.

  14. ఆమ్ ఆద్మీ పార్టీ: దిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో నేడు మెగా ర్యాలీ

    అరవింద్ కేజ్రీవాల్

    ఫొటో సోర్స్, AAP

    దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ రామ్‌లీలా మైదాన్‌లో ఒక మెగా ర్యాలీని నిర్వహించబోతున్నారు.

    ట్రాన్స్‌ఫర్ పోస్టింగ్ ఆర్డినెన్స్‌కి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ర్యాలీని నిర్వహిస్తుంది.

    ‘‘దిల్లీ ప్రజల హక్కులను లాగేసుకున్న కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా దిల్లీ ప్రజలు జూన్ 11న రామ్‌లీలా మైదాన్‌లో సమావేశం కానున్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మీరు కూడా ఈ ర్యాలీలో పాల్గొనవచ్చు.’’ అనికేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

    ఎంతోకాలంగా ఈ మెగా ర్యాలీ నిర్వహించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధమవుతోంది. ఈ ర్యాలీలో పాల్గొనాలని ఆప్ పార్టీ సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్‌ను ఆహ్వానించింది.

    కపిల్ సిబల్‌తో పాటు దిల్లీ ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ ర్యాలీలో పాల్గొననున్నారు.